Rss Feed

ఎస్వీ రంగారావు ( సామర్ల వెంకట రంగారావు)

సుప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు ఎస్వీ రంగారావు పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. నట యశస్వి గా పేరు పొందిన ఈ నటుడు మూడు దశాబ్దాలపాటు మూడొందల చిత్రాలకు పైగా అద్భుతంగా నటించి ఘటోత్కచుడిగా, కీచకుడిగా, రావణాసురుడిగా తనకు తానే సాటిగా ఖ్యాతి గడించాడు. ఆయా పాత్రలలో ఆయన ఎంత మమేకమై పొయ్యరంటే, వేరెవరు కూడా ఆ పాత్రలలో ఇప్పటివరకు ఇమడ లేకపొయ్యారు. విషయ సూచిక * 1 తొలి జీవితం * 2 నటనా చాతుర్యం * 3 వ్యక్తిగతం * 4 అవార్డులు, ప్రశంసలు * 5 కొన్ని పాత్రలు * 6 నటించిన చిత్రాలు * 7 మూలాలు తొలి జీవితం కృష్ణా జిల్లా లోని నూజివీడు లో 1918 జూలై 3 వ తేదీన లక్ష్మీ నరసాయమ్మ, కోటేశ్వరరావులకు ఎస్వీ రంగారావు జన్మించాడు. తండ్రి ఎక్సైజు శాఖలో పనిచేసేవాడు. యస్.వి.రంగారావు హిందూ కాలేజిలో చదివాడు. డిగ్రీ వరకూ చదివి, అగ్నిమాపక దళంలో ఉన్నతోద్యోగిగా పనిచేస్తూ, షేక్స్‌పియర్ ఆంగ్ల నాటకాలలో ఒథెల్లో, షైలాక్ తదితర పాత్రలు పోషించి ప్రముఖ రంగస్థల కళాకారుడిగా విశేష ఖ్యాతి గడించాడు. ఆ తర్వాత బి.వి.రామానందం దర్శకత్వంలో నిర్మించిన వరూధిని చిత్రంలో ప్రవరాఖ్యుడిగా తెలుగు చలనచిత్ర రంగానికి పరిచయమయ్యాడు. నటనా చాతుర్యం వరూధిని చిత్రంలో ప్రవరాఖ్యునిగా ఎస్వీ రంగారావు ఆ తర్వాత మనదేశం, పల్లెటూరి పిల్ల , షావుకారు, పాతాళభైరవి, పెళ్ళి చేసి చూడు, బంగారుపాప, బాలనాగమ్మ, గృహలక్ష్మి, బాల భారతం, తాతా మనవడు ఇలా అనేక చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించి తన అద్భుత నటనాచాతుర్యంతో సినీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశాడు. నటసామ్రాట్, విశ్వనట చక్రవర్తి మొదలగు బిరుదులతో తెలుగు ప్రేక్షకులు ఆయన్ను గౌరవించారు. ఎస్వీయార్ నటించిన నర్తనశాల ఇండొనేషియాలోని జకార్తా లో ఆఫ్రో-ఆసియా చిత్రోత్సవము‍లో ప్రదర్శించబడడమే కాకుండా కీచకపాత్రకుగాను ఎస్వీయార్ ఉత్తమ నటుడు బహుమతి పొందాడు. కొన్ని చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించాడు. ముఖ్యంగా ఆయన దర్శకత్వం వహించిన చదరంగం చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వ బహుమతి, నగదు పారితోషికం లభించాయి. అద్భుత నటనకు ప్రతీకగా నిల్చిన ఎస్వీ రంగారావు 1974 జూలై 18వ తేదీన మద్రాసు లో శాశ్వతంగా కన్నుమూశాడు. [మార్చు] వ్యక్తిగతం వ్యక్తిగా రంగారావు సహృదయుడు, చమత్కారి. ఆయన ఇష్టదైవం శివుడు. ప్రతిరోజూ శివపూజ చేసిన తర్వాత దినచర్య ప్రారంభించేవాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమార్తెల పేర్లు విజయ, ప్రమీల. కొడుకు పేరు కోటేశ్వర రావు. యస్వీఆర్ ఒక రకమయిన వేదాంతి. ఆయన ఇంటి లైబ్రరీలో వివేకానందునికి సంబంధించిన పుస్తకాలు ఎన్నో ఉండేవి. ఆయన గొప్ప దాత. ప్రజాహిత సంస్థలకు లెక్కలేనన్ని