Rss Feed

తేనీరు


ఉత్పత్తి

దాదాపు ప్రతి దేశంలోనూ టీ వినియోగంలో ఉన్నా భారతదేశం ఉత్పాదించే టీ వైవిధ్యానికీ, విశిష్టతకూ ప్రసిద్ధి పొందింది. పశ్చిమ బెంగాల్ లోని డార్జిలింగ్ టీ మిక్కిలి నాణ్యమైనది. ఇది సువాసనభరితమైనది. ముఖ్యంగా ఇక్కడి మంచుతో కూడిన హిమాలయ పర్వత వాతావరణ పరిస్థితుల వల్ల మరియు ఈ ప్రదేశంలో భూసార రచనా విధానం వల్ల ఇక్కడ ఉత్పత్తి కాబడే టీకి ప్రత్యేక రుచి, సువాసన సిద్ధిస్తుంది. భారతదేశంలో టీ వ్యవసాయం ప్రాతిపదికగా అనేక మందికి జీవనోపాధిని కల్గిస్తోంది. ఈ రంగంలో సుమారు 2 మిలియన్ల మంది ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ శ్రామికులు ఉన్నారు. వీరిలో 50 శాతం స్త్రీలు.

చరిత్ర

4వ శతాబ్దంలో ఒక చైనా వైద్యుడు ఆకులను త్రుంచి, ఎండబెట్టి, ఒక ప్రత్యేక ఉష్ణోగ్రతకు వేడి చేసి, వేడి నీటిలో నానబెట్టగా వచ్చిన చేదు డికాక్షను వైద్య పరీక్షకు త్రాగాడు. ఈ టీ డికాక్షను త్రాగినందువల్ల ఇతడు ఉత్తేజాన్ని పొందాడు. టీ సేవన ద్వారా మొట్టమొదటగా ఉత్సాహాన్నీ, ఆనందాన్నీ పొందిన వ్యక్తి ఇతనే. [1]15వ శతాబ్దంలో నాగరిక ప్రపంచంలో టీ త్రాగడం ప్రారంభమయ్యింది. 17వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపనీ వినిమయ పద్ధతిలో బట్టలు, వెండికి మరియు అనధికార యుక్తంగా నల్లమందుకు బదులుగా టీని చైనా నుండి దిగుమతి చేసుకునేది. చాలాకాలం తర్వాత 1823లో బ్రిటన్‌కు చెందిన బ్రూస్ సోదరులు అస్సాంలో దేశీయ కనిపెట్టినప్పుడు భారతదేశంలో టీ ఉత్పాదన ప్రారంభమయ్యింది. విస్తారంగా టీ ప్రవృద్ధి చెందే ప్రాంతాలను వీరు కనుగొన్నారు. ఇవి సింగ్‌ఫో జాతులు తోటల పెంపకంలో మిగిలినవై ఉండవచ్చు. ఈ కొండ ప్రదేశాలలో జనులు టీ ఆకులతో చేసిన నాటు సారాను త్రాగుతూ ఉండేవారు. మొట్టమొదట 1838లో దిబ్రుఘర్ నుంచి 8 పెట్టెలు ఎగుమతి చేయబడ్డాయి. ఈ బ్లాక్ టీ సౌచోంగ్ మరియు పీకో అని రెండు గ్రేడులుగా చాలా ప్రసిద్ధి పొందింది. చైనాతో 1833లో ఏస్ట్ ఇండియా కంపెనీ గుత్తాధిపత్య వ్యాపార సంబంధాలు చెడిపోయినప్పుడు ఇంగ్లాండు భారతదేశంలో టీ ఉత్పాదనకు తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించింది. 1860 నాటికి భారతదేశంలో టీ ప్లాంటేషన్ తోటలు బాగా అభివృద్ధి చెందినప్పుడు ఇక్కడే టీ ఉత్పాదన సుమారు ఒక మిల్లియన్ కేజీలు ఉండేది.
చైనా నుండి బ్లాక్ మరియు గ్రీన్ టీ రకాల్ విత్తనాలను లార్డ్ మెకార్డెనీ తెప్పించి భారతదేశంలో 1793లో కలకత్తా బొటానికల్ గార్డెన్స్‌లో ప్రవేశపెట్టాడు. ఇవి పశ్చిమ బెంగాల్ కచార్ మరియు నీలగిరి ప్రదేశాలలో నాటబడ్డాయి. నేడు భారతదేశంలో సగానికి సగం టీ మొక్కలు ఆ తోటల పెంపకానికి చెందినవే. ఆ తరువాత అనతికాలంలో 1860కి చైనా టీ ఇక్కడి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రవృద్ధిపొందింది. నేడు అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ భారతదేశంలో టీని అధికంగా ఉత్పాదించే రాష్ట్రాలుగా ప్రసిద్ధిపొందాయి. ఇవి మొత్తం సుమారు 98 శాతం టీని ఉత్పాదిస్తున్నాయి. భారతదేశపు టీ ఉత్పాదక ప్రదేశాలలో త్రిపుర, కర్ణాటక, మణిపూర్, సిక్కిం, మరియు అరుణాచలప్రదేశ్ ముఖ్య పాత్రను వహిస్తున్నాయి. నీలగిరి కొండలలో భారతదేశపు ఉత్తమ రకం టీ ఉత్పాదించబడుతుంది. సతతహరితపు మొక్కైన టీకి వర్షపాతం అధికంగా ఉండాలి. అప్పుడే అది పుష్కలంగా, సమృద్ధిగా పెరుగుతుంది. దిగుబడి అధికంగా ఉంటుంది. సముద్ర మట్టానికి ఎత్తుగా ఉండే ప్రదేశాలలో పెరిగే టీ ఉత్తమమైనది. కానీ మైదానాలలో పెరిగే టీ వల్ల అధిక ఫలసాయం వస్తుంది.
చైనా మరియు జపాన్‌లలో టీ త్రాగడం విస్తారమైన తంతుతో కూడిన ఒక గొప్ప ఉత్సవం (Tea Ceremony)గా పరిణమించింది. అక్కడ టీ డికాక్షను కాచి పంచదార, పాలు కలపకుండా త్రాగుతారు. ఒక్కొక్కప్పుడు నిమ్మరసం, పంచదార కలిపి త్రాగుతారు. అమెరికాలో సామాన్యంగా టీలో ఐస్ వేసి, పంచదారతో త్రాగుతారు. భారతదేశం మరియు బ్రిటన్‌లలో పాలు, పంచదార కలిపి త్రాగుతారు. టిబెటియన్‌లు గ్రీన్ టీని ఉప్పు మరియు యాక్ వెన్నతో కొయ్య కప్పులలో త్రాగుతారు. ఆఫ్రికాలో డికాక్షనును చిలికి నురగగా తయారు చేసి త్రాగుతారు. పశ్చిమ ఆసియాలో టీని యాలకులతో కలిపిన డికాక్షన్‌తో త్రాగితే భారతదేశంలో గుజరాతీలు మసాలా టీ త్రాగుతారు. బ్లాక్ లేక గ్రీన్ టీని ఏలకులు, కొట్టిన బాదంపప్పు కలిపి కహ్వా అని కాశ్మీరులు త్రాగుతారు. ఇది చాల పుష్టికరమైన రుచికరమైన పానీయం.


నల్ల తేనరసాయనిక విశ్లేషణ
టీ సహజమైన పానీయం. దీనిలో రసాయనిక పదార్ధాలుగానీ, కృత్రిమ వాసల ద్రవ్యాలుగానీ, ఇతర రంగులుగానీ చేరి ఉండవు. ఇది ఆరోగ్యదాయకమైన మరియు శక్తిదాయకమైన పానీయం. దీనిలో విటమిన్లు ముఖ్యంగా బీ గ్రూప్ విటమిన్లు, రిబోఫ్లేవిన్ మరియు నియాసిన్ ఉంటాయి. దీన్లో అతి తక్కువగా లభించే కెఫీన్ మానవ శరీరానికి ఆరోగ్యకరమైనది. అపాయకారి కాదు.
వయసుతో నిమిత్తం లేకుండా టీని సేవించడం ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. ఒకప్పుడు అతిధులకు మర్యాదపూర్వకంగా ఇచ్చే టీ ఈనాడు త్రాగే నీరులాగా అతి సాధారణ పానీయం అయ్యింది. ఇక్కడబడితే టీ దుకాణాలు వెలవడం పజలు ఈ పానీయానికి ఎంతగా అలవాటుపడ్డారో తెలుపుతుంది.

జ్యోతిబసు

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సుధీర్ఘకాలం పాటు పనిచేసి దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు స్చంతంచేసుకున్న జ్యోతిబసు ( Jyoti Basu) జూలై 8, 1914న కోల్కతాలో జన్మించాడు. కమ్యూనిస్టు (మార్క్సిస్టు) పార్టీ కి చెందిన జ్యోతిబసు 1977 నుండి 2000 వరకు వరుసగా 5 సార్లు ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టినాడు. అంతకు ముందు 1967-69 కాలంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు. సి.పి.ఐ.పోలిట్ బ్యూరో నిర్ణయం వల్ల 1996లో దేశ ప్రధానమంత్రి అయ్యే అవకాశాన్ని కోల్పోయినాడు. 2000లో మఖ్యమంత్రి పదవి నుండి వైదొలిగిన జ్యోతిబసు జనవరి 17, 2010న 96 సంవత్సరాల వయస్సులో మరణించాడు. 

