Rss Feed

"ఆవ_కాయ+ బిర్యాని"క్లైమాక్ష్ లో ఆడియన్స్ ఎందుకొచామా అని వెలుథుంటారు

ఓ ముస్లిం-హిందు(తెలంగాణ-ఆంధ్రా) ప్రేమ కథను చూస్తానని ఊహించలేకపోయాను. పోని అదన్నా స్టైయిట్ గా చెప్పాడా అంటే…మధ్యలో తెలంగాణ ఊరి సమస్యలు అంటూ ప్రభుత్వ ప్రకటనలా టార్చర్ స్టార్ట్ చేసాడు. ఇదీ ధియోటర్ ఫస్ట్ డే ఫస్ట్ టాక్. మహ్మద్ అక్బర్ కలామ్(కమల్ కామరాజు) దేవరకొండ అనే తెలంగాణ పల్లెలో సెవన్ సీటర్ ఆటో నడుపుతూంటాడు. లక్ష్మి(బిందు మాధవి) ఆవకాయ అమ్ముకుని కుటుంబానికి సహకరించాలనుకుని పోలవరం (ఆంధ్రా)నుంచి వలస వచ్చిన అమ్మాయి. లక్ష్మి వికారబాద్ కి వెళ్ళటానికి అక్బర్ ఆటో ఎక్కుతుంది. ఇద్దరి మధ్య మీరూహించినట్లే కామన్ గా ప్రేమ చిగురిస్తుంది. ఈ మధ్యలో మాస్టర్జీ(రావు రమేష్),బబ్బర్ ఖాన్(వరుణ్ జొన్నాఢ) అనే ఇద్దరు పల్లె విలన్స్. వీరి నుండి ఈ ప్రేమ జంట తప్పించుకుని లక్ష్మి మతానికి విలువ ఇచ్చే తండ్రిని ఎలా ఒప్పించి పెళ్ళి చేసుకున్నారనేదే మిగతా కథ. నిజానికి పైన రాసినట్లుగా ఎలా ఒప్పించి పెళ్ళి చేసుకున్నాడనేదే ఇలాంటి కథల్లో హైలట్ అవ్వాల్సింది…అదే మిస్సయింది. సమస్యకు ఏం పరిష్కారం చూపాలో అర్ధం కాక..రెండేళ్ళ తర్వాత అని వేసాడు. అనంతరం అక్బర్ మండల ప్రెసెడెంట్ అయ్యాడని చూపాడు. అది చూసిన లక్ష్మి తండ్రి(అంటే ఆయన దృష్టిలో మనిషి సోషల్ స్టేటస్ పెరిగితే చాలు అన్న ఆలోచన ఉందేమో) పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. హీరోయిన్ చక్కగా బి.కామ్ చదువుకుంది కదా..ఏ ఉద్యోగమో చేసి కుటుంబానికి సాయపడుతుందేమో అనుకుంటాం..అలాంటిదేం జరగదు.దాంతో ఏ టెన్త్ ఫెయిల్ అమ్మాయో అని పెడితే బాగుండుననిపిస్తుంది. అలాగే హీరోతో ఆమె ఇకనుంచి ఇంగ్లీష్ లోనే మాట్లాడుదాం అంటుంది.కానీ అది తర్వాత సీన్ కే మర్చిపోతుంది. అంతేగాక హీరోయిన తండ్రి ఆమె పెళ్ళి చేసి చచ్చిపోతాను అన్నట్లు మాట్లాడుతూంటాడు గాని తనకు మరో కూతురు,కొడుకు ఉన్నారన్న ఫీలింగే ఎక్కడా కనిపించదు. ఇక బొంబాయి..సినిమాని మణిరత్నం అలానే ఎందుకు తీసాడో ఈ సినిమా చూస్తే…మరింత స్పష్టంగా అర్ధమవటం ఈ చిత్రానికున్న ఏకైక ప్లస్. కథలో ఫెయిలయిన రచయిత,దర్శకుడు డైలాగుల్లో కూడా ఫీల్ మిస్సయ్యాడు. ఫస్టాఫ్ మొత్తం డైలాగులతో నింపి గోల గోలగా మార్చేసాడు. డైలాగులు తగ్గించి విజువల్స్ చూపెడితేనే నిండుతనం వచ్చేది.ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. కెమెరా,ఎడిటింగ్ దర్శకుడు సెన్స్ కి తగినట్లే ఉన్నాయి ఏదైమైనా బ్రాండ్ నేమ్ చూసి సినిమాకెళితే మోసపోతారు అని నిక్కార్సయిన సత్యం చెప్పిన ఈచిత్రం ఇది. అలాగే ఈ సినిమాని ఆర్.కె.నారాయణ్ మాల్గుడి డేస్ తోను,శ్యామ్ బెనగల్ చిత్రాలతోనూ పోల్చటం అనవసరం.