Rss Feed

విజయనిర్మల

విజయనిర్మల (1946) తెలుగు సినిమా నటి, దర్శకురాలు మరియు ప్రముఖ నటుడు ఘట్టమనేని కృష్ణ భార్య. ఈమె అసలు పేరు నిర్మల అయితే తనకు సినీరంగములో తొలి అవకాశమిచ్చిన విజయా స్టూడియో కు కృతజ్ఞతగా విజయనిర్మల అని పేరు మార్చుకొన్నది. అప్పటికే ఇదే పేరుతో వేరే నటి (ఇప్పటి నిర్మలమ్మ) ఉండడం కూడా పేరు మార్పునకు మరో కారణము. ఈమె మొదటి పెళ్లి ద్వారా సినీ నటుడు నరేష్ కి తల్లి. మరో ప్రముఖ సినిమా నటి జయసుధకు ఈమె పిన్నమ్మ. 2002 లో ప్రపంచములోనే అతిఎక్కువ సినిమాలు తీసిన మహిళా దర్శకురాలిగా గిన్నీస్ ప్రపంచ రికార్డులు[1] లోకెక్కినది. నటి అయిన ఈమె 1971లో దర్శకత్వము వహించడము ప్రారంభించినది. ఈమె నటించిన అధిక చిత్రాలలో కధానాయకుడు కృష్ణ కావటం విశేషం. వీరిద్దరూ జంటగా సుమారు యాభై వరకూ చిత్రాలలో నటించారు. విజయనిర్మల, కృష్ణ జంటగా నటించిన తెలుగు చిత్రాలు * సాక్షి * మంచి కుటుంబం * సర్కార్ ఎక్స్ ప్రెస్ * అత్తగారు కొత్తకోడలు * లవ్ ఇన్ ఆంధ్రా * టక్కరి దొంగ చక్కని చుక్క * విచిత్ర కుటుంబం * బందిపోటు భీమన్న * అక్కా చెల్లెలు * మా నాన్న నిర్దోషి * మళ్లీపెళ్లి * విధివిలాసం * అమ్మకోసం * తాళిబొట్టు * పెళ్లి సంబంధం * పెళ్లికూతురు * పగ సాధిస్తా * అగ్నిపరీక్ష * రెండు కుటుంబాల కధ * అల్లుడే మేనల్లుడు * మాస్టర్ కిలాడి * అనురాధ * మోసగాళ్లకు మోసగాడు * భలే మోసగాడు * పండంటి కాపురం * ప్రజా నాయకుడు * మంచివాళ్లకు మంచివాడు * దేవుడు చేసిన మనుషులు * మీనా * గాలిపటాలు * అల్లూరి సీతారామరాజు * ధనవంతుడు గుణవంతుడు * దేవదాసు * సంతానం-సౌభాగ్యం * పాడిపంటలు * రామరాజ్యంలో రక్త పాతం * దేవుడే గెలిచాడు * పంచాయితీ * పట్నవాసం * మూడు పువ్వులు ఆరు కాయలు * హేమాహేమీలు * అంతం కాదిది ఆరంభం * రక్తసంబంధం * సాహసమే నా ఊపిరి * ప్రజల మనిషి * బొబ్బిలి దొర * శ్రావణమాసం