-
జంధ్యాల
Posted by
సుమన్.గద్దె
on 25, నవంబర్ 2009, బుధవారం
Labels:
సినిమాలు
జంధ్యాల తెలుగు సినిమా రచయిత, దర్శకుడు. జంధ్యాల అని ఇంటిపేరుతోటే సుప్రసిద్ధుడైన ఇతని అసలుపేరు జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి. ప్రత్యేకించి హాస్యకథా చిత్రాలు తీయటంలో ఇతనిది అందె వేసిన చెయ్యి. జంధ్యాల చెప్పిన ప్రసిద్ధ వాక్యం - నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం
విషయ సూచిక
* 1 జీవిత విశేషాలు
* 2 సినిమా ప్రస్థానం
* 3 జంధ్యాల చెణుకులు
* 4 అవార్డులు
* 5 జంధ్యాల పరిచయం చేసిన నటీనటులు
* 6 జంధ్యాల వ్రాసిన కొన్ని సినీ సంభాషణలు
* 7 జంధ్యాల సినిమాలు
* 8 బయటి లింకులు
జీవిత విశేషాలు
జంధ్యాల 1951 జనవరి 14 న పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించారు. బి.కామ్ వరకు చదువుకున్నారు. చిన్నతనం నుండీ నాటకాల పట్ల ఆసక్తిగా ఉండేవారు. స్వయంగా నాటకాలు రచించారు కూడాను. ఆయన రాసిన నాటకాల్లో ఏక్ దిన్ కా సుల్తాన్, గుండెలు మార్చబడును ప్రముఖమైనవి. ఆయన నాటకాలు అనేక బహుమతులు అందుకున్నాయి.
1974 లో జంధ్యాల సినిమా రంగ ప్రవేశం చేసాడు. శంకరాభరణం, సాగరసంగమం, అడవిరాముడు, వేటగాడు వంటి అనేక విజయవంతమైన సినిమాలకు మాటలు రాసారు. ముద్దమందారం సినిమాతో దర్శకుడిగా మారి, శ్రీవారికి ప్రేమలేఖ వంటి చిరస్మరణీయ చిత్రాన్ని సృజించారు.
జంధ్యాల 2001 జూన్ 19 న హైదరాబాదులో గుండె పోటుతో మరణించారు.
] సినిమా ప్రస్థానం
మాటల రచయితగా తన సినిమా జీవితం మొదలుపెట్టిన జంధ్యాల, మంచి రచయితగా పేరు తెచ్చుకున్నాడు. తరువాతి కాలంలో దర్శకుడిగా అవతారమెత్తి, అనేక హాస్యచిత్రాలను రూపొందించాడు. ఆరోగ్యకరమైన హాస్యానికి జంధ్యాల పేరుగాంచాడు. హాస్యబ్రహ్మ అని పేరుపొందాడు.
జంధ్యాల చెణుకులు
* ఇంటిపేరుతోటే ప్రసిద్ధుడైన జంధ్యాలను మీ అసలు పేరు ఏమిటి అని అడిగితే ఆయన ఇలా అనేవాడు: "నేను రామానాయుడి గారి సినిమాకు పనిచేసేటపుడు నాపేరు జంధ్యాల రామానాయుడు, విశ్వనాథ్ గారి సినిమాకు పనిచేసేటపుడు నా పేరు జంధ్యాల విశ్వనాథ్..." అలా అనేవాడు తప్ప, తన అసలుపేరు ఎక్కడా చెప్పుకోలేదు.
