Rss Feed

బాపు

బాపు జన్మ నామం సత్తిరాజు వెంకట లక్ష్మీనారాయణ జననం డిసెంబర్ 15,1933 స్వస్థలం నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లా,ఆంధ్రప్రదేశ్ నివాసం చెన్నై, తమిళనాడు ఇతర పేర్లు బాపు వృత్తి చిత్రకారుడు, కార్టూనిస్ట్ మరియు సినిమా దర్శకుడు మతం హిందూ భార్య/భర్త భాగ్యవతి తండ్రి వేణు గోపాల రావు తల్లి సూర్యకాంతమ్మ వెబ్‌సైటు http://www.bapubomma.com/ బాపు తెలుగునాట పేరెన్నికగన్న బహుముఖ ప్రజ్ఙాశాలి. బాపు గీత, బాపు వ్రాత తెలుగువారి సంస్కృతిలో భాగమయ్యాయి. బాపు చిత్రం ప్రచురించని తెలుగు పత్రికలు అరుదు. ఆయన వేసిన కార్టూనులూ, పుస్తకాల ముఖచిత్రాలూ లెక్క పెట్టడం కష్టం. 'బాపు బొమ్మ' అనే మాట ఈరోజు చిత్రశైలికీ వాడుతారు, అందాల భామను వర్ణించడానికీ వాడుతారు.బాపు బొమ్మల గురించి ప్రసిద్ది గాంచిన కవి ఆరుద్ర పద్య రూపంలో తన కవితల పుస్తకములో హ్రుద్యంగా వర్ణించిన తీరు చిరస్మరణీయమైనది ఒకటుంది. కొంటెబొమ్మల బాపు కొన్ని తరముల సేపు గుండె ఊయలలూపు ఓ కూనలమ్మా! ఇలా కూనలమ్మ పదం రాసి, ఆరుద్ర బాపుకు ఎప్పుడో చేసిన పద్యాభిషేకంతొ ఏకీబవించని వారు లేరు.బొమ్మలే కాదు, బాపు చేతిలో తెలుగు అక్షరాలు కూడా హొయలు పోయాయి. ఇప్పుడు ఈయన చేతిరాతకూడ బాపు ఫాంటుగా అలరిస్తోంది. అందమయిన చేతిరాతకి అందరికి గుర్తొచ్చే ఫాంటు ఇదే అవటం అతిశయోక్తి కాదు. ఇక ఈయన దర్శకత్వంలో వచ్చిన తెలుగు,హిందీ సినిమాలు అవార్డులు, రివార్డులు పొందటముతొ పాటు అచ్చ తెలుగు సినిమాకి ఉదాహరణలుగా చరిత్రలొ నిలిచిపొయాయనటం పొగడ్త కాదు. క్లుప్తంగా ఈయన గీసిన బొమ్మని సంతకం లేకపొయిన,తీసిన సినిమాలొ దర్శకుడిగా ఈయన పేరు చూడక పొయినా చప్పున ఎవరయినా ఇది గీసింది,తీసింది బాపూ అని గుర్తించగలిగేటంత విలక్షణమయిన శైలి ఈ ప్రతిభావంతుడి సొత్తు. విషయ సూచిక * 1 జీవితం * 2 చిత్రకళ * 3 బాపు చిత్రమాలిక * 4 చలన చిత్రకళ o 4.1 బాపు దర్శకత్వం వహించిన సినిమాలు * 5 ప్రదర్శనలు * 6 ప్రముఖుల అభిప్రాయాలు * 7 పురస్కారాలు * 8 మూలాలు * 9 బయటి లింకులు జీవితం బాపు తల్లి తండ్రులు బాల్యంలో బాపు బాపు అసలు పేరు సత్తిరాజు వెంకట లక్ష్మీనారాయణ. బాపు డిసెంబర్ 15, 1933 వ సంవత్సరం లో పశ్చిమ గోదావరి జిల్లా, నర్సాపురం లో వేణు గోపాల రావు,సూర్యకాంతమ్మ దంపతులకు జన్మించారు.