Rss Feed

ఆదుర్తి సుబ్బారావు

ప్రముఖ తెలుగు సినిమా దర్శకులు, రచయిత మరియు నిర్మాత అయిన ఆదుర్తి సుబ్బారావు 1922 సంవత్సరం డిసెంబరు 16న రాజమండ్రిలో తాసీల్దారు సత్తెన్న ఇంట జన్మించాడు. ముంబాయి లోని సెయింట్ జూనియర్ కాలేజ్ ఆఫ్ ఫొటోగ్రఫీలో చేరి ఫిల్మ్ లాబ్, ప్రోసెసింగ్, ప్రింటింగ్, ఎడిటింగ్ మొదలైన విభాగాలలో అనుభవం సంపాదించాడు. ఆనాడు సంచలనం రేపిన ఉదయ శంకర్ 'కల్పన' చిత్రానికి అసోసియేట్ ఎడిటరుగా నియమితులయ్యాడు. అతని సోదరుడు ఆదుర్తి నరసింహమూర్తి ప్రచురించిన 'హారతి' పత్రికకు సంపాదకత్వం వహించాడు. తరువాత ఇతడు చిత్ర రంగంలో ప్రవేశించి పూలరంగడు, గాజుల క్రిష్ణయ్య మొదలైన 26 చిత్రాలు, 9 తమిళ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఇతని చిత్రాలు నిర్మాతలకు విశేష లాభాలు ఆర్జించి పెట్టినాయి. చలనచిత్ర రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆదుర్తి సుబ్బారావు 1975 సంవత్సరంలో అక్టోబరు 29న పరమపదించాడు. విషయ సూచిక * 1 చిత్ర సమాహారం o 1.1 దర్శకులుగా o 1.2 రచయిత o 1.3 నిర్మాతగా దర్శకులుగా * మహాకవి క్షేత్రయ్య (1976) * గాజుల కిష్టయ్య (1975) * గుణవంతుడు (1975) * సునెహరా సంసార్ (1975) * బంగారు కలలు (1974) * జ్వర్ భట (1973) * ఇన్సాఫ్ (1973) * మాయదారి మల్లిగాడు (1973) * జీత్ (1972) * విచిత్రబంధం (1972) * రఖ్ వాలా (1971) * మస్తానా (1970) * దర్పన్ (1970) * మరో ప్రపంచం (1970) * పూల రంగడు (1970) * డోలి (1969) * మన్ కా మీత్ (1968) * మిలన్ (1967) * సుడిగుండాలు (1967) * కన్నెమనసులు (1966) * సుమంగళి (1965) * తేనె మనసులు (1965) * తోడు నీడ (1965) * దాగుడు మూతలు (1964) * డాక్టర్ చక్రవర్తి (1964) * వెలుగు నీడలు (1964) * చదువుకున్న అమ్మాయిలు (1963) * మూగ మనసులు (1963) * మంచి మనసులు (1962) * ఇద్దరు మిత్రులు (1961) * ఎంగళ్ కుల దైవి (1959) * నమ్మిన బంటు (1959) * ఆడపెత్తనం (1958) * మాంగళ్యబలం (1958) * తోడికోడళ్ళు (1957) * అమరసందేశం (1954) రచయిత * డోలి (1969) (screenplay) * మిలన్ (1967) (screenplay) * సుడిగుండాలు (1967) (screen adaptation) * తేనె మనసులు (1965) (writer) * చదువుకున్న అమ్మాయిలు (1963) (screen adaptation) * మాంగల్యబలం (1958) (writer) * తోడికోడళ్ళు (1957) (screen adaptation) నిర్మాతగా * గాజుల కిష్టయ్య (1975) * మాయదారి మల్లిగాడు (1973) * జీత్ (1972) (హిందీ) * దర్పన్ (1970) (హిందీ) * ఐ.ఎమ్.బి.డి.లో సుబ్బారావు పేజీ.