* హాస్యం గురించి ఆయన ఇలా అనేవాడు: "నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం"
అవార్డులు
జంధ్యాలకు లభించిన కొన్ని అవార్డులు:
- 1983, "ఆనంద భైరవి" చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రం దర్శకుడు జాతీయ అవార్డు
- 1983, "ఆనంద భైరవి" చిత్రానికి ఉత్తమ దర్శకుడు నంది అవార్డు
- 1987, "పడమటి సంధ్యారాగం" చిత్రానికి ఉత్తమ కధారచయిత అవార్డు
- 1992, "ఆపద్బాంధవుడు" చిత్రానికి ఉత్తమ మాటల రచయిత అవార్డు
జంధ్యాల పరిచయం చేసిన నటీనటులు
జంధ్యాల తన సినిమాల ద్వారా అనేకమంది నటులను సినిమా రంగానికి పరిచయం చేసాడు. వారిలో కొందరు:
* బ్రహ్మానందం
* నరేష్
* ప్రదీప్
* సుత్తి వీరభద్రరావు
* సుత్తి వేలు
జంధ్యాల వ్రాసిన కొన్ని సినీ సంభాషణలు
వివాహ భోజనంబు చిత్రం నుంచి
మట్టి పూసుకొని ఉన్నపుడు బ్రహ్మానందం సంభాషణ--(ఏడుపు గొంతుతో) ఈ చెమ్మంతా ఇగిరేలోపు మన కళ్ళు చెమ్మగిల్లుతాఏమో మహాప్రభో. ఇట్లా మనల్ని ఎవరు చూసినా ప్రమాదమే . జూవాళ్ళు చూస్తే వాళ్ళ కోతులు తప్పించుకొచ్చాయని పట్టుకెళ్ళి పోతారు. జనమెవరయినా చూస్తే ఇతర గ్రహాలనుండి వచ్చారనుకొని రాళ్ళుచ్చుక్కొడతారు... (ఆశగా ) ఇంక ఎంచక్కా కడిగేసుకుందామా మహాప్రభో.
కధ చెప్పమని--ఈ కథ సినెమాగా తీస్తే నేను అడుక్కుతినాల, ఓ వూరు వూరంతా పస్తుండి నాకు ముష్టెయ్యాల్సొస్తుంది. అరే ఇన్నాళ్ళనుండి సూత్తన్నాను. సినిమాకు పనికొచ్చే ఒక కథ కూడా సెప్పలేనోడివి నువ్వేం కవివయ్యా అసలు. నేనొక గొప్ప కథ సెప్తాను ఇనుకో
మధ్య తరగతి ఎదవనాయాలా. మహాప్రభో తమరు నన్ను తిట్టారా?
లేదు సినిమా పేరు చెప్పా--ఆ పేరు తిట్టులా ఉంది మహాప్రభో --పేరులో తిట్టుంటేనే సినిమా హిట్టవుద్దయ్యా
తెర లెగవంగానే ఈరో ఒక కాఫీ ఓటల్కు ఎల్తాడు. సర్వర్ రాగానే ఈరో ఏమున్నాయి అని అడిగాడు. అప్పుడు సర్వరు "ఇడ్లీ, రవ్వ ఇడ్లీ, గారె, మషాలా గారె, ఉప్మా, కిచిడీ, పెసరట్టు, మినపట్టు, రవ్వట్టు, మషాలా అట్టు, బాత్తు, టమేటా బాత్తు, బోండా, బజ్జీ, మైసూరు బజ్జీ, మిరపకాయ బజ్జీ, అరిటికాయ బజ్జీ, తమలపాకు బజ్జీ, లడ్డు, బందరు లడ్డు, రవ్వ లడ్డు, మిఠాయి, పీచు మిఠాయి, బందరు మిఠాయి, బొంబాయి మిథాయి, కలకత్తా మిఠాయి, జాంగ్రీ, పాలకోవా,హల్వా, మైసూరు పాకు, అమలాపురం కాజా, భీమవరం బాజా, పెద్దాపురం కూజా" ఉన్నాయంటాడు.