[1] 1955 వ సంవత్సరం లో మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి లాయర్ పట్టా పుచ్చుకున్నారు. అదే సంవత్సరం ఆంధ్ర పత్రిక దినపత్రికలో వ్యంగ్య చిత్రకారునిగా చేరారు. చిత్రకళ బాపుబొమ్మ బాపు స్వీయ రేఖాచిత్రం బాపు చిత్రకళ ఒక విషయానికి పరమితంకాలేదు. 1945 నుండీ బాపు చిత్రాలనూ, వ్యంగ్యచిత్రాలనూ, పుస్తకాల ముఖచిత్రాలనూ, పత్రికల ముఖచిత్రాలనూ, కధలకు బొమ్మలనూ, విషయానుగుణ చిత్రాలనూ పుంఖాను పుంఖాలుగా సృష్టిస్తున్నారు. కొత్త రచయితలూ, ప్రసిద్ధ రచయితలూ, పురాణాలూ, జీవితమూ, సంస్కృతీ, రాజకీయాలూ, భక్తీ, సినిమాలూ - అన్ని రంగాలలో ఆయన గీతలు వాసికెక్కాయి. ఆయన చిత్రాలతో ఉన్న శుభాకాంక్ష పత్రికలు (గ్రీటింగ్ కార్డులు), పెళ్ళి శుభలేఖలూ కళాప్రియులు కోరి ఏరుకుంటారు. బాపు రాత కూడా అంతే. ఇంతవరకూ తెలుగునాట ఎవరి చేతి వ్రాతకూ ఆ ప్రాముఖ్యత అందలేదు. తెలుగులో బాపు అక్షరమాల (ఫాంట్) ఎన్నో డి.టి.పి సంస్థలూ, ప్రచురణా సంస్థలూ వాడుతుంటాయి. నవరసాలు, అష్టవిధనాయికలు, జనార్దనాష్టకము, అన్నమయ్య పాటలు, రామాయణము, భారతీయ నృత్యాలు, తిరుప్పావై - ఇలా ఎన్నో విషయాలపై బాపు ప్రత్యేక చిత్రావళిని అందించారు. ఆయన చిత్రాలలో కొన్ని ప్రధాన లక్షణాలు కనిపిస్తాయి. * పొదుపుగా గీతలు వాడటం. * ప్రవహించినట్లుండే ఒరవడి * సందర్భానికి తగిన భావము * తెలుగుదనము బుడుగు బాపు కొతకాలం జె.వాల్టర్ థామ్సన్ సంస్థలోనూ, ఎఫిషియెంట్ పబ్లికేషన్స్ లోనూ, ఎఫ్.డి.స్టీవార్ట్స్ సంస్థలోనూ పని చేశారు. బాపు కృషిలో సహచరుడైన ముళ్ళపూడి వెంకటరమణ తో కలిసి రూపొందించిన బుడుగు పుస్తకం తెలుగు సాహిత్యంలో ఒక క్లాసిక్. ఇందులో బుడుగు తో పాటు సిగానపెసూనంబ తెలుగువారి హృదయంలో చిరకాలస్థానం సంపాదించుకొన్నారు. ఆయన చిత్రాలు దేశదేశాలలో ఎన్నో ప్రదర్శనలలో కళాభిమానుల మన్నలందుకొన్నాయి. బాపు చిత్రమాలిక అసంఖ్యాకంగ ఈయన గీసిన అందమయిన, అద్భుతమయిన చిత్రాలలొనుండి మచ్చుకు కొన్ని... బాల కృష్ణుడు గంగావతారం సీతారాముల పట్టాభిషేకం సరస్వతీదేవి రామాయణం క్లుప్తంగా దారి విడుము కృష్ణా... కూచిపూడి... నమస్కారం చలన చిత్రకళ 1967లో సాక్షి (సినిమా) చిత్రదర్శకునిగా సినిమారంగంలో అడుగుపెట్టిన బాపు మొదటి చిత్రంతోనే ప్రసంసలు అందుకొన్నారు. అయన మొత్తం 41 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 1976లొ వెలువడిన 'సీతాకల్యాణం' సినిమా చూసెవారికి కన్నుల పండుగ. ముఖ్యంగా అందులో గంగావతరణం సన్నివేశం మరువరానిది. బాపు తను తీయబోయే చలన చిత్రపు సన్నివేశాలని సచిత్రంగా ( స్టోరీబోర్డు ) తయారు చేసుకుని తెరమీదకి ఎక్కిస్తారు.ఈ విదానం వలన తను మనసులో అనుకున్నది కాగితం మీద ఎంత అందంగా చిత్రీకరించుకుంటారో అంతే అందంగా తెరమీద గందరగోళం లేకుండా చిత్రీకరించగలుగుతారు. ఉదాహరణకి...రాధాగోపాళం తెలుగు సినిమాకి ఈయన గీసుకున్న సన్నివేశపు చిత్రం. రాధాగోళం సినిమాకు స్టోరీబోర్డు చిత్రాలు - ముందుగా గీసిన చిత్రాలతోబాటు సినిమా తీసిన తరువాతి షాట్లను కూడా చూడవచ్చును. బాపు దర్శకత్వం వహించిన సినిమాలు చిత్రం పేరు విడుదల సంవత్సరం బాష తెలుగు సుందరకాండ 2008 తెలుగు రాధా గోపాళం 2005 తెలుగు రాంబంటు 1996 తెలుగు పెళ్ళికొడుకు 1994 తెలుగు పరమాత్మా 1994 హిందీ శ్రీనాథ కవిసార్వభౌమ 1993 తెలుగు మిష్టర్ పెళ్ళాం 1993 తెలుగు పెళ్ళి పుస్తకం 1991 తెలుగు ప్రేమ్ ప్రతిగ్యా 1989 హిందీ దిల్ జలా 1987 హిందీ ప్యార్ కా సిందూర్ 1986 హిందీ కళ్యాణ తాంబూలం 1986 తెలుగు మేరా ధరమ్ 1986 హిందీ ప్యారీ బెహనా 1985 హిందీ బుల్లెట్ 1985 తెలుగు జాకీ 1985 తెలుగు మోహబ్బత్ 1985 హిందీ సీతమ్మ సేత 1984 తెలుగు మంత్రిగారి వియ్యంకుడు 1983 తెలుగు వోహ్ సాత్ దిన్ 1983 హిందీ ఏది ధర్మం ఏది న్యాయం 1982 తెలుగు కృష్ణావతారం 1982 తెలుగు నీతిదేవన్ మయగుగిరన్ 1982 తమిళం పెళ్ళీడు పిల్లలు 1982 తెలుగు బేజుబాన్ 1981 హిందీ రాధా కళ్యాణం 1981 తెలుగు త్యాగయ్య 1981 తెలుగు హమ్ పాంచ్ 1980 హిందీ వంశవృక్షం 1980 తెలుగు కలియుగ రావణాసురుడు 1980 తెలుగు పండంటి జీవితం 1980 తెలుగు రాజాధిరాజు 1980 తెలుగు తూర్పు వెళ్ళే రైలు 1979 తెలుగు మనవూరి పాండవులు 1978 తెలుగు అనోఖా శివభక్త్ 1978 హిందీ గోరంత దీపం 1978 తెలుగు స్నేహం 1977 తెలుగు భక్త కన్నప్ప 1976 తెలుగు సీతాస్వయంవర్ 1976 హిందీ శ్రీ రాజేశ్వరీవిలాస్ కాఫీక్లబ్ 1976 తెలుగు సీతాకల్యాణం 1976 తెలుగు ముత్యాల ముగ్గు 1975 తెలుగు శ్రీ రామాంజనేయ యుద్ధం 1974 తెలుగు అందాల రాముడు 1973 తెలుగు సంపూర్ణ రామాయణం 1971 తెలుగు బాలరాజు కధ 1970 తెలుగు ఇంటి గౌరవం 1970 తెలుగు బుద్ధిమంతుడు 1969 తెలుగు బంగారు పిచ్చుక 1968 తెలుగు సాక్షి 1967 తెలుగు ప్రదర్శనలు ] ప్రముఖుల అభిప్రాయాలు * శివలెంక రాధాకృష్ణ-ఆంధ్ర పత్రిక సంపాదకులు-చక్కటి గీత, నొప్పించని హేళన, మొత్తం మీద అందంగా కనిపించే బొమ్మ-తెలుగు కార్టూన్‌లలో ఈ లక్షణాలు