విరాళాలు ఇచ్చాడు. చైనాతో యుద్ధం వచ్చినపుడు ఏర్పాటు చేసిన సభలో పదివేల రూపాయలు విరాళం ఇచ్చాడు. తర్వాత పాకిస్తాన్‌తో యుద్ధం వచ్చినపుడు కూడా ఎన్నో సభలు నిర్వహించి, మిగతా నటులతో కలసి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి, విరాళాలు సేకరించి, ఆ డబ్బును రక్షణ నిధికి ఇచ్చాడు. అవార్డులు, ప్రశంసలు నర్తనశాలలో కీచకుని పాత్రకు ఆఫ్రో-ఆసియా చిత్రోత్సవములో ఉత్తమ నటుని బహుమతి అందుకొన్న ఎస్వీ రంగారావు బిరుదులు: * విశ్వనటచక్రవర్తి * నటసార్వభౌమ * నటసింహ బహుమతులు * రంగారావు దర్శకత్వం వహించిన మొదటిచిత్రం 'చదరంగం' ద్వితీయ ఉత్తమ చిత్రంగా నంది అవార్డును, రెండవ చిత్రం 'బాంధవ్యాలు' తొలి ఉత్తమ చిత్రంగా నంది అవార్డును గెలుచుకున్నాయి. * నర్తనశాల చిత్రంలో నటనకు ఇండోనేషియా ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ నటుడి అవార్డు, అదే పాత్రకు రాష్ట్రపతి అవార్డు అందుకున్నాడు. * ఎస్.వి.రంగారావు ప్రతిభను గురించి, వైవిధ్యమైన పాత్రల పోషించగల నైపుణ్యం గురించి ప్రసిద్ధ దర్శకుడు చిత్రకారుడు, బాపువేసిన ఛిత్రానికిముళ్ళపూడి వాఖ్యానం ఇలా చమత్కారంగా వ్రాశారు. క్లిష్టపాత్రల్లో చతురంగారావు దుష్టపాత్రల్లో క్రూరంగారావు హడలగొట్టే భయంకరంగారావు హాయిగొలిపే టింగురంగారావు రొమాన్సులో పూలరంగారావు నిర్మాతల కొంగుబంగారావు స్వభావానికి 'ఉంగారంగారావు కథ నిర్బలం అయితే హావభావాలు పాత్రపరంగారావు కళ్ళక్కట్టినట్టు కనబడేది ఉత్తి యశ్వీరంగారావు ఆయన శైలీ ఠీవీ అన్యులకు సులభంగారావు ఒకోసారి డైలాగుల్లో మాత్రం యమకంగారంగారావు [మార్చు] కొన్ని పాత్రలు రంగారావు బహుముఖ ప్రజ్ఞాశాలి. పాత్ర ఏదయినా, ఆయన కనిపించేవాడు కాదు, పాత్రే కనిపించేది. ఆయన తన సుదీర్ఘ నట జీవితంలో, అనేకానేక పాత్రలలో జీవించాడు. వాటిలో కొన్ని: * షావుకారు - సున్నం రంగడు * పెళ్ళిచేసి చూడు - ధూపాటి వియ్యన్న * సంతానం - గుడ్డివాడు * మాయాబజార్ - ఘటోత్కచుడు * సతీ సావిత్రి - యముడు * భక్తప్రహ్లాద - హిరణ్యకశిపుడు * శ్రీక్రిష్ణ లీలలు - కంసుడు * యశోద కృష్ణ - కంసుడు * పాండవ వనవాసం - దుర్యోధనుడు * నర్తనశాల - కీచకుడు * హరిశ్చంద్ర - హరిశ్చంద్రుడు * శ్రీకృష్ణాంజనేయ యుద్ధం - వాసుదేవుడు * సంపూర్ణ రామాయణం - రావణుడు * దీపావళి - బాణాసురుడు * అనార్కలి - అక్బర్ * మహాకవి కాళిదాసు - భోజరాజు * పాతాళభైరవి - మాంత్రికుడు * భట్టి విక్రమార్క - మాంత్రికుడు * బాలనాగమ్మ - మాంత్రికుడు * విక్రమార్క - మాంత్రికుడు * బంగారుపాప - కోటయ్య * బొబ్బిలియుద్ధం - తాండ్ర పాపారాయుడు నటనకే భాష్యం చెప్పిన యశస్వి - ఎస్వీ రంగారావు [మార్చు] నటించిన చిత్రాలు ఆయన నటంచిన చిత్రాలు అనేకం. అందులో కొన్ని . 