-
కవితలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కవితలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
నా కవిత్వానికి
నా కవిత్వానికి గుక్కెడు కన్నిళ్ళ విలువ తెలుసు
నా కవిత్వానికి పిడికెడు ఆనందాక్షణలు తెలుసు
నా కవిత్వానికి ప్రశ్నించటం తెలుసు
నా కవిత్వానికి బదులివ్వటము తెలుసు
నా కవిత్వానికి తలెత్తి నిలబడటం తెలుసు
ఏ అస్తిత్వానికి లోనుకానీది నా కవిత్వం
ఏ బంధానికి ఏ అనుబంధానికి మరే బావబంధానికి లొంగిపొంది నా కవిత్వం
బాధో ఆనందమో , కష్టాలో నష్టాà ��ో,రాజకీయాలో ఆరాచకియాలో
అన్నీ కాగితంపై కవితక్షరాలై ముద్రించబడతాయ్..
నా కవిత్వం గూడు లెనివడికి నీడనిస్తున్ది,
నా కవిత్వం కూడు లేని వాడికి ముద్ద పెడుతుంది,
నా కవిత్వం నీలకాశపు తాను చించి వివస్థ్రల వస్త్రం అవుతుంది ..
నా కవిత్వం వెన్నెలై వెలుగునిస్తుంది, చినుకై గొంతు తడుపుతుంది..
నా కవిత్వం రాబంధుమానవుల గుండెల్లో ఉరుమై భయం నింపుతుంది..
అసలు విటన్నిటికన్నా నా కవిత్వానికి మానవత్వం ఉంది..
............సుమన్.గద్దె
శ్రీ శ్రీ అంటే ఒక సంకల్పం
- శివలక్ష్మి
శ్రీ శ్రీ
రెండు అక్షరాల ఉద్వేగం
పెల్లుబికే జీవన కాంక్ష
ఎందుకు ఇష్టం
శ్రీ శ్రీ అంటే-
జీవితం ఎందుకు ఇష్టమో
అందుకే
ఊగించే శక్తి,ఉద్వేగంగా అల్లుకునే నడక
కవిత్వం అంటే శ్రీ శ్రీ
సదా నిత్యనూతనం, సదా స్నేహితుడిలా
ధైర్యం చెప్పే భరోసాతనం
పదే పదే పెదవుల మీదకు ప్రసరించి
పలకరించే ప్రతీక శ్రీశ్రీ
నిరాసక్తంగా సాగిపోతున్నప్పుడు
వెంట నడిచే జీవన ఉత్సాహం శ్రీశ్రీ
పదండి ముందుకు పడండి త్రోసుకు
అంటూ మరో ప్రపంచపు దారికి మళ్ళిస్తూ
కవిత్వాన్ని అమృతంలా
గుండెల్లో ఒంపుతుంటాడు
శ్రీశ్రీ అంటే ఎందుకు ఇష్టం
జీవితం అంటే ఎందుకు ఇష్టమో
అందుకే అని సాగిపోతూంటాను.
శ్రీ శ్రీ
రెండు అక్షరాల ఉద్వేగం
పెల్లుబికే జీవన కాంక్ష
ఎందుకు ఇష్టం
శ్రీ శ్రీ అంటే-
జీవితం ఎందుకు ఇష్టమో
అందుకే
ఊగించే శక్తి,ఉద్వేగంగా అల్లుకునే నడక
కవిత్వం అంటే శ్రీ శ్రీ
సదా నిత్యనూతనం, సదా స్నేహితుడిలా
ధైర్యం చెప్పే భరోసాతనం
పదే పదే పెదవుల మీదకు ప్రసరించి
పలకరించే ప్రతీక శ్రీశ్రీ
నిరాసక్తంగా సాగిపోతున్నప్పుడు
వెంట నడిచే జీవన ఉత్సాహం శ్రీశ్రీ
పదండి ముందుకు పడండి త్రోసుకు
అంటూ మరో ప్రపంచపు దారికి మళ్ళిస్తూ
కవిత్వాన్ని అమృతంలా
గుండెల్లో ఒంపుతుంటాడు
శ్రీశ్రీ అంటే ఎందుకు ఇష్టం
జీవితం అంటే ఎందుకు ఇష్టమో
అందుకే అని సాగిపోతూంటాను.