ఉన్న సంప్రదాయాన్ని శ్రీ బాపు గారు మొదలు పెట్టారు. పురస్కారాలు ముగ్దమనోహరమయిన ఒక స్రీ హొయలు... బాపు గారికి స్వదేశీ, విదేశీ పురస్కారాలు ఎన్నో లభించాయి. అందులో ముఖ్యమయినవి కొన్ని. * బాపు గారి దర్శకత్వం వహించిన ముత్యాల ముగ్గు చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా (1975 వ సంవత్సరం) భారత ప్రభుత్వ పురస్కారం తో పాటు సినిమాటోగ్రాఫర్ ఇషాన్ అర్యాకి చాయగ్రాకుడిగా పురస్కారం. * 1986 వ సంవత్సరంలో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఎ.పి కళా వేదిక ద్వారా రఘుపతి వెంకయ్య స్మారక పురస్కారం మదర్ థెరిస్సా బహుకరించగా తన స్నేహితుడు ముళ్ళపూడి వెంకట రమణ తో కలసి స్వీకారం.[2] * చెన్నై(తమిళనాడు)లో స్థాపించిన శ్రీ రాజలక్ష్మి ఫౌండేషన్ వారి ప్రతిస్టాత్మకమయిన రాజ్యలక్ష్మి పురస్కారం 1982 వ సంవత్సరంలో ఇవ్వబడింది. * 1991 వ సంవత్సరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్ కళాప్రపూర్ణ బహుకరణ. * 1992 వ సంవత్సరంలో అమెరికా తెలుగు అసోసియేషన్ (ATA) వారిచే శిరోమణి పురస్కారం అమెరికాలో స్వీకరణ. * మిస్టర్ పెళ్ళాం సినిమాకి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా భారత ప్రభుత్వ పురస్కారం.(1993 వ సంవత్సరం) * 1995 వ సంవత్సరంలో తెలుగు అసోసియేషన్ అఫ్ నార్త్ అమెరికా(TANA) వారిచే తెలుగు చిత్ర కళా,సాహిత్య,సాంస్కృతిక,సినిమా రంగాలకి తన ఏభై సంవత్సరాల(గోల్డెన్ జూబ్లీ సెలేబ్రషన్) సేవకి గాను ఘన సన్మానం. * బాపు గారిమీద ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు వంశీ తీసిన డాక్యుమెంటరీ చిత్రానికి 1996 వ సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నంది అవార్డు.[3] * 9 జూన్,2001 వ సంవత్సరంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్టుస్ (IIC) వారిచే జీవిత సాఫల్య పురస్కారం తో సన్మానం. * 2 జూన్,2001 వ సంవత్సరంలో డిసెంబర్ న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం వారిచే విశిష్ట పురస్కారంతో గౌరవం. * అకాడమీ అఫ్ ఫైన్ ఆర్ట్స్, తిరుపతి వారిచే ప్రెసిడెంట్ అఫ్ ఇండియా అవార్డు భాహుకరణ.[4] * బాలరాజు కథ (1970), అందాల రాముడు (1973), ముత్యాల ముగ్గు (1975),పెళ్లి పుస్తకం (1991), మిస్టర్ పెళ్ళాం (1993) సినిమాలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి నంది పురస్కారాలు.