అప్పుడు ఈరో "అట్టు తే" అన్నాడు
అప్పుడు సర్వరు " యే అట్టు? పెసరట్టా, మినపట్టా, రవ్వట్టా, మషాలా అట్టా, 70mm అట్టా, MLA అట్టా, నూనేసి కాల్చాలా నెయ్యేసి కాల్చాలా, నీళ్ళోసి కాల్చాలా, పెట్రోలు పోసి కాల్చాలా, కిరసనాలు పోసి కాల్చాలా, డీజిలేసి కాల్చాలా, అసలు కాల్చాలా వద్దా " అని అడిగాడు
అప్పుడు ఈరో పెసరట్టు నెయ్యేసి కాల్చమన్నాడు, కాఫీ కూడా తెమ్మన్నాడు
అప్పుడు సర్వరు "యే కాపీ మామూలు కాపీయా,స్పెసలు కాపీయా, బుర్రూ కాపీయా, నెస్కాఫీయా, బ్లాక్ కాఫీయా, వైటు కాఫీయా హాటు కాఫీయా, కోల్డు కాఫీయా , నురుగు కావాలా వద్దా, కావాలంటే ఎన్ని చెంచాలు " అని అడిగాడు
అప్పుడు ఈరో మామూలు కాపీ తెమ్మన్నాడు
అప్పుడు సర్వరు "నీలగిరి కాపీయా, హిమగిరి కాపీయా, సిమలా కాపీయా'
ఆపండి మహాప్రభో, తమలో ఇంత వూహాశక్తి ఉందని వూహించలేకపోయాను. ఈ కథనే సినిమాగా తీసుకోండి. పది వేల రోజులు ఆడుతుంది జనం వ్రుద్దులై పండి రాలిపోయేంత వరకు, కలియుగాంతం వచ్చి సర్వ ప్రాణి నాశనం అయిపోయేంత వరకు ఈ సినిమా ఆడుతూనే ఉంటుంది మహాప్రభో నన్ను వదిలెయ్యండి మహాప్రభో నన్ను వదిలెయ్యండి
మహాప్రభో అద్దె బాకీ మాఫీ చేస్తానని తమరు నన్నిలా శంకుస్థాపన టైపులో పాతిపెట్టి తమరలా విష్ణుమూర్థిలా పడుకోవడం ఏమీ బాగలేదు మహాప్రభో
నిన్ను నేను పాతిపెట్టాను కదా, నన్ను పాతి పెట్టే మడిసి కోసం సూత్తన్నానయ్యా
నన్ను తొరగా బయటకి లాగండి మహాప్రభో. ఏ ఊరకుక్కాన్నా దగ్గరికొచ్చి కాలెత్తిందంటే పావనమైపోతాను. లేదా యే అల్సేషనో ఇసుకలో బంతి పడిందని నా తల నొట కరుచుకొని వెళ్ళిపోతే కీర్తిశేషుడిని అయిపోతాను. చీ ముక్కు మీద దురద పుట్టినా గోక్కోలేని వెధవ బ్రతుకు అయిపోయింది నాది
స్షో ఆట్టే వాగావంటే... .... నువ్వు సెప్తున్న కథలో ఏదో లోపముందయ్యా కవీ. నేను ఆలోసించి పెట్టుకున్న సిన్న లైను ఇనిపిస్తాను ఇనుకో
వో ప్యామిలీ మంగలగిరి తిరణాలకెల్తారు. ఆళ్ళ కొడుకు ఆరేళ్ళ గుంటడు ఆ జనంలో తప్పోతాడు. ఆడి తల్లిదండ్రులు ఆడికోసం బావురుమంటారు
ఆహా సెంటిమెంటు బాగుందండయ్యా. మొదటి సారిగా తమరు మెదడు వాడుతున్నారు, వాడండి
ఆడి తండ్రి ఆడికోసం వూళ్ళన్నీ గాలించడం మొదలుపెట్టాడు. యే యే వూళ్ళు తిరిగాడో తెలుసా?
ఐదరాబాదు, అదిలాబాదు, సికిందరాబాదు, అహమ్మాదాబాదు, ఫకీరాబాదు,అలహాబాదు, ఫరీదాబాదు. ఔరంగాబాదు, తనబాదు (??), సింధుబాదు,ముస్తాబాదు, ఫైసలాబాదు, గజియాబాదు, అబ్దుల్లాబాదు, జపారాబాదు, వుస్సేనుబాదు. (బ్రహ్మం ఏడుస్తూ) నా బొందబాదు, నా శ్రాద్దంబాదు, నా పిండాకూడు బాదు
ఆ ఆ ఆటన్నిటితో కలిపి మొత్తం ఇరవయ్యొక్క బాదులు ఎతికాడు. సివరాఖరికి యెవుడో ఆ గుంటడు బెజవాడలో ఉన్నాడని సెప్తే ఆ వూరెళ్ళాడు.
