Rss Feed

వంశీ

వంశీ తెలుగు సినిమా దర్శకుడు, రచయిత. అసలు పేరు జె.వి.కె నారయణ రాజు ఈయన సినిమాలకధలు సహజంగా ఉంటూ పల్లెఅందాలను ఆవిష్కరిస్తుంటాయి. బాల్యం వంశీ తూర్పు గోదావరి జిల్లా, అనపర్తికి దగ్గరలో ఉన్న పసలపూడి అనే గ్రామంలో పుట్టి పెరిగాడు. కెరీర్ తెలుగు సినీ చరిత్రలో ఆణిముత్యమైన శంకరాభరణం సినిమాకు వంశీ సహాయ దర్శకుడిగా వ్యవహరించాడు. దర్శకుడిగా ఆయన మొదటి సినిమా 1982 లో చిరంజీవి, సుహాసిని,రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రధారులుగా నటించిన మంచు పల్లకి అనే సినిమా. ఈ సినిమాకు యండమూరి వీరేంద్రనాథ్ రచయిత. యండమూరి, చిరంజీవి కలయికలో వచ్చిన తొలి చిత్రం ఇదే కావడం విశేషం. 1984 లో ఆయన రూపొందించిన సితార సినిమా విమర్శకుల మన్ననలనందుకుంది. ఇదే సినిమాతో భానుప్రియ తెలుగు సినిమాకు కథానాయిక గా పరిచయమైంది. ఆయన రూపొందించిన చాలా వరకు సినిమాలకు ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించాడు. వంశీ దర్శకత్వం వహించిన అనేక తెలుగు సినిమాలలో ప్రస్పుటంగా కనిపించే అంశములు కామెడీ మరియు తెలుగువారి వ్యావహారిక పద్దతులు. గోదావరి పట్ల వంశికి వున్నప్రేమ అంత ఇంతా కానిది. ప్రతి సినిమాలో ఏదో ఒక పాత్ర శ్రుష్టించి అది గోదావరి జిల్లాలో పరిబ్రమించెలాగా చెయ్యటం వంశికి వెన్న తో పెట్టిన విద్య. ] అవార్డుల సినిమాలు * సితార * మంచుపల్లకి వంశీ సినిమాల జాబితా 1. మంచు పల్లకి 2. ఆలాపన 3. అన్వేషణ 4. సితార 5. లాయర్ భారతి 6. చెట్టు క్రింద ప్లీడర్ 7. స్వర కల్పన 8. లేడీస్ టైలర్ 9. లింగబాబు లవ్ స్ఝ్తోరి 10. జోకర్ 11. ప్రేమ ‍‍& కో 12. డిటెక్టివ్ నారద 13. ఏప్రిల్ 1 విడుదల 14. దొంగ రాముడు అండ్ పార్టి 15. అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు 16. కొంచెం టచ్ లో ఉంటే చెబుతాను 17. అనుమానాస్పదం 18. గోపి గోపిక గోదావరి 19. [[ఫ్యాషన్ డిసైనర్ S/O లేడీస్ టైలర్(నిర్మాణంలో ఉంది?)