Rss Feed

కోవెలమూడి సూర్యప్రకాశరావు

కోవెలమూడి సూర్యప్రకాశరావు (1914 - 1996) తెలుగు సినిమా దర్శక నిర్మాతలలో ఒకడు. రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత. ఈయన కొడుకు కె.రాఘవేంద్రరావు కూడా ప్రసిద్ది పొందిన సినిమా దర్శకుడు. ఈయన దర్శకత్వం వహించిన ప్రేమనగర్ సినిమా పెద్ద విజయం సాధించింది. విషయ సూచిక * 1 తొలి జీవితం * 2 సినీరంగ ప్రవేశం * 3 చిత్ర సమాహారం o 3.1 నటించిన సినిమాలు o 3.2 నిర్మించిన సినిమాలు o 3.3 దర్శకత్వం వహించిన సినిమాలు * 4 మూలాలు * 5 బయటి లింకులు తొలి జీవితం సూర్యప్రకాశరావు 1914వ సంవత్సరం కృష్ణా జిల్లాకు చెందిన కోలవెన్నులో జన్మించాడు. ప్రాధమిక విద్యాభ్యాసము ముగించుకొని ప్రకాశరావు కొన్నాళ్ళు భీమా ఏజెంటుగాను, ఒక బంగారు నగల దుకాణములోను ఉద్యోగం చేశాడు. భారతీయ ప్రజా నాటక సంఘము యొక్క తెలుగు విభాగమైన ప్రజానాట్యమండలితో ప్రకాశరావు పనిచేసేవాడు. సినీరంగ ప్రవేశం ప్రకాశరావు సినీజీవితాన్ని నటునిగా 1941లో గూడవల్లి రామబ్రహ్మం తీసిన అపవాదు సినిమాతోనూ, 1940లో నిర్మించినా 1942లో విడుదలైన పత్ని సినిమాతోనూ ప్రారంభించాడు. పత్ని సినిమాలో ఈయన కోవలన్ పాత్ర పోషించాడు. ఈయన 1942లో ఆర్.ఎస్.ప్రకాశ్ తీసిన బభ్రువాహన సినిమాలో కూడా నటించాడు. 1948లో ద్రోహి సినిమాతో సినీ నిర్మాణములో అడుగుపెట్టాడు. ఇందులో నాయకుని పాత్రకూడా ప్రకాశరావే పోషించాడు. స్వతంత్ర పిక్చర్స్ పతాకముపై విడుదలైన ఈ సినిమాకు ఎల్వీ ప్రసాద్ దర్శకత్వం వహించాడు. ఆ తరువాత 1949లో పతాకము పేరు ప్రకాశ్ ప్రొడక్షన్స్‌గా మార్చి మొదటిరాత్రి మరియు దీక్ష వంటి సినిమాలకు నిర్మించి దర్శకత్వం తానే వహించాడు. దాని తర్వాత ప్రకాశ్ ప్రొడక్షన్స్‌ను ఒక స్టూడియోగా అభివృద్ధి పరచి ప్రకాశ్ స్టూడియోస్‌గా నామకరణం చేశాడు. 1950లో ఈయన తీసిన సినిమాలు చాలామటుకు మెలోడ్రామాలు. ఆ తరువాత కాలములో ప్రేమనగర్ వంటి సైకలాజికల్ ఫాంటసీలను తీశాడు. ఈయన పుట్టన కణగళ్ తీసిన నగర హావు (1972) అనే కన్నడ ప్రేమకథా చిత్రాన్ని తెలుగులో కోడెనాగుగా పునర్నిర్మించాడు. 1970వ దశకంలో కన్నడ సినిమాలు కూడా తీశాడు. ఈయన కొడుకు కె.రాఘవేంద్రరావు అత్యంత విజయవంతమైన కమర్షియల్ చిత్రాలను నిర్మించి తెలుగు చలనచిత్రరంగములో బాగా పేరుతెచ్చుకున్నాడు. ఇంకో కుమారుడు, కె.ఎస్.ప్రకాశ్ తెలుగు చిత్రరంగములో పేరొందిన ఛాయాగ్రాహకుడు. 1994 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈయనకు రఘుపతి వెంకయ్య అవార్డు ఇచ్చి సత్కరించింది. ఈయన 1996 సంవత్సరంలో మరణించాడు. చిత్ర సమాహారం నటించిన సినిమాలు 1. అపవాదు (1941) 2. పత్ని (1942) 3. బభ్రువాహన (1942) 4. ద్రోహి (1948) --> కథానాయకుడిగా 5. ప్రేమనగర్ (1971) --> చిన్న పాత్రలో నిర్మించిన సినిమాలు 1. ద్రోహి (1948) 2. మొదటిరాత్రి (1950) 3. దీక్ష (1951) 4. కన్నతల్లి (1953) 5. బాలానందం (1954) 6. అంతేకావాలి (1955) 7. మేలుకొలుపు (1956) 8. రేణుకాదేవి మహత్యం (1960) దర్శకత్వం వహించిన సినిమాలు 1. మొదటిరాత్రి (1950) 2. దీక్ష (1951) 3. కన్నతల్లి (1953) 4. బాలానందం (1954) 5. అంతేకావాలి (1955) 6. మేలుకొలుపు (1956) 7. రేణుకాదేవిమాహాత్మ్యం (1960) 8. స్త్రీజన్మ (1967) 9. విచిత్రకుటుంబం (1969) 10. తాసిల్దారు గారి అమ్మాయి (1971) 11. ప్రేమనగర్ (1971) 12. ఇదాలోకం (1973) 13. కోడెనాగు (1974) 14. చీకటి వెలుగులు (1975) 15. కొత్తనీరు (1982)

కోడి రామకృష్ణ

నాటక రంగం నుంచి వచ్చిన ప్రతిభావంతులైన దర్శకులలో ఒకడు కోడి రామకృష్ణ. ఇతని స్వస్థలం పాలకొల్లు. పాలకొల్లులో కల లలిత కళాంజలి సంస్థ ద్వారా అనేక నాటకాలు వేసాడు. సినీ ప్రస్థానం కోడి రామకృష్ణ కు దర్శకుడిగా తొలిచిత్రం "ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య"(1981). దర్శకుడిగా దాసరి నారాయణరావుని పరిచయంచేసిన నిర్మాత కె.రాఘవ ఆయన శిష్యుడైన కోడి రామకృష్ణ కు కూడా అవకాశం ఇచ్చారు. ఎన్.టి.రామారావు మినహా అందరు కథానాయకులతోనూ పనిచేశారు. నూరు పైగా చిత్రాలు చేసిన నలుగురు తెలుగు దర్శకులలో ఒకరు. (దాసరి,కె.ఎస్.ఆర్ దాస్, కె.రాఘవేంద్రరావు లు మిగతా మువ్వురు). నటునిగా దర్శకునిగా గుర్తింపు పొందాక నటునిగా కూడా ప్రయత్నించారు. తొలిసారిగా 'మాఇంటికి రండి' అనే చిత్రంలో కథానాయకునిగా నటించారు. సుహాసిని కథానాయిక. ఐతే చిత్రంవిజయవంతం కాలేదు. తర్వాత కొద్దిసినిమాలలో సపోర్టింగ్ పాత్రలు ధరించారు. నటించిన చిత్రాలన్నీ ఆయన దర్శకత్వంలో వచ్చినవే. కధానాయకులు- చిత్రాలు చిరంజీవి తో ఇంట్లోరామయ్య వీధిలో క్రిష్ణయ్య తర్వాత ఆలయశిఖరం(అమితాబ్ నటించిన ఖుద్దార్ చిత్రం ఆధారంగా),సింహపురిసింహం(చిరంజీవి ద్విపాత్రాభినయం),గూధచారి 117,రిక్షావోడు,అంజి చిత్రాలు నిర్మించారు. బాలకృష్ణ కు సోలో హీరోగా తొలి విజయవంతమైన చిత్రం "మంగమ్మగారి మనవడు" ఈయన చిత్రమే.తర్వాత బాలకృష్ణ తో ముద్దుల కృష్ణయ్య,ముద్దులమావయ్య,మువ్వగోపాలుడు,ముద్దుల మేనల్లుడు,బాలగోపాలుడు వంటి చిత్రాలు తీసారు. భార్గవ్ ఆర్ట్స్ చిత్రాలలో ఎక్కువభాగం కోడి దర్శకత్వం వహించారు. గొల్లపూడి మారుతీరావు, గణేష్ పాత్రో మాటలతో కోస్తాంధ్ర నేపధ్యం తో కొంతకాలం చిత్రాలు తీశారు. తర్వాత అమ్మోరు(సినిమా) సినిమా నుండి గ్రాఫిక్స్ వినియోగిస్తూ కొన్ని విజయవంతమైన చిత్రాలు తీశారు (దేవి, దేవీపుత్రుడు, దేవుళ్ళు, అంజి). రాజకీయనేపధ్యం తో కొన్ని చిత్రాలు తీసారు.ఈయన దర్శకత్వంలొ ఇటీవల వచ్చిన అరుంధతి చిత్రం పెద్ద విజయం సాధించినది.

కె.ప్రత్యగాత్మ

కె.ప్రత్యగాత్మగా ప్రసిద్ధిచెందిన కొల్లి ప్రత్యగాత్మ (ఆంగ్లం: Kotayya Pratyagatma) తెలుగు సినిమా దర్శకుడు. ఈయన 1925 అక్టోబర్ 31 న గుడివాడలో జన్మించాడు. చదువుకునే రోజుల్లోనే చేసిన జాతీయవాద ప్రదర్శనలకు గాను జె.జె.కళాశాల యొక్క బ్రిటీషు ప్రిన్సిపాలు ప్రత్యగాత్మను కళాశాల నుండి బహిష్కరించాడు. ఈయన సినిమా రంగములో ప్రవేశించక మునుపు 1952లో ప్రజాశక్తి లో పాత్రికేయునిగా, జ్వాలా పత్రికకు సంపాదకునిగా పనిచేశాడు. ప్రత్యగాత్మ దర్శకునిగా తొలి సినిమా 1961లో విడుదలైన భార్యాభర్తలు. ఈయన తెలుగులో 21 సినిమాలు మరియు హిందీలో 7 సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఈయన ఆత్మా బ్యానర్ క్రింద చిలకా గోరింక మరియు మా వదిన చిత్రాలను స్వయంగా దర్శకత్వం వహించి నిర్మించాడు. ప్రత్యగాత్మ, తెలుగు సినీ రంగములో రెబెల్‌స్టార్ గా పేరుతెచ్చుకున్న కృష్ణంరాజును 1966లో విడుదలైన చిలకా గోరింక సినిమాతో పరిచయము చేశాడు. 1966లో సొంత సినీ నిర్మాణ సంస్థ ఆత్మ ఆర్ట్స్ ప్రారంభించాడు. ఈయన 2001, జూన్ 8న హైదరాబాదులో కన్నుమూశాడు. ప్రత్యగాత్మ కుమారుడు కె.వాసు కూడా తెలుగు సినిమా దర్శకుడు. * 1 పురస్కారాలు * 2 చిత్ర సమాహారం o 2.1 తెలుగు సినిమాలు o 2.2 హిందీ సినిమాలు * 3 బయటి లింకులు పురస్కారాలు ఈయన 1962లో భార్యాభర్తలు చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రముగా రజత కమలాన్ని అందుకున్నాడు. చిత్ర సమాహారం తెలుగు సినిమాలు * భార్యాభర్తలు (1961) * కులగోత్రాలు (1962) * పునర్జన్మ (1963) * మంచి మనిషి (1964) * మనుషులు మమతలు (1965) * చిలకా గోరింక (1966) * మా వదిన (1967) * ఆదర్శ కుటుంబం (1969) * అమ్మకోసం (1970) * మనసు మాంగల్యం (1970) * శ్రీమంతుడు (1971) * స్త్రీ (1973) * పల్లెటూరి బావ (1973) * దీక్ష (1974) * ముగ్గురమ్మాయిలు (1974) * అల్లుడొచ్చాడు (1976) * అత్తవారిల్లు (1976) * గడుసు అమ్మాయి (1977) * కన్నవారి ఇల్లు (1978) * మంచి మనసు (1978) * కమలమ్మ కమతం (1979) * నాయకుడు – వినాయకుడు (1980) హిందీ సినిమాలు ఈయన హిందిలో కె.పి.ఆత్మ పేరుతో కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించాడు * దో లడ్కియా (1976) * మెహమాన్ (1973) * ఏక్ నారీ ఏక్ బ్రహ్మచారీ (1971) * బచ్‌పన్ (1970) * తమన్నా (1969) * రాజా ఔర్ రంక్ (1968) * ఛోటాభాయి (1966)

కొమ్మినేని శేషగిరిరావు

కొమ్మినేని శేషగిరిరావు (Kommineni Seshagiri Rao) ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు, నటుడు. ఇతడు ప్రముఖ సంగీత దర్శకుడు కె.చక్రవర్తికి సోదరుడు. వీరి స్వస్థలం గుంటూరు జిల్లా స్వగ్రామం తెనాలి సమీపంలోని పొన్నెకల్లు. ఈయన అనేక సినిమాల్లో నటించారు. మొదట్లో విలన్‌గా నటించినా, గొప్పవారి గోత్రాలు (1967) సినిమాలో కథానాయకుడిగా నటించాడు. ఆ తరువాత శ్రీకృష్ణపాండవీయం, తాతామనవడు, సంసారం సాగరం వంటి యాభైకి పైగా సినిమాలలో నటించాడు. దర్శకునిగా కొమ్మినేని తొలిచిత్రం గిరిబాబు హీరోగా నటించిన దేవతలారా దీవించండి. ఆ చిత్ర విజయం తరువాత సింహగర్జన సినిమాకు, ఆ తరువాత తాయారమ్మ బంగారయ్య సినిమాకు దర్శకత్వం వహించారు. తాయారమ్మ బంగారయ్య సినిమాను తమిళంలో శివాజీ గణేశన్‌తో నిర్మించారు. అదికూడా ఘన విజయం సాధించింది. వీరు కన్నడంలో కూడా రెండు సినిమాలకు దర్శకత్వం వహించారు. కొమ్మినేని 2008, డిసెంబర్ 5న చెన్నైలో శరీరంలోని అనేక అంగాలు వైఫల్యం చెందడంతో మరణించాడు. ఈయనకు భార్యతో పాటు నలుగురు కుమారులు మరియు ఒక కుమార్తె ఉన్నారు.

కె.బాలచందర్

కె.బాలచందర్ గా ప్రసిద్ధిచెందిన కైలాసం బాలచందర్ ప్రముఖ దక్షిణ భారతదేశ సినిమా దర్శకుడు, రచయిత మరియు నిర్మాత. వీరు 1930 సంవత్సరంలో తంజావూరు దగ్గర నన్నిలం గ్రామంలో జన్మించారు. విషయ సూచిక * 1 పురస్కారాలు * 2 పరిచయం చేసిన నటులు * 3 చిత్ర సమాహారం o 3.1 దర్శకత్వం వహించిన సినిమాలు * 4 తమిళ చిత్రాలకు-తెలుగుభావాలు, అనువాద చిత్రాలు తెలుగువారి సౌలభ్యం కొరకు, o 4.1 రచయితగా'''' o 4.2 నిర్మాతగా * 5 నటునిగా * 6 బయటి లింకులు పురస్కారాలు వీరు 1982లో ఏక్ దూజే కేలియే సినిమాకు గాను ఫిల్మ్ ఫేర్ ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు గెలుచుకున్నారు. వీరు 1989లో రుద్రవీణ సినిమా కోసం జాతీయ స్థాయిలో నర్గీస్ దత్ అవార్డు, వెండి కమలం బహుమతుల్ని చిరంజీవి, నాగేంద్రబాబులతో పంచుకున్నారు. పరిచయం చేసిన నటులు * కమల్ హాసన్ * రజినీ కాంత్ * చిరంజీవి ( తమిళ పరిశ్రమకు) * శ్రీ విద్య * శ్రీ దేవి * సరిత * వివేక్ ( తమిళ హాస్య నటుడు) * ప్రకాష్ రాజ్ * వై. జి. మహేంద్రన్ ( తమిళ నటుడు) * సుజాత * చరణ్ ( తమిళ దర్శకుడు) * రమేష్ అరవింద్ * మాధవి * జయసుధ * జయప్రధ * శ్రీ ప్రియ * గీత * చార్లి ( తమిళ హాస్య నటుడు) * యువరాణి * విమలా రామన్ చిత్ర సమాహారం దర్శకత్వం వహించిన సినిమాలు తమిళ చిత్రాలకు-తెలుగుభావాలు, అనువాద చిత్రాలు తెలుగువారి సౌలభ్యం కొరకు, * [[ పొయ్ (2006)(అబధ్ధం) * [[పార్థాలే పరవశం (2001) (పరవశం) * కల్కి(1996) * డ్యూయెట్ (1994) ]] * జాది మల్లి (1992) (జాతి మల్లె) * వావమే ఎల్లై (1992)(నింగే హద్దు) * [[అళగన్(1991) (అందగాడు) * కోకిల (1990) * [[ఒరు వీడు ఇరు వాసల్ (1990) (,ఒక ఇల్లు రెండు గుమ్మాలు) * [[పుదు పుదు అర్తంగల్ (1989) ( కొత్త కొత్త అర్ధాలు) * రుద్రవీణ(1988) * [[ఉన్నాల్ ముడియుమ్ తంబి (1988) (రుద్రవీణ) * [[మనదిల్ ఉరుది వెండుమ్ (1987) (మనసులో నమ్మకముండాలి) * [[పున్నగై మన్నన్ (1986) (డాన్స్ మాస్టర్) * సుందర స్వప్నగళు(1986) ( మళయాళం) * కళ్యాణ అగదిగల్ (1985) (పెళ్లికాని అనాధలు) * ముగిల మల్లిగై(1985) * సింధు భైరవి (1985) * ఏక్ నయ్ పహేళి (1984) (హిందీ) * అచ్చమిల్లై అచ్చమిల్లై (1984) ( భయములేదు భయములేదు) * ఇరదు రేగగళు(1984) * లవ్ లవ్ లవ్ (1984) * బెంకి అల్లి అరలిద హువు (1983) * కోకిలమ్మ (1983) * [[పొయ్ కాల్ గుదిరై (1983) ( అబధ్ధపు కాలు గుర్రం) * జరా సే జిందగి (1983) * అగ్ని సాక్షి (1982) ]] * ప్యారా తరానా (1982) * 47 రోజులు (1981) * [[ఏక్ తుజే కేళియే (1981) (మరో చరిత్ర- హిందీలో)]] * ఆడవాళ్ళు మీకు జోహార్లు (1981) * ఆకలి రాజ్యం (1981) * ఎంగ ఊరు కన్నగి (1981) (మా ఊరి పతివ్రత) * తన్నీర్ తన్నీర్ (1981) ( నీళ్లు నీళ్లు) * తొలికోడి కూసింది(1981) ]] * తిల్లు ముల్లు(1981) ( గోలుమాల్ అనే భావం) * తిరైగల్ ఎళుదియ కవితై(1980) ( తెరలు రాసిన కవిత) * [[వరుమయిన్ నిరం సివప్పు (1980) ( ఆకలి రాజ్యం) * ఇది కథకాదు (1979) * రతి మన్మధుడు (1979) * ఏదో సరిత (1979) * సొమ్మొకడిది సోకొకడిది (1979) * గుప్పెడు మనసు (1979) * నినైత్తలే ఇనిక్కుమ్ [[ (1979)( అందమైన అనుభవం)]] * ఐ లవ్ యూ (1979) * నూల్ వెలి (1979) ( దారపు సందు) * మరో చరిత్ర (1978) * నిళళ్గళ్ నిజమాగిరదు (1978) (నీడలు నిజమాయెను) * తప్పిత్త తలె (1978) (తప్పించుకున్న తల) * ఆయినా(1977) * అవర్గళ్ (1977) వాళ్లు) * మీది మీది బాటెయిన్ (1977) * ఒక తల్లి కథ (1977) * పట్టిన ప్రవేశం (1977) (పట్టణ ప్రవేశం) * అంతులేని కథ (1976) * మన్మథ లీలై (1976) (మన్మథ లీల) * [[మూండ్రు ముడిచి (1976) (మూడు ముళ్లు) * [[అపూర్వ రాగంగళ్ (1975) (అపూర్వ రాగాలు) * కోటి విద్యలు కూటి కొరకే (1974) ]] * నాన్ అవనిల్లై (1974) (నేను వాణ్నికాదు) * అరంగేట్రం (1973) * లోకం మారాలి (1973) * సొల్లత్తన్ నినైక్కిరేన్ (1973) (చెప్పాలనే అనుకుంటున్నా) * కన్నా నలమా (1972) ( కన్నయ్యా కుశలమా?) * వెళ్లి విళా (1972) (సిల్వర్ జూబ్లీ అనే భావం) * బొమ్మా బొరుసా (1971) * నాన్గు సువర్గళ్ (1971) (నాలుగు గోడలు) * పున్నగై (1971) (నవ్వు) * ఎదిరొలి (1970) (ప్రతిధ్వని) * కావియ తలైవి (1970) (కావ్య నాయక) * నవగ్రహం (1970) * పథం పాస్(1970) * ఇరు కోడుగళ్ (1969)(రెండు ధ్రువాలు) * పూవా తలయా (1969) (బొమ్మా బొరుసా) * సత్తెకాలపు సత్తెయ్య (1969) * ఎదిర్ నీఛ్ఛళ్ (1968) (ఎదురీత) * తామిరై నెంజం (1968) (తామరవంటి హ్రుదయం) * అనుభవి రాజ అనుభవి (1967) (అనుభవించు రాజా అనుభవించు) * భలే కోడళ్ళు (1967) * మేజర్ చంద్రకాంత్ (1966) * నాణల్ (1965) * నీర్ కుమిళి (1965) ( నీటి మడుగు) రచయితగా'''' * సింధు భైరవి (1985) (రచయిత) ]] * ఎక్ నై పహేలి (1984) (కథ, కథనం) * అచ్చమిల్లై అచ్చమిల్లై (1984) (కథ, కథనం) * ఏక్ తుజే కేళియే (1981) (కథ, కథనం) * ఆడవాళ్ళు మీకు జోహార్లు (1981) (కథ) ]] * ఆకలి రాజ్యం (1981) (రచయిత) * తన్నీర్ తన్నీర్ (1981) (కథనం) ]] * తిల్లు ముల్లు (1981) (రచయిత) * ఇది కథ కాదు (1979) (రచయిత) ]] * గుప్పెడు మనసు (1979) (రచయిత)]] * కళుగన్ (1979) (కథ) * మరో చరిత్ర (1978) (కథనం)]] * ఆయిన (1977) (కథ, కథనం) * అంతులేని కథ (1976) (రచయిత)]] * హార్ జీత్ (1972) (రచయిత) * బొమ్మా బొరుసా(1971) (కథ) ]] * అనుభవి రాజా అనుభవి (1967) (రచయిత) * సుఖదుఃఖాలు (1967) నిర్మాతగా * [[47 నాట్కళ్ (1981) (47 రోజులు) * శ్రీ రాఘవేంద్రా (1985)]] * వేలైకరన్ (1987)(పని వాడు) * ఉన్నైసొల్లి కుట్రమిల్లై (1990) (నిన్నుచెప్పి తప్పు లేదు) * రోజా (1992) * నామ్ ఇరువర్ నమక్కిరువర్ (1998) (మనమిద్దరం మనకిద్దరు) * [[సామీ (2003) (లక్ష్మీనరసింహాకు మాత్రుక)]] * [[తిరుమలై (2003) (చిన్నోడుకు మాత్రుక)]] * అయ్యా (2005) * ఇదయ తిరుడన్ (2006) (మనసు దొంగ * కుచేలన్ (2008) * తిరువన్నామలై ( 2008) * క్రిష్ణ లీలై (2009) (క్రిష్ణ లీల) * నుట్రుకు నూరు (2009) (వందకు వంద) నటునిగా * అబద్ధం * రెట్ట సుళి

కె.విశ్వనాథ్.

ళాతపస్విగా చిరపరిచితమైన పద్మశ్రీ కాశీనాధుని విశ్వనాధ్ తెలుగు సినిమా దర్శకుడు. ప్రశస్తమైన సినిమాలను సృష్టించి, తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన వ్యక్తి, కె.విశ్వనాథ్. విశ్వనాథ్ 1930 లో విజయవాడ లో జన్మించాడు. చెన్నై లోని ఒక స్టూడియోలో తెక్నీషియనుగా సినిమా జీవితాన్ని మొదలుపెట్టి, ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు వద్ద సహాయకుడిగా చేరాడు. అక్కినేని నాగేశ్వరరావు నాయకుడిగా నిర్మించిన ఆత్మ గౌరవం సినిమాతో విశ్వనాథ్ దర్శకుడిగా మారాడు. సిరిసిరిమువ్వ సినిమాతో ఆయన ప్రతిభ వెలుగులోకి వచ్చింది. విశ్వనాథ్ చలనచిత్ర జీవితంలో కలికితురాయి వంటిది శంకరాభరణం. జాతీయ పురస్కారం గెలుచుకున్న ఈ సినిమా, తెలుగు సినిమా చరిత్రలో కూడా ఒక మైలురాయి వంటిది. పాశ్చాత్య సంగీతపు హోరులో కొట్టుకుపోతున్న భారతీయ సాంప్రదాయ సంగీతానికి పూర్వవైభవాన్ని పునస్థాపించాలనే ఉద్దేశ్యాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించాడు. భారతీయ సాంప్రదాయ కళలకు పట్టం కడుతూ ఆయన మరిన్ని సినిమాలు తీసాడు. వాటిలో కొన్ని సాగరసంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం మొదలైనవి. కుల వ్యవస్థ, వరకట్నం వంటి సామాజిక అంశాలను కూడా తీసుకుని విశ్వనాథ్ చిత్రాలు నిర్మించాడు. సప్తపది, స్వాతిముత్యం, స్వయంకృషి, శుభోదయం, శుభలేఖ, ఆపద్బాంధవుడు, శుభసంకల్పం వంటి సినిమాలు ఈ కోవలోకి వస్తాయి. శంకరాభరణం కు జాతీయ పురస్కారం తో పాటు సప్తపదికి జాతీయ సమగ్రతా పురస్కారం లభించింది. స్వాతిముత్యం సినిమా 1986 లో ఆస్కార్ అవార్డుకు అధికారిక ప్రవేశం పొందింది. భారతీయ సినిమాకు చేసిన సమగ్ర సేవకు గాను విశ్వనాథ్ కు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారమిచ్చి గౌరవించింది. విశ్వనాథ్ సినిమాలలో సంగీతానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. తన సినిమాలకు ఎక్కువగా కె.వి.మహదేవన్ నుగానీ, ఇళయరాజా ను గానీ సంగీతదర్శకులుగా ఎంచుకునేవాడు. కొన్ని సినిమాలలో పండిత హరిప్రసాద్ చౌరాసియా, కేలూచరణ్ మహాపాత్ర, షరోన్ లోవెన్ వంటి ప్రముఖ కళాకారులతో కలిసి పని చేసాడు. ప్రస్తుతం దర్శకత్వ బాధ్యతలను తగ్గించుకుని నటుడిగా ప్రేక్షకులను అలరిస్తున్నాడు. * 1 కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన చిత్రాలు * 2 కె.విశ్వనాథ్ నటించిన చిత్రాలు * 3 పురస్కారాలు * 4 బయటి లింకులు * 5 మూలాలు కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన చిత్రాలు * ఆత్మ గౌరవం * అల్లుడు పట్టిన భరతం * సిరి సిరి మువ్వ * సీతామాలక్ష్మి * శంకరాభరణం * సప్తపది * ఆపద్భాందవుడు * శృతిలయలు * స్వాతికిరణం * స్వాతిముత్యం * స్వర్ణకమలం * శుభలేఖ * శుభోదయం * శుభ సంకల్పం * సిరివెన్నెల * సాగరసంగమం * స్వయంకృషి * జననీ జన్మభూమి * చిన్నబ్బాయి * సూత్రధారులు * స్వరాభిషేకం * జీవిత నౌక * కాలాంతకులు * జీవన జ్యోతి * ప్రేమబంధం * చెల్లెలి కాపురం * నిండు హృదయాలు * చిన్ననాటి స్నేహితులు * ఉండమ్మా బొట్టు పెడతా * కలిసొచ్చిన అదృష్టం * ప్రైవేటు మాస్టారు * శారద * కాలం మారింది * ఓ సీత కధ తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయి కె.విశ్వనాథ్ నటించిన చిత్రాలు * వజ్రం * శుభసంకల్పం * సంతోషం * స్వరాభిషేకం * నరసింహనాయుడు * ఠాగూర్ * నీ స్నేహం * ద్రోహి * అతడు * సీమసింహం * లక్ష్మీనరసింహ * ఆంధ్రుడు [మార్చు] పురస్కారాలు * జాతీయ చలనచిత్ర పురస్కారాలు o 1980-జాతీయ ఉత్తమ కుటుంబకథా చిత్రం -శంకరాభరణం o 1982-నర్గీస్ దత్ జాతీయ సమైక్యతా ఉత్తమచిత్రం - సప్తపది o 1984- జాతీయ ఉత్తమ చలనచిత్రం - తెలుగు సాగరసంగమం o 1986 - జాతీయ ఉత్తమ చలనచిత్రం - తెలుగు - స్వాతిముత్యం o 1988 - జాతీయ ఉత్తమ చలనచిత్రం - తెలుగు శృతిలయలు o 2004 - జాతీయ ఉత్తమ చలనచిత్రం - తెలుగు స్వరాభిషేకం * 1992 - రఘుపతి వెంకయ్య పురస్కారం * పద్మశ్రీ పురస్కారం జన్మ నామం కాశీనాధుని విశ్వనాధ్ జననం ఏప్రిల్ 19 1930 (1930-04-19) (వయసు 79) Flag of భారత దేశంతెనాలి,గుంటూరుజిల్లా,ఆంధ్రప్రదేశ్ నివాసం చెన్నై,తమిళనాడు ఇతర పేర్లు కళాతపస్వి,కె.విశ్వనాధ్ వృత్తి సినిమా, టి.వి దర్శకుడు నటుడు కథా రచయిత స్క్రీన్ ప్లే రచయిత శబ్ద గ్రాహకుడు మతం బ్రాహ్మణ హిందూ భార్య/భర్త జయలక్ష్మి సంతానం పద్మావతి దేవి(కూతురు) కాశీనాధుని నాగేంద్రనాథ్ కాశీనాధుని రవీంద్రనాథ్(కొడుకులు) తండ్రి కాశీనాధుని సుబ్రహ్మణ్యం తల్లి సరస్వతమ్మ

కె.వి.రెడ్డి

కె.వి.రెడ్డి గా సుప్రసిద్ధుడైన కదిరి వెంకట రెడ్డి (K.V.Reddy, Kadiri Venkata Reddy) తెలుగు సినిమాలకు స్వర్ణ యుగమైన, 1940-1970 మధ్య కాలంలో ఎన్నో ఉత్తమ చిత్రాలను తెలుగు తెరకు అందించిన ప్రతిభావంతుడైన దర్శకుడు, నిర్మాత మరియు రచయిత. పురాణాలు, జానపద చలన చిత్రాలు తియ్యడంలో సాటి లేని మేటి అనిపించుకొన్న కె.వి.రెడ్డి అనంతపురం జిల్లా తాడిపత్రిలో 1912 వ సంవత్సరం జూలై 1 న జన్మించాడు. కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన సినిమాలలో కథానాయకులకే కాకుండా ఇతర చిన్న పాత్రలకు సైతం ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఉదాహరణకు సత్య హరిశ్చంద్ర చిత్రంలో రేలంగి, జగదేకవీరుని కథ చిత్రంలో రాజనాల, మాయాబజార్ చిత్రంలో ఎస్వీ.రంగారావు పాత్రలు. అంతేకాక కె.వి.రెడ్డి సినిమాలలో గిల్పం, తసమదీయులు, పరవేశ దవారం, డింభక లాంటి కొత్త పదాలు వినిపించడం కద్దు. ఈయన సినిమాలలో కథ, చిత్రానువాదం, పాత్రల విశిష్టతే కాకుండా సంగీతం కూడా ఎంతో బాగుంటుంది. విషయ సూచిక * 1 సినీ ప్రస్థానం o 1.1 భక్త పోతన o 1.2 పాతాళ భైరవి o 1.3 పెద్ద మనుషులు o 1.4 దొంగ రాముడు o 1.5 మాయా బజార్ o 1.6 జగదేకవీరుని కథ o 1.7 శ్రీకృష్ణార్జున యుద్దం o 1.8 సత్య హరిశ్చంద్ర o 1.9 శ్రీకృష్ణ సత్య * 2 దర్శకత్వ శైలి * 3 విశేషాలు * 4 పని చేసిన సినిమాలు * 5 వనరులు సినీ ప్రస్థానం సినిమాల గురించీ, సినిమా నిర్మాణం గురించీ తెలుసుకుని, పుస్తకాలు చదివి సినిమాలమీద అభిమానం పెంచుకున్న కె.వి.రెడ్డి, స్నేహితుడైన మూలా నారాయణస్వామి సలహా మీద గృహలక్ష్మి (1938 సినిమా)కి కేషియరుగా పని చేశాడు. తరువాత వాహినీ సంస్థ బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి దర్శకత్వంలో నిర్మించిన వందేమాతరం (1939) సినిమాకు ప్రొడక్షన్ మేనేజరుగా పని చేశాడు. ఇదే సినిమాకు పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు సహాయ దర్శకుడిగా ఉన్నాడు. తరువాత బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి సినిమాలైన సుమంగళి (1940), దేవత (1941), స్వర్గసీమ అన్నింటికీ ప్రొడక్షన్ మేనేజర్ గా పని చేశాడు. వాహినీ సినిమాలలో ఈయన ప్రొడక్షన్‌ మేనేజరు, కాషియరూ ఐనా, ఆలోచనంతా సినిమా దర్శకత్వం, నిర్మాణం మీదనే ఉండేది. భక్త పోతన కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన మొదటి సినిమా భక్త పోతన (1942). భక్తపోతన పెద్ద హిట్‌ కావడంతో యోగివేమన (1947) తీశాడు, కె.వి.రెడ్డి. ఆర్థికంగా లాభించకపోయినా ప్రపంచ సినిమాల స్థాయిలో 'యోగివేమన' కూడా ఒక క్లాసిక్‌ అన్న ఖ్యాతి లభించింది. ఈ రెండు సినిమాలలో కూడా చిత్తూరు నాగయ్య కథానాయకుడు. తరువాతి సినిమా గుణసుందరి కథ (1949). ఇందులో విషాద పాత్రలకు పేరు పొందిన శ్రీరంజని గుణసుందరీ దేవిగా నటించింది. ఈ సినిమాకు కె.వి.రెడ్డి మరియు కమలాకర కామేశ్వరరావు కలసి చిత్రానువాదం అందించగా, పింగళి నాగేంద్రరావు సంభాషణలు రాసాడు. పాతాళ భైరవి కె.వి.రెడ్డి మరియు విజయా సంస్థల పేర్లను ఆంధ్రదేశంలో ప్రతి ఒక ఇంట్లో మారుమోగేలా చేసిన పాతాళ భైరవి సినిమా 1951 సంవత్సరంలో విడుదలైంది. జానపదాల్లో పాతాళభైరవి అనేక విషయాల్లో మార్గదర్శకమైంది. ఈ సినిమా కథకు చందమామ పత్రికలో వచ్చిన ఒక కథ మూలం. నేపాలీ మాంత్రికుణ్ణి సంహరించి తన సాహసంతో ఉజ్జయినీ రాకుమార్తెను పొందే వీరుడిగా ఎన్.టి.రామారావు సరిగ్గా సరిపోయాడు. నేపాళీ మాంత్రికుడుగా అద్భుతంగా నటించిన ఎస్వీ రంగారావుకీ ఈ సినిమా ద్వారా మంచిపేరు వచ్చింది. ముఖ్యంగా సాహసం శాయరా డింభకా, రాకుమారి లభించునురా అన్న వాక్యం ప్రాచుర్యం పొందింది. నేపాళీ మాత్రికునితో పాటు ఉండే డింగిరి పాత్రలో పద్మనాభం నటించాడు. ఉజ్జయినీ మహారాజుగా సి.ఎస్.ఆర్.ఆంజనేయులు నటించగా, అమాయక రాకుమారుని పాత్రలో రేలంగి నవ్విస్తాడు. ఈ సినిమాలోని ఒక పాటలో ప్రముఖ నటి సావిత్రి కనిపించడం విశేషం. ఈ చిత్రంలాగే ఇందులోని పాటలు కూడా అద్భుత విజయం సాధించాయి. ముఖ్యంగా కలవరమాయే మదిలో, ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసివాడూ పాటలు ఆంధ్ర్రదేశమంతా మారుమోగాయి. పెద్ద మనుషులు పాతాళభైరవి లాంటి జానపదం తీసిన తరువాత 1954లో సాంఘిక చిత్రమైన పెద్ద మనుషులు చిత్రం విడుదలైంది. సాంఘికాల్లో పెద్ద మనుషులు చిత్రాన్ని కీర్తిస్తూ న భూతో న భవిష్యతి అన్నారు అప్పటి విమర్శకులు. పదవుల ఘరానా ముసుగులో అవతవకలకు పాల్పడే పెద్దలను విమర్శిస్తూ తీశారు ఈ సినిమా. పెద్దలు చేసే పనులలో లొసుగులను బయటపెట్టే తిక్క శంకరయ్య పాత్ర రేలంగి సినీ జీవితంలో మరపురాని పాత్రలలో ఒక్కటి. ప్రముఖ సినీ రచయిత డి.వి.నరసరాజుకు ఇదే తొలి సినిమా. కొసరాజు రాసిన శివ శివ మూర్తివి గణనాథా, నీవు శివుని కుమారుడవు గణనాథా పాట ఇప్పటికీ వినబడుతూంటుంది. [మార్చు] దొంగ రాముడు దుక్కిపాటి మధుసూదనరావు, అక్కినేని నాగేశ్వరరావులు సినీ నిర్మాణ కంపెనీ ఆరంభించినా, కె.వి.రెడ్డి చేతనే తొలి చిత్రం తీయించాలని అనుకోవడంతో, ఆయన కోసం రెండేళ్లు పైచిలుకు కాలం నిరీక్షంచవలసి వచ్చింది. ఆ చిత్రం అన్నపూర్ణావారి దొంగరాముడు (1955). ఈవాళ ఆ చిత్రం పూనా ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లోని విద్యార్ధులకు బోధనాపాఠం. ఒక దొంగ తన తప్పులు తెలుసుకొని తనను తాను సంస్కరించుకొనే పాత్రలో ఏయన్నార్ చక్కగా నటించాడు. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు మరియు ఆర్.నాగేశ్వరరావుల మధ్య పోరాట సన్నివేశాలను అత్యంత సహజంగా, అద్భుతంగా చిత్రీకరించారు. ఇందులో సావిత్రి పూలమ్మే అమ్మాయిగా నటించగా జమున, అక్కినేని నాగేశ్వరరావుకు చెల్లెలుగా నటించింది. సానుభూతి పరుడైన వైద్యునిగా కొంగర జగ్గయ్య నటించాడు. మాయా బజార్ ప్రధాన వ్యాసం: మాయా బజార్ ఒక్క మాయాబజార్‌ సినిమా చాలు చిత్రానువాదం (స్క్రీన్‌ ప్లే) నడపడంలో కె.వి.రెడ్డి వైదుష్యం ఎంతటిదో అర్థం కావడానికి. ఆ చిత్రం ఎన్ని సార్లు చూసినా.., ఫలానా నన్నివేశం అనవసరమనో లేక ఇంకేదో సన్నివేశం అవసరం ఉందనో అనిపించదు. సినిమా మూడు గంటలపాటు నడిచినా ముప్పావుగంటలో అయిపోయిందన్న భ్రమ కల్పించడానికీ, సర్వకాలాల్లోనూ సర్వప్రేక్షకుల్నీ అలరిస్తూ ఆహ్లాదపరచడానికీ, ఆ చిత్రానువాదమే కారణం. తెలుగు సినిమా చరిత్రలో విడుదలైన అద్భుత చిత్రాలలో ఈ సినిమా ప్రథమ స్థానం అలంకరించిందంటే అది ఆ దర్శకచక్రవర్తి ప్రజ్ఞ. ప్రజ్ఞతో చేసిన తపస్సు. పాతాళ భైరవి తరువాత కెవి.రెడ్డి విజయా సంస్థకు చేసిన రెండవ సినిమా ఇది. దుర్యోధనుని కుమారుడైన లక్ష్మణ కుమారుడితో వివాహం నిశ్చయమైన శశిరేఖను, ఘటోత్కచుడు తన మాయజాలంతో అపహరించి, తన ఆశ్రమంలో అభిమన్యుడితో వివాహం జరిపించడం, తాను మాయా శశిరేఖ అవతారం దాల్చడం, కౌరవులను ముప్పుతిప్పలు పెట్టడం, కృష్ణుడు వీటన్నిటికి పరోక్షంగా సహకరించడం, ఇవి ఈ చిత్రంలోని కథాంశాలు. జగదేకవీరుని కథ 1958లో ఎ.ఎన్.ఆర్, జమున నటించిన పెళ్ళినాటి ప్రమాణాలు లాంటి సాంఘికం చేసిన తరువాత 1961లో జగదేకవీరుని కథ లాంటి అద్భుత జానపదాన్ని తీశాడు కె.వి.రెడ్డి. ఇందులో నలుగురి కథానాయికలలో ఒకరిగా బి.సరోజాదేవి నటించింది. ప్రతాప్ అనే రాకుమారుడు దేవకన్యలను పెళ్ళి చేసుకొనే కోరికతో బయలుదేరి, దేవతలనే మెప్పించి నాగ కన్య, అగ్ని పుత్రిక, వరుణుడి కుమార్తె, ఇంద్ర పుత్రికలను పెళ్ళాడటం ఈ చిత్రంలోని కథాంశం. ఇందులోని శివశంకరి పాట ఎంతో పేరుపొంది ఘంటసాల కీర్తిని శాశ్వతం చేసింది. శ్రీకృష్ణార్జున యుద్దం 1962 సంవత్సరంలో తెలుగు సినిమాకు రెండు కళ్ళయిన రామారావు - నాగేశ్వరరావు కలసి నటించిన శ్రీకృష్ణార్జున యుద్దం విడులైంది. మహాభారతంలోని పాత్రలను తీసికొని కల్పించిన కథతో ఈ చిత్రాన్ని తీసారు. గయుడు అనే గంధర్వుడు పుష్పక విమానంలో వెడుతుండగా తను నములుతున్న తాంబూలాన్ని భూమి మీదకు ఉమ్ముతాడు. అది సంధ్యావందనం చేస్తున్న శ్రీకృష్ణుని చేతులో పడుతుంది. దానితో ఆగ్రహించిన కృష్ణుడు గయుణ్ణి సంహరిస్తానని శపథం చేస్తాడు. దానితో భీతిల్లిన గయుడు నారదుని సలహామీద, అసలు విషయం చెప్పకుండా అర్జునుని శరణు పొందుతాడు. తరువాత విషయం తెలిసికూడా ఇచ్చిన అభయం నిలబెట్టుకోవడం కోసం అర్జునుడు శ్రీకృష్ణుడితో పోరాడటం ఇందులోని కథాంశం. సత్య హరిశ్చంద్ర 1965 సంవత్సరంలో కె.వి.రెడ్డి, హరిశ్చంద్రుని పాత్రలో ఎన్.టీ.ఆర్ ను, చంద్రమతి పాత్రలో ఎస్.వరలక్ష్మిని తీసికొని సత్య హరిశ్చంద్ర చలన చిత్రాన్ని తీశాడు. విశ్వామిత్రునిగా ముక్కామల నటించగా, కాటికాపరి పాత్రలో రాజనాల నటించాడు. ] శ్రీకృష్ణ సత్య 1972 సంవత్సరంలో కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన చివరి చిత్రం శ్రీకృష్ణ సత్య విడుదలైంది. కృష్ణుని పాత్రలో మళ్ళీ ఎన్.టీ.ఆర్ నటించగా, సత్యభామ పాత్రలో జమున నటించింది. దర్శకత్వ శైలి నిర్మాణ శాఖనీ, దర్శకత్వ శాఖనీ రెంటినీ ఆకళింపు చేసుకున్న వ్యక్తి కె.వి.రెడ్డి. ఏ చిత్రం తాను నిర్దేశకత్వం చేసినా, పథకం అంతా తనే సిద్ధం చేసేవాడు. వేసుకున్న బడ్జెట్‌లోనే సినిమా తియ్యడం సాద్యం చేసుకున్నట్టుగానే రాసుకున్న సినిమా నిడివిని దాటకుండా, సుసాధ్యం చేసుకోగలిగిన దర్శకుడు కె.వి.రెడ్డి. నిడివి విషయంలో ఎంతో దూరాలోచన ఉండేది కె.వి.రెడ్డికి. అలాగే కె.వి.కి దూరదృష్టి కూడా చాలా ఎక్కువ. ఏది తీసినా, ఏది తలపెట్టినా కథాగమనానికీ, దృశ్యనిర్మాణానికీ అతను వెచ్చించవలసిన కాలం వెచ్చించవలసిందే. అందులో రాజీ ఉండదు. 'గుణసుందరి కథ' లో ‘శ్రీరంజని హీరోయినా?’ అన్నారు కొందరు - మిత్రులూ, పరులూ. పాతాళభైరవిలో "రామారావు పక్కన మాలతి ఏం బావుంటుంది?" అన్నారు వాళ్లే. మాయాబజార్‌ లో అంత లావు సావిత్రి శశిరేఖా? ‘రేవతి ఛాయాదేవా?’ అన్నవాళ్లకి "అందుకే ఛాయాదేవి!" అని ఆయన సమాధానం ఇచ్చారు. అంతలావు తల్లి ఉన్నప్పుడు పక్కన కూతురిలో ఆ లావు కనిపించదని కె.వి. నమ్మకం. శ్రీరంజని అయినా, మాలతి అయినా కథాపరమైన పాత్రలకి ఏ సమస్యా రాదన్నది ఆయన విశ్వాసం. బక్కచిక్కిన 'పోతన' పాత్రకి భారీమనిషి నాగయ్యేమిటి? - అని అప్పుడే వచ్చింది విమర్శ. నాగయ్య తన నటనతో, తన పర్సనాలిటీని మరపింపజేస్తాడని - కె.వి. ధీమా. ఒక్క కథాగమనం, షూటింగ్‌ పథకాలూ అనే కాకుండా - అన్నీ నిశితంగా ఆలోచించే నిర్ణయించేవాడు కె.వి. చిన్న వేషాలు, పక్కవేషాలు, చెలికత్తెల వేషాల నిర్ణయంలో కూడా ఆ ఆలోచన ఉంటుంది. కె.వి. రెడ్డిని చూసినప్పుడు ‘ఈయనా? సినిమా డైరెక్టర్‌లా లేరే!’ అనుకునేవారు కొత్తవాళ్లు. ముతక ఖాదీపంచె, పొట్టిచేతుల చొక్కా, పర్సు, కాయితాలూ, పెన్నులతో ఎత్తయిన జేబు, భుజం మీద వేల్లాడుతూ కండువా -ఇదీ కె.వి. వేషధారణ. అందర్నీ ‘బ్రదర్‌!’ అని సంబోధిస్తూ ఎక్కువగా ఇంగ్లీషే మాట్లాడేవాడు. షూటింగులో కె.వి.విధానమే వేరు. తానుగా చేసి చూపించడమో, నటించడమో చేసి చూపించేవాడు కాదు. చెప్పేవాడు కూడా కాదు. పాత్రధారుల్నే చెయ్యమనేవాడు. అది తనకి కావలసిన రీతిలో లేకపోతే, ఇంకోలాగా, ఇంకోవిధంగా చెయ్యమనీ, చెప్పమనీ - తను ఎన్నికచేసి ఖాయం చేసేవాడు. ఎక్కువ తక్కువలుంటే చెప్పేవాడు. కళాకారులకి స్వతంత్రం వుండేది - దర్శకుని నియంత్రణా ఉండేది. షాటులో ఆరుగురు నటులుంటే - మాట్లాడే వారొక్కరే అయినా, ఫైనల్‌ రిహార్సల్సు ఆరు చేయించేవారు. ఒకొక్క రిహార్సలులోనూ ప్రతి ఒక్కరి రియాక్షనూ చూసేవారు. ఎక్కువ తక్కువలుంటే - సరిదిద్దేవాడు. టేకు ముందు మేకప్‌లు, లైటింగ్‌, కెమెరా పొజిషనూ అన్నీ ఓసారి సరిచూసుకుని ‘టేక్‌!’ చేసేవాడు. ఐతే, ఆయన ఏనాడూ ‘ఒకే!’ అని గట్టిగా అనలేదు. ‘పాస్‌!’ అనడమే ఆయన అలవాటు. అతని చిత్రాల్లో మంచిపాత్రలు ధరించి పేరు తెచ్చుకున్న రేలంగి, కె.వి.రెడ్డి "పాస్‌ మార్కులు ఇచ్చేవారే గానీ, నూటికి నూరు ఇవ్వడం మేము ఎరగం" అని చెప్పాడు. కె.వి.రెడ్డి షూటింగుకి సందర్శకులకు అనుమతి ఉండేది కాదు. మరీ కావలసినాళ్లో, తప్పనిసరో అయితే ముగ్గురికో, నలుగురికో అనుమతి ఇచ్చేవాళ్లు - అదీ పది, పదిహేను నిమిషాల్లో వెళ్లిపోవాలి. పూర్తి నిశ్శబ్దం, క్రమశిక్షణ, ఏకాగ్రత కనిపించేవి అతని షూటింగుల్లో. చిత్రాలు దర్శకత్వం చెయ్యమని బయటి సంస్థల నుంచి ఎంత గిరాకీ వున్నా కె.వి.రెడ్డి అంగీకరించేవాడు కాదు. ఒక సినిమా అయిన తర్వాతే, ఇంకో సినిమా తియ్యాలనే తత్వం ఆయనది. "మిగతా డైరెక్టర్లు ఒకేసారి రెండుమూడు చిత్రాలు చేస్తున్నారుకదా!" అంటే - "ఐయామ్‌ సారీ! ఐ డోంట్‌ హావ్‌ టు బ్రెయిన్స్‌!" అన్నది కె.వి.సమాధానం. జయాపజయాలు అనేవి అందరికీ వుంటాయి. అన్నిచోట్లా వుంటాయి. కె.వి.కీ వున్నాయి "చిత్రాలు విజయం పొందినప్పుడు ఎలా స్పందిస్తామో, పరాజయం పొందినప్పుడూ స్పందిస్తాం. రెండిటినీ సమానంగానే యాక్సెప్ట్‌ చెయ్యాలి!" అనేవాడు కె.వి.రెడ్డి. విశేషాలు * చిత్ర నిడివి విషయంలో కె.వి.రెడ్డికి ఎంత దూరాలోచన అంటే - ఒక ఉదాహరణ : దృశ్యాల విభజన జరిగిన తర్వాత సంభాషణలు నిర్ధారించుకున్న తర్వాత ‘ఇంత నిడివి ఉండాలి’ అని నిర్ణయించుకున్న తర్వాత - సహాయకులచేత సీన్లు చదివించుకుని స్టాప్‌ వాచ్‌ పెట్టుకుని, టైముచూసుకుని, ‘పుటేజ్‌’ నోట్‌చేసుకోవడం - అతని అలవాటు. అలా ‘గుణసుందరి కథ’ (1949) లోని ఒకదృశ్యం విని - ‘ఎంతొచ్చింది?’ అని అడిగాడు. ‘రెండు నిమిషాలొచ్చింది’ అన్నాడు సహాయదర్శకుడు. 'కాదు, ఇంకో అరనిమిషం పెరుగుతుంది. ఎంచేతంటారా రాజుగారి వేషం వేస్తున్నది గోవిందరాజు సుబ్బారావు. మీరు చదివినట్టుగా ఆయన డైలాగులు చెప్పరు. ఇంకా తాపీగా చెబుతారు. అంచేత, ఆయన ఉన్న ప్రతి దృశ్యాన్నీ మనం వేసుకున్న టైముకి మరికొంత కలుపుకుంటూ రావాలి!' అని కె.వి. వివరించినట్టు - పింగళి నాగేంద్రరావు ఓసారి చెప్పాడు. * ‘జగదేకవీరుని కథ’ (1961) షూటింగ్‌ ఆరంభానికి నాలుగునెలల ముందే, కార్యక్రమాలు, షెడ్యూలు సిద్ధమైనాయి. ‘జలకాలాటలలో....’ పాట జనవరిలో పడింది. కాల్‌ షీట్‌ టైము ఉదయం ఏడుగంటలకి. జనవరి అంటే చలిరోజులు. నలుగురు అమ్మాయిలు ఆరున్నరకే రెడీ అయి, ఈతకొలనులోకి దిగాలి. నీళ్లు వెచ్చగా ఉంటే వాళ్లు హాయిగా దిగుతారు. లేకపోతే నసుగుతారు. పైగా చాలాసేపు నీళ్లలో ఉండాలి గనక - ‘ఆ పాట తీసే మూడుపూటలూ వేడి నీరు సరఫరా చెయ్యాలి’ అని నోట్‌ రాసి, ప్రొడక్షన్‌వారికి అందజేశాడు. షూటింగ్‌ వేళకి వెచ్చని నీళ్లు ‘పంపు’ కావడం, అనుకున్న షూటింగ్‌ రెండుపూటల్లోనే పూర్తికావడం జరిగాయి. పని చేసిన సినిమాలు దర్శకత్వం వహించినవి 1. భక్త పోతన (1942) 2. యోగి వేమన (1947) 3. గుణసుందరి కథ (1949) 4. పాతాళభైరవి (1951) 5. పెద్దమనుషులు (1954) 6. దొంగరాముడు (1955) 7. మాయాబజార్ (1957) 8. పెళ్ళినాటి ప్రమాణాలు (1958) 9. జగదేకవీరుని కథ (1961) 10. శ్రీకృష్ణార్జున యుద్ధం (1963) 11. సత్య హరిశ్చంద్ర (1965) 12. భాగ్యచక్రం (1968) 13. ఉమా చండీ గౌరీ శంకరుల కధ (1968) 14. శ్రీకృష్ణసత్య (1971) చిత్రానువాదం అందించినవి 1. గుణసుందరి కథ (1949) 2. దొంగరాముడు (1955) కథ అందించినవి 1. దొంగరాముడు (1955) 2. మాయాబజార్ (1957) నిర్మాతగా వ్యవహరించినవి 1. పెళ్ళినాటి ప్రమాణాలు (1958) 2. జగదేకవీరుని కథ (1961) 3. శ్రీకృష్ణార్జున యుద్ధం (1963) 4. సత్య హరిశ్చంద్ర (1965) 5. భాగ్యచక్రం (1968) 6. ఉమా చండీ గౌరీ శంకరుల కధ (1968)