బెజవాడలో
గవర్నరుపేట, లబ్బీ పేట, పున్నమ్మ తోట, భాస్కర్రావు పేట, సింగు నగరం, ప్రజాశక్తి నగరం, అయోధ్యా నగరం, ముత్యాలపాడు, గుణదల, గాంధీ నగరం, చిట్టి నగరం, మాచవరం, రోకళ్ళపాలెం, మారుతీ నగరం, మొగల్రాజపురం, భవానీపురం, సత్యన్నారాయనపురం, సీతారామపురం...
వద్దు బాబోఇ, చాలు మహాప్రభో చాలు, బెజవాడంతా వెతికేసాడనుకుందాం ఒక్క మాటలో సరిపోతుంది మహాప్రభో.
అన్నీ పేట్లెతికినా ఆ గుంటడు దొరకలేదయా, అప్పుడు...
పారిపోవడానికి కూడా వీలులేని పరిస్థిథిలో పడిపోయాను మహాప్రభో
ఇను ఇక్కడే ఇక్కడే తమాషగుంటంది అప్పుడు ఆడు రోడ్ల మీద పడ్డాడు. యే యే రోడ్ల మీద పడ్డాడో తెలుసా? బీసెంటు రోడ్డు, బందరు రోడ్డు, యేలూరు రోడ్డు, నక్కల రోడ్డు, టిక్కల రోడ్డు, కారల్ మార్క్సు రోడ్డు, గాంధీ రోడ్డు, వన్ టవును రోడ్డు, అద్దంకివారి వీధి, తాళంకివారి వీధి, దాసరివారి వీధి, మల్లెలవారి వీధి, పుల్లెలవారి వీధి, పూలబావి వీధి, కొత్తగుళ్ళ వీధి, మసీదు వీధి, వినోడా టాకీసు వీధి, అచ్చమామబ ఆస్పత్రి వీధి, మాంటిసోరి స్కూలు వీధి, హనుమంతరాయ గ్రంథాలయం వీధి...
మహాప్రభో ఆపండి, ఇది సినిమా కథా? ఈ లెక్కన పోస్ట్ మ్యాన్లు అత్యద్భుతమయిన సినిమా కథలు రాయగలరు. కుక్కొచ్చి కాలెత్తినా పందొచ్చి తల కొరికినా ఇంతకంటే సుఖంగా ఉంటుంది మహాప్రభో
వేటగాడు చిత్రం నుంచి
రావుగోపాలరావు, సత్యనారాయణతో -రాజా ప్రియురాలు రోజా మేజా బల్ల మీదికెక్కి కాజాలు తింటూ నీ వీపు మీద బాజాలు బాదుతోంటే నువ్వేంచేస్తున్నావురా కూజా" అన్నప్పుడు సత్యనారాయణ చిన్నబుచ్చుకున్న కోపంతో రావుగోపాలరావు ప్రాసల బలం ఎంతుందో చూపమంటాడు. అప్పుడు రావుగోపాలరావు - " రాజుగారి పెద్ద కొడుకు బెస్టుగా పస్టు క్లాసులో పాసయ్యాడని, బావుండదని గెస్టుగా పీస్టుకి పిలిచి, హోస్టుగా నేనుండి సపర్యలు చేస్తోంటే, సుస్టుగా భోంచేసి, పొద్దున్నే లేచి మన పేస్టుతోనే పళ్లు తోంకుని, ఉడాయించాడు భ్రస్టు వెధవ" అన్నప్పుడు ఇదంతా విని రొప్పుతున్న సత్యనారాయణని చూసి - " ఇంకా విసరమంటావా నా మాటల తూటాలు" అంటాడు.
