Rss Feed

టి.ప్రకాశరావు

లేదా తాతినేని ప్రకాశరావు (1924-1992) సుప్రసిద్ధ తెలుగు, తమిళ మరియు హిందీ సినిమా దర్శకులు. వీరు కృష్ణా జిల్లా కపిలేశ్వరంలో జన్మించారు. సినిమా రంగంలో యల్.వి.ప్రసాద్ షావుకారు సినిమాకు మరియు కె.వి.రెడ్డి గారి వద్ద పాతాళ భైరవి సినిమాకు అసిస్టెంటుగా పనిచేశారు. తర్వాత పరివర్తన, పల్లెటూరు, జయం మనదేరా మొదలైన ఎన్నో తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించారు. శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, యం.జి.ఆర్. మొదలైన అగ్రనటులతో ఎన్నో తమిళ చిత్రాలకు దర్శకత్వం వహించారు. హిందీలో దాదాపు పెద్ద నటులందరితోనూ 25 పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. మొత్తంగా సుమారు 60 పైగా దర్శకత్వం వహించినవాటిలో కొన్ని చిత్రాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి. వీరు తాష్కెంట్ చలన చిత్రోత్సవంలోను, ఉజ్ బెకిస్థాన్ లోను రెండు సార్లు డెలిగేషన్ లో పాల్గొన్నారు. సినిమాలు * Kab Tak Chup Rahungi (1988) * Engalalum Mudiyum (1982) * Asha Jyoti (1981) * Ganga Bhavani (1979) * Hamara Sansar (1978) * Chiranjeevi Rambabu (1977) * పొగరుబోతు (1976) * సంసారం (1975) * Gali Patalu (1974) * మైనరు బాబు (1973) * Rivaaj (1972) * Ghar Ghar Ki Kahani (1970) * Nanha Farishta (1969) * Duniya (1968) * Izzat (1968) * Vaasna (1968) * Suraj (1966) * Bahu Beti (1965) * Padakottai (1964) * Bahurani (1963) * Hamrahi (1963) * Kaathiruntha Kangal (1962) * Anbu Magan (1961) * Sasural (1961) * College Girl (1960) * Ellorum Innattu Mannar (1960) * Maa Babu (1960) * ఇల్లరికం (1959) * Kanniraindha Kanavan (1959) * Nalla Theerpu (1959) * Amar Deep (1958) * Sitamgar (1958) * Uttama Puthiran (1958) * అమరదీపం (1956) * చరణదాసి (1956) * జయం మనదేరా (1956) * Matharkula Manikkam (1956) * పరివర్తన (1954) * నిరుపేదలు (1954) * పిచ్చి పుల్లయ్య (1953) * పల్లెటూరు (1952)