కె.ఎస్.ఆర్.దాస్

కె.ఎస్.ఆర్.దాస్ (జ. జనవరి 5, 1931[1]) తెలుగు మరియు కన్నడ సినిమా దర్శకుడు. ఈయన యాక్షన్ మరియు క్రైమ్ చితాలు తీయడంలో సిద్ధహస్తుడు. మోసగాళ్ళకు మోసగాడు , యుగంధర్ లాంటి యాక్షన్ చిత్రాలకు ఈయనే దర్శకుడు.

కె. రాఘవేంద్ర రావు

తెలుగు సినీ రంగములో దర్శకేంద్రుడు అని పిలువబడే శతాధిక చిత్రాల తెలుగు సినిమా దర్శకుడు కె. రాఘవేంద్ర రావు. ఆయన మే 23, 1942 తేదీన కృష్ణా జిల్లా, కంకిపాడు మండలానికి చెందిన కోలవెన్ను గ్రామంలో జన్మించాడు. శ్రీదేవి, విజయశాంతి, రాధ, రమ్యకృష్ణ, రవళి లాంటి కథానాయికలకు ఎందరికో మంచి సినీ జీవితాన్ని ప్రసాదించిన ఈ దర్శకేంద్రుడు తన సినీ జీవితాన్ని శోభన్ బాబు నటించిన బాబు అనే విజయవంతమైన చిత్రంతో ప్రారంభించాడు. ఆ తర్వాత ఎంతో మంది కథానాయకులతో ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీశాడు. "హిమ్మత్-వాలా", "తోఫా" లాంటి విజయవంతమైన హిందీ సినిమాలకు దర్శకత్వం వహించి బాలీవుడ్ లో తన సత్తా చాటాడు. స్త్రీ పాత్రలే ప్రధానంగా జ్యోతి, ఆమె కథ, కల్పన లాంటి చిత్రాలు తీశాడు. కె. రాఘవేంద్ర రావు సినిమాల జాబితా స.రం చిత్రం పేరు నటీ నటులు 1975 బాబు శోభన్ బాబు, వాణిశ్రీ, లక్ష్మి 1976 రాజా శోభన్ బాబు, జయసుధ 1976 జ్యోతి జయసుధ 1977 అమరదీపం కృష్ణంరాజు, జయసుధ 1977 కల్పన మురళీమోహన్, జయచిత్ర 1977 ఆమెకథ మురళీమోహన్, ప్రభ 1977 అడవి రాముడు నందమూరి తారక రామారావు, జయప్రద, జయసుధ 1978 సింహబలుడు నందమూరి తారక రామారావు, వాణిశ్రీ 1978 పదహారేళ్ళ వయసు శ్రీదేవి, చంద్ర మోహన్ 1979 డ్రైవర్ రాముడు నందమూరి తారక రామారావు, జయసుధ 1979 వేటగాడు నందమూరి తారక రామారావు, శ్రీదేవి 1980 గజదొంగ నందమూరి తారక రామారావు, శ్రీదేవి, జయసుధ 1980 మోసగాడు శోభన్ బాబు, శ్రీదేవి 1980 భలే కృష్ణుడు కృష్ణ, జయప్రద 1980 ఘరానా దొంగ కృష్ణ, శ్రీదేవి 1981 కొండవీటి సింహం నందమూరి తారక రామారావు, శ్రీదేవి, జయంతి 1981 తిరుగులేని మనిషి నందమూరి తారక రామారావు 1981 ఊరికి మొనగాడు కృష్ణ, జయప్రద 1981 రగిలే జ్వాల కృష్ణంరాజు, సుజాత, జయప్రద 1982 మధుర స్వప్నం కృష్ణంరాజు, జయసుధ, జయప్రద 1982 త్రిశూలం కృష్ణంరాజు, శ్రీదేవి, రాధిక, జయసుధ 1982 దేవత శోభన్ బాబు, జయప్రద, శ్రీదేవి 1982 జస్టిస్ చౌదరి నందమూరి తారక రామారావు, శ్రీదేవి 1983 అడవి సింహాలు కృష్ణ, కృష్ణంరాజు, శ్రీదేవి, జయప్రద 1983 శక్తి కృష్ణ, జయసుధ 1983 హిమ్మత్ వాలా జితేంద్ర, శ్రీదేవి 1984 థోఫా జితేంద్ర, శ్రీదేవి 1984 ఇద్దరు దొంగలు శోభన్ బాబు, రాధ 1984 బొబ్బిలి బ్రహ్మన్న కృష్ణంరాజు, లక్ష్మి, రాధ 1985 అడవి దొంగ చిరంజీవి, రాధ 1985 అగ్నిపర్వతం కృష్ణ, రాధ, విజయ శాంతి 1985 వజ్రాయుధం కృష్ణ, శ్రీదేవి 1985 పట్టాభిషేకం బాలకృష్ణ, విజయ శాంతి, శారద 1986 రావణబ్రహ్మ కృష్ణంరాజు, శారద, జయసుధ 1986 కలియుగ పాండవులు వెంకటేష్, కుష్బు 1986 చాణక్య శపధం చిరంజీవి, విజయ శాంతి 1986 కొండవీటి దొంగ చిరంజీవి, రాధ, విజయ శాంతి 1987 భారతంలో అర్జునుడు వెంకటేష్, కుష్బు, అరుణ 1988 జానకిరాముడు అక్కినేని నాగార్జున, విజయ శాంతి 1988 ఆఖరి పోరాటం అక్కినేని నాగార్జున, శ్రీదేవి , సుహాసిని 1989 ఒంటరి పోరాటం వెంకటేష్ 1989 రుద్రనేత్ర చిరంజీవి 1990 మంచి దొంగ చిరంజీవి, విజయ శాంతి 1990 జగదేకవీరుడు- అతిలోక సుందరి చిరంజీవి, శ్రీదేవి 1990 అల్లుడుగారు మోహన్ బాబు, రమ్యకృష్ణ 1991 కూలీ నెం.1 వెంకటేష్, టబు 1992 సుందరకాండ వెంకటేష్, మీనా, అపర్ణ 1992 ఘరానా మొగుడు చిరంజీవి, నగ్మా, వాణీ విశ్వనాధ్ 1992 రౌడీ అల్లుడు చిరంజీవి, శోభన, దివ్య భారతి 1992 అల్లరి మొగుడు మోహన్ బాబు, మీనా 1992 అశ్వమేధం శోభన్ బాబు, బాలకృష్ణ , మీనా 1993 మేజర్ చంద్రకాంత్ నందమూరి తారక రామారావు, మోహన్ బాబు, శారద, రమ్యకృష్ణ, నగ్మా 1994 అల్లరి ప్రియుడు రాజ శేఖర్, రమ్యకృష్ణ, మధు బాల 1994 ముద్దుల ప్రియుడు వెంకటేష్, రమ్యకృష్ణ, రంభ 1994 ముగ్గురు మొనగాళ్ళు చిరంజీవి, నగ్మా, రోజా, రమ్యకృష్ణ 1994 అల్లరి ప్రేమికుడు జగపతి బాబు, రమ్యకృష్ణ, సౌందర్య, రంభ 1995 ఘరానా బుల్లోడు అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ 1995 రాజసింహం రాజ శేఖర్, రమ్యకృష్ణ, సౌందర్య 1996 బొంబాయి ప్రియుడు జె.డి.చక్రవర్తి, రంభ 1996 పెళ్ళి సందడి శ్రీకాంత్, దీప్తీ భట్నాగర్, రవళి 1996 సాహసవీరుడు - సాగరకన్య వెంకటేష్, శిల్పా షెట్టి, మాలశ్రీ 1997 అన్నమయ్య అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ, కస్తూరి 1998 పరదేశి మాధవ్ , మోనా , ధనుజ, విశ్వ 1998 లవ్ స్టోరీ 1999 ప్రభుదేవా, నవీన్ వడ్డే , రమ్య, రంభ 1999 రాజకుమారుడు మహేష్‌ బాబు, ప్రీతి జింటా 1999 ఇద్దరు మిత్రులు చిరంజీవి, సాక్షీ శివానంద్, రమ్యకృష్ణ 2001 మంజునాధ చిరంజీవి, అర్జున్, సౌందర్య, మీనా 2003 గంగోత్రి అల్లు అర్జున్ , అదితి అగర్వాల్ 2005 సుభాష్ చంద్రబోస్ వెంకటేష్, శ్రియా, జెనీలియా 2005 అల్లరి బుల్లోడు నితిన్, త్రిష 2006 శ్రీరామదాసు అక్కినేని నాగార్జున , స్నేహ 2008 పాండురంగడు బాలకృష్ణ, స్నేహ

కృష్ణవంశీ

కృష్ణవంశీ ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు. రామ్ గోపాల్ వర్మ దగ్గర కొన్ని చిత్రాలకు సహాయకుడిగా పనిచేసాడు. తన తొలి చిత్రం గులాబీతో మంచి పేరు తెచ్చుకున్నాడు. 2000వ సంవత్సరంలో ఆంధ్రా టాకీస్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. నటి రమ్యకృష్ణను పెళ్ళి చేసుకున్నాడు. చిత్రాలు 1. గులాబి 2. నిన్నే పెళ్ళాడుతా 3. సిందూరం 4. అంతఃపురం 5. సముద్రం 6. మురారి 7. ఖడ్గం 8. శ్రీఆంజనేయం 9. చక్రం 10. డేంజర్ 11. రాఖీ 12.చందమామ 13.ససిరేకపరినయం 14.మహాత్మా తెలుగు సినిమా లో స్రుజనాత్మకతకు భాష్యం చెప్పిన దర్శకుడు క్రిష్ణవంశీ.
కమలాకర కామేశ్వరరావు సాంఘిక చిత్రాల మాటెలా ఉన్నా తెలుగు పౌరాణిక చిత్రాలకు సాటి రాగల పౌరాణికాలు యావద్భారత దేశంలోనే మరే భాషలోనూ లేవు. తెలుగు పౌరాణికాలకు ఆ ఘనతను సాధించి పెట్టిన చిత్రాలు చాలానే ఉన్నాయి. నర్తనశాల, పాండవ వనవాసం మొదలైనవి వాటిలో ముఖ్యమైనవి. అలాంటి చిత్రాలను తీసి పౌరాణిక చిత్రాల బ్రహ్మ గా గుర్తింపు పొందిన దర్శకుడు కమలాకర కామేశ్వరరావు. విషయ సూచిక * 1 తొలి జీవితం * 2 సినీ విమర్శకునిగా * 3 రంగ ప్రవేశం * 4 దర్శకత్వం వహించిన సినిమాలు: o 4.1 దర్శకుని నిర్వచనం కామేశ్వరరావు 1911 లో బందరు లో జన్మించాడు. ఆయన విద్యాభ్యాసం పూర్తిగా అక్కడే జరిగింది. ఆయన 1933 లో బి.ఏ. పాసయాడు. అప్పటికే ఆయనకు సినిమా టెక్నిక్ మీద మంచి ఉత్సాహం ఏర్పడింది. వచ్చిన ప్రతి చిత్రమూ భాషతో నిమిత్తం లేకుండా తప్పక చూసేవాడు. చూసి ఊరుకోక ఫిల్మ్ టెక్నిక్ కు సంబంధించిన పుస్తకాలు తెప్పించి చదవడం ప్రారంభించాడు. స్వతహాగా ఉన్న ఆసక్తికి ఇలా పుస్తకాల ద్వారా పొందిన విజ్ఞానం తోడవడంతో ఆయన విడుదలైన సినిమాల మీద విమర్శలు వ్రాయడం ఆరంభించాడు. సినీ విమర్శకునిగా కృష్ణా పత్రిక లో 'సినీఫాన్' అన్న పేరుతో సినిమా రివ్యూలు వ్రాసే వాడు. విడుదలైన తెలుగు సినిమాలను; న్యూ థియేటర్స్, ప్రభాత్ వారి హిందీ సినిమాలనూ కూలంకషంగా పరిశీలిస్తూ నిశితంగా విమర్శించేవాడు. బందరులో మొదటిసారి విడుదల కాని సినిమాలను బెజవాడ వెళ్ళి చూసి వచ్చేవాడు. సినిమాల్లో కథ, కథాసంవిధానం ఎలా వున్నాయి? ఆ సినిమాలు టెక్నికల్ గా ఎలా వున్నాయి? అన్న విషయాల మీద ఆయన విమర్శలు సాగేవి. తెలుగు, హిందీ సినిమాలే గాక ఆంగ్ల చిత్రాల గురించి కూడా వ్రాసేవాడు. 'గుడ్ ఎర్త్ ' అనే సినిమా లోని గొప్ప దనాన్ని గురించి వరసగా నాలుగు సంచికల్లో వ్రాశాడు. ఆయన సినిమా విమర్శలకు ఎంతో విలువ ఉండేది. ఆ విమర్శలు విజ్ఞులందరికీ ప్రామాణికంగా ఉండేవి. ఆ విమర్శల్ని చదివి, వాటిలో 'బాగుంది' అని వ్రాస్తేనే ఆ సినిమాలను చూసేవాళ్ళు, బాగలేదని వ్రాస్తే చూడని వాళ్ళు కూడా ఉండేవారు. కృష్ణా పత్రిక స్థాపకుడు మరియు సంపాదకుడు అయిన ముట్నూరు కృష్ణారావు కామేశ్వరరావు ను గురించి "మా సినీఫాన్" అని గర్వంగా చెప్పేవాడు. ఆ రోజుల్లో పోటీ పడి ఒకేసారి విడుదలైన "ద్రౌపదీ వస్త్రాపహరణం", "ద్రౌపదీ మానసంరక్షణం" చిత్రాలను రెండింటినీ సరిపోలుస్తూ, తేడాలను విశదపరుస్తూ కామేశ్వరరావు కృష్ణా పత్రికలో వరసగా నాలుగు సంచికలలో వ్రాసిన విమర్శలు సినిమా పరిశ్రమలో సంచలనం కలిగించాయి. ఎందుకంటే 'వస్త్రాపహరణం' ఆర్థికంగా విజయవంతమైంది; 'మానసంరక్షణం' దెబ్బతిన్నది. కానీ కామేశ్వరరావు మాత్రం 'మానసంరక్షణం' 'వస్త్రాపహరణం' కంటే మంచి చిత్రమని ప్రశంసించాడు. వస్త్రాపహరణం లోని లోటు పాట్లను విమర్శించాడు. వస్త్రాపహరణంలో నాటి ప్రముఖ స్టేజి నటులంతా నటించారు. బహుళ ప్రచారంలో ఉన్న పద్యాలనే ఆ సినిమాలో వాడారు. హెచ్. ఎం. రెడ్డి ఆధ్వర్యంలో హెచ్.వి.బాబు దర్శకత్వంలో ఆ చిత్ర నిర్మాణం జరిగింది. ఇక మానసంరక్షణం చిత్రానికి ఎన్.జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. ఇందులో దుర్యోధన పాత్ర ధరించింది బళ్ళారి రాఘవ కాగా అందులో యడవల్లి సూర్యనారాయణ. కథ నడిపిన విధానం, నటన మానసంరక్షణం లో బాగున్నాయని కామేశ్వరరావు వ్రాశాడు. ఈ విమర్శలను నార్ల వెంకటేశ్వరరావు, గూడవల్లి రామబ్రహ్మం లాంటి ప్రముఖులందరూ ప్రశంసించారు. రామబ్రహ్మం 'వస్త్రాపహరణం' సినిమాలో పని చేశాడు. అయినా కామేశ్వర రావు విమర్శలను మెచ్చుకున్నాడు! ఈ 'వస్త్రాపహరణం', 'మానసంరక్షణం' చిత్రాల మీద వ్రాసిన విమర్శలే కామేశ్వర రావును చిత్ర పరిశ్రమలో ప్రవేశ పెట్టాయి. రంగ ప్రవేశం హెచ్.ఎం.రెడ్డి 'కనకతార' తీస్తున్న రోజుల్లో కామేశ్వరరావు మద్రాసు వచ్చాడు. తాను 'సినీఫాన్' అనే పేరుతో కృష్ణా పత్రికలో సినిమాల గురించి విమర్శలు వ్రాస్తూ ఉంటానని చెప్పి 'మానసంరక్షణం', 'వస్త్రాపహరణం' చిత్రాల మీద తాను వ్రాసిన విమర్శలు చూపించాడు - వాటిల్లో ఆర్థికంగా హిట్టైనా సరే, బాగాలేదని తాను వ్రాసిన వస్త్రాపహరణం సినిమా తీసిన హెచ్.ఎం.రెడ్డి కి! కానీ విమర్శలు పూర్తిగా చదివి హెచ్.ఎం.రెడ్డి ఆయన్ను అభినందించాడు!! "చాలా బాగుంది" అని మెచ్చుకున్నాడు!! పైగా తన సినిమాను విమర్శించి, దానికి పోటీగా ఇంకొకరు తీసిన సినిమాను ప్రశంసించిన కామేశ్వరరావుకు ఉద్యోగమివ్వడానికి సిద్ధపడ్డాడు ఆయన. గృహలక్ష్మి సినిమా ప్రారంభానికి ముందు కబురందుకుని కామేశ్వరరావు మద్రాసు చేరుకుని రోహిణీ సంస్థలో చేరాడు. అయితే ఆ సినిమాలో పనిచేసేనాటికి ఆయనకు సినిమాలలో పని చేసిన అనుభవం లేదు కాబట్టి జీతం లేదు కానీ భోజనం, వసతి సౌకర్యాలు ఉచితంగా ఏర్పాటు చేశారు. కామేశ్వరరావు రోహిణీ వారి లాడ్జిలోనే వుండేవారు. (ఆ రోజుల్లో ఒక సినిమాలో పని చేసే వాళ్లందరికీ ఒకే లాడ్జిలో వసతి, భోజనాలు ఏర్పాటు చేసేవారు). రోహిణీలో చేరడంతో ఆయనకు పెద్దవారితో పరిచయాలు ఏర్పడ్డాయి. రామ్‌నాథ్, ఎ.కె.శేఖర్, బి.ఎన్.రెడ్డి, కె.వి.రెడ్డి, సముద్రాల రాఘవాచార్య మొదలైన వారు పరిచయమయ్యారు. కె.వి.రెడ్డి అప్పుడు రోహిణి లో క్యాషియర్ గా ఉండేవాడు. పెద్ద, చిన్న భేదం లేకుండా అందరూ ఒకే చోట భోజనాలు చేసేవారు. ఒక్కసారే ఒకే కార్లో షూటింగుకు బయల్దేరే వారు. అంతా ఒక కుటుంబంలా ఉండేవారు. కామేశ్వరరావుకు ఆ సినిమాలో జీతమేకాదు, పని కూడా ఏమీ ఉండేది కాదు. ప్రతిరోజూ తప్పనిసరిగా ఏదో ఒక సినిమా చూసేవాడు. రాత్రయాక లాడ్జిలో పడుకుని కె.వి.రెడ్డి, ఆయనా ఆ సినిమా గురించి చర్చించుకునేవారు. అలా వారిద్దరూ బాగా సన్నిహితులైనారు. గృహలక్ష్మి చిత్రం పూర్తయాక బి.ఎన్.రెడ్డి, రామ్‌నాథ్, ఎ.కె.శేఖర్ తదితరులంతా కలిసి వాహినీ సంస్థ స్థాపించారు. దాంట్లో కామేశ్వరరావు సహాయ దర్శకుడుగా చేరాడు. కె.వి.రెడ్డి ప్రొడక్షన్ మానేజరు, బి.ఎన్.రెడ్డి దర్శకుడు. వాహినీ వారి దేవత చిత్రం నుంచి కామేశ్వరరావు అసోసియేట్ గా పని చేశాడు. ఆసియాలోకెల్లా అతిపెద్ద స్టూడియోగా పేరుపొందిన వాహినీ స్టూడియోకు శంకుస్థాపన జరిగినప్పుడు అక్కడుండి మట్టి వేసిన వారిలో కామేశ్వరరావు ఒకడు. బందరులో కామేశ్వరరావుకు పింగళి నాగేంద్రరావుతో పరిచయముంది. ఆయన వింధ్యరాణి చిత్ర నిర్మాణ సమయంలో మద్రాసు వచ్చాడు. అప్పుడు కామేశ్వరరావు ఆయనను కె.వి.రెడ్డికి, బి.ఎన్.రెడ్డికి పరిచయం చేశాడు. అలా తెలుగు సినిమా చరిత్రలో అత్యంత ప్రతిభావంతమైన రచయితను పరిశ్రమకు పరిచయం చేసింది కూడా కామేశ్వరరావేనని చెప్పవచ్చు.అంతలో కారణాంతరాల వల్ల వాహినీ స్టూడియో చేతులు మారి విజయా సంస్థ స్టూడియోను నిర్వహించసాగింది. విజయా వారు కామేశ్వరరావును కూడా తమ సంస్థ లోకి తీసుకున్నారు. తొలుత విజయా వారి పాతాళభైరవి సినిమాకు ఆయన పనిచేశాడు. తర్వాత విజయా వారే నిర్మించిన చంద్రహారం సినిమాతో కామేశ్వరరావు తొలిసారిగా దర్శకుడయ్యాడు. తెలుగు, తమిళ భాషల్లో నిర్మించబడిన ఈ చిత్రం విజయావారి మునుపటి చిత్రాల వలె అర్థికంగా విజయవంతం కాలేకపోయింది. కానీ విమర్శకుల మెప్పును మాత్రం పొందింది. ఆ చిత్రంలోని టెక్నిక్ కు ఎందరో విమర్శకులు జోహార్లర్పించారు. ఆ సినిమాలోని కొన్ని దృశ్యాలు విదేశాల్లో టెలివిజన్ లో ప్రసారమయ్యాయి. దర్శకత్వం వహించిన సినిమాలు: చంద్రహారం (1954) గుణసుందరి కథ (తమిళం) పెంకి పెళ్ళాం (1956) పాండురంగ మహత్యం (1957) శోభ (1958) రేచుక్క-పగటిచుక్క (1959) మహాకవి కాళిదాసు (1960) గుండమ్మకథ (1962) మహామంత్రి తిమ్మరుసు (1962) నర్తనశాల (1963) పాండవ వనవాసం (1965) శకుంతల (1966) శ్రీకృష్ణ తులాభారం (1966) శ్రీకృష్ణావతారం (1967) కాంభోజరాజు కథ (1967) వీరాంజనేయ (1968) కలసిన మనసులు (1968) మాయని మమత (1970) శ్రీకృష్ణ విజయం (1971) బాల భారతం (1972), మొ|| దర్శకుని నిర్వచనం * "చిత్రంలో అన్నిశాఖలూ, అందరూ కనిపించాలి గానీ, దర్శకుడు కనిపించగూడదని నా ఉద్దేశ్యం. అన్నిశాఖలనూ కనిపింపజెయ్యడమే దర్శకుని ఘనత. మణిహారంలో సూత్రముంటుంది. అది పైకి కనిపించదు. కానీ అన్ని మణులనూ కలిపి హారంగా రూపొందిస్తుంది. చిత్ర దర్శకుడు అలాంటి సూత్రం." -కమలాకర కామేశ్వరరావు. * ఇంతటి మహోన్నత ఆదర్శమూర్తి జూన్ 29, 1998 న తన 88వ ఏట కాలంచేశారు.

కడారు నాగభూషణం

కడారు నాగభూషణం సుప్రసిద్ధ తెలుగు సినిమా నిర్మాత మరియు దర్శకుడు. పసుపులేటి కన్నాంబ భర్త. చిత్రసమాహారం * Thali Bhagyam (1966) (దర్శకుడు) * ఉషా కల్యాణం (1966) (దర్శకుడు) * చదువుకున్న భార్య (1965) (దర్శకుడు) * ఆప్త మిత్రులు (1963) (నిర్మాత మరియు దర్శకుడు) * దక్షయజ్ఞం (1962) (నిర్మాత మరియు దర్శకుడు) * ఉషా పరిణయం (1961) (నిర్మాత మరియు దర్శకుడు) * ధర్మమే జయం (1960) (దర్శకుడు) * వీర భాస్కరుడు (1959) (దర్శకుడు) * శ్రీకృష్ణ మాయ (1958) (నిర్మాత) * అన్న తమ్ముడు (1958) (నిర్మాత) * సతీ అనసూయ (1957) (దర్శకుడు) * సతీ సావిత్రి (1957) (దర్శకుడు) * నాగ పంచమి (1956) (దర్శకుడు) * శ్రీకృష్ణ తులాభారం (1955) (నిర్మాత మరియు దర్శకుడు) * సతీ సక్కుబాయి (1954) (దర్శకుడు) * లక్ష్మి (1953) (దర్శకుడు) * Enzhai Vazhavan (1952) (దర్శకుడు) * పేదరైతు (1952) (దర్శకుడు) * సౌదామిని (1951) (నిర్మాత మరియు దర్శకుడు) * నవజీవనం (1949) (దర్శకుడు) * తులసీ జలంధర్ (1947) (దర్శకుడు) * పాదుకా పట్టాభిషేకం (1945) (నిర్మాత మరియు దర్శకుడు) * సుమతి (1942) (నిర్మాత మరియు దర్శకుడు) * తల్లిప్రేమ (1941) (నిర్మాత)

ఎస్వీ రంగారావు ( సామర్ల వెంకట రంగారావు)

సుప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు ఎస్వీ రంగారావు పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. నట యశస్వి గా పేరు పొందిన ఈ నటుడు మూడు దశాబ్దాలపాటు మూడొందల చిత్రాలకు పైగా అద్భుతంగా నటించి ఘటోత్కచుడిగా, కీచకుడిగా, రావణాసురుడిగా తనకు తానే సాటిగా ఖ్యాతి గడించాడు. ఆయా పాత్రలలో ఆయన ఎంత మమేకమై పొయ్యరంటే, వేరెవరు కూడా ఆ పాత్రలలో ఇప్పటివరకు ఇమడ లేకపొయ్యారు. విషయ సూచిక * 1 తొలి జీవితం * 2 నటనా చాతుర్యం * 3 వ్యక్తిగతం * 4 అవార్డులు, ప్రశంసలు * 5 కొన్ని పాత్రలు * 6 నటించిన చిత్రాలు * 7 మూలాలు తొలి జీవితం కృష్ణా జిల్లా లోని నూజివీడు లో 1918 జూలై 3 వ తేదీన లక్ష్మీ నరసాయమ్మ, కోటేశ్వరరావులకు ఎస్వీ రంగారావు జన్మించాడు. తండ్రి ఎక్సైజు శాఖలో పనిచేసేవాడు. యస్.వి.రంగారావు హిందూ కాలేజిలో చదివాడు. డిగ్రీ వరకూ చదివి, అగ్నిమాపక దళంలో ఉన్నతోద్యోగిగా పనిచేస్తూ, షేక్స్‌పియర్ ఆంగ్ల నాటకాలలో ఒథెల్లో, షైలాక్ తదితర పాత్రలు పోషించి ప్రముఖ రంగస్థల కళాకారుడిగా విశేష ఖ్యాతి గడించాడు. ఆ తర్వాత బి.వి.రామానందం దర్శకత్వంలో నిర్మించిన వరూధిని చిత్రంలో ప్రవరాఖ్యుడిగా తెలుగు చలనచిత్ర రంగానికి పరిచయమయ్యాడు. నటనా చాతుర్యం వరూధిని చిత్రంలో ప్రవరాఖ్యునిగా ఎస్వీ రంగారావు ఆ తర్వాత మనదేశం, పల్లెటూరి పిల్ల , షావుకారు, పాతాళభైరవి, పెళ్ళి చేసి చూడు, బంగారుపాప, బాలనాగమ్మ, గృహలక్ష్మి, బాల భారతం, తాతా మనవడు ఇలా అనేక చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించి తన అద్భుత నటనాచాతుర్యంతో సినీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశాడు. నటసామ్రాట్, విశ్వనట చక్రవర్తి మొదలగు బిరుదులతో తెలుగు ప్రేక్షకులు ఆయన్ను గౌరవించారు. ఎస్వీయార్ నటించిన నర్తనశాల ఇండొనేషియాలోని జకార్తా లో ఆఫ్రో-ఆసియా చిత్రోత్సవము‍లో ప్రదర్శించబడడమే కాకుండా కీచకపాత్రకుగాను ఎస్వీయార్ ఉత్తమ నటుడు బహుమతి పొందాడు. కొన్ని చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించాడు. ముఖ్యంగా ఆయన దర్శకత్వం వహించిన చదరంగం చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వ బహుమతి, నగదు పారితోషికం లభించాయి. అద్భుత నటనకు ప్రతీకగా నిల్చిన ఎస్వీ రంగారావు 1974 జూలై 18వ తేదీన మద్రాసు లో శాశ్వతంగా కన్నుమూశాడు. [మార్చు] వ్యక్తిగతం వ్యక్తిగా రంగారావు సహృదయుడు, చమత్కారి. ఆయన ఇష్టదైవం శివుడు. ప్రతిరోజూ శివపూజ చేసిన తర్వాత దినచర్య ప్రారంభించేవాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమార్తెల పేర్లు విజయ, ప్రమీల. కొడుకు పేరు కోటేశ్వర రావు. యస్వీఆర్ ఒక రకమయిన వేదాంతి. ఆయన ఇంటి లైబ్రరీలో వివేకానందునికి సంబంధించిన పుస్తకాలు ఎన్నో ఉండేవి. ఆయన గొప్ప దాత. ప్రజాహిత సంస్థలకు లెక్కలేనన్ని విరాళాలు ఇచ్చాడు. చైనాతో యుద్ధం వచ్చినపుడు ఏర్పాటు చేసిన సభలో పదివేల రూపాయలు విరాళం ఇచ్చాడు. తర్వాత పాకిస్తాన్‌తో యుద్ధం వచ్చినపుడు కూడా ఎన్నో సభలు నిర్వహించి, మిగతా నటులతో కలసి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి, విరాళాలు సేకరించి, ఆ డబ్బును రక్షణ నిధికి ఇచ్చాడు. అవార్డులు, ప్రశంసలు నర్తనశాలలో కీచకుని పాత్రకు ఆఫ్రో-ఆసియా చిత్రోత్సవములో ఉత్తమ నటుని బహుమతి అందుకొన్న ఎస్వీ రంగారావు బిరుదులు: * విశ్వనటచక్రవర్తి * నటసార్వభౌమ * నటసింహ బహుమతులు * రంగారావు దర్శకత్వం వహించిన మొదటిచిత్రం 'చదరంగం' ద్వితీయ ఉత్తమ చిత్రంగా నంది అవార్డును, రెండవ చిత్రం 'బాంధవ్యాలు' తొలి ఉత్తమ చిత్రంగా నంది అవార్డును గెలుచుకున్నాయి. * నర్తనశాల చిత్రంలో నటనకు ఇండోనేషియా ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ నటుడి అవార్డు, అదే పాత్రకు రాష్ట్రపతి అవార్డు అందుకున్నాడు. * ఎస్.వి.రంగారావు ప్రతిభను గురించి, వైవిధ్యమైన పాత్రల పోషించగల నైపుణ్యం గురించి ప్రసిద్ధ దర్శకుడు చిత్రకారుడు, బాపువేసిన ఛిత్రానికిముళ్ళపూడి వాఖ్యానం ఇలా చమత్కారంగా వ్రాశారు. క్లిష్టపాత్రల్లో చతురంగారావు దుష్టపాత్రల్లో క్రూరంగారావు హడలగొట్టే భయంకరంగారావు హాయిగొలిపే టింగురంగారావు రొమాన్సులో పూలరంగారావు నిర్మాతల కొంగుబంగారావు స్వభావానికి 'ఉంగారంగారావు కథ నిర్బలం అయితే హావభావాలు పాత్రపరంగారావు కళ్ళక్కట్టినట్టు కనబడేది ఉత్తి యశ్వీరంగారావు ఆయన శైలీ ఠీవీ అన్యులకు సులభంగారావు ఒకోసారి డైలాగుల్లో మాత్రం యమకంగారంగారావు [మార్చు] కొన్ని పాత్రలు రంగారావు బహుముఖ ప్రజ్ఞాశాలి. పాత్ర ఏదయినా, ఆయన కనిపించేవాడు కాదు, పాత్రే కనిపించేది. ఆయన తన సుదీర్ఘ నట జీవితంలో, అనేకానేక పాత్రలలో జీవించాడు. వాటిలో కొన్ని: * షావుకారు - సున్నం రంగడు * పెళ్ళిచేసి చూడు - ధూపాటి వియ్యన్న * సంతానం - గుడ్డివాడు * మాయాబజార్ - ఘటోత్కచుడు * సతీ సావిత్రి - యముడు * భక్తప్రహ్లాద - హిరణ్యకశిపుడు * శ్రీక్రిష్ణ లీలలు - కంసుడు * యశోద కృష్ణ - కంసుడు * పాండవ వనవాసం - దుర్యోధనుడు * నర్తనశాల - కీచకుడు * హరిశ్చంద్ర - హరిశ్చంద్రుడు * శ్రీకృష్ణాంజనేయ యుద్ధం - వాసుదేవుడు * సంపూర్ణ రామాయణం - రావణుడు * దీపావళి - బాణాసురుడు * అనార్కలి - అక్బర్ * మహాకవి కాళిదాసు - భోజరాజు * పాతాళభైరవి - మాంత్రికుడు * భట్టి విక్రమార్క - మాంత్రికుడు * బాలనాగమ్మ - మాంత్రికుడు * విక్రమార్క - మాంత్రికుడు * బంగారుపాప - కోటయ్య * బొబ్బిలియుద్ధం - తాండ్ర పాపారాయుడు నటనకే భాష్యం చెప్పిన యశస్వి - ఎస్వీ రంగారావు [మార్చు] నటించిన చిత్రాలు ఆయన నటంచిన చిత్రాలు అనేకం. అందులో కొన్ని . 40వ దశకం 1. వరూధిని(1946) 2. మన దేశం(1948) 50వ దశకం 1950 1. పల్లెటూరి పిల్ల 2. షావుకారు 3. తిరుగుబాటు 1951 1. ఆకాశరాజు 2. పాతాళభైరవి 1952 1. దాసి 2. పెళ్ళిచేసి చూడు 3. పల్లెటూరు 1953 1. బ్రతుకు తెరువు 2. చండీరాణి 3. దేవదాసు 4. పరదేశి 5. పెంపుడు కొడుకు 6. రోహిణి 1954 1. అంతా మనవాళ్ళే 2. జాతకఫలం 3. అన్నదాత 4. రాజు-పేద 5. రాజీ నా ప్రాణం 6. సంఘం 7. చంద్రహారం 1955 1. బంగారుపాప 2. అనార్కలి 3. మిస్సమ్మ 4. జయసింహ 5. సంతానం 1956 1. కనకతార 2. చింతామణి 3. హరిశ్చంద్ర 4. చరణదాసి 1957 1. తోడికోడళ్ళు 2. సతీ సావిత్రి 3. మాయాబజార్ 4. అల్లావుద్దీన్ అద్భుతదీపం 5. సారంగధర 6. రేపు నీదే 1958 1. బొమ్మల పెళ్ళి 2. భూకైలాస్ 3. చెంచులక్ష్మి 4. పెళ్ళినాటి ప్రమాణాలు 1959 1. కృష్ణలీలలు 2. మాంగల్య బలం 3. అప్పుచేసి పప్పుకూడు 4. జయభేరి 5. రేచుక్క పగటిచుక్క 6. బాలనాగమ్మ 7. భక్త అంబరీష 8. సౌభాగ్యవతి 60వ దశకం 1960 1. నమ్మిన బంటు 2. మహాకవి కాళిదాసు 3. దీపావళి 4. భట్టి విక్రమార్క 5. మామకు తగ్గ అల్లుడు 6. దేవాంతకుడు 1961 1. వెలుగు నీడలు 2. కృష్ణ ప్రేమ 3. సతీసులోచన 4. ఉషాపరిణయం 5. కలసి ఉంటే కలదు సుఖం 1962 1. గాలిమేడలు 2. టైగర్ రాముడు 3. పెళ్ళి తాంబూలం 4. మంచి మనసులు 5. దక్షయజ్ఞం 6. గుండమ్మకథ 7. ఆత్మబంధువు 8. పదండి ముందుకు 9. విషబిందువు 1963 1. నర్తనశాల 2. తోబుట్టువులు 1964 1. మురళీకృష్ణ 2. రాముడు భీముడు 3. బొబ్బిలి యుద్ధం 1965 1. నాదీ ఆడజన్మే 2. పాండవ వనవాసం 3. తోడు నీడ 4. సతీ సక్కుబాయి 5. ఆడబ్రతుకు 1966 1. మొనగాళ్ళకు మొనగాడు 2. ఆటబొమ్మలు 3. శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ 4. చిలకా గోరింక 5. సంగీత లక్ష్మి 6. భక్త పోతన 7. అడుగు జాడలు 8. మోహినీ భస్మాసుర 1967 1. భక్త ప్రహ్లాద 2. చదరంగం 3. గృహలక్ష్మి 4. లక్ష్మీనివాసం 5. పుణ్యవతి 6. రహస్యం 7. సుఖదుఃఖాలు 8. వసంతసేన 1968 1. బాంధవ్యాలు 2. బందిపోటు దొంగలు 3. భలే కోడళ్ళు 4. చిన్నారి పాపలు 5. కుంకుమ భరిణ 6. రాము 7. వీరాంజనేయ 1969 1. జగత్ కిలాడీలు 2. మామకుతగ్గ కోడలు 3. మూగనోము 4. బందిపోటు భీమన్న 70వ దశకం 1970 1. సంబరాల రాంబాబు 2. జగత్ జెట్టీలు 3. ఇద్దరు అమ్మాయిలు 4. దేశమంటే మనుషులోయ్ 5. బస్తీ కిలాడీలు 6. కిలాడి సింగన్న 1971 1. విక్రమార్క విజయం 2. అనురాధ 3. దెబ్బకు ఠా దొంగల ముఠా 4. రౌడీ రంగడు 5. భలేపాప 6. జాతకరత్న మిడతంభొట్లు 7. ప్రేమనగర్ 8. శ్రీకృష్ణ సత్య 9. దసరా బుల్లోడు 10. శ్రీకృష్ణ విజయం 1972 1. శ్రీకృష్ణాంజనేయ యుద్ధం 2. పాపం పసివాడు 3. పండంటికాపురం 4. సంపూర్ణ రామాయణం 5. శాంతి నిలయం 6. విచిత్రబంధం 7. వంశోద్ధారకుడు 8. కత్తుల రత్తయ్య 9. కొడుకు కోడలు 10. బాలభారతం 1973 1. బంగారు బాబు 2. మరపురాని మనిషి 3. తాతా మనవడు 4. డబ్బుకు లోకం దాసోహం 5. రామరాజ్యం 6. రాముడే దేముడు 7. వారసురాలు 8. మైనరు బాబు 9. దేవుడు చేసిన మనుషులు 10. డాక్టర్ బాబు 1974 1. ప్రేమలూ పెళ్ళిళ్ళు 2. బంగారు కలలు 3. చక్రవాకం 4. గాలిపటాలు 5. అందరూ దొంగలే 6. య

ఎల్.వి.ప్రసాద్

ఎల్.వి.ప్రసాద్ గా ప్రసిద్ధి చెందిన అక్కినేని లక్ష్మీవరప్రసాదరావు తెలుగు సినీనిర్మాత, దర్శకుడు, నటుడు మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత . ఈయన జనవరి 17,1908 లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఏలూరు తాలూకాలోని సోమవరప్పాడు గ్రామమునందు అక్కినేని శ్రీరాములు, బసవమ్మ దంపతుల రెండవ సంతానముగా జన్మించాడు. హిందీ, తమిళ, తెలుగు, కన్నడ వంటి పలు భారతీయ భాషలలో 50 చిత్రాల వరకు ఆయన దర్శకత్వం వహించటంగానీ, నిర్మించటంగానీ, నటించటంగానీ చేసాడు. అంతేకాదు ఎల్.వి.ప్రసాద్ హిందీ, తమిళ, తెలుగు భాషలలో తొలి టాకీ చిత్రాలయిన ఆలం ఆరా, కాళిదాస్ మరియూ భక్తప్రహ్లాద మూడింటిలోనూ ఆయన నటించాడు. తెలుగువారిలో బహుశా ఆయన ఒక్కరే ఈ ఘనత సాధించి ఉంటాడు. విషయ సూచిక * 1 బాల్యం * 2 సినిమాలు o 2.1 నటునిగా o 2.2 దర్శకునిగా * 3 పురస్కారాలు * 4 బయటి లింకులు బాల్యం రైతు కుటుంబంలో పుట్టిన ప్రసాద్ గారాబంగా పెరిగాడు. చురుకైన కుర్రవాడే కానీ చదువులో ఎప్పుడూ శ్రద్ధ చూపలేదు. ఉరూరా తిరిగే నాటకాల కంపెనీలు, డాన్సు ట్రూపుల డప్పుల చప్పుల్లు ప్రసాద్ ను ఆకర్షించేవి. పాత అరిగిపోయిన సినిమా రీళ్ళను ప్రదర్శించే గుడారపు ప్రదర్శనశాలల్లో ప్రసాద్ తరచూ వాటిని ఆసక్తిగా చూసేవాడు. స్థానిక నాటకాల్లో తరచుగా చిన్న చిన్న వేషాలు వేసేవాడు. ఇదే ఆసక్తి పెద్దయ్యాక కదిలే బొమ్మలు, నటనపై ఆసక్తిని పెంచి సినిమా రంగంలో ప్రవేశించడానికి పునాదులు వేసింది. 17 యేళ్ళ వయసులో 1924లో మేనమామ కూతురు సౌందర్య మనోహరమ్మను సినిమా ఫక్కీలో పెళ్ళి చేసుకున్నాడు. వెనువెంటనే వీరికి ఒక ఆడపిల్ల పుట్టుంది. ప్రసాద్ తండ్రి కొండలా పెరిగిపోతున్న అప్పులను భరించలేక, ఇళ్ళు గడవక చేతులెత్తేసి కుటుంబాన్ని తలదించుకునేట్టు చేశాడు. ఇదే సమయంలో ప్రసాద్ తన నటనా ప్రతిభను జీవనోపాధికై ఉపయోగించాలని నిశ్చయించుకుని జేబులో వంద రూపాయలతో ఎవరికీ చెప్పకుండా ఉరు విడిచి వెళ్ళాడు. సినిమాలు నటునిగా * స్టార్ ఆఫ్ ది ఈస్ట్ (Star of the east (Silent)) - అసంపూర్తి. * 1931 : ఆలం ఆరా - మొదటి హిందీ టాకీ సినిమా * 1931 : కాళిదాస్ - మొదటి తమిళ టాకీ సినిమా * 1931 : భక్తప్రహ్లాద - మొదటి తెలుగు టాకీ సినిమా * 1933 : సీతా స్వయంవర్ (హిందీ) * 1940 : బోండాం పెళ్ళి (తెలుగు) * 1940 : చదువుకున్న భార్య (1940) (తెలుగు) * 1982 : రాజా పార్వాయి (తమిళం) దర్శకునిగా * మిస్సమ్మ (1955) * గృహ ప్రవేశం (1947) * పల్నాటి యుద్ధం (1947) * ద్రోహి (1948) * మన దేశం (1949) * సంసారం (1950) * షావుకారు (1950) పురస్కారాలు * దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు * ఎల్వీ ప్రసాదు స్మారకార్థం భారత తపాలా శాఖ 2006 సెప్టెంబరు 5న ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేసింది.

ఎం.వి.రఘు

మాడపాక వెంకట రఘు (ఎం.వి.రఘు)[1] తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పేరు గాంచిన అవార్డులు, రివార్డులు పొందిన ప్రముఖ ఛాయాగ్రాహకుడు (సినీమాటోగ్రాఫర్) మరియు దర్శకుడు. ఈయన వివిధ భాషలలో యాభైకి(50)[1] పైగా సినిమాలకి,10 డాక్యుమెంటరీలకి ఛాయగ్రాహణం నిర్వర్తించారు. రెండు సినిమాలకి దర్శకత్వం వహించారు. ఛాయగ్రాహకునిగా మరియు దర్శకునిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది అవార్డులతో పాటు వివిధ సాంస్కృతిక సంస్థల నుండి యాభైకి పైగా అవార్డులు పొందిన లబ్దప్రతిష్టుడు.[2] విషయ సూచిక * 1 బాల్యం * 2 చదువు * 3 సినీరంగ ప్రవేశం * 4 సహాయ ఛాయగ్రాహకుడుగా * 5 ఛాయగ్రాహకుడుగా o 5.1 సితార సినిమాకి o 5.2 అన్వేషణ సినిమాకి o 5.3 స్వాతిముత్యం సినిమాకి o 5.4 సిరివెన్నెల సినిమాకి o 5.5 డాక్యుమెంటరీలకి * 6 దర్శకుడుగా * 7 పురస్కారాలు * 8 చిత్ర సంకలనము * 9 మూలాలు * 10 ఇవి కూడా చూడండి బాల్యం 1954లో భీమవరంలో జన్మించిన రఘు తండ్రి, ఎం.ఎస్.చిన్నయ్య రైల్వే ఉద్యోగి. తల్లి నాగేశ్వరమ్మ గృహిణి. చిన్నయ్యకు ఫోటోగ్రఫిలో చాలా ఆసక్తి ఉండేది. తన 620 కొడాక్ బాక్స్ కెమెరాతో తరచూ ఫోటోలు తీసి సొంతగా డెవలప్ చేసేవాడు. వాళ్ళ ఇంట్లోనే ఒక డార్క్ రూమ్ ఉండేది. రఘుకు బాల్యం నుండే ఫోటో రీళ్ళను కడగటం వంటి పనులు బాగా అలవడ్డాయి. చిన్నయ్యకు సినిమారంగములో అడుగుపెట్టాలని ఆశ ఉన్నా, అప్పటి పరిస్థితులు అనుకూలించక ఆ కల సాకారం కాలేదు. ఫోటోగ్రఫిలో తండ్రి అనేక అవార్డులను గెలుచుకోవటం, తనయుడైన రఘుకు పెద్దైన తర్వాత కెమెరామెన్ కావలనే స్ఫూర్తిని కలుగజేసింది. దానికి ఆయన కుటుంబము మంచి ప్రోత్సాహాన్నిచ్చింది. తొమ్మిదేళ్ల వయసులో తండ్రికి గుంటూరు బదిలీ అవడంతో కుటుంబముతో సహా గుంటూరు వచ్చారు. అక్కడున్న ఆ తర్వాత పదేళ్ళు రఘు, తండ్రితో పాటు గుంటూరులోని లీలామహల్ థియేటర్లో విడుదలైన ఇంగ్లీషు సినిమాలన్నీ చూసేవాడు. ఒక్కో సినిమా 32 సార్లు చూసేవాన్నని, లాంగెస్ట్ డే సినిమాని 42సార్లు చూసానని చెప్పుకున్నాడు.[3] ఈయనను అత్యంత ప్రభావితం చేసిన సినిమా 1968లో విడుదలైన 2001- ఏ స్పేస్ ఒడిస్సీ. రఘుకు అప్పటినుండే సినిమా టెక్నిక్కులు, స్పెషల్ ఎఫెక్ట్లు, లైటింగ్ స్కీములు మరియు ఇతర చిన్న చిన్న విషయాల గురించి నోట్సు వ్రాసుకునే అలావాటు ఉండేది. చదువు రఘు గుంటూరులో బీఎస్సీ పూర్తిచేసి, 1972 నుండి 74వరకు హైదరాబాదులోని ప్రభుత్వ సైన్స్, ఆర్ట్స్ మరియు ఆర్కిటెక్చర్ కళాశాల (ప్రస్తుత జే.ఎన్.టి.యూ) లో కమర్షియల్ ఫోటోగ్రఫిలో డిప్లొమా కోర్సులో చేరి 98 శాతం మార్కులతో పాసై బంగారు పతకము సాధించాడు. సినీరంగ ప్రవేశం రఘు తండ్రి చిన్నయ్య, నేపథ్యగాయకుడు పిఠాపురం నాగేశ్వరరావు మంచి స్నేహితులు. చిన్నయ్య కొడుకు గురించి నాగేశ్వరరావుకు సిఫారుసు చేయగా, ఆయన తన ఇంట్లో అద్దెకుంటున్న కెమెరామెన్ వి.ఎస్.ఆర్.స్వామితో రఘ విషయమై ప్రస్తావించాడు. ఇలా 1976లో వి.ఎస్.ఆర్.స్వామి సహాయంతో రఘు విజయవాహినీ స్టూడియో సహాయకునిగా చేరాడు. కెమెరా విభాగంలో సహాయకునిగా రఘు తొలి చిత్రము, శివాజీ గణేషన్ కథానాయకునిగా దర్శకుడు యోగానంద్ నిర్మించిన గృహప్రవేశం. ఈ సినిమాను స్టూడియోలోని నాలుగవ అంతస్థులో చిత్రీకరించారు. సహాయ ఛాయగ్రాహకుడుగా ఈయన మద్రాస్(ఇప్పుడు చెన్నై) కి వచ్చిన కొత్తలో ప్రముఖ చలన చిత్ర చాయగ్రాకుడు వి.ఎస్.ఆర్.స్వామి దగ్గర సహాయకుడిగా చేరి అప్పటికే తనకు జే.ఎన్.టి యూనివర్సిటి వారి ఫోటోగ్రఫి శిక్షణ ద్వారా వున్న పరిజ్ఞానానికి మరింత మెరుగులు దిద్దుకుంటూ చలన చిత్ర చాయగ్రహణములో మంచి పరిణితి సాదించారు.దీనికంటే ముందు వి.ఎస్.ఆర్.స్వామి సూచన మేరకు ప్రముఖ ఫిల్మ్ స్టూడియో విజయ వాహిని లో కేమెరా విభాగములో చేరి ఒక సంవత్సరం పాటు పనిచేసి 2౦౦ మంది సినిమాటోగ్రాఫెర్ల పనితీరును,సినిమాల చిత్రీకరణ విధానాన్ని పరిశీలించి తిరిగీ వి.ఎస్.ఆర్.స్వామి దగ్గర సహాయకుడిగా ప్రముఖ దర్శకుడు,చిత్రకారుడు బాపు దర్శకత్వం వహించిన భక్త కన్నప్ప సినిమా ద్వారా తన సినిమాటోగ్రాఫి శిక్షణని ప్రారంభించి 25 సినిమాలకి పనిచేసారు[4]. అప్పటికే వి.ఎస్.ఆర్.స్వామి దగ్గర ఆపరేటివ్ కెమేరామన్ గా వున్న ఎస్.గోపాలరెడ్డి తను స్వంతగా జంధ్యాల దర్శకత్వంలో ముద్దమందారం తెలుగు చలన చిత్రానికి చాయాగ్రహకత్వం వహించే అవకాశం రావటముతో ఎం.వి.రఘు ని ఆపరేటివ్ కెమెరామన్ గా[5] తీసుకున్నారు.ఈయన దగ్గర 20 సినిమాలకి ఆపరేటివ్ కేమెరామన్ గాపనిచేసారు. ఛాయగ్రాహకుడుగా ప్రముఖ నటుడు చిరంజీవి-హరిప్రసాద్ మరియు సుధాకర్ లతో కలసి ఎం.వి.రఘు తన మొట్ట మొదటి చాయగ్రాహక దర్శకత్వం విజయ బాపినీడు దర్శకత్వం వహించిన మగమహారాజు సినిమా. చిరంజీవి కూడా ఈ సినిమా ద్వారానే కథానాయకుడు గా పరిచయం చేయబడ్డాడు.ఈ సినిమా ఘన విజయం సాధించటముతో చిరంజీవి, ఎం.వి.రఘు లకి తమ తమ రంగాలలో ముందుకు వెళ్ళేదానికి దోహదపడింది అని చెప్పవచ్చు. సితార సినిమాకి 1984 సంవత్సరములో విడుదల అయిన సితార సినిమా అప్పటివరకు వస్తూవున్న మూస చిత్రాలని తోసిరాజని ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందని చెప్పవచ్చు.ఎం.వి.రఘు అద్బుత చాయగ్రహణంతో ఈ సినిమా వంశీ దర్శకత్వం వహిస్తే పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ వారు నిర్మించారు.35ఎం.ఎం ఫిల్మ్ ఫార్మాట్ లో నిర్మించిన ఈ రంగుల సినిమాకి భారత ప్రభుత్వంవారి ఉత్తమ ప్రాంతీయ చిత్రం పురస్కారం లభించింది. దక్షిణ భారత దేశ సినిమా చరిత్రలో మొదటిసారిగా రౌండ్ ట్రాలి(గుండ్రటి పట్టాలఫై ట్రాలి మీద కెమేరా వుంచి చిత్రీకరణ జరిపే విదానం) వాడి చిత్రీకరణ జరిపిన చాయగ్రాహకుడిగా[6] రఘు ప్రసిద్ది చెందాడు.ఈ రౌండ్ ట్రాలీ మీద కెమెరా వుంచి చిత్రీకరించే విదానాన్ని సితార సినిమాలో కూడా ఒక సన్నివేశంలో గమనించవచ్చు. తెలుగు చలన చిత్రాలలో సినేమాటోగ్రఫీకి గుర్తింపు,విలువ రావటం ఈ సినిమాతోనే మొదలయ్యిందనటం అతిశయోక్తికాదు. సితార సినిమాకి రౌండ్ ట్రాలి వాడి చిత్రీకరిస్తున్నప్పటి ఫోటో కెమెరా పట్టుకున్న వ్యక్తి ఎం.వి.రఘు కూర్చున్నవ్యక్తి డైరెక్టర్ వంశీ సితార సినిమా లో రఘు చాయగ్రాహన పనితనాన్ని ముఖ్యంగా డే ఫర్ నైట్ చిత్రీకరణ విదానాన్ని చూసి ముగ్దుడయిన ప్రముఖ హిందీ నటుడు అమితాబ్ బచ్చన్ తన స్వంత సినిమాకి చాయగ్రాహకుడిగా నియమించుకున్నాడు[7].కాని అనివార్య కారణాలవలన ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు. అన్వేషణ సినిమాకి వంశీ దర్శకత్వంలోనే వచ్చిన అన్వేషణ సినిమాకి రఘు అందించిన చాయగ్రహణం అద్బుతంగా ఉంటుంది. చాల మంది ఔత్సాహిక ఫోటోగ్రాఫేర్లకి ఈ సినిమా ప్రేరణగా నిలిచిందని అంటుంటారు. తిరుపతి కి దగ్గరలోని తలకోన అడవులలో చిత్రీకరించిన ఈ సినిమా చాల భాగం రాత్రులు మరియు డే ఫర్ నైట్ పద్దతిలో పగలు చిత్రీకరించి రాత్రిలాగా చూపించటం, చేతితోనే కెమెరా పట్టుకుని పరిగెడుతూ(స్టేడికాం కెమేరాతో చిత్రీకరించినట్టుగా) చిత్రీకరించిన విధం, ముఖ్యంగా సినిమా సస్పెన్స్ కథనానికి, పాటల చిత్రీకరణానికి రఘు కి చాల పేరు, అవార్డులు పెట్టడమే కాకుండా చిత్ర విజయానికి ఎంతొ దోహదం చేసాయి. ఈ సినిమాకి, చిత్ర విజయానికి వచ్చిన మంచి ప్రశంస" ఇది సాంకేతిక నిపుణుల సినిమా" అని పత్రికలూ,విమర్శకులు ప్రశంసించటం. స్వాతిముత్యం సినిమాకి సిరివెన్నెల సినిమాకి మాస్క్ పనితనం(ఒకే నటుడు ఇద్దరు లేక ముగ్గురుగా ఒకే ఫ్రేములో కనిపించేట్టుగా నల్లటి అట్ట ముక్కని ఉపయోగించి ఒకే ఫిల్మ్ మీద చిత్రీకరించే విదానం), డే ఫర్ నైట్(రాత్రి చిత్రీకరణని పగలు చిత్రీకరించటం),అత్యంత వేగంగా చిత్రీకరణలో ఈయన నిష్ణాతుడు. డాక్యుమెంటరీలకి డిస్కవరీ టీవి ఛానల్ కార్యక్రమం హిడ్డెన్ ట్రెజర్స్ డాక్యుమెంటరీ దర్శకుడు మరియు రామోజీరావు తో కలసి ఎం.వి.రఘు' ప్రపంచ ప్రఖ్యాత టీవి ఛానల్ డిస్కవరీ తమ కార్యక్రమం దాగివున్న సంపదలు (హిడ్డెన్ ట్రెజర్స్) శీర్షిక క్రింద రామోజీ ఫిల్మ్ సిటీ ని చిత్రీకరించేందుకు ఛాయగ్రాహకునిగా ఎం.వి.రఘుని ఎన్నుకున్నారు. ఎందరో ఛాయాగ్రాహకులను పరిశీలించి అంతర్జాతీయ ప్రమాణాలతో చిత్రీకరించేందుకు సరైన సినిమాటోగ్రాఫర్‌గా రఘును ఎన్నుకోవటం ఆయన ప్రతిభకి ఒక గుర్తింపు. దర్శకుడుగా రఘు మొట్టమొదటిసారిగా దర్శకత్వం వహించిన కళ్ళు సినిమా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక అత్యుత్తమమయిన కథతో తీసిన ప్రయోగాత్మక చిత్రంగా నిలిచిపోయింది. ఈ సినిమాకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి నంది పురస్కారముతో పాటు రెండు డజన్లకు పైగా ఇతర సాంస్కృతిక సంస్థల పురస్కారాలు లభించాయి. గొల్లపూడి మారుతీరావు రచించిన కళ్ళు నాటకం ఆధారంగా ఈ సినిమా తీశారు. [2] అంతేకాదు ఈ సినిమాను ఆస్కారు అవార్డుల నామినేషన్లలో భారతీయ సినిమాలకు ప్రాతినిధ్యం చేయడానికి కూడా ఎంపికచేయబడినది. [2] [8] ఈ సినిమాలో నటుడు చిరంజీవి తన కనిపించని పాత్రకు మాటలు అందించాడు. ఈ సినిమాలో తెల్లారింది లెగండోయ్... మంచాలింక దిగండోయ్... అనే పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రి తానే రాసి స్వయంగా పాడాడు. శివాజీ రాజా , రాజేశ్వరి , సుధారాణి, చిదంబరం ఈ సినిమా ద్వారానే మొట్టమొదటిసారిగా నటులుగా పరిచయం చేయబడ్డారు. కళ్ళు చిదంబరం పేరుకు ముందు ఉన్న కళ్ళు ఈ సినిమా నుండే వచ్చాయి. రఘు దర్శకత్వం వహించిన రెండవ సినిమా ఆర్తనాదం. రాజశేఖర్, సీత, చంద్రమోహన్ మొదలగు వాళ్ళు నటించారు. చిత్రంలో ఉన్న వైవిధ్యం ఎంటి అంటే సినిమా మొత్తం ఒక చిత్రం షూటింగ్‌కి వెళ్ళిన యూనిట్ మధ్య జరుగుతుంది. కథానాయకిని హత్య చెయ్యడానికి ప్రయత్నం జరుగుతుంది. ఎవరు చేసారు? దేనికి? అన్నది అర్ధం కాదు. మధ్యలో వచ్చిన బైట వ్యక్తి మీద అనుమానం, కొన్ని ఆనవాళ్ళు కనపడతాయి. చివరకు ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ సినిమా ఆద్యంతమూ సాగుతుంది. చిత్రం మొత్తం ఊటిలోని బృందావన్ అతిధి గృహంలో తీసిన ఈ సినిమా షూటింగును మొత్తం 30 రోజుల్లో పూర్తి చేసారు. ఈ చిత్రానికి సంగీతం హంసలేఖ. అప్పట్లో సెన్సార్ అధికారిగా పనిచేస్తున్న సరళ ఈ చిత్రానికి అబ్బ నీ సొకు మాడా అనే ఒక పాట పాడటం మరో విశేషం.[9] రఘు ఈ రెండు సినిమాలకి దర్శకత్వం వహించిన తరువాత ఛాయగ్రాహకునిగా అనేక సినిమాలకి చాయాగ్రహణం భాద్యతలు నిర్వర్తించినా తిరిగి దర్శకత్వం మాత్రం చేపట్టక పోవటం ఆశ్చర్యకర విషయం. [మార్చు] పురస్కారాలు పురస్కారం పేరు బహుకరించింది సంవత్సరం ఇతర వివరాలు నంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Mv Raghu nandi award frm NTR.jpg 1986 సిరివెన్నెల సినిమా చాయాగ్రహణ ప్రతిభకి న్యాయ నిర్ణేతల ప్రత్యేక పురస్కారం నంది పురస్కారం(ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపు అధికారిక అవార్డు) అప్పటి ముఖ్యమంత్రి,ప్రఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు నుండి అందుకుంటున్న ఎం.వి.రఘు[2] నంది 1988వ సంవత్సరానికికళ్ళు (సినిమా) సినిమాకి ఉత్తమ నూతన దర్శకుడిగా నంది పురస్కారం ఫిలింఫేర్ పురస్కారం ఉత్తమ దర్శకుడు 1988 1988వ సంవత్సరానికికళ్ళు (సినిమా) సినిమాకి ఉత్తమ దర్శకుడిగా ఫిలింఫేర్ పురస్కారం.[2] [మార్చు] చిత్ర సంకలనము చిత్రము నటీ నటులు విడుదల సంవత్సరము భాష బాధ్యతలు మగమహారాజు చిరంజీవి,సుహాసిని 1983 తెలుగు ఛాయాగ్రాహకత్వం సితార భానుప్రియ, సుమన్ 1983 తెలుగు ఛాయాగ్రాహకత్వం [10] స్వాతిముత్యం కమలహాసన్, రాధిక 1985 తెలుగు ఛాయాగ్రాహకత్వం [10] అన్వేషణ కార్తీక్, భానుప్రియ 1985 తెలుగు ఛాయాగ్రాహకత్వం [10] సంసార్[11] రేఖ,రాజ్ బబ్బర్,అనుపమ్ ఖేర్ 1985 హిందీ ఛాయాగ్రాహకత్వం [10] మేరా పతీ సిర్ఫ్ మేరా హై[12] జితేంద్ర, రేఖ, రాధిక 1990 హిందీ ఛాయాగ్రాహకత్వం [10] ఏప్రిల్ 1 విడుదల రాజేంద్రప్రసాద్,శోభన 1991 తెలుగు ఛాయాగ్రాహకత్వం [10] డిటెక్టివ్ నారద మోహన్ బాబు,మోహిని,నిరోషా 1993 తెలుగు ఛాయాగ్రాహకత్వం [10] వైఫ్ ఆఫ్ వి వరప్రసాద్ వినీత్,ఆవని,ఎస్.పీ.బాలసుబ్రమణ్యం,జె.డి.చక్రవర్తి 1998 తెలుగు ఛాయాగ్రాహకత్వం [10] [మార్చు] మూలాలు 1. ↑ 1.0 1.1 "Return of the thespian", TheHindu.com, 2008-05-29. Retrieved on మే 29. 2. ↑ 2.0 2.1 2.2 2.3 2.4 ద హిందూ దిన పత్రికలో ఎం.వి.రఘుపై వ్యాసం. మే 26, 2007న సేకరించబడినది. 3. ↑ http://ilovehyderabad.com/interviews/interviews-i-write-with-the-light.html 4. ↑ "The saga of a lensman:M.V.Raghu", TheHindu.com, 2008-05-31. Retrieved on మే 31. 5. ↑ "as Operative cameraman: M.V. Raghu", telugucinema.com, 2008-05-30. Retrieved on మే 30. 6. ↑ "Sitara (1984)", cinegoer.com, 2008-06-03. Retrieved on జూన్ 03. 7. ↑ "The saga of a lensman", hinduonnet.com, 2008-06-03. Retrieved on జూన్ 03. 8. ↑ తెలుగు సినిమా.కాంలో ఎం.వి.రఘు పరిచయం. మే 26, 2007న సేకరించబడినది. 9. ↑ ఆర్తనాదం సినిమాపై telugucinema.comలోని వ్యాసం. మే 30, 2008న సేకరించబడినది. 10. ↑ 10.0 10.1 10.2 10.3 10.4 10.5 10.6 10.7 "Raghu M.V.", IMDb.com, 2008-05-28. Retrieved on మే 29. 11. ↑ "Sansar", IMDb.com, 2008-05-28. Retrieved on మే 29. 12. ↑ "Mera pati sirf mera hy", IMDb.com, 2008-05-28. Retrieved on మే 29.

ఎ.కోదండరామిరెడ్డి

కె.రాఘవేంద్రరావు శిష్యుడైన కోదండరామిరెడ్డికి దర్శకుడిగా తొ లిచిత్రం "సంధ్య". హిందీ చిత్రం 'తపస్య' ఆధారంగా తీసారు. కుటుంబ చిత్రంగా ఓ మాదిరిగా విజయవంతమైంది. చాలా కొద్దికాలంలోనే పెద్ద హీరోలతో అవకాశాలు వచ్చాయి. చిరంజీవిని తారాపథానికి తీసుకెళ్ళిన ఖైదీ చిత్రం కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చింది. "న్యాయం కావాలి" చిత్రంతో మొదలైన వీరి సినీ నిర్మాణ బంధం "ముఠా మేస్త్రి" సినిమా వరకు సాగింది. వీరిద్దరు కలిపి 23 సినిమాలకు పనిచేసారు. అందులో 80% విజయం సాధించాయి. ఒక్క ఎన్.టి.ఆర్ తో తప్ప అందరు ప్రముఖ నటులతోనూ చిత్రాలు తీసారు. విషయ సూచిక [దాచు] * 1 చిత్రసమాహారం o 1.1 దర్శకుడిగా o 1.2 రచయితగా o 1.3 నటుడిగా * 2 బయటి లింకులు [మార్చు] చిత్రసమాహారం [మార్చు] దర్శకుడిగా * గొడవ (2007) * తప్పు చేసి పప్పు కూడు (2002) * ముఠా మేస్త్రీ (1993) * జమై రాజా (1990) * కొండవీటి దొంగ (1990) * అత్తకి యముడు అమ్మాయికి మొగుడు (1989) * నారీ నారీ నడుమ మురారి (1989) * త్రినేత్రుడు (1988) * మరణ మృదంగం (1988) * రక్తాభిషేకం (1988) * జేబుదొంగ (1987) * పసివాడి ప్రాణం (1987) * దొంగ మొగుడు (1987) * భార్గవ రాముడు (1987) * రాక్షసుడు (1986) * వేట (1986) * కిరాతకుడు (1986) * అనసూయమ్మగారి అల్లుడు (1986) * దేశోద్ధారకులు (1986) * విజేత (1985) * ఒక రాధ ఇద్దరు కృష్ణులు (1985) * రక్త సింధూరం (1985) * దొంగ (1985) * మహా సంగ్రామం (1985) * పల్నాటి సింహం (1985) * రుస్తుం (1984) * ఛాలెంజ్ (1984) * అనుబంధం (1984) * గూండా (1984) * ఖైదీ (1983) * శివుడు శివుడు శివుడు (1983) * అభిలాష (1983) * ప్రేమ పిచ్చోళ్ళు (1983) * రామరాజ్యంలో భీమరాజు (1983) * శ్రీరంగనీతులు (1983) * కిరాయి రౌడీలు (1981) * న్యాయం కావాలి (1981) [మార్చు] రచయితగా * అత్తకు యముడు అమ్మాయికి మొగుడు (1989) (screen adaptation) * దొంగ మొగుడు (1987) (writer) * ఒక రాధ ఇద్దరు కృష్ణులు (1985) (screen adaptation) * గూండా (1984) (screen adaptation) * అభిలాష (1983) (screen adaptation) [మార్చు] నటుడిగా

ఇ.వి.వి.సత్యనారాయణ

ఇ.వి.వి గా ప్రసిద్ధి చెందిన ఈదర వీర వెంకట సత్యనారాయణ (జ. జూన్ 10, 1958)[1] తెలుగు సినిమా ప్రరిశ్రమలో ప్రసిద్ధ దర్శకుడు. తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించిన ఇతడు ప్రముఖ దర్శకుడు జంధ్యాల శిష్యుడు. ఈతడి మొదటి సినిమా రాజేంద్రప్రసాద్ కధానాయకుడిగా నిర్మింపబడిన చెవిలో పువ్వు. ఈ సినిమా అంతగా విజయవంతం కాలేదు. కొద్ది కాలంతర్వాత నిర్మాత రామానాయుడు 'ప్రేమఖైదీ' చిత్రంలో అవకాశమిచ్చారు. ఆ చిత్రం విజయవంతం కావటంతో పలు అవకాశాలు వచ్చాయి. జంధ్యాల వరవడిలో హస్యప్రధాన చిత్రాలు నిర్మించాడు. జంధ్యాల కంటే కొంతఘాటైన హస్యాన్ని చిత్రాల్లో ప్రవేశపెట్టారు. రాజేంద్ర ప్రసాద్ తో 'ఆ ఒక్కటి అడక్కు', 'అప్పుల అప్పారావు', 'ఆలీబాబా అరడజనుదొంగలు' వంటి చిత్రాలు మరియు నరేష్ తో 'జంబలకిడి పంబ' మొడలైన చిత్రాలు తీశారు. సీతారత్నంగారి అబ్బాయి, ఏవండీ ఆవిడ వచ్చింది (శోభన్ బాబు), లాంటి చిత్రాలతర్వాత , ఆమె, తాళి వంటి మహిళాపరమైన చిత్రాలు తీశారు. అగ్రనటులైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లతో చిత్రాలు తీశారు. .కొద్ది విరామం తర్వాత కుమారులిద్దర్ని హీరోలుగా పరిచయంచేశారు. విషయ సూచిక [దాచు] * 1 తొలినాళ్ళు * 2 పరిచయం చేసిన నటీనటులు * 3 చిత్రాలు * 4 మూలాలు [మార్చు] తొలినాళ్ళు సత్యనారాయణ పశ్చిమ గోదావరి జిల్లాలోని దొమ్మేరులో వ్యవసాయ కుటుంబంలో పుట్టాడు. నాన్న వెంకటరావు, అమ్మ వెంకటరత్నం. ఈయన కుటుంబానికి దొమ్మేరులో 70 ఎకరాల పొలం ఉండింది. బాల్యం నుండి సినిమాలంటే ఆసక్తితో కనీసం వారానికి రెండు సినిమాలైన చూసేవాడు. ఇంటర్మీడియట్ వరకు బుద్ధిగానే చదివినా, ఇంటర్‌కు నిడుదవోలు వెళ్ళిన సత్యనారాయణ కాలేజికి వెళ్ళకుండా రోజూ ఉదయం ఆట, మధ్యాహ్నం ఆట సినిమాలను చూడటంతో హాజరు తక్కువై ఇంటర్మీయడ్ తప్పాడు. అప్పుడు సత్యనారాయణ తండ్రి ఆయన్ను కాలేజీకి పంపించి లాభం లేదని నిశ్చయించి తండ్రితో పాటు పొలం పనులు చూసుకోవటానికి నియమించాడు. 19 యేళ్ళకే 1976లో సరస్వతి కుమారితో పెళ్ళైంది. ఆ వెంటనే సంవత్సరానికి ఒకరు చొప్పున ఇద్దరు కొడుకులు పుట్టారు. వీళ్ళకు రాజేష్, నరేష్ అని పేరు పెట్టారు. కొన్నాళ్ళకు వ్యవసాయంలో పెద్ద నష్టాలు రావడంతో పొలాలు అమ్మేయవలసిన పరిస్థితి కలిగింది. ఆ పరిస్థితుల్లో అక్కడ ఉండటానికి సత్యనారాయణ తెగ ఇబ్బంది పడి ఎక్కడికైనా మరో ఊరికి కొన్నాళ్ళు వెళ్ళిపోవాలనుకున్నాడు. ఇ.వి.వి స్నేహితుడు నిర్మాత నవతా కృష్ణంరాజు మేనల్లుడైన సుబ్బరాజును సంప్రదించి ఒక సిఫారుసు ఉత్తరం పట్టుకుని మొదటిసారి మద్రాసు వెళ్ళాడు. నవతా కృష్ణంరాజును కలిసి ఉత్తరం ఇవ్వగా ఆయన సినీరంగంలో జీవితం అనుకున్నంత సులభం కాదని, తిరిగి సొంత ఊరికి వెళ్ళిపొమ్మని హితవు చెప్పాడు. దాంతో పూర్తిగా నిరాశచెందిన సత్యనారాయణ, తిరిగి వెళ్ళినా చేసేదేమీ లేదనుకుని మద్రాసులోనే ఉండి వివిధ ప్రదేశాలు తిరుగుతుండేవాడు. పాండీబజారుకు వెళ్ళి అక్కడ సహాయదర్శకులు చెప్పుకునే మాటలు వినేవాడు. ప్రతి ఉదయం నవత కృష్ణంరాజు కార్యాలయం గేటు వద్ద నుంచుని ఉండేవాడు. ఒక నెలరోజుల తర్వాత కుర్రవాని పట్టుదలను చూసి ఏం చెయ్యగలవు అని అడిగాడు. సహాయ దర్శకున్ని అవుతానని చెప్పిన ఇ.వి.వి ని కనకాల దేవదాసు క్రింద ఓ ఇంటి భాగోతం సినిమాకు సహాయదర్శకునిగా అవకాశం ఇప్పించాడు.[2] పరిచయం చేసిన నటీనటులు * రంభ * రచన * ఊహ * రవళి చిత్రాలు 1. చెవిలో పువ్వు 2. సీతారత్నం గారి అబ్బాయి 3. అబ్బాయిగారు 4. ఏవండీ ఆవిడ వచ్చింది 5. తాళి 6. ఆమె 7. కన్యాదానం 8. అల్లుడా మజాకా 9. గొప్పింటి అల్లుడు 10. ఆవిడా మా ఆవిడే 11. ఇంట్లోఇల్లాలు వంటింట్లో ప్రియురాలు 1. ↑ http://www.cinegoer.com/evv1.htm 2. ↑ http://www.totaltollywood.com/interviews/E.V.V.Satyanarayana_2110.html

ఆదుర్తి సుబ్బారావు

ప్రముఖ తెలుగు సినిమా దర్శకులు, రచయిత మరియు నిర్మాత అయిన ఆదుర్తి సుబ్బారావు 1922 సంవత్సరం డిసెంబరు 16న రాజమండ్రిలో తాసీల్దారు సత్తెన్న ఇంట జన్మించాడు. ముంబాయి లోని సెయింట్ జూనియర్ కాలేజ్ ఆఫ్ ఫొటోగ్రఫీలో చేరి ఫిల్మ్ లాబ్, ప్రోసెసింగ్, ప్రింటింగ్, ఎడిటింగ్ మొదలైన విభాగాలలో అనుభవం సంపాదించాడు. ఆనాడు సంచలనం రేపిన ఉదయ శంకర్ 'కల్పన' చిత్రానికి అసోసియేట్ ఎడిటరుగా నియమితులయ్యాడు. అతని సోదరుడు ఆదుర్తి నరసింహమూర్తి ప్రచురించిన 'హారతి' పత్రికకు సంపాదకత్వం వహించాడు. తరువాత ఇతడు చిత్ర రంగంలో ప్రవేశించి పూలరంగడు, గాజుల క్రిష్ణయ్య మొదలైన 26 చిత్రాలు, 9 తమిళ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఇతని చిత్రాలు నిర్మాతలకు విశేష లాభాలు ఆర్జించి పెట్టినాయి. చలనచిత్ర రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆదుర్తి సుబ్బారావు 1975 సంవత్సరంలో అక్టోబరు 29న పరమపదించాడు. విషయ సూచిక * 1 చిత్ర సమాహారం o 1.1 దర్శకులుగా o 1.2 రచయిత o 1.3 నిర్మాతగా దర్శకులుగా * మహాకవి క్షేత్రయ్య (1976) * గాజుల కిష్టయ్య (1975) * గుణవంతుడు (1975) * సునెహరా సంసార్ (1975) * బంగారు కలలు (1974) * జ్వర్ భట (1973) * ఇన్సాఫ్ (1973) * మాయదారి మల్లిగాడు (1973) * జీత్ (1972) * విచిత్రబంధం (1972) * రఖ్ వాలా (1971) * మస్తానా (1970) * దర్పన్ (1970) * మరో ప్రపంచం (1970) * పూల రంగడు (1970) * డోలి (1969) * మన్ కా మీత్ (1968) * మిలన్ (1967) * సుడిగుండాలు (1967) * కన్నెమనసులు (1966) * సుమంగళి (1965) * తేనె మనసులు (1965) * తోడు నీడ (1965) * దాగుడు మూతలు (1964) * డాక్టర్ చక్రవర్తి (1964) * వెలుగు నీడలు (1964) * చదువుకున్న అమ్మాయిలు (1963) * మూగ మనసులు (1963) * మంచి మనసులు (1962) * ఇద్దరు మిత్రులు (1961) * ఎంగళ్ కుల దైవి (1959) * నమ్మిన బంటు (1959) * ఆడపెత్తనం (1958) * మాంగళ్యబలం (1958) * తోడికోడళ్ళు (1957) * అమరసందేశం (1954) రచయిత * డోలి (1969) (screenplay) * మిలన్ (1967) (screenplay) * సుడిగుండాలు (1967) (screen adaptation) * తేనె మనసులు (1965) (writer) * చదువుకున్న అమ్మాయిలు (1963) (screen adaptation) * మాంగల్యబలం (1958) (writer) * తోడికోడళ్ళు (1957) (screen adaptation) నిర్మాతగా * గాజుల కిష్టయ్య (1975) * మాయదారి మల్లిగాడు (1973) * జీత్ (1972) (హిందీ) * దర్పన్ (1970) (హిందీ) * ఐ.ఎమ్.బి.డి.లో సుబ్బారావు పేజీ.

తెలుగు సినిమా దర్శకులు

ఆ * ఆదుర్తి సుబ్బారావు * ఇ.వి.వి.సత్యనారాయణ * ఎ.కోదండరామిరెడ్డి * ఎం.వి.రఘు * ఎల్.వి.ప్రసాద్ * ఎస్.వి. రంగారావు * కడారు నాగభూషణం * కమలాకర కామేశ్వరరావు * కృష్ణవంశీ * కె. రాఘవేంద్ర రావు * కె.ఎస్.ఆర్.దాస్ * కె.వి.రెడ్డి * కె.విశ్వనాథ్ * కైలాసం బాలచందర్ * కొమ్మినేని శేషగిరిరావు * కోటయ్య ప్రత్యగాత్మ * కోడి రామకృష్ణ * కోవెలమూడి సూర్యప్రకాశరావు * గరికపాటి రాజారావు * గిరిబాబు * గుత్తా రామినీడు * గూడవల్లి రామబ్రహ్మం * గౌతమ్ ఘోష్ * ఘంటసాల బలరామయ్య * చక్రపాణి * చిత్తజల్లు శ్రీనివాసరావు * చిత్తూరు నాగయ్య * జంధ్యాల * జంపన చంద్రశేఖరరావు * డూండీ * తమ్మారెడ్డి భరద్వాజ * తాతినేని ప్రకాశరావు * తాతినేని రామారావు * త్రిపురనేని గోపీచంద్ * దాసరి నారాయణరావు * పరిటాల ఓంకార్ * పాలడుగు దుర్గా ప్రసాద్ * పి.ఎస్. రామకృష్ణారావు * పి.పుల్లయ్య * పినిశెట్టి శ్రీరామమూర్తి * పూరీ జగన్నాధ్ * బాదామి సర్వోత్తం * బాపు * బాలు మహేంద్ర * బి.ఎ.సుబ్బారావు * బి.పద్మనాభం ( * బి.విఠలాచార్య * బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి * భానుమతీ రామకృష్ణ * మణిరత్నం * ముక్కామల కృష్ణమూర్తి * రాజమౌళి * రామ్ గోపాల్ వర్మ * వంశీ * విజయ భాస్కర్ * విజయనిర్మల * వీరమాచనేని మధుసూదనరావు * వేదాంతం రాఘవయ్య * వై.వి. రావు * శేఖర్ కమ్ముల * శ్రీను వైట్ల * సముద్రాల రాఘవాచార్య * సావిత్రి (నటి) * సి.పుల్లయ్య * సింగీతం శ్రీనివాసరావు * సుందరం బాలచందర్ * సుకుమార్ * హెచ్.ఎమ్.రెడ్డి * హెచ్.వి.బాబు