40వ దశకం 1. వరూధిని(1946) 2. మన దేశం(1948) 50వ దశకం 1950 1. పల్లెటూరి పిల్ల 2. షావుకారు 3. తిరుగుబాటు 1951 1. ఆకాశరాజు 2. పాతాళభైరవి 1952 1. దాసి 2. పెళ్ళిచేసి చూడు 3. పల్లెటూరు 1953 1. బ్రతుకు తెరువు 2. చండీరాణి 3. దేవదాసు 4. పరదేశి 5. పెంపుడు కొడుకు 6. రోహిణి 1954 1. అంతా మనవాళ్ళే 2. జాతకఫలం 3. అన్నదాత 4. రాజు-పేద 5. రాజీ నా ప్రాణం 6. సంఘం 7. చంద్రహారం 1955 1. బంగారుపాప 2. అనార్కలి 3. మిస్సమ్మ 4. జయసింహ 5. సంతానం 1956 1. కనకతార 2. చింతామణి 3. హరిశ్చంద్ర 4. చరణదాసి 1957 1. తోడికోడళ్ళు 2. సతీ సావిత్రి 3. మాయాబజార్ 4. అల్లావుద్దీన్ అద్భుతదీపం 5. సారంగధర 6. రేపు నీదే 1958 1. బొమ్మల పెళ్ళి 2. భూకైలాస్ 3. చెంచులక్ష్మి 4. పెళ్ళినాటి ప్రమాణాలు 1959 1. కృష్ణలీలలు 2. మాంగల్య బలం 3. అప్పుచేసి పప్పుకూడు 4. జయభేరి 5. రేచుక్క పగటిచుక్క 6. బాలనాగమ్మ 7. భక్త అంబరీష 8. సౌభాగ్యవతి 60వ దశకం 1960 1. నమ్మిన బంటు 2. మహాకవి కాళిదాసు 3. దీపావళి 4. భట్టి విక్రమార్క 5. మామకు తగ్గ అల్లుడు 6. దేవాంతకుడు 1961 1. వెలుగు నీడలు 2. కృష్ణ ప్రేమ 3. సతీసులోచన 4. ఉషాపరిణయం 5. కలసి ఉంటే కలదు సుఖం 1962 1. గాలిమేడలు 2. టైగర్ రాముడు 3. పెళ్ళి తాంబూలం 4. మంచి మనసులు 5. దక్షయజ్ఞం 6. గుండమ్మకథ 7. ఆత్మబంధువు 8. పదండి ముందుకు 9. విషబిందువు 1963 1. నర్తనశాల 2. తోబుట్టువులు 1964 1. మురళీకృష్ణ 2. రాముడు భీముడు 3. బొబ్బిలి యుద్ధం 1965 1. నాదీ ఆడజన్మే 2. పాండవ వనవాసం 3. తోడు నీడ 4. సతీ సక్కుబాయి 5. ఆడబ్రతుకు 1966 1. మొనగాళ్ళకు మొనగాడు 2. ఆటబొమ్మలు 3. శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ 4. చిలకా గోరింక 5. సంగీత లక్ష్మి 6. భక్త పోతన 7. అడుగు జాడలు 8. మోహినీ భస్మాసుర 1967 1. భక్త ప్రహ్లాద 2. చదరంగం 3. గృహలక్ష్మి 4. లక్ష్మీనివాసం 5. పుణ్యవతి 6. రహస్యం 7. సుఖదుఃఖాలు 8. వసంతసేన 1968 1. బాంధవ్యాలు 2. బందిపోటు దొంగలు 3. భలే కోడళ్ళు 4. చిన్నారి పాపలు 5. కుంకుమ భరిణ 6. రాము 7. వీరాంజనేయ 1969 1. జగత్ కిలాడీలు 2. మామకుతగ్గ కోడలు 3. మూగనోము 4. బందిపోటు భీమన్న 70వ దశకం 1970 1. సంబరాల రాంబాబు 2. జగత్ జెట్టీలు 3. ఇద్దరు అమ్మాయిలు 4. దేశమంటే మనుషులోయ్ 5. బస్తీ కిలాడీలు 6. కిలాడి సింగన్న 1971 1. విక్రమార్క విజయం 2. అనురాధ 3. దెబ్బకు ఠా దొంగల ముఠా 4. రౌడీ రంగడు 5. భలేపాప 6. జాతకరత్న మిడతంభొట్లు 7. ప్రేమనగర్ 8. శ్రీకృష్ణ సత్య 9. దసరా బుల్లోడు 10. శ్రీకృష్ణ విజయం 1972 1. శ్రీకృష్ణాంజనేయ యుద్ధం 2. పాపం పసివాడు 3. పండంటికాపురం 4. సంపూర్ణ రామాయణం 5. శాంతి నిలయం 6. విచిత్రబంధం 7. వంశోద్ధారకుడు 8. కత్తుల రత్తయ్య 9. కొడుకు కోడలు 10. బాలభారతం 1973 1. బంగారు బాబు 2. మరపురాని మనిషి 3. తాతా మనవడు 4. డబ్బుకు లోకం దాసోహం 5. రామరాజ్యం 6. రాముడే దేముడు 7. వారసురాలు 8. మైనరు బాబు 9. దేవుడు చేసిన మనుషులు 10. డాక్టర్ బాబు 1974 1. ప్రేమలూ పెళ్ళిళ్ళు 2. బంగారు కలలు 3. చక్రవాకం 4. గాలిపటాలు 5. అందరూ దొంగలే 6. య