జంధ్యాల సినిమాలు
దర్శకునిగా
సినిమా తారాగణం విడుదల తేది
ముద్ద మందారం ప్రదీప్, పూర్ణిమ 1981
మల్లె పందిరి విజ్జి బాబు, జ్యోతి, యస్.పి.బాల నుబ్రమణ్యం 1982
నాలుగు స్తంభాలాట నరేష్, ప్రదీప్, పూర్ణిమ, తులసి 15-5-1982
నెలవంక రాజేష్, గుమ్మడి, జే.వి.సోమయాజులు 25-1-1983
రెండుజెళ్ళ సీత నరేష్, ప్రదీప్, రాజేష్, సుభాకర్, మహాలక్ష్మి 30-3-1983
అమరజీవి అక్కినేని నాగేశ్వరరావు, జయప్రద 19-8-1983
మూడు ముళ్ళు చంద్రమోహన్, రాధిక, గీత -9-1983
శ్రీవారికి ప్రేమలేఖ నరెష్, పూర్ణిమ 2-3-1984
ఆనంద భైరవి (తెలుగు & కన్నడం) గిరీష్ కర్ణాడ్, మాళవిక -4-1984
రావు - గోపాలరావు రావు గోపాలరావు, చంద్రమోహన్, ముఛ్ఛర్ల అరుణ 1984
పుత్తడి బొమ్మ నరేష్, పూర్ణిమ, ముఛ్ఛర్ల అరుణ 1985
బాబాయ్ అబ్బాయ్ బాలకృష్ణ, అనితా రెడ్డి, సుత్తి వీరభద్ర రావు 8-2-1985
శ్రీవారి శోభనం నరేష్, అనితా రెడ్డి 1985
మొగుడు పెళ్ళాలు నరేష్, భానుప్రియ 5-8-1985
ముద్దుల మనవరాలు భానుమతి, సుహాసిని, జయసుధ, చంద్రమోహన్, శరత్ బాబు 1985
రెండు రెళ్ళు ఆరు రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్, రజని, ప్రీతి 11-1-1986
సీతారామ కళ్యాణం బాలకృష్ణ, రజిని 18-4-1986
చంటబ్బాయి చిరంజీవి, సుహాసిని 22-8-1986
పడమటి సంధ్యారాగం విజయశాంతి, టామ్, గుమ్మలూరి శాస్త్రి 11-4-1987
రాగలీల రఘు, సుమలత, తులసి, సంధ్య 4-6-1987
సత్యాగ్రహం చల్లా రామకృష్ణా రెడ్డి, సరిత, గుంటూరు శాస్త్రి 1987
అహ నా పెళ్ళంట రాజేంద్ర ప్రసాద్, రజని 27-11-1987
చిన్ని కృష్ణుడు రమేష్, కుషుబూ, శరత్ బాబు -4-1988
వివాహ భోజనంబు రాజేంద్ర ప్రసాద్, అశ్విని -4-1988
నీకు నాకు పెళ్ళంట డా.రాజశేఖర్, అశ్వని 8-1988
చూపులు కలసిన శుభవేళ నరేష్, మోహన్, అశ్వని, సుధ 7-10-1988
హై హై నాయకా నరేష్, శ్రీ భారతి 23-2-1989
జయమ్ము నిశ్చయమ్మురా రాజేంద్ర ప్రసాద్, సుమలత, చంద్రమోహన్, అవంతి 6-7-1989
లేడీస్ స్పెషల్ సురేష్, వాణీ విశ్వనాథ్, రశ్మి, సుత్తివేలు 1991
బావా బావా పన్నీరు నరేష్, రూపకళ 9-8-1991
ప్రేమ ఎంత మధురం నరేష్, మయూరి 6-9-1991
విచిత్రప్రేమ రాజేంద్ర ప్రసాద్, అమృత 1991
బాబాయి హోటల్ బ్రహ్మానందం, కిన్నెర 5-6-1992
ప్రేమా జిందాబాద్ రాజేంద్ర ప్రసాద్, ఐశ్వర్య, సుభలేఖ సుధాకర్ -
అ ఆ ఇ ఈ వరుణ్ రాజ్, అచ్యుత్, విజయ్ కుమార్ -
ష్ గప్‌చుప్ వరుణ్ రాజ్, భానుప్రియ 12-5-1994
ఓహో నా పెళ్ళంట హరీష్, సంఘవి 20-3-1996
విచిత్రం గజల్ శ్రీనివాస్, చంద్రశ్రీ, శ్రీ హర్ష, చార్మి 6-11-1999
రచయితగా
* నారీ నారీ నడుమ మురారి
* అడవి రాముడు
* వేటగాడు
* రహస్య గూఢచారి
* సీతాకోక చిలుక
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి