Rss Feed

నాకు ఆర్కుట్లో ప్రేమ దొరికిందోచ్.................

  • ప్రేమ మనసులో వుంటుందా..? మనిషి లో వుంటుందా...? మాటల్లో వుంటుందా...?
  • 'నా మనసుకు తను నచ్చింది. తనంటే ప్రేమ' అంటాం మనం. అంటే మనసులో వుంటుందా ప్రేమ...???
  • మనలో ప్రేమున్న లేకపోయినా తనలో ప్రేముండాలని, మనల్ని ప్రేమించాలని అనుకుంటాము మనం. అంటే ప్రేమ మనిషిలో వుంటుందా...?
  • మనం ప్రేమించిన వాళ్ళతో ప్రేమగా మాట్లాడతాము.అంటే మాటల్లో వుంటుందా ప్రేమ...?
  • నేస్తం..! ప్రేమ లేని చోటు అంటూ వుండదు..
  • తన కోసం వేచి చూసే కన్నులో ప్రేమ వుంటుంది.
  • పరుగులు తీసే పిల్లగాలికి చల్లనైన మల్లెల శుఘంధమంటే ప్రేమ. పగలంతా పడిన అలసటకికమ్ముకోచే చికటంటే ప్రేమ. నేర్రాలే నగలైన నెలకి ఒళ్ళంతా తడిమే జల్లంటే ప్రేమ.
  • ప్రతి చిగురికి పచరంగుని పూసే ప్రకృతికి పచ్చధనమంటే ప్రేమ. మన చుట్టూ ప్రేమ కనిపిస్తుంటే ప్రేమని అక్కడో , ఇక్కడో మాత్రం చెప్పలేము..
  • ప్రకృతిలోనే కాదు... మనలో, మన మనసులో, మన మాటల్లో ప్రేమ వుండాలి.
  • నిలోను , ని మనసులోనూ, ని మాటల్లోనూ... అన్నింట్లోనూ కలగలిసి వుంటేనే అది నిజమైన , పరిపూర్ణ మైన ప్రేమ..

ఆంధ్రజ్యోతి లోని ఒక వ్యాసం

నాన్న : అబ్బయి ! నీకో పిల్లను చూశానురా కొడుకు : అక్కర్లేదు నాన్న కావల్సిన అమ్మాయిని నేనే చూసుకుంటాను . నాన్న : అరె .... నేను చూసిన అమ్మయి బిల్ గేట్స్ కూతురురా . కొడుకు : అవునా ... అలా అయితే సరే ... తర్వాత నాన్న బిల్ గేట్స్ దగ్గరికి వెళతాడు నాన్న : మీ అమ్మయికో మంచి వరుడ్ని చూసాను . బిల్ గేట్స్ : కాని మా అమ్మయి చాల చిన్న పిల్ల నాన్న : ఆ అబ్బయి వరల్డ్ బ్యాంక్ ఉపాధ్య్ క్షుడు బిల్ గేట్స్ : ఓ ... అలా అయితే సరే ఆ తర్వాత నాన్న వరల్డ్ బ్యాంక్ అధ్య్క్షుడి దగ్గరికి వెళతాడు నాన్న :meeకు ఉపాధ్య్ క్షుడిగా పనికివచ్చే ఒక Yuవకుడు ఉన్నాడు నా దగ్గర . అధ్యక్షు డు : నా దగ్గర ఇప్పటికే అవసరానికి మించి ఉపాధ్యక్షులు ఉన్నారు నాన్న : కాని ఆ అబ్బయి బిల్ల్ గేట్స్ అల్లుడు అధ్యక్షుడు : నిజమా.... అలా అయితే సరే ...... ఇవ్వాల రేపు వ్యాపారలన్ని ఇలాగే జరుగుతున్నయట ఒక్క వ్యాపారాలనేమిటి రాజకీయాలు ,పరిపాలన , అంతర్జాతీయ వ్యవహారాలు అన్ని ఇంతే. వాక్యాల మధ్యే కాదు పదాల మధ్య , అక్షరాల మధ్య కూడా అంతరార్ధాలను శొధించాల్సి వస్తోంది . -------

map

లెక్క

p

ఇంగ్లిష్ టూ తెలుగు డిక్షనరీ

  • మనకూ ఒక ఇంగ్లిష్ టూ తెలుగు డిక్షనరీ కావాలి ...ఇక్కడ నొక్కండి అదే వస్తుందిలే
పాలక్షుడు నవల చదవాలి అనుకుంటే ఇక్కడ నొక్కండి ..... మధుబాబు రెడ్ షాడో కావాలంటే ఇక్కడ నొక్కండి

John Mathieson workshop

Tastes in photography have changed. These days things are much sharper, lower in contrast, sometimes flat in pastel colours, retouched, with no depth or perspective and with a lot of front light. This is very different to the past. With commercials not having the budgets and influence they used to and the MTV age gone, the only area that has remained and expanded in our everyday visual world of internet and cable TV, surprisingly, is fashion photography. Glossy magazines are more popular than ever and they are stuffed full of digital retouched and air brushed digital photography. Don’t underestimate what an influence that has on us, and, how we experiment. We support and imitate it, not consciously, with our own domestic digital cameras the asc

వడ్డెర చండీదాసు

ఎందుకోగాని అనుక్షణికం చదివినతరవాత చండీదాస్ గురుంచి నా బ్లాగ్లో కొద్దిగా రాయాలి అనిపించింది
వడ్డెర చండీదాసు (Vaddera Chandidas) ప్రముఖ తెలుగు నవలా రచయిత. ఇతని అసలు పేరు డాక్టర్ చెరుకూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు (సి.ఎస్.రావు) [1]. తన కలంపేరులో "వడ్డెర"ను పేద వృత్తికులమైన వడ్డెర ప్రజల నుండి, చండీదాస్ అన్న పేరును 15వ శతాబ్దపు విప్లవాత్మక బెంగాలీ కవి నుండి స్వీకరించాడని కథనం.[2] చండీదాస్ తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయములో తత్త్వశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేసి విరమించారు. ఇతని నవలలో హిమజ్వాల, అనుక్షణికం, చీకట్లోంచి చీకటిలోకి ప్రముఖమైనవి. చైతన్య స్రవంతి కథన రీతిని ఎంచుకుని రాసిన చండీదాస్‌ రచనలు విశేష ప్రజాదరణ పొందడమే కాకుండా సాహిత్యవేత్తల మన్ననలు కూడా పొందాయి. హిమజ్వాల ఇది వడ్డెర చండీదాస్ తొలి నవల. మంచులా చల్లబడిపోయిన తెలుగు పాఠకుల మనసులో మంటలు రగిలించిన నవల హిమజ్వాల. ఆంధ్రజ్యోతి వార పత్రికలో ధారావాహికగా వెలువడి విపరీతమైన సంచలనాన్ని సృష్టించింది. నాటకీయత, కధనా నైపుణ్యం, చేతనా స్రవంతి అద్భుతంగా మేళవించిన రచన ఇది. కృష్ణ చైతన్య, గీత అనే రెండు ముఖ్యపాత్రల అంతరంగ చిత్రణ ఈ నవలలో అద్భుతంగా జరిగింది. [మార్చు] అనుక్షణికం దీని రచనాకాలం 1979-81, కధాకాలం 1971-80. రెండు వందలు పైగా పాత్రలు, కోకొల్లుగా సంఘటనలతో ఒక దశాబ్దపు దేశ రాష్ట్ర చరిత్రలను కూర్చి సృష్టించిన నవల ఇది. ఇందులో ఘటనలన్నీ నిజాలు, చారిత్రికాలు. ఈ నవలలో మరొక విశేషం - తెలుగు నవలా సాహిత్యంలో ఎన్నడూ లేని వాస్తవికత. కులాల పేర్లు, ఇంటి పేర్లు, ఊళ్ళపేర్లు చిరినామాలతో సహా పేర్కొనడం. ఆంధ్రజ్యోతి వార పత్రికలో ధారావాహికగా వెలువడి రెండు సంవత్సరాల సుదీర్ఘ సమయంలో ఎందరినో మెప్పించిన నవల ఇది. చండీదాస్ 2005, జనవరి 30న విజయవాడలోని నాగార్జున ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు

ఎళ్దమొస్తవా.స్టేజి మీద పాట

ఎళ్దమొస్తవా.స్టేజి మీద పాట అయింది. కాసేపటికి తరువాత అక్కడే కింద ది ఆ పాట మాదంటె మాదని గొడవ మొదలయిం .సరే.మీరెక్కడికెళ్దామని అర్థం లో రాశారు"అన్నాడుఊరిపెద్ద..... .వలస,వలస పొయ్యే వాళ్ళ గురించి "అన్నాడు సింగమయ్య.. .సరే మీరెక్కడికని పాడుకున్నారు పిల్లలూ"అడిగాడు పెద్ద.......... నేను మా నాన్ననడగాలి అన్నాడు కుర్రాడు.................... అమ్మాయ్ నువ్వు ఎక్కడికని పాడావ్................................. ఇంకెందుకులెండి చెయ్యాల్సిన అల్లరంతా చేశాడు గా ఆ శింగమయ్య. ఆ పాట ఆయన రాసిందట. భంగ పడ్డాం చాలు,చాలు గాని ఇప్పుడేం చెయ్యమంటాడో అడగండి... సరె చెప్పు నాయనా,శింగమయ్యా, వాళ్ళు ఒప్పుకుంటున్నట్టు అనిపిస్తొంది. నీకేం కావాలో చెప్తే ఇప్పించే ప్రయత్నం చేస్తాను"అన్నాడు పెద్ద.......... .టిక్కెట్టు కి పావు టిక్కెట్టు వాల్యూ ,క్షమాపణ నాకు కావాలి"అన్నాడు శింగమయ్య....... అన్యాయం ,అన్యాయం అంటూ అబ్బాయి ,అమ్మాయి లేచారు............ మీరుండండి నాయనా,అమ్మా నేను మాట్లాడు తున్నాగ"అన్నాడు పెద్ద.... ఇంతలో మరొకాయన లేచి పావేంటి ఈ షో అంతా ఆ పాట మీద కాదు నడిచింది.ఇది పెద్ద హిట్టు.టిక్కెట్టు కి సగం ఇయ్యాల్సిందే"అన్నాడు.... మాకేం మిగులుద్ది అనుకున్నారు ఆ అమ్మాయి అబ్బాయి.అయినా మరీ అంత ఆశ ఉండొద్దయ్యా తప్పు"అన్నాడుపెద్ద.. ........ఏంటి ఆశా, లేచాడు శింగమయ్య.కందిపప్పెంత వంద,బియ్యం ఎంత నలభై,కూరగాయలెంత, పెట్రోలెంతా పిల్లల ఫీజులెంత,ఇంటి కిరాయిలెంతనుకున్నారు.నేనెంత కష్ట పడుతున్నా"అన్నాడు శింగమయ్య.............. ......అవును శింగమయ్య అన్నది కూడా కరక్టే .ఆయనా మనిషే కదా, బతకాలి కదా .కాస్త అటు ఇటు గ ఇచ్చెయ్యండి అన్నారు పెద్దలు ముగిస్తు

మంచి స్క్రీన్ ప్లే

ఎప్పటినుంచో మంచి స్క్రీన్ ప్లే 'స్ ని నా బ్లొగ్లొ ఉంచాలి అని అనుకుంటున్నాను అందుకె ముంధుగా no smoking స్చ్రీంప్లయ్ మెకొసం చదవలి అని అనుకుంటె ఇక్కద క్లిక్ చెయ్యండి

అంగవైకల్యం పెద్ద సమస్యకాదు. అంగవైకల్యంపై మనలాంటి సాధారణమైన మనుషులు చూపే వివక్ష అన్నిటికన్నా పెద్ద అంగవైకల్యం

http://www.youtube.com/watch?v=iq78SMYYVE0

చలనచిత్రము యొక్క ప్రప్రధమ పరిశోధకుడు, సృష్టి కర్త ఫ్రీస్ గ్రీన్

ఫిలిం పరిశ్రమకు , ఫిలిం పరిశోధనలకు ఫిలిం సృష్టి కర్తలకు కూడా అమెరికా జన్మస్థానము అని చాలా మంది అభిప్రాయము. కాని, ఫిలిం పరిశ్రమ విషయంలో అన్ని విధములా అగ్రస్థానం ఇంగ్లండుది. అసలు చలన చిత్రం యొక్క సృష్టి ఇంగ్లండులో జరిగింది. ప్రపంచం అంతటిలోనూ ప్రపధమ చలనచిత్రము ఇంగ్లండులో తయారు చేయబడింది. ప్రపంచం అంతటిలోనూ మొట్టమొదట సినిమా హాలు ఇంగ్లండులోనే నిర్మింపబడింది. చలన చిత్రమునకే కాక మాట్లాడే ఫిలిమునకు కూడా ఇంగ్లండే జన్మస్థానం. మాట్లాడే ఫిల్ము ప్రప్రధమములో ఇంగ్లండులో తయారు చేయబడినది. ఈ చలనచిత్రము యొక్క ప్రప్రధమ పరిశోధకుడు, సృష్టి కర్త ఇంగ్లండులో జన్మించాడు. అమెరికా దేశస్థులకి ఫిలిం అంటే యేమిటో తెలియని రోజులలో ఇంగ్లండు దేశీయుడైన ఫ్రీస్ గ్రీన్ (Friese Greene) అనే అతడు, ప్రస్తుత ఫిలిం పరిశ్రమలో ఉపయోగింపబడే సెల్యులాయిడ్ ఫిలిం మీద ఒక చలనచిత్రాన్నితయారుచేశాడు.ఇదే ప్రపంచంలో మొట్టమొదట తయారు చేయబడిన చలనచిత్రం. ఈ ఫిలిం బ్రిటిష్ పేటెంటు కార్యాలయంలో, 1889 వ సంవత్సరంలో, జూన్ 21వ తేదీన పేటెంటు చేయబడింది. ఫ్రీస్ గ్రీన్ తన మొదటి చలనచిత్రాన్ని తయారు చేసిన నాలగైదు సంవత్సరాల తర్వాత, అనగ1894 ప్రాంతముల వరకు, అమెరికా శాస్త్రజ్ఞుడైన ఎడిసన్, ఫిలిం నిర్మాణానికి పరిశోధనతో తంటాలు పడుతూనే వున్నాడు. గ్రీన్ తన మొదటి ఫిలిమును తయారుచేయుటకు ముందనేక సంవత్సరాలనుంచీ కూడా, ఫిల్ము నిర్మాణమును గూర్చి అనేక పరిశోధనలు చేస్తూండేవాడు, అనేక దినములు రాత్రింపగళ్ళు, నిద్రాహారాములు లేక, తదేక దీక్షతో ఆలోచనలు సాగిస్తుండేవాడు. అతని ఆలోచనలకు అంతూపొంతూ లేకుండా నెలలు, సంవత్సరాలు, గడుపుతూ, ఒక్కక్కప్పుడు తనను తానే మరిచిపోతుండేవాడు. ఒక్కక్కప్పుడతని ఆలోచనలు అతనికే కలలుగాను, ఆకాశ పుష్పాలు గానూ భ్రమింపచేసి, నిరుత్సాహం కలిగించేవి. కాని, ఆలోచనలూ, పరిశోధనలు మాత్రము యధాప్రకారం సాగుతూనే వుండేవి. ’ఎప్పటికైనా జీవరహితమైన చిత్రములను చలనచిత్రాలుగా చేసి తీరాలి’ అని దీక్షవహించాడు. చలనచిత్ర సృష్టియే తన జీవితాశముగా, అదియే తన జీవిత లక్ష్యముగా నిశ్చయించాడు. ఎల్లప్ప్పుడూ తన లక్ష్యమును గూర్చి అనేకములైన కలలు కంటూండేవాడు. దీనికితోడు దారిద్ర్య దేవత కూడా అతన్ని ఆశ్రయించింది.ప్రతిరోజూ దినదిన గండంగా వుండేది. అతని సంసారిక జీవితమంతా అయోమయంగా, అనేక కష్టపరంపరంలతో కూడుకొని వుండేది.అతనియొక్క జీవితమంతా నిరాశ దు:ఖములతో కూడివుండేది. కా్, గ్రీన్ జీవితలక్ష్యమునకు మాత్రము వీటి వలన భంగం కలగలేదు. అన్నిటినీ యదార్థమైన వీరుని వలె యెదుర్కొని, చలించక తన దృక్పథమును కొంచెము కూడా మార్పు చెందనీయలేదు. అది 1889 వ సంవత్సరంలో ఒక నాటి నిశిరాత్రి-యధారీతిగా రాత్రి పండ్రెండు గంటలవరకూ తిరిగి తిరిగి ఇల్లు చేరుకున్నాడు.తక్షణమే గ్రీన్ మందహాసం చేస్తూ పరిశోధనాలయంలోకి పోయాడు. అది ఒక చిన్న గది. గోడలన్నీ మాత్రం సున్నం చేయబడి తెల్లగా ఉన్నాయి. ఆ తెల్లగోడలనే గ్రీన్ తన పరిశోధనలకు తెరగా ఉపయోగించేవాడు. యధాప్రకారం పరిశోధనలు ప్రారంభించాడు. సంవత్సరాలనుంచీ కొయ్యబొమ్మల్లా నిల్చివుండే చిత్రాలన్నీ, ఆనాడు ప్రాణములు ధరించినట్లు గోడల మీద ఆడడం ప్రారంభించాయి. ఇన్ని సంవత్సరాలుగా ఈ ఆశయం కొరకు గ్రీన్ తన రక్తమాంసముల నాహుతిచేశాడో, ఆ ఆశయం సిద్ధించింది. అటువంటి సమయంలో గ్రీన్ సంతోషానికి హద్దుంటుందా! గ్రీన్ ఆశాజ్యోతి అప్పుడే ప్రజ్వలించింది.అనేక సంవత్సరముల నుండి అతని హృదయవీధిలోసంచరిస్తూన్న కలలూ నాడతని హృదయఫలకం మీద నిల్చి నిజస్వరూపంలో తాండవించాయి. సంవత్సరములనుండి అతని దృష్టిలో తాండవిస్తూన్న ఆకాశపుష్పములన్నీ మాలయై అతని కంఠసీమ నలంకరించాయి. అప్పుడతనిలో నుండి పొంగి పొంగ్ వచ్చిన ఉత్సాహాన్నీ సంతోషాన్నీ ఆపుకోలేకపోయాడు గ్రీన్. అతనిలో ఆశ్చర్యం ఆనందం ఉదభవించి, అతన్ని పిచ్చివాడిని చేశాయి. పిచ్చి యెత్తినవాడిలా పట్టారాని సంతోషంతో వీధిలోపడి పరుగులు ప్రారంభించాడు. అక్కడవున్ పోలీసువాడొకడాతనిని వెంటాడి పట్టుకున్నాడు. గ్రీన్ “కొయ్యబొమ్మలకి ప్రాణాలుపోసి నా గది గోడల మీద ఆడుస్తూన్నాను, చూడు చూడు” అని ఆ పోలీసును బరబర తన గదిలోకి ఈడ్చుకుపోయాడు. ఆ పోలీసుకూడా చూసి ఆశ్చర్యంతో కొయ్య బారి చూడడం ప్రారంభించాడు. ఈ హడావుడంతా చుసి చుట్టుప్రక్కలవాళ్ళంతా జేరి ఆశ్చర్యపడ్డారు. తక్షణం గ్రీన్ నాల్గు విస్కీ బాటిల్సు విప్పి జన్మదినోత్సవం చేసేశాడు. మరునాటినుంచే పారిశ్రామికలనేకులు గ్రీన్ చుట్టూ మూగటం ప్రారంభించేరు. అక్కడక్కడనేక స్టూడియోలు బయలుదేరి ఫిలింపరిశ్రమను ప్రారంభించాయి. ’కల్నర్ రాబర్ట్ హేమిల్టన్ వెచ్’ అనే ఒక ప్రభుత్వోద్యోగికి ఈ పరిశ్రమలో అభిరుచి కలిగింది. ఒకనాడు తన ఆఫీసుకు రావలసిందని గ్రీన్ కు కబురుచేశాడు. గ్రీన్ తన మామూలు చింపిరిగుడ్డలతో దీర్ఘంగా ఆలోచిస్తూ పరధ్యానంగా బయల్దేరాడు. ఆఫీసుదగ్గరకు రాగానే గుమ్మం దగ్గిర నౌకరు ’నీ పేరే’మని అడిగాడు. కాని గ్రీన్ మనస్సు అక్కడలేదు, ఆ నౌకరుకేమీ సమాధానం చెప్పలేదు. ఆ నౌకరు మళ్ళి రెండు మూడు సార్లు గద్దించి అడిగాడు. అప్పడులికిపాడి, నిద్దురలేచినట్లు కళ్ళు నులుముకుంటూ తనకు వచ్చిన ఆహ్వానం తీసి చూపించాడు. అది చూసి ఆ నౌకరు గ్రీన్ ను, హామిల్టన్ దగ్గరు తీసుకుపోయాడు. కొంత సంభాషణ అయ్యాక గ్రీన్ చేత ఒక ఫిలిం తీయించడానికి నిర్ణయించుకున్నాడు హేమిల్టన్. నిర్ణయప్రకారం బెలూన్ లో పైకిపోయి, క్రింద సైన్యములను, చలనచిత్రంగా తీశాడు గ్రీన్. ఇదే ఫిలిం ప్రపంచానికి మొదటి చలనచిత్రం. ఇప్పుడీ చలనచిత్ర నిర్మాతలు కోటీశ్వరులవుతూంటే అప్పుడా చలనచిత్ర జన్మధాత కూటికి లేకచనిపోయాడు, అతని జీవితమంతా దినదిన గండములుగా గడిపాడు. తరచూ గ్రీన్ తినుటకు తిండిలేక మలమల మాడుతూనే వుండేవాడు. అవసరం నిమిత్తం అనేక అప్పులు చేశాడు. అంత్యదశలో అప్పులవారాతని ఆస్తిని వేలంవేసి అతన్ని ఖైదులో పెట్టించారు. ఆ విజ్ఞాన శాస్త్ర కోవిదుడు, ఫిలిం జన్మధాత గ్రీన్, బెంగతో ఆకలిబాధతో కృశించి, సలసల కాగి స్రవించిన దు:ఖాశ్రుజాలంతోమరణించాడు.

"ఆవ_కాయ+ బిర్యాని"క్లైమాక్ష్ లో ఆడియన్స్ ఎందుకొచామా అని వెలుథుంటారు

ఓ ముస్లిం-హిందు(తెలంగాణ-ఆంధ్రా) ప్రేమ కథను చూస్తానని ఊహించలేకపోయాను. పోని అదన్నా స్టైయిట్ గా చెప్పాడా అంటే…మధ్యలో తెలంగాణ ఊరి సమస్యలు అంటూ ప్రభుత్వ ప్రకటనలా టార్చర్ స్టార్ట్ చేసాడు. ఇదీ ధియోటర్ ఫస్ట్ డే ఫస్ట్ టాక్. మహ్మద్ అక్బర్ కలామ్(కమల్ కామరాజు) దేవరకొండ అనే తెలంగాణ పల్లెలో సెవన్ సీటర్ ఆటో నడుపుతూంటాడు. లక్ష్మి(బిందు మాధవి) ఆవకాయ అమ్ముకుని కుటుంబానికి సహకరించాలనుకుని పోలవరం (ఆంధ్రా)నుంచి వలస వచ్చిన అమ్మాయి. లక్ష్మి వికారబాద్ కి వెళ్ళటానికి అక్బర్ ఆటో ఎక్కుతుంది. ఇద్దరి మధ్య మీరూహించినట్లే కామన్ గా ప్రేమ చిగురిస్తుంది. ఈ మధ్యలో మాస్టర్జీ(రావు రమేష్),బబ్బర్ ఖాన్(వరుణ్ జొన్నాఢ) అనే ఇద్దరు పల్లె విలన్స్. వీరి నుండి ఈ ప్రేమ జంట తప్పించుకుని లక్ష్మి మతానికి విలువ ఇచ్చే తండ్రిని ఎలా ఒప్పించి పెళ్ళి చేసుకున్నారనేదే మిగతా కథ. నిజానికి పైన రాసినట్లుగా ఎలా ఒప్పించి పెళ్ళి చేసుకున్నాడనేదే ఇలాంటి కథల్లో హైలట్ అవ్వాల్సింది…అదే మిస్సయింది. సమస్యకు ఏం పరిష్కారం చూపాలో అర్ధం కాక..రెండేళ్ళ తర్వాత అని వేసాడు. అనంతరం అక్బర్ మండల ప్రెసెడెంట్ అయ్యాడని చూపాడు. అది చూసిన లక్ష్మి తండ్రి(అంటే ఆయన దృష్టిలో మనిషి సోషల్ స్టేటస్ పెరిగితే చాలు అన్న ఆలోచన ఉందేమో) పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. హీరోయిన్ చక్కగా బి.కామ్ చదువుకుంది కదా..ఏ ఉద్యోగమో చేసి కుటుంబానికి సాయపడుతుందేమో అనుకుంటాం..అలాంటిదేం జరగదు.దాంతో ఏ టెన్త్ ఫెయిల్ అమ్మాయో అని పెడితే బాగుండుననిపిస్తుంది. అలాగే హీరోతో ఆమె ఇకనుంచి ఇంగ్లీష్ లోనే మాట్లాడుదాం అంటుంది.కానీ అది తర్వాత సీన్ కే మర్చిపోతుంది. అంతేగాక హీరోయిన తండ్రి ఆమె పెళ్ళి చేసి చచ్చిపోతాను అన్నట్లు మాట్లాడుతూంటాడు గాని తనకు మరో కూతురు,కొడుకు ఉన్నారన్న ఫీలింగే ఎక్కడా కనిపించదు. ఇక బొంబాయి..సినిమాని మణిరత్నం అలానే ఎందుకు తీసాడో ఈ సినిమా చూస్తే…మరింత స్పష్టంగా అర్ధమవటం ఈ చిత్రానికున్న ఏకైక ప్లస్. కథలో ఫెయిలయిన రచయిత,దర్శకుడు డైలాగుల్లో కూడా ఫీల్ మిస్సయ్యాడు. ఫస్టాఫ్ మొత్తం డైలాగులతో నింపి గోల గోలగా మార్చేసాడు. డైలాగులు తగ్గించి విజువల్స్ చూపెడితేనే నిండుతనం వచ్చేది.ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. కెమెరా,ఎడిటింగ్ దర్శకుడు సెన్స్ కి తగినట్లే ఉన్నాయి ఏదైమైనా బ్రాండ్ నేమ్ చూసి సినిమాకెళితే మోసపోతారు అని నిక్కార్సయిన సత్యం చెప్పిన ఈచిత్రం ఇది. అలాగే ఈ సినిమాని ఆర్.కె.నారాయణ్ మాల్గుడి డేస్ తోను,శ్యామ్ బెనగల్ చిత్రాలతోనూ పోల్చటం అనవసరం.

"సిరివెన్నెల" గారి" అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా"?

అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా? ఆత్మవినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా? చిన్నప్పుడు పాటలు వినే కొత్తలో శ్రీశ్రీ రచించిన పాడవోయి భారతీయుడా అనే పాట చాలా గొప్పపాట అని అమ్మ వినిపించేది. పాట వచ్చి ముప్పయ్యేళ్ళు గడిచినా చూడు ఇప్పటికీ ఆ పాట ఎంత రెలవెంటుగా ఉందో అని చెప్పేది. అప్పటిలో శ్రీశ్రీ దార్శనికత మీద గొప్ప అభిమానం పెంచేసుకున్నా కూడాను. కొన్నాళ్ళ తర్వాత అర్థమయ్యింది – రాయడంలో శ్రీశ్రీ గొప్పతనం ఎంతలా ఉన్నా – ఆ పాటని నిజం చెయ్యడంలో సమాజం “గొప్పతనాన్ని” కూడా తక్కువ అంచనా వేయకూడదని. సిందూరం అనే సినిమాలో వ్రాయబడ్డ ఈ పాటగురించి కూడా పై అభిప్రాయం వర్తిస్తుందనుకుంటాను. ఈ పాట పదేళ్ళక్రితం యాభయ్యవ స్వాతంత్ర సంబరాల సమయంలో అనుకుంటా వ్రాయబడింది. నిన్నే ఎందుకో హమ్ముకుంటుంటే – ఆహా! అయితే మనం గత పదేళ్ళలో పెద్దగా ఒరగబెట్టేసినదేమీ లేదన్నమాట అనిపించింది. పాట వింటూ అనిపించిన కొన్ని అనుభూతుల్ని మీతో పంచుకుందామని… శాంతికపోతపు కుత్తుక తెంచి తెచ్చినబహుమానం – ఈ రక్తపు సింధూరం నీ పాపిటలో భక్తిగ దిద్దిన ప్రజలను చూడమ్మా – ఓ పవిత్ర భారతమా! అవ్వడానికి సింధూరమే – పవిత్రమే – తెచ్చినదే ఎక్కడనుండి – కపోతాన్ని – అదే శాంతికపోతపు రక్తంతో భరతమాతకి సింధూరం దిద్దుతున్న సమాజం గత యాభయ్యేళ్ళలో అస్సలు మారలేదు. నాటి దేశవిభజన గొడవలనుండి – నేటి ఒరిస్సా మారణహోమాల దాకా – ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం – కృష్ణగీత ఆపిందా నిత్యకురుక్షేత్రం – మారదు లోకం – మారదు లోకం. కులాలకోసం గుంపులు కడుతూ మతాలకోసం మంటలు పెడుతూ ఎక్కడలేని తెగువను చూపి తగువుకు లేస్తారే – జనాలు తలలర్పిస్తారే సమూహక్షేమం పట్టని స్వార్ధపు ఇరుకుతనంలో ముడుచుకుపోతూ మొత్తం దేశం తగలడుతోందని నిజం తెలుసుకోరేం- తెలిసీ భుజంకలిపి రారేం అలాంటి జనాల తరపున ఎవరో ఎందుకు పోరాడాలి – పోరి ఏవిటి సాధించాలి ఎవ్వరికోసం ఎవరు ఎవరితో సాగించే సమరం – ఈ చిచ్చుల సింధూరం జవాబు చెప్పే బాధ్యత మరిచిన జనాల భారతమా – ఓ అనాధ భారతమా! ఒకవంక కులాల కురుక్షేత్రం. మరొకవంక మతాల మారణహోమం. పోనీ ఇవన్నీ అలా జరిగిపోతున్నాయా – కాదే - జరిపింపబడుతున్నాయి. ఎందుకు అని తెలిసినవాళ్ళంతా బానే ఉన్నారు. తెలియని మూర్ఖజనాలు బలవుతున్నారు. ఆపగలిగిన మేధావివర్గం దేశం అనే భావనే టెర్రరిజానికి మూలం – కాబట్టి దేశభక్తన్న భావనే పోవాలి అంటుంది. స్వేఛ్చ దేనికయ్యా అంటే కొట్టుకోవడానికి – ఎవరు ఎవరికోసం ఎవరితో కొట్టుకుంటున్నారు – ఎందుకోసం కొట్టుకుంటున్నారు – నూరుకోట్లమంది నీ నీడలో, నీ తిండి తింటూ, ఆనందంగా కొట్టుకుంటూ స్వేఛ్చని అనుభవిస్తున్నారు. నువ్వుమాత్రం అనాధవే… అమ్మ తుఝే సలాం. అన్యాయాన్ని సహించని శౌర్యం దౌర్జన్యాన్ని దహించే ధైర్యం క్రూరమృగంలా కారడువుల్లో దాక్కుని ఉండాలా – వెలుగుని తప్పుకు తిరగాలా శత్రువుతో పోరాడే సైన్యం – శాంతిని కాపాడే కర్తవ్యం స్వజాతివీరులనణిచే విధిలో కవాతు చెయ్యాలా – అన్నలచేతిలో చావాలా తనలో ధైర్యం అడవికి ఇచ్చి – తన ధర్మం చట్టానికి ఇచ్చి ఆ సమరం చూస్తూ సంఘం శిలలా నిలుచుంటే నడిచే శవాల సిగలో తురిమిన నెత్తుటి మందారం ఈ సంధ్యా సింధూరం చీకటివైపా వేకువలోకా ఎటు నడిపేనమ్మా – గతి తోచని భారతమా ధైర్యమూ, ధర్మమూ రెండూ సమాజంలో ఉంటే ఆ సమాజంలో శాంతి వెల్లివిరుస్తుంది. ఆ రెంటినీ సమాజం పంచేసింది. ఒకభాగం అడవిలో నక్సలైట్లకిచ్చి, మరోభాగం పోలీసులకిచ్చి ఆ కలహాన్ని చూస్తూ సంఘం శిలలా చూస్తూ ఉంటే… సమాజంలో జీవం ఎక్కడుంది? అలాంటి జీవంలేని శవాల్లా సమాజంలో నడుస్తున్న మేధోజనాలం మనం. మన సిగలో నెత్తుటి మందారాన్ని తురుముతున్న ఈ సింధూరసంధ్య ఎటు తీసుకుపోతుందో? ఈ సంధ్య ఉదయసంధ్యో, సాయంసంధ్యో అర్థం కావడం లేదు. మనందరికీ ఒకటే తృప్తి. సాయం సంధ్య అయినా రాత్రంతా గడిచైనా రేపుదయం వస్తుందని. మనకేమన్నా తొందరా? మనం నడిచి వెళ్ళాలంటే సమస్య – మనం నడవనంతవరకూ ఎవరెక్కడికి పట్టుకెళ్ళినా మనకి పరవాలేదు. వీలైతే స్పందించడమే మానేద్దాం. లేదంటే నక్సలైట్లదే తప్పని కాస్త అరుద్దాం. కాదంటే పోలీసులదే తప్పని గోలచేద్దాం. లేదంటే హిందూమతానిదే పాపం అని ప్రశ్నిద్దాం. పోదంటే ముస్లిములే తీవ్రవాదులని నిర్ణయిద్దాం. మరింత ఆజ్యాన్ని రగిలిద్దాం. ఆ చితిమంటల వెలుగులో మనం చలికాచుకుందాం. అంతేనా… తనతలరాతను తనే మార్చగల అవకాశాన్నే వదలుకొని తనలో భీతిని తన అవినీతిని తన ప్రతినిధులుగ ఎన్నుకుని ప్రజాస్వామ్యమని పిలిచే జాతిని ప్రశ్నించడమే మానుకుని కళ్ళు ఉన్న ఈ కబోది జాతిని నడిపిస్తుందట ఆవేశం ఆ హక్కేదో తనకే ఉందని శాసిస్తుందట అధికారం కృష్ణుడు లేని కురుక్షేత్రమున సాగే ఈ ఘోరం చితిమంటల సింధూరం చూస్తూ ఇంకా నిదురిస్తావా విశాలభారతమా ఓ విషాద భారతమా! అస్సలు ఈ పాటకి మీకు మధ్య నేనుండాలా అనిపిస్తుంది. కళ్ళున్న జాతిని కళ్ళు తెరవమని చెప్పడానికి అటు ఆవేశానికీ, ఇటు అధికారానికీ తీరుబడిలేదు గానీ, నడిపించడానికి మాత్రం వాళ్ళల్లో వాళ్ళు కొట్టేసుకుంటున్నారు. ఈ కురుక్షేత్రానికి అతిముఖ్యలోపం గమ్యం లేకపోవడం – గమ్యం తెలియకపోవడం. ఈ చితిమంటల సింధూరం చూస్తూ కూడా నిదురిస్తావా అని భారతానికొక ప్రశ్న. భారతమంటే నేను కాదు అని అనేసుకుని పక్కకు వెళ్ళిపోకండేం!

కాసేపు మణిరత్నం గారి గురించి ..

మణి రత్నం మొదటి నాలుగు సినిమాలు నేను చూళ్ళేదు (పల్లవి అనుపల్లవి , ఉన్నారు , పాగల్ నిలవు , ఇదయ కోవిల్ ) కాబట్టి వాటి మీద నో కామెంట్స్ . మౌన రాగం --- చాలా డీసెంట్ సినిమా , ఇలాంటి సినిమాలు తెలుగు లో కూడా అప్పటికీ చాలా వచ్చినా , స్క్రీన్ ప్లే పరంగా .. ఇది కాస్త ఎడ్జ్ ఓవర్ విన్నర్ .. అప్పట్లో వచ్చిన మరో తమిళ సినిమా కు ఇది కొంత కాపీ అని విన్నాను , దీని తరువాత ఆయన చాలా సినిమాలు ఇతరుల సినిమాలనుంచి inspire అయినవే , కొంత వరకూ కాపీ కూడా అనొచ్చు !! నన్ను అడిగితే అదే అంటాను !! రేవతి గారి ఆక్టింగ్ ఇందులో నిజంగా సూపర్ !! shez one of my fav actors in indina cinema. నాయకన్ --- ఎవరెన్ని చెప్పినా .. నేను మాత్రం ఇది కచ్చితంగా గాడ్ ఫాధర్ కాపీ అనే అంటాను, అందులో ఒక ఇటాలియన్ అమెరికా లో మాఫియా డాన్ గా ఎదిగితే .. ఇందులో ఒక మదరాసి .. బాంబే లో డాన్ గా ఎదుగుతాడు , ఇక ఇందులో సీన్లు చాలా వరకు మక్కీ కి మక్కీ దించక పోయినా ...స్క్రీన్ ప్లే ... టేకింగ్ ... ఇలా చాలా వరకు కాపీ యే ... కాపీ అయినా ఇండియన్ నేటివిటీ కి ఈ సబ్జెక్ట్ ఆపాదించి తీసి హిట్ చెయ్యడం గొప్ప కాదా అనవచ్చు .... కచ్చితంగా కాదు ... గాడ్ ఫాథర్ లాంటి సబ్జెక్ట్ , విభిన్న జాతూల తో ఒక మిని ప్రపంచం గా అలలారుతున్న మన భారతదేశానికి అతికినట్టు సరిపోతుంది .. కాబట్టి అందులో గొప్ప దనేమీ లేదు ... ఆ మాటకొస్తే మణి రత్నం కంటే రాం గోపాల్ వర్మా నే కొంత వరకూ బెటరూ ... ఆయన కనీసం సర్కార్ , నన్ను inspire చేసిన గాడ్ ఫాథర్ కి ఫ్రాంసిస్ ఫోర్డ్ కొప్పోలా కి నేను అర్పిస్తున్న గురు దక్షిణ అని ప్రకటించుకున్నారు ... మణి మాత్రం అది కాపీ కానే కాదు అని మంకు పట్టు పడుతున్నాడు . పైగా నాయకన్ TIME ప్రకటించిన 100 గ్రేటెస్ట్ ఫిలంస్ ఎవర్ మేడ్ లిస్ట్ లో ... ఉంది ఘర్షణ / అగ్ని నక్షత్రం ----- అసలు ఈ సినిమా ఎందుకు తీసాడో మణి రత్నానికే తెలియాలి , నన్ను అడిగితే ... ఇందులో హాస్పిటల్ సీన్ లో ప్రభు , కార్తీక్ వాళ్ళ నాన్న ని రూం మార్చి , మెట్ల దగ్గర కాపు కాసే సీన్ .. గాడ్ ఫాథర్ నుంచి మక్కి కి మక్కి దించేసారు మణి 'రతనం' గారు ..... అంజలి ---- ఈ సినిమా కు ఒక ఇంగ్లీష్ నవల ఆధారం , కొన్ని సీన్లు స్పీల్ బర్గ్ E.T నుంచి inspire అయ్యాయి , ఇందులో చిన్నారి షామిలీ అక్టింగ్ నిజంగా సూపర్ , రేవతి సినిమా కి మరో అసెట్. దళ పతి ---- ఈ సినిమా లో ని రజనీ , మమ్ముటి , అరవింద్ స్వామీ పాత్రలు మహా భారతం లో కర్ణుడు , ధుర్యోధనుడు , అర్జునుడి పాత్రలను తలపిస్తాయి , కధ కూడా కొంత వరకూ అలానే ఉంటుంది , ఇందులో మమ్ముటి పాత్ర మధ్యలో వీక్ అయినట్టు అనిపిస్తుంది , కొంత సైకోటెరిక్ గా కూడా అనిపిస్తుంది . దీని పై 1960's లో వచ్చిన హాలీవుడ్ గాంగ్ స్టా సినిమాల ప్రభావం చాలా వరకూ ఉందనిపిస్తుంది . గీతంజలి ---- ఒప్పుకుంటా ... ఈ సినిమా నిఝాంగా చాలా బావుంటుంది ... పైగా ఇందులో నాగార్జునా ఉన్నాడు అందుకే నో కామెంట్స్ . ;) రోజా --- దళ పతి మహా భారతం నుంచి inspire అయినట్టే ఇది మైధలాజికల్ కారెక్టర్ సావిత్రి కధ నుంచి inspire అయ్యింది , కాక పోతే అక్కడ యముడు , ఇక్కడ టెర్రరిస్టు , అందులో సావిత్రి పట్టు దల చూసి యముడు కరిగి పోతే ... ఇక్కడ అరవింద్ స్వామి మాటలకి టెర్రరిస్టు ice అయి పోయాడు ... కానీ ఇందులో జెండా తగుల బెట్టే సీన్ చూస్తే మాత్రం ... రక్తం ఉడికి పోతుంది . దొంగా దొంగా --- రాం గోపాల్ వర్మా , మణి రత్నం కలిసి ఒక సినిమా నిర్మిస్తున్నరంటే ... అది ఏ రేంజి లో ఉందో అనుకుంటాం , నిజం చెప్పాలంటే అప్పట్లో ఈ సినిమా సూపర్ గ ఉంది అనిపించింది , కానీ ఇప్పుడు చూస్తే ... బాంబే ---- హమ్ ..మ్.....మ్..మ్ ఈ సినిమా కి ఏం వంకలు పెట్టొచ్చబ్బా ?? ;) , రియల్ ఇంసిడెంట్ నుంచి inspire అయ్యింది ... పైగా చాలా మంచి వర్క్ ... కాబట్టి నో కామెంట్స్ . ఇద్దరు --- తమిళ నాడు రాజకీయల ఆధారంగా తీసిన సినిమా ఇది !! పర్లేదు బానే ఉంటుంది !! చాలా చోట్ల కధ మరీ పర్సనలైజ్ చేసినట్టు అనిపించింది , కధనం కూడా స్లో .... ముఖ్య పాత్రల మధ్య వైరం కూడా సినిమాలో వేగం తేలేక పోయింది !! దిల్ సే --- చూళ్ళేదు , నో కామెంట్స్ !! :) సఖి --- పర్లేదు మంచి సినిమా ... కాక పోతే .. ఇలాంటి వి బోల్డొచ్చాయి కాబట్టి లైట్ .. :) అమ్రుతా --- తమిళ టైగర్ల పోరాట నేపధ్యం లో సాగుతుంది ... మొదటి అర్ధ గంట తరువాత సినిమాలో వేగం పెరిగింది కానీ , ప్లాట్ లో ని కాంప్లెక్సిటీ సరిగ్గా హండిల్ చెయ్య క పోవడం వల్ల నేమో మధ్యలో డైల్యూట్ అయినట్టు అనిపించింది !! కానీ ఇందులో మాధవన్ , సిమ్రాన్ పాత్రలు చాలా బాగున్నాయి , సిమ్రాన్ ఒక తల్లి గా తన అమ్రుతకు సహాయ పడుతుంటే .... మాధవన్ మాత్రం తన రీసెర్చి కి కూడా పనికివస్తుంది అన్న రీతిలో ఉంటాడు , ఒక డెడికేటెడ్ రచయిత , తన లోని తండ్రి పాత్రను అధిగమించి అమ్రుత కు సహాయ పడుతుంది !! యువ --- ఈ సినిమా లో హీరోల ఇంట్రడక్షన్ సీన్ చూసి అందరూ ... మాకి కిరి కిరి ఏం తీసాడు మావా అన్నారు .. తీరా చూస్తే మెక్సికన్ సినిమా అమెరోస్ పెరురోస్ నుంచి కాపీ పేస్ట్ చేసారు ... సరే ఆ సీన్ వదిలేసి సినిమా అన్నా గొప్పగా ఉందా అంటే అదీ లేదు .... పాలిట్రిక్స్ లో యువత అనే మంచి కాచీ సబ్జెక్ట్ తీసుకొని ఊదేసారు , సినిమా లో బేసిక్ ఎలిమెంట్స్ చాలా మిస్స్ అయినట్టు అనిపించాయి . గురు --- Orson Welles తీసిన సిటిజన్ కేన్ చూసొచ్చి ఈ సినిమా చూడండి , కధా కధనాలు వేరైనా ... కారెక్టర్ పరంగా ... విజువల్స్ పరంగా .. స్క్రీన్ ప్లే పరంగా ఎన్ని సారూప్యతలు ఉన్నాయో మీరే గడ గడా చెబుతారు , ఇక అభిషేక్ అయితే Orson లాగా ఆక్ట్ చేడానికి తెగ కష్టపడ్డాడు పాపం , ఇందులో లైటింగ్ టెక్నిక్స్ అంతకు ముందే వచ్చిన స్పీల్ బర్గ్ సినిమా మ్యూనిక్ లైటింగ్ ఎఫెక్ట్స్ ని గుర్తుకు తెస్తాయి . దీన్ని ధీరూ భాయి అంబానీ జీవితం ఆధారంగా తీసారు. ఎందుకో నాకు పెద్దగా నచ్చలేదు !! ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా ఈ సం వ మన దేశం తరుఫున ఆస్కార్ కి పంపిస్తారట , చూద్దాం ఏ చేస్తాడో మన గురూ గారు !! Creative Commons License
suman by morning shot is licensed under a Creative Commons Attribution 2.5 India License.
Based on a work at writtenbysuman.blogspot.com.
Permissions beyond the scope of this license may be available at http://writtenbysuman.blogspot.com/.

RADIO

‘కొత్త బంగారులోకం’ మరీ అంత కొత్తగా ఎమీ లేదు

సినిమా కథ గురించి చెప్పేందుకు అంత ఏమీ లేదు కానీ కథనం మాత్రం కొన్ని చోట్ల బాగుంది. కథ: ఒకమ్మాయీ ఒకబ్బాయీ ప్రేమించుకుంటారు. చివరికి వాళ్లు కలవటం. మరి మధ్యలో కలవరా అంటే సినిమాలో చాలా సేపు కలిసే ఉంటారు కానీ అసలు కలవటం అన్నమాట. కాలేజిలో కలవటం, ప్రేమించుకోటం , పెద్దలకి దొరికి పోటం. షరా మామూలే. దాన్ని కొంచం బ్రతికించింది నటీ నటుల ప్రతిభ. కథనమేలా సాగిందంటే…: జయసుధ నేరేషన్లో కథ నడుస్తుంది. మంచి నటి కావటం, వాయిస్ బాగుండటం వల్ల నేరేషన్ లో ఏమీ భయం వెయ్యదు చూసేవాళ్ళకి. కానీ నాకు మాత్రం భయం వేసింది. (కృష్ణంరాజు, జయసుధలని పెట్టి మన్మధుడు తీసినా నేను ఇండియాలో A రేటింగూ, అమెరికాలో R రేటింగూ ఇస్తాను. గతానుభవం మరి). ఐతే అంత భయపడే విషయం ఏదీ లేదులే. నటీ నటులు: వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్, ప్రకాశ్రాజ్, జయసుధ, ఆహుతి ప్రసాద్, బ్రహ్మానందం, రావు రమేష్. ప్రతిభ: హీరో మనకి ‘హ్యాపీడేస్’ సినిమా ద్వారా పరిచయం అయ్యాడు. హీరోయిన్ కొత్తమ్మాయి లానే ఉంది. పాపం వాళ్ళకి దర్శకుడు నటించే అవకాశం ఇవ్వలేదు. దాంతో వాళ్ళిద్దరూ బ్రతికి పోయారు. అంతా వాళ్ల వయసుకు తగ్గట్టుగానే ఉండటంతో పెద్ద కష్ట పడకుండానే లాగించేశారు. మెచ్చుకోవచ్చు. హీరోయిన్ క్యూట్ గా ఉంది. ఈమధ్య అంత పెద్ద జడ ఉన్నా అమ్మాయిని చూడలేదు. ప్రకాష్రాజ్ కి ఇది నిజంగానే కొత్త పాత్ర. బాగా అండర్ ప్లే చేశాడు. చాలా బాగుంది. జయసుదకి ఇది రొటీన్ పాత్రే. బాగానే చేసిందని చెప్పక్కర్లేదు. నాకైతే బోరు కొట్టింది. ఆహుతి ప్రసాద్ ఉన్నంతలో లాగించాడు. నాకైతే మొహం మొత్తింది. ఆ స్టైల్ ఆఫ్ డైలాగ్స్ తో. బ్రహ్మానందం ప్రిన్సిపాల్ గా బాగున్నాడు. రెండు మూడు డైలాగ్స్ బాగున్నాయి. ‘రావు రమేష్’ ఫిజిక్స్ లెక్చరర్ గా చేశాడు. నేను మొదటి సారి విన్నాను. ఓ మాదిరిగా ఉన్నాడు. ఐతే అతనిది entertaining పాత్ర. మా ఫ్రెండు రావు గోపాల రావు తాలూకన్నాడు. నిజమా అనుకున్నాను. పాటలు: నాకు ఇంట్రెస్ట్ కలిగింది ‘సీతారామశాస్త్రి’ అన్న టైటిల్ చూసి. ఎవరు ఏవి రాశారో తెలీదు. వెళ్ళేసరికే పేర్లు ఐపోయాయి. ‘నిజంగా నేనేనా…’ పాట చిత్రీకరణ బాగానే ఉంది. (మూడో పాట). ‘క‍న్ఫ్యూషన్’ అనే పాటా గుర్తు ఉంచుకోదగ్గదే కానీ కంఫ్యూషన్ గానే ఉంది. మ్యూజిక్ సినిమాకు తగ్గట్టుగానే ఉంది. మాటలు: అసలు చెప్పుకోవాల్సింది వాటి గురించే. కొన్ని మాటలు బాగా పేలాయి. రెస్పాన్స్ బాగా వచ్చింది. అందులోనూ సెకండ్ హాఫ్ లో వచ్చే ‘అన్నయ్యా…’ డైలాగ్ అదిరింది. అలాగే హీరో ఫ్రెండు జల్సాని మూడు సార్లు చూశానంటే హీరో ‘అన్నిసార్లూ అర్ధం కాలేదా?”‘ అంటాడు. అదీ బాగానే ఉంది. క్లాసులో ‘టీనేజ్, యంగేజ్, మిడిలేజ్’ గురించి రావు రమేష్ చెప్పే సన్నివేశం లో డైలాగ్స్ బాగున్నాయి. అశ్లీలతలు లేక పోవటం బాగుంది. కెమెరా: అవేరేజ్. మూడో పాటలో మాత్రం బాగుంది. అనవసరపు హడావిడి లేకుండా చక్కగా తీశారు. ఎవరో తెలీదు. ఫైట్స్: ఒక్కటే ఉంది. క్రికెట్ ఫీల్డింగ్ లాగా. బాగుంది. సినిమా చూడొచ్చా?: నిక్షేపంలాగా. ఐతే ఒక్కసారి మాత్రమే. హెచ్చరిక: సినిమాలో హీరో తో కబుర్లాడుతూ హీరోయిన్ మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుదాం. అప్పుడు చాలా హ్యాపీ గా ఉండొచ్చు అంటుంది. ఇంకా డైలాగ్స్ ఉన్నాయి. మరీ చెప్పెయలేముగా! ఇది చాలు సినిమా చూడోచ్చోలేదో నిర్ణయించుకునేందుకు. పాపం ఆ అమ్మాయి అమాయకురాలనుకుంటా. ఇదే సినిమా గురుంచి "నవతరంగం"లొ సూర్యప్రకాష్ గారు ఎమన్నారొ చూద్దాం అసలు ఈ సినిమా కథ హ్యాపీడేస్ లాంటి ప్లేవర్ తో ఫస్టాఫ్ పూర్తి చేసి ప్రేమిస్తే లాంటి సంఘటనలతో సెకండాఫ్ నడుపుదామనకున్నప్పుడే సగం ప్లాబ్లం ప్రారంభమయ్యింది. ఎందుకంటే కాలేజి జీవితాన్ని ఉషారుగా చూపే పాప్ కార్న్ మోడ్ లో సాగ్ హ్యాపీడేస్ లో సంఘటనలకీ, ఉన్నదున్నట్లుగా వాస్తవంగా సన్నివేశాలతో నడిచే ప్రేమిస్తేని ముడి పెట్టడం చాలా కష్టం . అయినా ఈ స్కీమ్ ఫాలో కావటంతో సెకండాఫ్ లో హీరో,హీరోయిన్స్ కలిసే సన్నివేశాలే అసలు కథలో లేకుండా పోయాయి. దాంతో అప్పటి వరకూ వారి స్వీట్ రొమాన్స్ ని ఎంజాయి చేసిన ప్రేక్షకుడు హఠాత్తుగా కథ ఇలా డ్రైగా మారటం జీర్ణించుకోలేని విషయం. అలా కాకుండా తేజ రెగ్యులర్ నువ్వు-నేను,జయం స్కీమ్ వెళ్ళి పోయి టీనేజ్ ప్రేమ కథను అందర్ని ఎదిరించి పూర్తిగా గెలిపించే ప్రయత్నం చేసినే సమస్య లేకుండా పోయేది. అలా కాకుండా సందేశం చెప్పాలి…మరో ప్రక్క టీనేజ్ ప్రేమకథను చూపాలనే ప్రయత్నం చేయటం వల్లనే ఈ ప్రమాదం వచ్చింది. దాంతో అసలు దర్శక,రచయిత ఈ సినిమా ద్వారా ఏం చెప్పాలనుకున్నాడు అన్న క్లారిటీని ప్రేక్షకుడుకి అందించటం మిస్సవటం జర్గింది. అదే ఇదే బ్యానర్ లో గతంలో వచ్చిన బొమ్మరిల్లు సినిమాలో ఫస్ట్ సీన్ లోనే మా సినిమా తండ్రి కొడుకుల సమస్య అని స్పష్టం చేస్తాడు. అలాగే ఈ సినిమాలో దర్శకుడు ఫాలో అయిన ప్రేమిస్తే లోనూ ఫస్ట్ సీన్ లోనే ప్రపంచం ఇంకా తెలియని ప్రేమజంట లేచిపోవటం తో ప్రారంభించి ఓ పిచ్చివాడిని చూపి చివరకు ఇలాగే కథ ముగుస్తుంది…రియలిస్టిక్ ఎప్రోచ్ ఉన్న సినిమా అని హింట్ దర్శకుడు ఇస్తాడు. అలాగే ఈ దర్శకుడు మనసు పడ్డ మరో సినిమా మరో చరిత్ర (హీరో హీరోయిన్ల పేర్లు స్వప్న,బాలు) సినిమాలో నూ కథ ఓ పాత కాలం బిల్డింగ్ పై ఓపెన్ చేసి ఇది ఓ విషదాంత ప్రేమకథ అని చెప్పి ఫాలో అవ్వమంటాడు. ఆ చిత్రంలో హైలెట్ గా నిలిచే మన మధ్య ఉన్నది ఆకర్షణా,ప్రేమ అన్న విషయం తేల్చుకోవాలి అన్న పాయింట్ ని తీసుకున్న దర్శకుడు ఈ క్లారిటీని తన సినిమాలో మిస్సయ్యాడు.

మీరిది చూసారా..?

1. మాయాబజార్ సినిమాలో జరిగేది అర్జునుడి కొడుకు పెళ్ళి. కాని పాండవులెక్కడా కనపడరు. మీరు గమనించారా? 2. రాయలసీమకు ఆ పేరు పెట్టి ఎన్నాళ్ళో కాలేదు అంతకు ముందు దాన్ని దత్తమండలం అనేవారు. ఆ పేరెవరు పెట్టారు? 3. "బావా బావా పన్నీరు" పాట వ్రాసిందెవరు? వీటికి సమాధానాలు తెలుగు విజ్ఞాన సర్వస్వం -te.wikipedia.org. - లో ఉన్నాయి. మీరూ, నేనూ, మనవంటి వాళ్ళందరూ కలిసి సమష్టిగా రాస్తున్న సర్వస్వమిది. మనకేం తెలుసు, మనమేం రాయగలము అని అనుకోకండి. కాదేదీ కవితకనర్హం లాగా మనకు తెలిసిన ఏ విషయమూ చిన్నది కాదు. తెలుసు కాబట్టి అది మీకు చిన్నది.. కాని తెలియని నాకు...అది పెద్దదే, కొత్తదే. ఒకసారి చూడండి. మీరూ ఓ వ్యాసం రాయండి. మీ ఊరి గురించో, మీకు తెలిసిన గొప్ప వ్యక్తి గురించో, ఓ సంఘటన గురించో, చరిత్రో, సైన్సో.. ఏదైనా రాయొచ్చు..పూర్తి తెలుగులో. మీకు దాని అవసరం ఉంది. మీ అవసరం అక్కడ చాలా ఉంది.

సుబ్రమణ్యపురం

తమిళోళ్ళు సామాన్యులు కాదు. ఒక పరుతి వీరన్, ఒక కల్లూరి, ఒక ఆటోగ్రాఫ్, ఒక తమిళ్ MA. తమ నేటివిటీ కి ఈ మాత్రం లోపం రాకుండా వాస్తవానికి దగ్గరగా సినిమాలు తీస్తూ కమర్షియల్ గా విజయం సాధించడం వీళ్ళ తర్వాతే అని చెప్పొచ్చు. ప్రస్తుతం తమిళంలో సినిమాలు తీస్తున్న దర్శకుల్లో బాల, అమీర్ లు తమ సినిమాలతో ఇప్పటికే మంచి దర్శకులుగా పేరు తెచ్చుకున్నారు. వాళ్ళిద్దరి దగ్గరా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన శశికుమార్ దర్శకత్వంలో వచ్చిన సుబ్రమణ్యపురం సినిమా ఈ దశాబ్దపు ఉత్తమ సినిమాల్లో ఒకటిగా నిలుస్తుందనడంలో ఆశ్చర్యం లేదు. ఈ సినిమా కథ చెప్పి ఈ సినిమా చూడాలనుకున్న ప్రేక్షకులను నిరాశ పరచడం ఇష్టం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే “1980 లలో మధురై లోని సుబ్రమణ్యపురం లో నివసించే ఒక ఐదుగురి యువకుల కథ ఇది”. కథ, కథనం తో పాటు బ్రిలియంట్ సినిమాటోగ్రఫీ, సరైన సంగీతం ఈ సినిమాని ఒక మాస్టర్ పీస్ గా నిలబెడుతుంది.ఈ సినిమా నాకు బాగా నచ్చడానికి కొన్ని కారణాలు: 1. కథ మొదలైన తీరు నచ్చకపోయినా సినిమా ముగిసే సరికి కథ అలానే మొదలవ్వాలని దర్శకుడు కన్విన్స్ చేయగలగడం. 2. అంతా కొత్త వారైనా ప్రతి నటుడూ తమ పాత్రను అధ్భుతంగానే కాదు అవలీలగా పోషించారు. 3. ఈ సినిమాలో హీరో లంటూ ఎవరూ లేకపోవడం. 4. 1980 కాలాన్ని అత్యంత నేర్పుగా రిక్రియేట్ చేయడం. 5. కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో ఒక సినిమా తీసి దాన్ని బ్లాక్ బస్టర్ గా మలచిన తీరు. 6. మన టివిల్లో యాంకర్ గా ఒక వాగుడుకాయగా పరిచయమున్న స్వాతి కళ్ళతోనే గొప్ప నటన ప్రదర్శించింది. 7. పరుతి వీరన్, కల్లూరి, తమిళ్ MA సినిమాలలో క్లైమాక్స్ సెన్సేషనలైజ్ చేయకుండా ఈ సినిమా క్లైమాక్స్ కేవలం అంతకముందు జరిగిన సంఘటనల natural consequence గా మాత్రమే వుంటుంది. 8. వయొలెన్స్ అధికంగా వున్న సినిమా అయినా ఈ సినిమాలో అధిక శాతం వయొలెన్స్ మన మైండ్ లో ఊహించుకుంటాం కానీ తెరపై మనకి కనిపించదు. 9. ఈ సినిమాలో అణువణువనా వ్యక్తమయ్యే రియలిజం. 10. మొదటి పదిహేను నిమిషాలు తప్పితే ఊపిరి సలుపుకోలేని వేగంతో నడిచే కథనం. ఒక వేళ మీకు పరుతి వీరన్, ఆటోగ్రాఫ్, కల్లూరి లాంటి సినిమాలు నచ్చుంటే ఈ సినిమా కూడా మీకు తప్పకుండా నచ్చుతుంది. ఒక వేళ మీకా సినిమాలు నచ్చకపోతే ఈ సినిమా మీకు గ్యారంటీగా నచ్చుతుంది. ఇంకా కాదు అంటే మీకు పల్ప్ ఫిక్షన్, సిటీ ఆఫ్ గాడ్స్ నచ్చి వుంటే ఈ సినిమా మీకు తప్పకుండా నచ్చుతుంది. ఒక వేళ మీకా సినిమాలు నచ్చలేదంటే దయచేసి ఈ సినిమా కి దూరంగా వుండండి.ఈ సినిమా మీలాంటి టేస్ట్ లేని వాళ్ళకు కాదు.

rock on

నాలాగ మీకు ఇండియన్‌రాక్ లో ఏ కొంచెం ఆసక్తి వున్నా, ఈ సినిమా ‘GOD’ సినిమా అనిపించి తీరుతుంది. ఈ సినిమాలో లోట్లు వున్నాయి కానీ, నేను సినిమాలో ఎంత మైమరచి పోయానంటే, అవన్నీ ఏం తట్టలేదు. ఇప్పుడు ఆలోచిస్తే, సినిమాలోని కొన్ని లోట్లు, ౧) జో నౌక ఎక్కడానికి వెళ్తూంటే, కారు సరిగ్గా వీళ్ళ కాంసెర్ట్ ముందు ఆగడం. ముంబాయి లాంటి మహానగరాల్లో ఇలాంటిది జరగడం, కొంత కష్టమే. ౨) రాబ్ కి బ్రెయిన్ ట్యూమర్ పెట్టడం కొద్దిగా పాత సినిమా తరహాలో వుంది. కానీ కథలో కాంప్లికేషన్ కోసం ఇలాంటిది చేయాల్సివుంది. నాకీ రెండే తడుతున్నాయి. ఇంకా చిన్న చిన్నవి వున్నా, వాటిని పెద్దగా పట్టించుకోనక్కరలేదు. ఇక ఫర్హాన్ , రాంపాల్ పాత్రల విషయమై, ఫర్హాన్ పాత్ర ఆదిత్యలో కంటే, అర్జున్ పాత్ర జోలోనే ఎక్కువ డెప్త్ వుంది. ఆదర్శాలు ఎక్కువ వున్న పాత్ర జో. కాబట్టి ఎప్పటికైనా ఆ పాత్రకే మంచి గుర్తింపు వస్తుంది. ఈ సినిమా అర్జున రాంపాల్ కి మంచి గుర్తుంపునివ్వాలి. ఫర్హాన్ కూడా మరీ అతిగా చేయకండా, మిగిలిన నటులకు తగిన ప్రాముఖ్యతనిచ్చాడు. ఇక మంచి విషయాలు చెప్పవస్తే, ౧) ఇండియన్-రాక్ ఇష్టముంటే, ఈ సినిమాలో సంగీతం చాలా చాలా బాగుంటుంది (నా అభిప్రాయం - నేనైతే సీడి కొన నిశ్చయించాను), మీరు రెహమాను సంగీతమో, ఇళయరాజ సంగీతమో ఆశించివెళితే, కాస్తంటే కాస్త నిరాశ కలుగవచ్చు. ౨) స్క్రిప్టు - ఆదిత్యకి అతని భార్యకి మధ్య సంఘర్షన చాలా బాగుంది. అలానే, బ్యాండులో చిన్నచిన్న చీలికలు వచ్చి అవి పెద్దగా మారడాన్ని చాలా నెమ్మదిగా సహజంగా చిత్రీకరించారు. (మన అత్తకోడళ్ళ మధ్య ఒక పూటలో గొడవలు జరగడం లాంటిది కాకుండ.) ౩) కెడి, రాబ్ ల సంబంధం వారి పాత్రల చిత్రీకరణ చాలా బాగున్నాయి. ౪) మన తెలుగు సినిమాల్లో, హీరో గారు ఏదో వాయిస్తూవుంటారు, అక్కడ సంగీతం ఏదో వస్తూంటుంది. అలా కాకుండా, చాలా సహజంగా వుంది, రాంపాల్ గిటారు వాయించడం, మఱియు కెడి డ్రమ్ములు వాయించడం. ౫) నాన్ లీనియర్ కథనం - ఈ తరహా కథనం చాలా కష్టం, గమ్యంలో క్రిష్ ఇలాంటిది ప్రయత్నించాడు కాని, అంత సఫలమవ్వలేదు. అదీ పదేళ్ళు వెనక్కి తీసుకెళ్ళడమంటే, ఇంకా కష్టమవుతుంది. (జుట్టూ మీసాలు పెంచేస్తే సరిపోదు). ఈ సినిమాలో ఈ టెక్నిక్ ని చాలా బాగా ఉపయోగించుకున్నారు. ౬) కాంసెర్ట్ సన్నివేశాలన్నీ చాల సహజంగా వచ్చాయి. ఇంగ్లీషు సినిమాల్లోలాగ (వాసు సినిమాలోలో కాకుండ). స్థూలంగా చెప్పాలంటే, ఈ సినిమాలోని సాంకేతికాంశాలను చాలా పటిష్ఠంగా ఉంచుతూనే, చాలా మంచి అనుభూతిని కలిగించింది. దీన్ని మాస్టర్ పీస్ అని అనలేమేమోగాని, ఒక కొత్త పుంత త్రొక్కి అందులో చాలా దూరం వెళ్ళవచ్చని నిరూపించిన సినిమా ఇది. ‘దిల్ చాహతా హైఁ’ కంటే ఒక పదడుగులు ముందుకు వేసింది. వీలైతే ఈ సినిమా చూడండి, లేకుంటే డీవీడి కొనండి. సినిమాలో చెప్పినట్లు అక్రమంగా దిగుమతి చేసుకోవద్దు. (ఇది అష్టా-చెమ్మా కు కూడా వర్తిస్తుంది.)

charitra