బాల్యం


జ్యోతిబసు జూలై 8, 1914న కోల్‌కతలో బెంగాలీ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి నిశికాంత్ బసు వైద్యుడిగా పనిచేసేవాడు. తల్లి హేమలతా బసు. స్థానికంగా కలకత్తా (ఇప్పటి కోల్‌కత) లోనే జ్యోతిబసు విద్యాభ్యాసం కొనసాగింది. ఇతని అసలుపేరు జ్యోతికిరణ్ బసు కాగా పాఠశాల దశలో ఉన్నప్పుడు తండ్రి జ్యోతిబసుగా పేరును తగ్గించాడు. ప్రెసిడెన్సీ కళాశాల జ్యోతిబసు తన డిగ్రీ పూర్తిచేశాడు. ఉన్నత చదువుల కోసం 1935లో ఇంగ్లాండు బయలుదేరాడు. ఇంగ్లాండులో న్యాయశాస్త్రంలో విద్యనభ్యసించుదశలోనే గ్రేట్బ్రిటన్ కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షితుడై రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నాడు. 1940లో యాయశాస్త్రవిద్య పూర్తిచేసుకొని మిడిల్ టెంపుల్ వద్ద బారిస్టర్‌గా అర్హత పొందినాడు. అదే సంవత్సరంలో భారతదేశానికి తిరిగివచ్చాడు. 1944లో ట్రేడ్ యూనియన్ ఉద్యమాలలో పాలుపంచుకొని ఆ తరివాత యూనియన్ ప్రధానకార్యదర్శి అయ్యాడు.
akira kurasowa

వ్యూ ప్రమ్ ఎ గ్రెయిన్ ఆఫ్ శాండ్



ముగ్గురు ఆప్ఘన్ మహిళల జీవితాల నేపధ్యంలో 30 సంవత్సరాల ఆప్ఘనిస్తాన్ చరిత్రను పరామర్శిస్తూ మీనా నాన్జి వ్యూ ప్రమ్ ఎ గ్రెయిన్ ఆఫ్ శాండ్ అనే అద్భుతమైన డాక్యుమెంటరీ చిత్రాన్ని తీశారు. దీన్ని తెలుగులో "ఇసుక తిన్నెలమీంచి చూసినప్పుడు" అని పిలిస్తే అర్థవంతంగా ఉంటుంది.

ఆప్ఘనిస్తాన్ గురించి ఎవరు ఆలోచించినా అక్కడి మహిళల దుస్థితే మొదటగా మనసులోకి వస్తూంటుంది. ఆప్ఘన్ మహిళల ప్రస్తుత పరిస్థితి ఏమిటి... వాళ్ల జీవితాలు ఇప్పుడెలా ఉన్నాయి... కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారి పరిస్థితి నిజంగా మెరుగుపడిందా... వాళ్లకు నిజమైన హక్కులు ప్రస్తుతం ఉన్నాయా.. లేదా ఇప్పటికీ వారు భయం, అణచివేత నేపధ్యంలోనే బతుకుతున్నారా.. ఇలా అనేక ప్రశ్నలు పొడుచుకుని వస్తుంటాయి.
ఇసుక తిన్నెల మీదనుంచి...
30 సంవత్సరాల క్రమంలో యుద్ధంతో ఛిన్నాభిన్నమైన ఆప్ఘనిస్తాన్ ఆకాశంలో సగభాగం దుర్భరస్థితిని, మనోధైర్యాన్ని సజీవంగా చిత్రించిన ఈ లఘుచిత్రం "వ్యూ ప్రమ్ ఎ గ్రెయిన్ ఆఫ్ శాండ్" పలు అంతర్జాతీయ చిత్రోత్సవాలలో లెక్కలేనన్ని అవార్డులు దక్కించుకుంది.


"ఇసుక తిన్నెల మీదనుంచి చూసినప్పుడు" అనే అర్థం గల ఈ సినిమా ముగ్గురు ఆప్ఘన్ మహిళల కళ్లలోంచి ఈ సమస్యలను పట్టి పరిశీలిస్తుంది. వారు ఓ డాక్టర్, ఓ టీచర్, ఓ హక్కుల కార్యకర్త. అంతర్జాతీయ శక్తులు పురికొల్పిన యుద్ధాల ద్వారా ఆప్ఘనిస్తాన్‌లో మూడు వేరువేరు ప్రభుత్వాల హయాంలో తమ జీవితాలు ఎంత హింసాత్మకంగా మారిందీ ఈ ముగ్గురు మహిళలూ కళ్లకు కట్టినట్లుగా చూపిస్తారు.

ఈ హింసా కొనసాగింపులో వారి జీవితాలు కదిలిపోయినప్పటికీ, తమ ఇళ్లు, తమ దేశం సైతం ధ్వంసం అయిపోయినప్పటికీ, ఈ ముగ్గురు మహిళలూ మొక్కవోని ధైర్యసాహసాలతో, చెరగని విశ్వాసంతో తమ చుట్టూ ఉన్న ప్రజల జీవితాలను మెరుగుపర్చడానికి తమ పనిలో కొనసాగుతున్న వైనాన్ని ఈ డాక్యుమెంటరీ చిత్రం అత్యద్భుతంగా చిత్రించింది.

వాయవ్య పాకిస్తాన్‌లోని శరణార్థి శిబిరాలలో, తర్వాత యుద్ధంతో ఛిన్నాభిన్నమైన కాబూల్ నగరంలో గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న పరిస్థితుల వివరణతో ప్రారంభమయ్యే ఈ చిత్రం గత 30 సంవత్సరాలుగా అంటే రాజు జహీర్ షా పాలన నుంచి మొదలై ప్రస్తుత హమీద్ కర్జాయ్ ప్రభుత్వం వరకు ఆప్ఘన్ మహిళల భయానకమైన, ఆలోచనలను రేకెత్తించే దుర్భర జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది.

కొనసాగుతున్న పోరాటంలో ఈ మహిళలు తమ శక్తినంతటినీ కూడదీసుకుని ఎలా నిలబడుతున్నారో ఈ చిత్రం అతి స్పష్టంగా చూపిస్తుంది. ఇప్పటికీ విభజించబడిన, పైశాచిక స్థితికి వెళ్లిన ఆప్ఘన్ జాతీయ చిత్రణను ఈ చిత్రం చూపరులను హత్తుకునేలా చూపించింది.

మొత్తం ప్రపంచం ఇప్పుడు మరో సంక్షోభం మీద దృష్టి పెడుతున్న నేపధ్యంలో, ఈ డాక్యుమెంటరీ ప్రాజెక్ట్ ఆప్ఘనిస్తాన్‌పై కెమెరాను సారించి ఆప్ఘన్‌లో జీవన సంఘర్షణలో మునిగి తేలుతున్న మహిళల విలువైన స్వరాలను ప్రపంచానికి గుర్తు చేస్తోంది.

30 సంవత్సరాల క్రమంలో యుద్ధంతో ఛిన్నాభిన్నమైన ఓ జాతిలో సగభాగం దుర్భరస్థితిని, మనోధైర్యాన్ని సజీవంగా చిత్రించిన ఈ లఘుచిత్రం "వ్యూ ప్రమ్ ఎ గ్రెయిన్ ఆఫ్ శాండ్" పలు అంతర్జాతీయ చిత్రోత్సవాలలో లెక్కలేనన్ని అవార్డులు దక్కించుకుంది.

చిత్ర దర్శకురాలు మీనా నాన్జి వివరాలు
ఈ చిత్ర దర్శకురాలు మీనా నాన్జి గత పదేళ్లుగా ఫిల్మ్ వీడియోలో పనిచేస్తున్నారు. తన ప్రయోగాత్మక చిత్ర నిర్మాణానికి గాను ఆమె అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. నేషనల్ ఎండోమెంట్ ఫర్ ది ఆర్ట్స్, రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్ మీడియా ఫెలోషిప్, ది లాస్ ఏంజెల్స్ కల్చరల్ ఎఫైర్స్ డిపార్ట్‌మెంట్, పాల్ రాబ్సన్ ఫండ్ గ్రాంట్, ఇండిపెండెంట్ ఫిల్మ్ వీడియో ప్రొడక్షన్ గ్రాంట్, వంటి పలు సంస్థలు ఈమె సృజనాత్మక ప్రతిభకు అవార్డులతో సత్కరించాయి.

ఆమె దర్శకత్వంలో వచ్చిన సినిమాలు అంతర్జాతీయ చిత్రోత్సవాలలో పలు అవార్డులను సాధించాయి. అలాగే అమెరికా, యూరోపియన్ టెలివిజన్లలో పిబిఎస్ స్టేషన్లద్వారా విస్తృత ప్రదర్శనకు నోచుకున్నాయి.


http://www.youtube.com/watch?v=2a9JUh6LtBg

మహాప్రస్థానం' మతలబులు

-

జూన్ పదిహేను మహాకవి శ్రీశ్రీ వర్ధంతి. శ్రీశ్రీ పేరు చెప్పగానే మనకు వెంటనే గుర్తువచ్చేది 'మహాప్రస్థానం'. అర్థ శతాబ్దం పైగా పూర్తి చేసుకున్న, తెలుగు కవిత్వ గతిని పూర్తిగా మార్చేసిన ఈ పుస్తకాన్ని గురించి నేను నోట్ చేసుకుని పెట్టుకొన్న కొన్ని పాఠకులకు ఆసక్తికరంగా ఉంటాయని ఈ క్రింద పొందుపరుస్తున్నాను:

* శ్రీశ్రీ 'మహాప్రస్థానం' గీతం మొట్టమొదట ముద్దుకౄష్ణ నడిపిన 'జ్వాలా పత్రికలో ప్రచురితమైంది ("మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది! పదండి ముందుకు, పదండి ముందుకు,పోదాం, పోదాం పైపైకి!" అని సాగుతుందీ గీతం)

* 'మహాప్రస్థానం' ప్రచురణకు శ్రీశ్రీకి ఆర్థిక సహాయం చేసింది, మచిలీపట్నం వాస్తవ్యుడైన ఆయన మిత్రుడు నళినీకుమార్ (అసలు పేరు ఉండవల్లి సూర్యనారాయణ). మదరాసులో ఉండగా శ్రీశ్రీకి అతడితో పరిచయమైంది.

