-
డా. దాసరి నారాయణరావు
Posted by
సుమన్.గద్దె
on 25, నవంబర్ 2009, బుధవారం
Labels:
సినిమాలు
డా. దాసరి నారాయణరావు 1947, మే 4న పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లులో జన్మించాడు. దాసరి, రాజకీయనాయకుడు, సినిమా దర్శకుడు మరియు సినీ నిర్మాత. కళాశాలలో చదివేరోజులలో బీ.ఏ డిగ్రీతో పట్టబధ్రుడు అవటంతో పాటు దాసరి అనేక నాటకపోటీలలో కూడా పాల్గొనేవాడు. అనతి కాలంలోనే ప్రతిభ గల రంగ స్థల నటుడి గా, నాటక రచయిత గా చిత్ర దర్శకుడి గా గుర్తింపు పొందారు. దాసరి నారాయణరావు దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించాడు. 53 సినిమాలు స్వయంగా నిర్మించాడు. ఈయన 250 పైగా చిత్రాలలో సంభాషణ రచయితగా లేదా గీతరచయితగా పనిచేశాడు. దాసరి తెలుగు, తమిళం మరియు కన్నడ భాషా చిత్రాలలో నటించి, తన నటనకుగాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ నటునిగా బహుమతి కూడా పొందాడు. కృషితో నాస్తి దుర్భిక్షం అనే పదానికి తెలుగుసినీరంగంలో ఉదాహరణగా ఈయన గురించి చెబుతారు.
ఈయన అనేకమంది కొత్త కళాకారులను సినీరంగానికి పరిచయం చేసి తారలు అయ్యేందుకు దోహదపడ్డాడు. ఒకానొక సమయంలో ఈయన పేరిట 18,000 కు పైగా అభిమానసంఘలు ఉండేవి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలలో ఈయన ప్రాచుర్యానికి అద్దం పడుతుంది.
దాసరి సినిమాలు తాతా మనవడు, స్వర్గం నరకం, మేఘసందేశం, మరియు మామగారు ఈయనకు అనేక అవార్డులు తెచ్చిపెట్టాయి. ఈయన సినిమాలు ముఖ్యముగా స్త్రీ ప్రధానముగా ఉండి వరకట్న సమస్యకు వ్యతిరేకముగా సందేశాత్మకంగా రూపుదిద్దబడినవి. దాసరి తిసిన బొబ్బిలి పులి మరియు సర్దార్ పాపారాయుడు చిత్రాలు నందమూరి తారక రామారావు రాజకీయప్రవేశములో ప్రధానపాత్ర వహించాయి.
మామగారు, సూరిగాడు మరియు ఒసేయ్ రాములమ్మా చిత్రాలు దాసరి నటనా కౌశలానికి మచ్చుతునకలు. ఈ సినిమాలలో నటనకు దాసరి అనేక విమర్శకుల ప్రశంసలు మరియు బహుమతులు అందుకున్నాడు.
రాజకీయాలలో
హైదరాబాదునందు కేంద్ర మంత్రిగా దాసరి తెలుగు ఫాంట్స్ రిలీజ్ ఫంక్సన్ నందు ఉపన్యసిస్తున్న దృశ్యం
రాజీవ్ గాంధీ పాలనాకాలములో, దాసరి కాంగ్రేసు పార్టీ తరఫున ఉత్సాహవంతముగా ఎన్నికల ప్రచారము సాగించాడు. రాజీవ్ హత్యానంతరం పార్టీ కి కాస్త దూరంగా జరిగారు. 1990 దశకం చివరిలో ఆయన తెలుగు తల్లి అను ఒక రాజకీయ పార్టీని ప్రారంభించారు. ఈ పార్టీకి కోస్తా ప్రాంతాలలోని కాపు వర్గాల నుండి మంచి స్పందన లభించింది. ఆ తర్వాత మాత్రం ఆయన కాంగ్రేస్ పార్టీ తరపున రాజ్య సభ కు ఎన్నిక అయ్యారు. బొగ్గు మరియు గనుల శాఖకు కేంద్రమంత్రిగా కూడా వ్యవహరించారు. ఈయన కాంగ్రేస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కి సన్నిహితుడు. కాంగ్రేస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చాక క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు.
అవార్డులు
* 1974లో తాతా మనవడు సినిమాకి నంది అవార్డు అందుకున్నారు.
* స్వర్గం నరకం సినిమాకు ఉత్తమ చిత్రం గా బంగారు నంది బహుమతిని పొందారు.
* 1983లో మేఘ సందేశం చిత్రానికి గాను ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డును పొందారు.
* 1992లో మామగారు చిత్రానికి గాను ఉత్తమ నటుడు నంది అవార్డును పొందారు.
* 1986లో తెలుగు సంస్కృతి మరియు తెలుగు చిత్ర రంగం నకు ఆయన చేసిన సేవలకు గాను ఆంధ్రా విశ్వవిధ్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ ను పొందారు.
* ప్రముఖ సామాజిక సేవా సంస్థల నుండి అనేక అవార్డ్ లను పొందారు. వాటిలో కొన్ని వంశీ బెర్క్లే, కళా సాగర్, శిరోమణి ఇన్స్టిట్యుట్ మొదలైనవి. ఫిల్మ్ ఫేర్ అవార్డును 6 సార్లు, మద్రాసు ఫిల్మ్ ఫాన్స్ అవార్డ్ ను 5 సార్లు, సినీ హెరాల్డ్ అవార్డ్ ను 10 సంవత్సరాలు వరసగాను గెల్చుకున్నారు.
* జ్యోతి చిత్ర నుండి సూపర్ డైరెక్టర్ అవార్డ్ ను 3 సార్లు పొందారు.
* పాత కాలం నాటి ఆంధ్రపత్రిక నుండి ఉత్తమ దర్శకుడిగా 6 సార్లు ఎంపిక అయ్యారు.
* ఇవి కాక ఆయన నిర్మించిన చిత్రాలలో అనేకం అవార్డ్ లను గెలుచుకున్నాయి.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి