Rss Feed

కోడి రామకృష్ణ

నాటక రంగం నుంచి వచ్చిన ప్రతిభావంతులైన దర్శకులలో ఒకడు కోడి రామకృష్ణ. ఇతని స్వస్థలం పాలకొల్లు. పాలకొల్లులో కల లలిత కళాంజలి సంస్థ ద్వారా అనేక నాటకాలు వేసాడు. సినీ ప్రస్థానం కోడి రామకృష్ణ కు దర్శకుడిగా తొలిచిత్రం "ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య"(1981). దర్శకుడిగా దాసరి నారాయణరావుని పరిచయంచేసిన నిర్మాత కె.రాఘవ ఆయన శిష్యుడైన కోడి రామకృష్ణ కు కూడా అవకాశం ఇచ్చారు. ఎన్.టి.రామారావు మినహా అందరు కథానాయకులతోనూ పనిచేశారు. నూరు పైగా చిత్రాలు చేసిన నలుగురు తెలుగు దర్శకులలో ఒకరు. (దాసరి,కె.ఎస్.ఆర్ దాస్, కె.రాఘవేంద్రరావు లు మిగతా మువ్వురు). నటునిగా దర్శకునిగా గుర్తింపు పొందాక నటునిగా కూడా ప్రయత్నించారు. తొలిసారిగా 'మాఇంటికి రండి' అనే చిత్రంలో కథానాయకునిగా నటించారు. సుహాసిని కథానాయిక. ఐతే చిత్రంవిజయవంతం కాలేదు. తర్వాత కొద్దిసినిమాలలో సపోర్టింగ్ పాత్రలు ధరించారు. నటించిన చిత్రాలన్నీ ఆయన దర్శకత్వంలో వచ్చినవే. కధానాయకులు- చిత్రాలు చిరంజీవి తో ఇంట్లోరామయ్య వీధిలో క్రిష్ణయ్య తర్వాత ఆలయశిఖరం(అమితాబ్ నటించిన ఖుద్దార్ చిత్రం ఆధారంగా),సింహపురిసింహం(చిరంజీవి ద్విపాత్రాభినయం),గూధచారి 117,రిక్షావోడు,అంజి చిత్రాలు నిర్మించారు. బాలకృష్ణ కు సోలో హీరోగా తొలి విజయవంతమైన చిత్రం "మంగమ్మగారి మనవడు" ఈయన చిత్రమే.తర్వాత బాలకృష్ణ తో ముద్దుల కృష్ణయ్య,ముద్దులమావయ్య,మువ్వగోపాలుడు,ముద్దుల మేనల్లుడు,బాలగోపాలుడు వంటి చిత్రాలు తీసారు. భార్గవ్ ఆర్ట్స్ చిత్రాలలో ఎక్కువభాగం కోడి దర్శకత్వం వహించారు. గొల్లపూడి మారుతీరావు, గణేష్ పాత్రో మాటలతో కోస్తాంధ్ర నేపధ్యం తో కొంతకాలం చిత్రాలు తీశారు. తర్వాత అమ్మోరు(సినిమా) సినిమా నుండి గ్రాఫిక్స్ వినియోగిస్తూ కొన్ని విజయవంతమైన చిత్రాలు తీశారు (దేవి, దేవీపుత్రుడు, దేవుళ్ళు, అంజి). రాజకీయనేపధ్యం తో కొన్ని చిత్రాలు తీసారు.ఈయన దర్శకత్వంలొ ఇటీవల వచ్చిన అరుంధతి చిత్రం పెద్ద విజయం సాధించినది.