* 'మహాప్రస్థానం' మొదటి ప్రచురణ 1950 జూన్ లో జరిగింది. ఇప్పటికిది మరో 23 ప్రచురణలు పొందింది (ఇది ఇటీవలే నేను కొన్న 'మహాప్రస్థానం' ప్రతిపైన ఉన్న వివరాల ఆధారంగా ఇచ్చిన సమాచారం. తప్పైతే సవరించండి)

* 'మహాప్రస్థానం' పుస్తకంలో మొత్తం 40 కవితలున్నాయి (కొంపెల్ల జనార్థనరావుకోసం రాసిన అంకిత గీతం కాకుండా)

* 'మహాప్రస్థానం'లోని గేయాలన్నీ 1933-1940 మధ్యకాలంలో రాసినవి ("నిజంగానే" "గర్జించు రష్యా" 1941లో, "నీడలు" 1947లో రాసినవి. అది (1930 దషకం) ఆకలి బాధలు, ఆర్థికమాంద్యం ప్రపంచాన్ని పీడిస్తున్న సమయం. ఈ దషాబ్దాన్ని (1930-40) చరిత్రకారులు "హుంగ్ర్య్ ఠిర్తిఎస్" అని అభివర్ణించారు.

* శ్రీశ్రీ తను ఆ కాలంలో రాసిన గేయాలన్నిటినీ ఈ సంపుటిలో చేర్చలేదు. ప్రపంచవ్యాప్తంగా మానవజాతి ఎదుర్కొంటున్న బాధలు ప్రధానేతివౄత్తంగా ఉండే గేయాల్నే చేర్చాడిందులో.

* శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని లండన్ లో స్థిరపడిన డాక్టర్ గూటాల కౄష్ణమూర్తి 'విదేశాంధ్ర ప్రచురణలా పేరుతో శ్రీశ్రీ సొంత దస్తూరిలో 1981లో విడుదల చేశారు. పుస్తకంతోపాటు శ్రీశ్రీతో స్వయంగా చదివించి రికార్డు చేసిన 'మహాప్రస్థానం' గీతాల క్యాసెట్టును కూడా విడుదల చేశారు. ఈ కౄషి వెనుక పురిపండా అప్పలస్వామి ప్రమేయం చాలా ఉంది.

* "మహాప్రస్థానం అన్న గీతం రాసేనాటికి నాకు మార్క్సిజం గురించి తెలియనే తెలియదు. నేను మార్క్సిజంను తెలుసుకున్నది సాహిత్యం ద్వారానేగాని, రాజకీయాలద్వారా కాదు." అని శ్రీశ్రీ 1970 ఫిబ్రవరిలో "సౄజన" పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పారు.

* 'మహాప్రస్థానానీకి చలంతో ముందుమాట (యోగ్యతాపత్రం) రాయించటానికి ప్రేరేపకుడు జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి (జరుక్ శాస్త్రి)

* 'మహాప్రస్థానం' సంపుటిలోని 'ప్రతిజ్ఞా గేయానికి మూలం లండన్ అభ్యుదయ రచయితల మానిఫెస్టో. దాని కాపీ ఒకటి అబ్బూరి రామకౄష్ణారావుగారు ఇస్తే అది చదవగానే ఆ స్ఫూర్తితో శ్రీశ్రీ ఈ గేయం రాశారు.

* 'దేశచరిత్రలూ గేయానికి 'జ్వాలా పత్రికలో ముద్దుకౄష్ణ రాసిన ఒక సంపాదకీయం ప్రేరణ (ఏ దేశచరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం...)

* 'మహాప్రస్థానం' ముందుమాటకి చలం పెట్టిన పేరు 'మహాప్రస్థానానికి జోహార్లూ అని. దాన్ని శ్రీశ్రీ 'యోగ్యతాపత్రం' అని మార్చుకున్నాడు. చలం అనుమతితోనే మరొక మార్పు కూడా చేశాడు. చలం రాసిన ముందుమాటలో 'శ్రీశ్రీ కవిత్వమూ, పాల్ రాబ్సన్ సంగీతమూ ఒకటేరకం అంటుంది సౌరిస్. ఆ రెంటికీ హద్దులూ, ఆజ్ఞలూ లేవు...' అని ఉంటుంది. నిజానికి చలం పాల్ రాబ్సన్ పేరు స్థానంలో 'సైగళ్ అని రాశాడు. సైగల్ పేరు తీసేసి, ఆ స్థానంలో పాల్ రాబ్సన్ పేరును చేర్చాడు శ్రీశ్రీ. పాల్ రాబ్సన్ అమెరికాలోని గొప్ప నీగ్రో గాయకుడు, వామపక్ష అభిమాని.

* శ్రీశ్రీ 'మహాప్రస్థానం' కవితా సంపుటిని హిందీలోకి డాక్టర్ సూర్యనారాయణ 'భానూ అనువదించారు. 1984లో ఇది ప్రచురింపబడింది.

* 'మహాప్రస్థానం'లోని 'చేదుపాటా కవితను జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి చదివి వింపించగా, చలం కన్నీళ్ళు పెట్టుకున్నాడట (ఔను నిజం, ఔను నిజం, ఔను నిజం, నీవన్నది, నీవన్నది, నీవన్నది నిజం, నిజం...)

* ఒక బహిరంగసభలో శ్రీశ్రీ చదివిన 'కవితా ఓ కవితా' అనే గేయాన్ని విష్వనాథ సత్యనారాయణ విని, పులకరించి, లేచి శ్రీశ్రీని కౌగిలించుకుని, ఆ గేయాన్ని నేనే ప్రచురిస్తానని వాగ్దానం చేశాడు. కాకపోతే ఆయన ఆ మాటను నిలబెట్టుకోలేకపోయాడు (కవితా! ఓ కవితా! నా యువకాశల నవపేశల సుమగీతావరణంలో...)

* శ్రీశ్రీ 'మహాప్రస్థానం' గేయాల్ని దేవులపల్లి, అడివి బాపిరాజు మొదలైన ప్రముఖులు బహిరంగసభల్లో ఆలాపించిన సందర్భాలు ఉన్నాయి.

* శ్రీశ్రీ తన సాహిత్య ప్రథమ గురువుగా చెప్పుకున్న అబ్బూరి రామకౄష్ణారావుగారు 1956లో తన మహాప్రస్థాన రచనావిధానాన్ని, అందులో ప్రతిపాదించిన సిద్ధాంతాలనూ వెక్కిరిస్తూ, ఖండిస్తూ ఓ కవిత రాశాడు (ఇది కేంద్ర సాహిత్య అకాడెమీ శ్రీశ్రీపై ప్రచురించిన మోనోగ్రాఫ్ లో బూదరాజు రాధాకౄష్ణగారు రాశారు, కాని, ఆ కవిత ఏమిటో చెప్పలేదు. ఎవరైనా సేకరిస్తే బాగుంటుంది)

* కొసమెరుపు - 'మహాప్రస్థానం' గేయాల్ని మొదట 'భారతీ పత్రికకు పంపిస్తే అవి తిరిగొచ్చాయి.

['మహాప్రస్థానం' లోని గీతాలను చాలా తెలుగు సినిమాల్లో ఉపయోగించుకున్నారు. వాటి వివరాలు ఎవరైనా సేకరించి ఉంటే తెలుపగలరు]

విశ్వనాథ్ బాబు

హనుమప్ప విశ్వనాథ్ బాబు (1903-1968) 1930వ దశకములో ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు. సరస్వతి టాకీస్ అనే చిత్రనిర్మాణ సంస్థను ప్రారంభించి అనేక తెలుగు సినిమాలు నిర్మించాడు. విశ్వనాథ్ బాబు మార్చి 27, 1903న బెంగుళూరులో జన్మించాడు. ఈయన బావ హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వం వహించిన తొలి తమిళ టాకీ సినిమా కాళిదాసులో నటించాడు. చిత్ర సమాహారం * దేవసుందరి * ఆదర్శం (1952 సినిమా) * ధర్మాంగద * కృష్ణప్రేమ * భోజ కాళిదాసు * ద్రౌపదీ వస్త్రాపహరణం * కనకతార (1937 సినిమా)

హెచ్.ఎమ్.రెడ్డి

తొలి తెలుగు సినిమా ‘భక్త ప్రహ్లాద’, తొలి తమిళ టాకీ చిత్రం కాళిదాసు తీసినవారు హెచ్‌.ఎమ్‌.రెడ్డి. ఆయన పూర్తిపేరు హనుమప్ప మునియప్ప రెడ్డి. హెచ్.ఎమ్.రెడ్డి బెంగుళూరులో పుట్టి పెరిగి, అక్కడే విద్యాభ్యాసం పూర్తిచేసుకున్నాడు. బెంగుళూరులో పోలీసుగా పనిచేశాడు.[1] ఆయన హైదరాబాదు జాగీర్దార్‌ కాలేజీలో ఇంగ్లీషు టీచరుగా పనిచేసేవారు. 1927లో ప్లేగువ్యాధి ప్రబలినపుడు చాలా కుటుంబాల వలెనే వూరువిడచి బొంబాయి వెళ్ళారు. తన బావమరిది హెచ్‌.వి.బాబు అండలో సినిమా రంగంలో ప్రవేశించారు. అక్కడక్కడా వేషాలు వేస్తూ సినిమా టెక్నిక్‌ను కొంతవరకూ అర్థం చేసుకున్నారు. 1930లో ఇంపీరియల్‌ కంపెనీకి ‘విజయకుమార్‌’, 1931లో ‘ఎ వేజర్‌ ఇన్‌ లవ్‌’ అన్న రెండు మూకీలను హెచ్.ఎమ్.రెడ్డి డైరెక్ట్‌ చేశారు. రెండు చిత్రాల్లోనూ పృథ్వీరాజ్‌ కపూర్‌ ముఖ్యపాత్రధారి. అలా - శబ్దరహిత చిత్రాలు తీసి హెచ్‌.ఎమ్‌.రెడ్డి, 1931లో శబ్దసహిత చిత్రాలు తీశారు. హిందీలో తొలి టాకీ ‘ఆలం ఆరా’ అర్దేషిర్‌ ఇరానీ తీశాడు. ఆయనకి తెలుగులోనూ, తమిళంలోనూ కూడా చిత్రాలు తియ్యాలనిపించింది. హెచ్‌.ఎమ్‌.రెడ్డి తెలుగువాడు గనక ‘భక్తప్రహ్లాద’ని ఆయనకు అప్పజెప్పారు. అలాగే ‘కాళిదాసు’ కూడా తమిళంలో తీశారు రెడ్డి. హిందీ, తెలుగు, తమిళం మూడు భాషల చిత్రాలూ 1931 లోనే విడుదలైనాయి. ‘ఆలం ఆరా’ మార్చి 14న విడుదలైంది. ‘భక్త ప్రహ్లాద’ సెప్టెంబరు 15న విడుదలయ్యింది. అలా హెచ్‌.ఎమ్‌.రెడ్డి టాకీయుగానికి నాంది పలికి, ‘పితామహుడు’అనిపించుకున్నారు. రెడ్డిగారిని ‘టైగర్‌’ అనేవారు. మీసం మీద చెయ్యి వేసి ఈ పక్కా ఆ పక్కా దువ్వి ‘ఇది తమిళం ఇది తెలుగు’ అని దర్జాగా, గర్వంగా చెప్పుకోగల ఘనుడు హెచ్‌.ఎమ్‌.రెడ్డి. తర్వాత ‘సీతాస్వయంవరం’ (1933) చిత్రం హిందీలో తీశారు. రెడ్డి కొల్హాపూర్‌లో వున్నప్పుడు పారుపల్లి శేషయ్య, కూరుకూరు సుబ్బారావు ‘ద్రౌపదీ వస్త్రాపహరణం’ (1936) తియ్యాలని, ఆయన సహాయం కోరారు. హెచ్‌.వి. బాబు చేత ఆయన దర్శకత్వం చేయించి - తాను పర్యవేక్షణ చేసి పూర్తి చేయించారు. ఆ చిత్రం విజయవంతమైంది. గూడవల్లి రామబ్రహ్మం ఈ సినిమాకి ప్రొడక్షన్‌ మేనేజరుగా సినిమా రంగప్రవేశం చేశారు. అంతకుముందు రెడ్డిగారు తీసిన ‘ప్రహ్లాద’ నుంచి కొన్ని చిత్రాల వరకు ఎల్.వి.ప్రసాద్ సహాయకుడుగా పని చేశారు. రోహిణి పిక్చర్స్‌ పేరిట బి.ఎన్.రెడ్డి లాంటి వారిని కలుపుకుని ‘గృహలక్ష్మి’ (1938) తీసి ‘సాంఘిక పతాకం’ ఎగరవేశారు రెడ్డి. రోహిణి స్థిరపడింది, భాగస్వాములు విడిపోయి ‘వాహిని పిక్చర్స్’ స్థాపిస్తే అదీ స్థిరపడింది. రెడ్డిగారు ‘నిర్దోషి’ (1951) తీసిన తర్వాత రోహిణి స్టూడియో కట్టారు మద్రాసులో. ప్రయోగాలు చెయ్యడంలో కూడా హెచ్‌.ఎమ్‌.దిట్ట. అంతవరకూ విలన్‌ వేషాలే వేస్తున్న ముక్కామలని ‘నిర్దోషి’లో హీరోని చేశారు. వాంప్‌ వేషాలు ఎక్కువగా వేసిన అంజలీదేవిని నిర్దోషి (1951) తో హీరోయిన్‌ని చేశారు. ‘నిర్దోషి’ లో ఓ చిన్నవేషంలో కనిపించిన కాంతారావుని ‘ప్రతిజ్ఞ’తో హీరోని చేశారు. అలాగే ‘ప్రతిజ్ఞ’ లో విలన్‌ రాజనాలకు అదే తొలిచిత్రం. కమలాకర కామేశ్వరరావు, సదాశివబ్రహ్మం, కొండముది గోపాలరాయశర్మ, మల్లాది వెంకటకృష్ణశర్మ, కొవ్వలి, భమిడిపాటి కామేశ్వరరావు, శ్రీశ్రీ - ఇలా ఎందరో మహామహులను వెండితెరకు పరిచయంచేసిన ఘనులు హెచ్.ఎమ్.రెడ్డి.

సుకుమార్

సుకుమార్ తెలుగు చలనచిత్ర దర్శకుడు. దర్శకుడు కాక ముందు గణితం భోధించే అధ్యాపకులు. ఇతని మొదటి చిత్రం ఆర్య సంచలన విజయం సాధించి అల్లు అర్జున్ ను స్టార్ గా నిలబెట్టింది. రెండవ చిత్రం జగడం టేకింగ్ పరంగా వైవిధ్యం చూపి విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. మూడవ చిత్రం ఆర్య2

ఎస్.బాలచందర్

గా ప్రసిద్ధిచెందిన సుందరం బాలచందర్ (జ: 18 జనవరి 1927 – మ: 15 ఏప్రిల్ 1990) సుప్రసిద్ధ వీణా విద్వాంసులు మరియు దక్షిణ భారత సినిమా దర్శకుడు మరియు నటుడు. ఇతడు తెలుగులో దర్శకత్వం వహించిన ఏది నిజం (1956) సినిమాకు రాష్ట్రపతి ప్రశంసా పత్రం లభించింది.

సింగీతం శ్రీనివాసరావు

సింగీతం శ్రీనివాసరావు (Singeetham Srinivasa Rao) ప్రతిభాశాలురైన సినిమా దర్శకులలో ఒకరు. తెలుగు, తమిళం, కన్నడ భాషలలో సందేశాత్మకమైవీ, ప్రయోగాత్మకమైనవీ, కధాభరితమైనవీ - ఇలా వైవిధ్యం గల పెక్కు సినిమాలకు దర్శకత్వం వహించి ఆయన ప్రేక్షకులనూ, విమర్శకులనూ మెప్పించాడు. మయూరి,పుష్పక విమానం,ఆదిత్య 369, మైఖేల్ మదన్ కామరాజు కధ వంటి వైవిధ్యము గల సినిమాలకు దర్శకత్వము వహించాడు. ఇంకా ఆయన మంచి సంగీత దర్శకుడు,కథకుడు కూడా. జననం సెప్టెంబరు 21, 1931 ఉదయగిరి, నెల్లూరు జిల్లా ప్రాముఖ్యత సినిమా దర్శకుడు వృత్తి సినిమా దర్శకుడు, రచయిత తండ్రి రామచంద్రరావు తల్లి శకుంతలాబాయి జీవిత విశేషాలు సింగీతం శ్రీనివాసరావు 1931 సెప్టెంబరు 21న నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జన్మించాడు. తండ్రి ఒక హెడ్‌మాస్టరు. తల్లి వయొలిన్ వాయిద్య నిపుణురాలు. చెన్నై ప్రెసిడెన్సీ కాలేజీలో చదివేప్పుడు శ్రీనివాసరావుకు హరీంద్రనాద ఛటోపాధ్యాయ పర్వేక్షణలో నాటకరంగంలో ప్రవేశం ఏర్పడింది. డిగ్రీ వచ్చిన తరువాత సూళ్ళూరుపేటలో ఉపాధ్యాయవృత్తి సాగించాడు. స్వయంగా రచించిన నాటకాలు (బ్రహ్మ, అంత్యఘట్టం) తన విద్యార్ధులతో ప్రదర్శింపజేశాడు. రవీంద్రనాధ టాగూరు నాటకం "చిత్ర"ను "చిత్రార్జున" అనే సంగీతనాటకంగా రూపొందించి ప్రదర్శించి ప్రశంసలు అందుకొన్నాడు. ఈ నాటకాన్ని ఢిల్లీలో జవహర్ లాల్ నెహ్రూ చూశాడు. 'టామ్ బుచాన్' అనే స్కాటిష్ నాటకకారుడు ఈ నాటకాన్ని ఆంగ్లంలోకి అనువదించి ఒక అమెరికన్ టెలివిజన్ ఛానల్‌లో ప్రసారం చేశాడు. కొంతకాలం శ్రీనివాసరావు "తెలుగు స్వతంత్ర" పత్రికలో రచనలు (ప్రధానంగా ఇంటర్వ్యూలు) చేశాడు. సినిమా రంగం కానీ చలనచిత్ర రంగం శ్రీనివాసరావుకు ప్రధాన ధ్యేయం. పట్టు వదలకుండా సుప్రసిద్ధ దర్శకుడు కె.వి.రెడ్డి వెంటబడి ఆయనకు అనుచరునిగా పనిచేయడం మొదలుపెట్టాడు. మాయాబజార్ చిత్రంతో మొదలుపెట్టి చాలా చిత్రాలలో కె.వి.రెడ్డి చేతిక్రింద పనిచేశాడు. పట్టాభి రామిరెడ్డి కన్నడంలో యు.ఆర్.అనంతమూర్తి నవల ఆధారంగా సంస్కార సినిమా తీయ సంకల్పించినపుడు శ్రీనివాసరావును ఎక్సిక్యూటివ్ డైరెక్టరుగా తీసుకొన్నాడు. ఈ సినిమాకు రాష్ట్రపతి బంగారు పతకం లభించింది. 1972లో సింగీతం పూర్తి దర్శకత్వం వహించిన నీతి నిజాయితీ సినిమాను విమర్శకులు ప్రశంసించారుగాని ఆర్ధికంగా విఫలమయ్యింది. 1975లో తీసిన 'జమీందారుగారి అమ్మాయి' ఆయన మొదటి విజయవంతమైన చిత్రం. కాని 1976లో వచ్చిన అమెరికా అమ్మాయి అన్ని వర్గాల ప్రేక్షకులనూ మెప్పిచడమే గాక సంగీత పరంగా మంచి విజయం సాధించింది. ఆ కోవలోనే పంతులమ్మ విజయవంతమైంది. ఆ తరువాత సింగీతం విజయ పరంపర, ప్రయోగ పరంపర సమాంతరంగా సాగాయి. ముఖ్యంగా కమల్ హాసన్‌తో సింగీతం సొమ్మొకడిది సోకొకడిది సినిమాతో ఆరంభించి పలు చిత్రాలను విజయవంతంగా తీశాడు. వాటిలో మైఖేల్ మదన కామరాజు కధ, అమావాస్య చంద్రుడు, అపూర్వ సహోదరులు ముఖ్యమైనవి. సందేశాత్మకంగా తీసిన చిత్రాలలో తరం మారింది ముఖ్యమైంది. డైలాగులు లేకుండా తీసిన పుష్పక విమానం అన్ని "భాషలలో" ప్రదర్శించారు. మయూరి సినిమాలో "సుధా చంద్రన్" చరిత్రను సున్నితంగా తెరకెక్కించాడు. తెలుగులో వచ్చిన కొద్ది సైన్స్ ఫిక్షన్ సినిమాలలో ఆదిత్య 369 ఒకటి. భైరవద్వీపం సినిమాతో ప్రేక్షకులు మరచిపోతున్న జానపదచిత్రాలను గుర్తు చేశాడు. కన్నడంలో రాజకుమార్ ప్రధాన చిత్రాలలో 'శ్రావణబంతు' ఒకటి. సంగీత దర్శకునిగా సింగీతం శ్రీనివాసరావు ప్రసిద్ధ సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావుకు శిష్యుడు. 'భాగ్యద లక్ష్మి బారమ్మ', 'సంయుక్త' అనే రెండు విజయవంతమైన కన్నడ చిత్రాలకు శ్రీనివాసరావు సంగీత దర్శకుడు. ప్రవాస భారతీయుల పిల్ల సౌకర్యార్ధం 30 శ్లోకాలను ఆంగ్లంలో సంగీతపరంగా కూర్చాడు. సినిమాల జాబితా * ముంబై ఎక్స్‌ప్రెస్ (2005) * Son of Alladin (2003)- 3D యానిమేషన్ చిత్రం. * Little John (2002) * ఆకాశ వీధిలో (2001) * శ్రీకృష్ణార్జున యుద్ధం (1996) * చిన్న వతియార్ (1995) * భైరవద్వీపం(1994) * ఆడవాళ్ళకు మాత్రమే (1994) * మేడమ్(1993) * ఫూల్ (1993) * బృందావనం(1992) * క్షీరసాగర (1992) * ఆదిత్య 369 (1991) * మైకేల్ మదన కామరాజు కధ(1991) * అపూర్వ సహోదరులు (1989) ( తమిళం: అపూర్వ సహోదరగళ్, హిందీ: అప్పూరాజా) * చిరంజీవి సుధాకర (1988) * దేవతా మనుష్య (1988) * పుష్పక విమానం (1988) - డైలాగులు లేని సినిమా, కనుక అన్ని భాషలలోనూ విడుదలయ్యింది * అమెరికా అబ్బాయి (1987) * ఆనంద(1986) * మయూరి (1984) * శ్రావణ బంతు(1984) * చెలిసువ మొదగళు(1982) * Nancy (1981) * అమావాస్య చంద్రుడు (తమిళం: రాజా పారవై) (1981) * త్రిలోక సుందరి * మంగళ తోరణాలు(1979) * గమ్మత్తు గూఢచారులు (1978) * రామచిలుక (1978) * సొమ్మొకడిది సోకొకడిది (1978) * అందమె ఆనందం (1977) * నిరపరయుమ్ నిలవిక్కుమ్ (1977) * పంతులమ్మ (1977) * తరం మారింది (1977) * అమెరికా అమ్మాయి (1976) * ఒక దీపం వెలిగింది(1976) * జమీందారు గారి అమ్మాయి (1975) * దిక్కట్ర పార్వతి (1973) * నీతి నిజాయితి (1972)

సి.పుల్లయ్య

చిత్తజలు పుల్లయ్య మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు. ఇతను 1898లో కాకినాడలో జన్మించాడు. 1967 అక్టోబర్ 6న మద్రాసులో మరణించాడు. రఘుపతి వెంకయ్య, అతని కుమారుడు రఘుపతి ప్రకాష్ దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి సినిమా నిర్మాణ సంస్థ 'స్టార్ ఆఫ్ ది ఈస్ట్' ను స్థాపించారు. 1921లో భీష్మ ప్రతిజ్ఞ మూగచిత్రాన్ని నిర్మించారు (ఇది మూగచిత్రం గనుక "మొదటి తెలుగువాడి సినిమా" అనడం ఉచితం). ప్రకాష్ దర్శకత్వం వహించడమే కాకుండా ఈ చిత్రంలో భీష్ముని పాత్రను కూడా పోషించారు. 'డి కాస్టెల్లో' (De Castello) అనే ఆంగ్ల యువతి గంగ పాత్రను ధరించింది. తరువాత ప్రసిద్ధులైన సి.పుల్లయ్య, వై.వి.రావులూ ప్రకాష్ అనుచరులుగా తమ సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ] దర్శకత్వం వహించిన తెలుగు సినిమాలు * భువన సుందరి కథ (1967) * భామావిజయం (1967) * పరమానందయ్య శిష్యుల కథ (1966) * లవకుశ (1963) కొంత భాగం తీసిన తరువాత పుల్లయ్య ఆరోగ్యం క్షీణించింది. సుందర్ లాల్ నహతా, బి.ఎన్.రెడ్డి ల ప్రోత్సాహంతో సి.పుల్లయ్య కుమారుడైన సి.యస్.రావు దర్శకత్వబాధ్యత చేపట్టి మిగిలిన భాగం పూర్తి చేశాడు.. * దేవాంతకుడు (1960) * పక్కింటి అమ్మాయి (1953) * సంక్రాంతి (1952) * అపూర్వ సహోదరులు (1950) * వింధ్యరాణి (1948) * గొల్లభామ (1947) * నారద నారది (1946) * బాలనాగమ్మ (1942) * మాలతీ మాధవం (1940) * వరవిక్రయం (1939) * మోహినీ భస్మాసుర (1938) * సత్యనారాయణ వ్రతం (1938) * చల్ మోహనరంగ (1937) * దశావతారములు (1937) * కాసుల పేరు (1937) * అనసూయ (1936) * ధ్రువ (1936) * శ్రీకృష్ణ తులాభారం (1935) * లవకుశ (1934 సినిమా) (1963) * రామదాసు (1933) * సావిత్రి (1933)

కొమ్మారెడ్డి సావిత్రి

తెలుగు సినీ ప్రపంచం లో మహానటి కొమ్మారెడ్డి సావిత్రి (1936 జనవరి 4 - 1981 డిసెంబర్ 26) . తెలుగు తమిళ సినిమాల్లో కూడా నటించి, మహానటి అనిపించుకుని, తరాల తరువాత కూడా ఆరాధింపబడుతూంది. ఈమె కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించి నిర్మించింది. తొలి జీవితం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలంలోని చిర్రావూరు గ్రామంలో 1936 జనవరి 4 న నిశ్శంకర గురవయ్య, సుభద్రమ్మ దంపతులకు జన్మించింది. వారికి సావిత్రి రెండవ సంతానం, 1934లో ఆడపిల్ల పుట్టగా మారుతి అని నామకరణం చేశారు. సావిత్రికి ఆరు నెలలు నిండగానే టైఫాయిడ్ కారణంగా తండ్రి మరణించాడు. గురవయ్య మరణంతో సుభద్రమ్మ విజయవాడలోని తన అక్క అయిన దుర్గాంబ ఇంటికి మకాం మార్చింది. దుర్గాంబ భర్త పేరు కొమ్మారెడ్డి వెంకట్రామయ్య చౌదరి, సావిత్రికి వరుసకు పెద్దనాన్న. మారుతి, సావిత్రి విజయవాడలోని కస్తూరిబాయి మెమోరియల్ స్కూలులో చెరారు. పాఠశాలకు వెళ్ళే దారిలో నృత్యవిద్యాలయం ఉండేది. రోజూ ఇతరులు నాట్యం చేయటం చూసి శిష్ట్లా పూర్ణయ్య శాస్త్రి దగ్గర సంగీతం మరియూ శాస్త్రీయ నృత్యం నేర్చుకొని విజయవాడలో తన చిన్నతనంలోనే ప్రదర్శనలు ఇచ్చింది. కొంతకాలం ఎన్టీఆర్, జగ్గయ్య తదితరులు నడుపుతున్న నాటకాల కంపెనీలో పనిచేసి, అనంతరం స్వయంగా పెదనాన్న నడిపిన నాట్య మండలిలో కూడా నటించింది. బుచ్చిబాబు రాసిన ఆత్మవంచన అనే నాటకంలో కూడా నటించింది. చలనచిత్ర జీవితం పెదనాన్న ప్రోద్బలంతో సినిమా రంగం వైపు దృష్టి సారించి ఎన్నో కష్టాలనోర్చి తిరుగులేని అభినేత్రి గా విరాజిల్లింది. ఎల్వీ ప్రసాద్ దర్శకత్వం వహించిన సంసారం సినిమాలో చిన్న పాత్ర పొంది, ఆనక ఆ పాత్రకు తగ్గ వయసు లేదని అందులోనుండి తొలగింపబడింది. ఆ తరువాత కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన పాతాళ భైరవిలో ఒక చిన్న పాత్రలో నటించింది. పెళ్ళిచేసిచూడు ఆమె సినీ జీవితంలో ఒక మలుపు. కాని అందులో ఆమె రెండో కథానాయిక పాత్రకే పరిమితం కావలసి వచ్చింది. తన నటనా ప్రతిభను నిరూపించుకోవటానికి ఆమె, నృత్యరూపకుడు మరియూ దర్శకుడూ అయిన వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించిన దేవదాసు సినిమా వరకూ ఆగవలసి వచింది. ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో మిస్సమ్మ లో ప్రధానపాత్ర పోషించింది. ఆ చిత్రంతో ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా స్థిరపడింది. ఆ తరువాత వచ్చిన దొంగరాముడు, అర్థాంగి, చరణదాసి ఆమె స్థానాన్ని పదిలపరచాయి.1957 లో వచ్చిన తెలుగు చిత్ర చరిత్ర లోనే అజరామరం అనదగిన మాయాబజార్ చిత్రంలో ఆమె ప్రదర్శించిన అసమాన నటనా వైదుష్యం ఆమె కీర్తి పతాకంలో ఒక మణిమకుటం. అది మొదలు యెన్నో వైవిధ్యమైన పాత్రలను తనకే సాధ్యమైన రీతిలో పోషించి వాటికి ప్రాణ ప్రతిష్ట చేసింది. ఆమె తమిళ చిత్రాలలోనూ నటించి పేరుతెచ్చుకుంది. తమిళంలోనూ మహానటి (నడిగెయర్ తిలగం) బిరుదు పొందింది. 1968 లో చిన్నారి పాపలు సినిమాకు దర్శకత్వం వహించింది. ఈ సినిమా కు ఒక ప్రత్యేకత వుంది. బహుశా దక్షిణ భారత దేశంలోనే తొలిసారిగా దాదాపు పూర్తిగా మహిళలచే నిర్మింపబడిన చిత్రంగా ప్రత్యేకత సంతరించుకున్నది . అయితే అది అంత విజయం సాధించలేదు. ఆ తరువాత చిరంజీవి,మాతృదేవత, వింత సంసారం మొదలగు సినిమాలకు దర్శకత్వం వహించింది. 1956లో అప్పటికే రెండు పెళ్ళిళ్ళయిన తమిళ నటుడు జెమినీ గణేశన్ ను పెళ్ళిచేసుకుంది. వారికి ఒక కుమార్తె, ఒక కుమారుడు - విజయ చాముండేశ్వరి, సతీష్ కుమార్. అయితే ఆ పెళ్ళి విఫలమైంది. ఆస్తిపాస్తులు కోల్పోయి, తాగుడుకు, మత్తుమందులకు, నిద్రమాత్రలకు బానిసై, 1981 డిసెంబర్ 26 న మరణించింది. ఇతర విశేషాలు అభిమానులు, ప్రచారసాధనాలు సావిత్రి జన్మదినాన్ని డిసెంబరు 6 గా జరుపుకుంటాయి. మల్లెపూలు, వర్షం సావిత్రికి ఇష్టమైనవి. ఆమెది ఎడమ చేతివాటం. క్రికెట్, చదరంగం ఆటలను బాగా ఇష్టపడేది. చెన్నైలో క్రికెట్ మ్యాచ్ ఉంటే ఆమె తప్పక చూసేది. వెస్టిండీస్ ప్రముఖ ఆటగాడు "గ్యారీ సోబర్స్" కు సావిత్రి అభిమాని. ఆ రోజుల్లోనే శివాజీగణేశన్ తోపాటు తారల క్రికెట్లో పాల్గొనేది. ఆమె వద్ద ఏనుగు దంతంతో చేసిన చదరంగం బల్లకూడా ఉండేది. సావిత్రి మంచి చమత్కారి, అంతే కాదు ఇతరులను అనుకరించటంలో కూడా దిట్ట. ఆమె తన భర్త జెమినీ గణేశన్ను, రేలంగిని, బి.సరోజాదేవిని, ఎస్వీ రంగారావుని, ఇంకా అనేకమందిని తరుచూ అనుకరించేది. దానధర్మాల విషయంలో అమెది ఎముకలేని చెయ్యి. ఒకసారి నిండుగా నగలతో అలంకరించుకుని ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి ని కలిసేందుకు వెళ్ళి, అక్కడ మొత్తం నగలన్నిటినీ వలిచి ప్రధానమంత్రి సహాయ నిధికి దానమిచ్చేసింది. నటిగా 1. సంసారం (1950) 2. అగ్నిపరీక్ష (1951) 3. పాతాళభైరవి (1951)లో నృత్యకారిణి 4. పెళ్ళిచేసి చూడు (1952)లో సావిత్రి 5. పల్లెటూరు (1952)లో సుగుణ 6. ప్రతిజ్ఞ (1953) 7. దేవదాసు (1953)లో పార్వతి 8. బ్రతుకుతెరువు (1953)లో జమీందారుగారి కూతురు 9. మేనరికం (1954) 10. చంద్రహారం (1954)లో చంచల 11. బహుత్ దిన్ హుయే (1954) (హిందీ సినిమా) 12. పరివర్తన (1954)లో సుందరమ్మ 13. వదిన (1955) 14. మిస్సియమ్మ (1955) (తమిళ సినిమా) 15. మిస్సమ్మ (1955)లో మేరీ/మహాలక్ష్మి 16. అర్ధాంగి (1955) 17. సంతానం (1955)లో శారద 18. కన్యాశుల్కం (1955)లో మధురవాణి 19. దొంగరాముడు (1955)లో సీత 20. చరణదాసి (1956)లో లక్ష్మి 21. భలేరాముడు (1956) 22. అమరదీపం (1956)లో అరుణ 23. వినాయకచవితి (1957)లో సత్యభామ/భూదేవి 24. తోడికోడళ్ళు (1957)లో సుశీల 25. ఎమ్మెల్యే (M.L.A.) (1957)లో నిర్మల 26. మాయాబజార్ (1957)లో శశిరేఖ 27. మాయాబజార్ (1957) (తమిళ సినిమా)లో శశిరేఖ 28. కర్పూరకరసి (1957) (తమిళ సినిమా)లో మంజుల 29. మాంగల్యబలం (1958) 30. అప్పుచేసి పప్పుకూడు (1958)లో మంజరి 31. నమ్మిన బంటు (1959) 32. విమల (1960) 33. శ్రీవెంకటేశ్వరమహత్యం (1960)లో పద్మావతి 34. శాంతినివాసం (1960) 35. దీపావళి (1960) 36. చివరకు మిగిలేది (1960)లో పద్మ 37. పాపపరిహారం (1961) 38. పసమలార్ (1961) (తమిళ సినిమా)లో రాధ 39. పాండవవనవాసం (1961)లో ద్రౌపది 40. కలసివుంటే కలదుసుఖం (1961) 41. సిరిసంపదలు (1962) 42. పవిత్రప్రేమ (1962) 43. మనితన్ మరవిల్లై (1962) (తమిళ సినిమా) 44. మంచిమనసులు (1962) 45. ఆరాధన (1962)లో అనూరాధ 46. గుండమ్మ కథ (1962)లో లక్ష్మి 47. రక్తసంబంధం (1962) 48. ఆత్మబంధువు (1962) 49. రక్తతిలకం (1963)లో కమల 50. మూగ మనసులు (1963)లో రాధ 51. కర్ణలో (1963) భానుమతి 52. కర్ణన్ (1963) (తమిళ సినిమా)లో భానుమతి 53. ఘర్ బసాకే దేఖో (1963) (హిందీ సినిమా) 54. చదువుకున్న అమ్మాయిలు (1963)లో సుజాత 55. నర్తనశాల (1963)లో ద్రౌపది 56. వెలుగునీడలు (1964)లో సుగుణ 57. పూజాఫలం (1964)లో సీత 58. నవరాత్రి (1964) 59. కైకొడుత్తదైవం (1964) (తమిళ సినిమా) 60. గంగా కీ లెహరే (1964) (హిందీ సినిమా) 61. డాక్టర్ చక్రవర్తి (1964)లో మాధవీ దేవి 62. దేవత (1964) 63. సుమంగళి (1965) 64. తిరువిలయాదల్(1965) (తమిళ సినిమా)లో పార్వతి యొక్క వివిధ రూపాల్లో నటించింది. 65. నాదీ ఆడజన్మే (1965) 66. మనుషులు మమతలు (1965) 67. నవరాత్రి (1966) 68. భక్తపోతన (1966)లో సరస్వతీదేవి 69. ప్రాణమిత్రులు (1967) 70. వరకట్నం (1968) 71. తల్లితండ్రులు (1970)లో కౌసల్య 72. మరోప్రపంచం (1970) 73. అశ్వథ్థామ (1970)లో కుంజుని భార్య 74. జగన్మోహిని (1978) 75. అందరికంటే మొనగాడు (1985) 76. దేవదాసు మళ్లీ పుట్టాడు 77. గోరింటాకు (చివరి సినిమా) నిర్మాతగా 1. ఏక్ చిట్టీ ప్యార్ భరీ(1985) (హిందీ సినిమా) దర్శకురాలిగా 1. మాతృదేవత (1970) 1. నవరాత్రి (1966) సినిమాలో నేపథ్య గాయని

సముద్రాల

సముద్రాల రాఘవాచార్య(1902 - 1968) తెలుగు సినిమా పరిశ్రమలో సముద్రాల సీనియర్ గా ప్రసిద్ధి చెందిన రచయిత, నిర్మాత, దర్శకుడు మరియు నేపథ్యగాయకుడు. ఈయన కుమారుడు సముద్రాల రామానుజాచార్య సముద్రాల జూనియర్ గా తెలుగు చిత్ర పరిశ్రమ పరిచయము. రాఘవాచార్య 1902లో గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించాడు. పి.వి.దాసు నిర్మించిన శశిరేఖా పరిణయం సినిమాకు కొన్ని సన్నివేశాలు వ్రాయడంతో సినీ వ్యాసంగాన్ని ప్రారంభించిన సముద్రాల వందకు పైగా సినిమాలకు స్క్రిప్టులను వ్రాశాడు. అనేక పాటలు కూడా వ్రాశాడు. ఈయన వినాయకచవితి (1957), భక్త రఘునాథ్ (1960), బభృవాహన (1964) సినిమాలకు దర్శకత్వం కూడా వహించాడు. రచయితగా 1. భక్త ప్రహ్లాద (1967 సినిమా) 2. శ్రీకృష్ణ పాండవీయం (1966) 3. బభ్రువాహన (1964) (మాటలు) (కథ) 4. నర్తనశాల (1963) (మాటలు) 5. లవకుశ (1963) 6. సీతారామ కళ్యాణం (1961) (మాటలు) 7. బాటసారి (1961) (మాటలు) 8. పాండవ వనవాసం (1965) 9. భూకైలాస్ (1958) 10. సారంగధర (1957)(మాటలు) 11. వినాయక చవితి (1957) 12. జయం మనదే (1956) (మాటలు) (కథ) 13. జయసింహ (1955) (మాటలు) (కథ) 14. బ్రతుకు తెరువు (1953) (మాటలు) (కథ) 15. దేవదాసు (1953)(మాటలు) 16. నవ్వితే నవరత్నాలు (1951) 17. స్వప్న సుందరి (1950) 18. షావుకారు (1950) 19. మన దేశం (1949) (మాటలు) 20. లైలా మజ్ను (1949) (మాటలు) 21. పల్నాటి యుద్ధం (1947) (మాటలు) 22. రత్నమాల (1947) 23. యోగి వేమన (1947) 24. గరుడ గర్వభంగం (1943) (మాటలు) 25. భక్త పోతన (1942 సినిమా) (కథ మరియు మాటలు) 26. దేవత (1941) (మాటలు) 27. సుమంగళి (1940) (మాటలు) 28. వందేమాతరం (1939) (మాటలు) 29. గృహలక్ష్మి (1938) దర్శకత్వం 1. బభృవాహన (1964) 2. భక్త రఘునాథ్ (1960) 3. వినాయక చవితి (1957) నిర్మాత 1. దేవదాసు (1953) (నిర్మాత) (uncredited) 2. శాంతి (1952) (నిర్మాత) (uncredited) 3. స్త్రీసాహసం (1951) (నిర్మాత) (uncredited) నేపధ్య గాయకుడు 1. భక్త రఘునాథ్ (1960) (playback singe

శ్రీను వైట్ల

ను వైట్ల తెలుగు సినిమా దర్శకుడు. ఇతని మొదటి సినిమా నీ కోసం. కానీ 2001 సంవత్సరంలో విడుదలైన ఆనందం చిత్రం ద్వారా మంచి పేరు సంపాదించాడు. ఆయన స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా కందుల పాళెం అనే గ్రామం. సినిమాలు 1. నీ కోసం (1999) 2. ఆనందం (2001) 3. సొంతం 4. వెంకీ 5. అందరివాడు (2005) 6. ఢీ (2007) 7. దుబాయ్ శీను (2007) 8. రెడీ (2008) 9. కింగ్ (2008)

శేఖర్ కమ్ముల

శేఖర్ కమ్ముల ప్రముఖ తెలుగు సినీదర్శకుడు, నిర్మాత మరియు సినీ రచయిత. శేఖర్ నల్గొండ జిల్లా భువనగిరి ప్రాంతానికి చెందిన వాడు. సికిందరాబాద్ లోని సెయింట్ పాట్రిక్స్ హైస్కూల్ లో హైస్కూలు విద్య పూర్తి చేశాడు. సెయింట్ అల్ఫోన్సా కళాశాల నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. తరువాత చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. తరువాత అమెరికాలోని న్యూజెర్సీ లో కంప్యూటర్ సైన్సు లో పీజీ కోసం వెళ్ళాడు. కొద్ది కాలం సమాచార సాంకేతిక రంగంలో పని చేసిన తర్వాత వాషింగ్టన్ లోని హోవార్డ్ యూనివర్శిటీ లో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో చేరాడు. కెరీర్ దర్శకుడిగా ఆయన మొదటి సినిమా డాలర్ డ్రీమ్స్. ఈ సినిమాకు ఆయనకు ఉత్తమ నూతన దర్శకుడిగా జాతీయ పురస్కారము లభించింది. [1]. తరువాత ఆయన దర్శకత్వం వహించిన ఆనంద్ సినిమా ఆయనకు మంచి కమర్షియల్ విజయాన్నిచ్చింది. సినిమాల్లో సాధారణంగా కనిపించే హింస, అశ్లీలత మొదలైనవి శేఖర్ సినిమాల్లో తక్కువ మోతాదులో ఉంటాయి కాబట్టి కుటుంబ సమేతంగా చూడదగ్గవిగా ఉంటాయి. చిత్రాలు 1. డాలర్ డ్రీమ్స్ (2000) 2. ఆనంద్ (2004) 3. గోదావరి (2006) 4. హ్యాపీ డేస్ (2007) 5. లీడర్ (2009)

వై.వి.రావు

యెర్రగుడిపాటి వరదరావు (వై.వి.రావు) (జ: మే 30, 1903 - మ: ఫిబ్రవరి 14, 1973) తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత మరియు నటుడు. వై.వి.రావు 1903 మే 30న నెల్లూరులో జన్మించాడు. మద్రాసు విశ్వవిద్యాలయములో వైద్యవిద్యను వదిలి సినిమాలలో నటించాలనే కోరికతో బొంబాయి వెళ్లాడు. బొంబాయిలో మణీలాల్ జోషీని కలిసి, మెప్పించి మూకీ చిత్రాలలో నటించే అవకాశము పొందాడు. ఈయన కొన్ని రోజులు అర్దేషిర్ ఇరానీ యొక్క రాయల్ ఆర్ట్ స్టూడియోలో కూడా పనిచేశాడు. ఆ తరువాత మద్రాసులోని జనరల్ పిక్చర్స్ లో కళాదర్శకునిగా, నటునిగా చేరాడు. ఈయన ఆర్.ఎస్.ప్రకాష్ యొక్క కొన్ని మూకీ చిత్రాలలో కూడా నటించాడు. వై.వి.రావు 1939 లో తన సొంత చిత్ర నిర్మాణ సంస్థ అయిన చింతామణి పిక్చర్స్ ను స్థాపించాడు. 1950లో శ్రీవరుణ ఫిలంస్ అనే సంస్థను కూడా ప్రారంభించాడు. అప్పట్లో భారతీయ చిత్ర పరిశ్రమలో అన్ని (ఏడు) భాషల చిత్రాలలో పనిచేసిన ఘనత ఈయనకే దక్కినది. వై.వి.రావు పశ్చిమ మరియు దక్షిణ భారత దేశములలోని ప్రముఖ చిత్రనిర్మాణ కేంద్రాలైన బొంబాయి, కొల్హాపూర్, మద్రాసు మరియు మైసూరులలో పనిచేశాడు. తొలి కన్నడ టాకీ చలనచిత్రము, ఎం.వి.సుబ్బయ్య నాయుడు మరియు ఆర్.నాగేంద్రరావు నటించిన సతీ సులోచన ఈయనే నిర్మించాడు. 1946లో వై.వి.రావు, నర్తకి నుంగంబాక్కం జానకి కుమార్తె మరియు తమిళ సినిమా నటీమణి అయిన కుమారి రుక్మిణిని వివాహమాడినాడు. తెలుగు సినీనటి లక్ష్మి (జీన్స్ చిత్రములో బామ్మ) ఈయన కూతురే. * Hennina Balu Kanneru (1963) * Nagarjuna (1961/I) * శ్రీకృష్ణ గారడి (1958/I and II) * మంజరి (1953) * మానవతి (1952) * లవంగి (1946) (1950) * Ramadas (1948) * తాసీల్దార్ (1944) (నటుడు, కథా రచయిత, నిర్మాత మరియు దర్శకుడు) * సత్యభామ (1942) (నటుడు, నిర్మాత మరియు దర్శకుడు) * సావిత్రి (1941) * విశ్వమోహిని (1940) (నటుడు, కథా రచయిత మరియు దర్శకుడు) * మళ్ళీ పెళ్ళి (1939) (నటుడు, కథా రచయిత మరియు దర్శకుడు) * భక్త మీరా (1938) * స్వర్ణలత (1938) * Naganand (1935/I and II) * సతీ సులోచన (1934/II) (నటుడు మరియు దర్శకుడు) * Hari Maya (1932) * Pandava Agyathavas (1930) * సారంగధర (1930) * Shri Subramanyam (1930)

వేదాంతం రాఘవయ్య

వేదాంతం రాఘవయ్య (Vedantam Raghavaiah) మంచి కూచిపూడి కళాకారుడే కాకుండా, పలు తెలుగు సినిమాలకు దర్శకత్వం, మరి కొన్ని సినిమాలకు నృత్య దర్శకత్వం వహించారు. అంతే కాక కొన్ని సినిమాలలో నటించారు కూడా. [మార్చు] తొలి జీవితం వేదాంతం రాఘవయ్య కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామంలో 1919 సంవత్సరంలో జన్మించారు. రాఘవగా పిలవబడే రాఘవయ్య వేదాంతం రత్తయ్య శర్మ మరియు రాజ్యలక్ష్మి గార్ల ప్రథమ సంతానం. వీరి తాతగారు వేదాంతం రామయ్య గారు ప్రఖ్యాత కూచిపూడి యక్ష గాన ప్రయోక్తలు. వీరికి తమ ఇంటివిద్యపై మక్కువ వలన చిన్నతనంలోనే తన తండ్రిగారి వద్ద ఈ నాట్యవిద్యకు శ్రీకారం చుట్టారు. తరువాత పద్మభూషణ్ వెంపటి చినసత్యం గారివద్ద తన విద్యకు మెరుగులు దిద్దుకున్నారు. పాఠశాల విద్యానంతరము ఉన్నత విద్యలకై హైదరాబాదు వెళ్లి అక్కడ మేనమామగారైన నాట్యకళాధర పసుమర్తి రామలింగశాస్త్రి గారివద్ద ఉంటూ ఈ నాట్యకళల మెళకువలను, తాళప్రకరణము , నట్టువాంగమును అభ్యసించడమే కాకుండా తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా కూచిపూడి నాట్యంలో బి.ఎ. మరియు ఎం.ఎ. డిగ్రీలను పొందారు. [మార్చు] పని చేసిన సినిమాలు దర్శకత్వం వహించినవి * శాంతి (1952) * అన్నదాత (1952) * దేవదాసు (1953) * అనార్కలి (1955) * భలే అమ్మాయిలు (1957) * సువర్ణసుందరి (1957) * రహస్యం (1967) నటించినవి * రైతుబిడ్డ (1939) * గరుడ గర్వభంగం (1943) నృత్య దర్శకత్వం చేసినవి * పల్నాటి యుద్ధం (1947) చిత్రానువాదం అందించినవి * అనార్కలి (1955) * సువర్ణసుందరి (1957)
వేదాంతం రాఘవయ్య (Vedantam Raghavaiah) మంచి కూచిపూడి కళాకారుడే కాకుండా, పలు తెలుగు సినిమాలకు దర్శకత్వం, మరి కొన్ని సినిమాలకు నృత్య దర్శకత్వం వహించారు. అంతే కాక కొన్ని సినిమాలలో నటించారు కూడా. [మార్చు] తొలి జీవితం వేదాంతం రాఘవయ్య కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామంలో 1919 సంవత్సరంలో జన్మించారు. రాఘవగా పిలవబడే రాఘవయ్య వేదాంతం రత్తయ్య శర్మ మరియు రాజ్యలక్ష్మి గార్ల ప్రథమ సంతానం. వీరి తాతగారు వేదాంతం రామయ్య గారు ప్రఖ్యాత కూచిపూడి యక్ష గాన ప్రయోక్తలు. వీరికి తమ ఇంటివిద్యపై మక్కువ వలన చిన్నతనంలోనే తన తండ్రిగారి వద్ద ఈ నాట్యవిద్యకు శ్రీకారం చుట్టారు. తరువాత పద్మభూషణ్ వెంపటి చినసత్యం గారివద్ద తన విద్యకు మెరుగులు దిద్దుకున్నారు. పాఠశాల విద్యానంతరము ఉన్నత విద్యలకై హైదరాబాదు వెళ్లి అక్కడ మేనమామగారైన నాట్యకళాధర పసుమర్తి రామలింగశాస్త్రి గారివద్ద ఉంటూ ఈ నాట్యకళల మెళకువలను, తాళప్రకరణము , నట్టువాంగమును అభ్యసించడమే కాకుండా తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా కూచిపూడి నాట్యంలో బి.ఎ. మరియు ఎం.ఎ. డిగ్రీలను పొందారు. [మార్చు] పని చేసిన సినిమాలు దర్శకత్వం వహించినవి * శాంతి (1952) * అన్నదాత (1952) * దేవదాసు (1953) * అనార్కలి (1955) * భలే అమ్మాయిలు (1957) * సువర్ణసుందరి (1957) * రహస్యం (1967) నటించినవి * రైతుబిడ్డ (1939) * గరుడ గర్వభంగం (1943) నృత్య దర్శకత్వం చేసినవి * పల్నాటి యుద్ధం (1947) చిత్రానువాదం అందించినవి * అనార్కలి (1955) * సువర్ణసుందరి (1957)

వి.మధుసుదనరావు

వి.మధుసుదనరావు లేదా వీరమాచనేని మధుసూదనరావు తెలుగు సినిమా దర్శకులు. ఇతడు కె.ఎస్.ప్రకాశరావు వద్ద చలనచిత్రీకరణ పాఠాలు నేర్చుకొని మొదటిసారిగా సతీ తులసి పౌరాణిక చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇతడు రాజధాని నగరంలో ఫిలిం ఇన్ స్టిట్యూట్ స్థాపించి ఎందరో నటుల్ని తీర్చిదిద్దారు. సినిమాలు * సతీ తులసి (1959) * వీరాభిమన్యు (1965) * ఆరాధన (1962) * అంతస్థులు (1965) * అదృష్టవంతులు (1968) * పదండి ముందుకు (1962) * రక్తసంబంధం (1962) * భక్త తుకారాం (1973)

విజయనిర్మల

విజయనిర్మల (1946) తెలుగు సినిమా నటి, దర్శకురాలు మరియు ప్రముఖ నటుడు ఘట్టమనేని కృష్ణ భార్య. ఈమె అసలు పేరు నిర్మల అయితే తనకు సినీరంగములో తొలి అవకాశమిచ్చిన విజయా స్టూడియో కు కృతజ్ఞతగా విజయనిర్మల అని పేరు మార్చుకొన్నది. అప్పటికే ఇదే పేరుతో వేరే నటి (ఇప్పటి నిర్మలమ్మ) ఉండడం కూడా పేరు మార్పునకు మరో కారణము. ఈమె మొదటి పెళ్లి ద్వారా సినీ నటుడు నరేష్ కి తల్లి. మరో ప్రముఖ సినిమా నటి జయసుధకు ఈమె పిన్నమ్మ. 2002 లో ప్రపంచములోనే అతిఎక్కువ సినిమాలు తీసిన మహిళా దర్శకురాలిగా గిన్నీస్ ప్రపంచ రికార్డులు[1] లోకెక్కినది. నటి అయిన ఈమె 1971లో దర్శకత్వము వహించడము ప్రారంభించినది. ఈమె నటించిన అధిక చిత్రాలలో కధానాయకుడు కృష్ణ కావటం విశేషం. వీరిద్దరూ జంటగా సుమారు యాభై వరకూ చిత్రాలలో నటించారు. విజయనిర్మల, కృష్ణ జంటగా నటించిన తెలుగు చిత్రాలు * సాక్షి * మంచి కుటుంబం * సర్కార్ ఎక్స్ ప్రెస్ * అత్తగారు కొత్తకోడలు * లవ్ ఇన్ ఆంధ్రా * టక్కరి దొంగ చక్కని చుక్క * విచిత్ర కుటుంబం * బందిపోటు భీమన్న * అక్కా చెల్లెలు * మా నాన్న నిర్దోషి * మళ్లీపెళ్లి * విధివిలాసం * అమ్మకోసం * తాళిబొట్టు * పెళ్లి సంబంధం * పెళ్లికూతురు * పగ సాధిస్తా * అగ్నిపరీక్ష * రెండు కుటుంబాల కధ * అల్లుడే మేనల్లుడు * మాస్టర్ కిలాడి * అనురాధ * మోసగాళ్లకు మోసగాడు * భలే మోసగాడు * పండంటి కాపురం * ప్రజా నాయకుడు * మంచివాళ్లకు మంచివాడు * దేవుడు చేసిన మనుషులు * మీనా * గాలిపటాలు * అల్లూరి సీతారామరాజు * ధనవంతుడు గుణవంతుడు * దేవదాసు * సంతానం-సౌభాగ్యం * పాడిపంటలు * రామరాజ్యంలో రక్త పాతం * దేవుడే గెలిచాడు * పంచాయితీ * పట్నవాసం * మూడు పువ్వులు ఆరు కాయలు * హేమాహేమీలు * అంతం కాదిది ఆరంభం * రక్తసంబంధం * సాహసమే నా ఊపిరి * ప్రజల మనిషి * బొబ్బిలి దొర * శ్రావణమాసం