Rss Feed
పనికిరానివి పనికొచ్చేవి .. లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పనికిరానివి పనికొచ్చేవి .. లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

మతాల చరిత్ర

డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌
మతాల్లో నమ్మకం ఉండడం పూర్తిగా వ్యక్తిగతమైన విషయమని అనుకుంటాం. దేవుణ్ణి నమ్మమని ఎవరూ మనని నిర్బంధపెట్టరు కనక అది స్వచ్ఛందంగా ఆమోదించిన విషయంలాగా అనిపిస్తుంది. ఇది ఏ మాత్రమూ నిజంకాదు. ప్రత్యక్షంగా కాకపోయినా చుట్టూ ఉన్న సమాజమూ, సంస్కృతీ దేవుడున్నాడనే విషయాన్ని నిత్యమూ మనకు గుర్తుచేస్తూనే ఉండే అవకాశముంది. ఒకప్పుడు సమష్టి ప్రయోజనాలకు పనికొచ్చిన మతవిశ్వాసాలు తరవాతి దశల్లో మనుషులను ఏకాకులను చేశాయి. ఇదొక సామాజికపరిణామం.
మతవిశ్వాసాలు ఎంతో ప్రాచీనమైనవి. వాటిని ఈ రోజుల్లో ప్రశ్నించేవాళ్ళే తక్కువ. వాటిని నమ్మడం ఎంతో సహజమని ఎక్కువమంది అనుకుంటారు. అవి వేల ఏళ్ళుగా కొనసాగుతున్నాయనేది ఒక బలమైన కారణంగా వారికి కనిపిస్తుంది. అతీతశక్తుల గురించిన నమ్మకం ఆదిమమానవుల్లో సహజంగా తలెత్తడం ఒక ఎత్తయితే, ఆ భ్రమలూ, తప్పుడు నమ్మకాలూ ఇన్నాళ్ళుగా కొనసాగడానికి దోహదపడిన సామాజిక, ఆర్థిక, రాజకీయకారణాలన్నీ మరొక ఎత్తు. వీటన్నిటి గురించీ స్థూలంగానైనా తెలుసుకోకపోతే మతాలవల్ల నేటికీ కలుగుతున్న అయోమయమూ, అనర్థాలూ, హింసా, రక్తపాతమూ మొదలైనవాటికి కారణాలు అర్థంకావు.
మతాల చరిత్రయొక్క అధ్యయనం పంతొమ్మిదో శతాబ్దంనుంచీ మొదలయింది. దానివల్ల చారిత్రక వివరాలెన్నో బైటపడుతూవచ్చాయి. ప్రపంచంలో అనేకచోట్ల క్రీస్తుకు సుమారు 3 వేల ఏళ్ళ క్రితం లిపుల వాడకం మొదలయింది. అప్పటినుంచీ మతవిశ్వాసాలు ఏదో ఒక రూపంలో నమోదు అవుతూవచ్చాయి. మానవసమాజాలు రూపొందిన దశలో తెగలుగా జీవించిన ప్రజలు ఎందరో దేవతలను ఆరాధించేవారు. గణాచారులు నడిపిన తంతుల్లో రకరకాల జంతువులూ, చెట్లూ చేమలూ, ప్రకృతిశక్తులూ అన్నిటికీ పూజలు జరిగేవి. సమాజం విస్తృతమై సమాజజీవితాలు జటిలం అవుతున్నకొద్దీ దేవుడు ఒక్కడేనన్న భావన బలపడసాగింది. కారణాలేమిటో ఇప్పుడు ఖచ్చితంగా తెలియదు కాని మొత్తంమీద ఏకేశ్వరోపాసనకు భూమిక ఏర్పడింది. తెగలుగా జనపదాల్లో జీవించిన ప్రజలు చిన్న, పెద్ద సామ్రాజ్యాల పాలనకు లోనయారు. వ్యవసాయం పెద్దఎత్తున వ్యవస్థీకృతం అవడం వల్ల ప్రజల వ్యక్తిగత జీవితంకూడా అపూర్వమైన మార్పులకు గురి కాసాగింది.
తెగలు చిన్న రాజ్యాలుగానూ, చిన్న రాజ్యాలు పెద్ద సామ్రాజ్యాలుగానూ ఏకీకృతం అవుతున్న దశలో పాతకాలపు ఆచారాలకు కొత్త స్వరూపాలు ఏర్పడ్డాయి. టర్కీలో క్రీస్తుకు 9 వేల ఏళ్ళ క్రితమే మొదలైన ప్రాచీన దేవతారాధన గ్రీస్‌లో పెంపొందిన మతభావనలకు రూపాన్నిచ్చింది. అదే పద్ధతిలో గ్రీక్ దేవతలు రోమన్ నాగరికతకు భూమికను సిద్ధం చేశారు. ప్రాచీన గాథలూ, పురాణాలకు కొత్త రూపాలు ఏర్పడ్డాయి. తెగల్లో విడివిడిగా రూపొందిన మతభావనలన్నీ క్రమంగా ఏకం అవుతూ వచ్చాయి. తెగలమధ్య జరిగిన కొట్లాటల్లో జయం పొందినవారి దేవతలందరిదీ కొత్త సంస్కృతిలో పైచెయ్యి అయింది.
మతాలు బలపడిన తీరు కేవలం మనుషుల భావనలమీద అధారపడి, వారి ఇచ్ఛానుసారం జరగలేదు. సమాజాల్లో ఎటువంటి శక్తులు బలం సంపాదించుకోగలిగాయో వారు నమ్మిన మతాలే బలవత్తరం అవుతూవచ్చాయి. యేసుక్రీస్తును న్యాయవిచారణ జరిపి మరణదండనకు గురిచేసిన రోమన్ ప్రభుత్వం మొదట్లో క్రైస్తవమతాన్ని తీవ్రంగా అణగదొక్కింది. తరవాతికాలంలో రోమన్ చక్రవర్తులు అదే మతాన్ని అవలంబించాలని నిశ్చయించుకున్నాక క్రైస్తవమతం బలపడడమే కాక, దానికి అడ్డొచ్చినవారందరినీ రోమన్ ప్రభుత్వం మట్టుబెట్టసాగింది. మతాలకు స్వతహాగా బలమేమీ ఉండదు. పాలకవ్యవస్థ తలుచుకున్నప్పుడల్లా మతాల ప్రాబల్యం తగ్గడం, పెరగడం చరిత్రలో కనబడుతుంది.
చిన్న తెగలుగా వేటా, ఆహారసేకరణ ఆధారంగా జీవించిన దశతో పోలిస్తే వ్యవసాయం మొదలయాక జనాభా పెరగసాగింది. జనవాసాలు ఏర్పడి వాటిమధ్య సహకారసంబంధాలు పెరిగాయి. వస్తువుల మార్పిడి, వాణిజ్యం మొదలైన కొత్త ప్రక్రియలు ఆరంభమయాయి. శ్రమవిభజన ద్వారా అనేక చేతిపనులూ, వృత్తులూ చేపట్టడం వీలయింది. వ్యక్తులమధ్య కేవలం ఒకే తెగకూ, కుటుంబానికీ చెందిన సమష్టి భావనకు ప్రాధాన్యత తగ్గసాగింది. దగ్గర సంబంధీకులు కాకపోయినా ఎక్కువమంది వ్యక్తులు సమీపాన నివసించడం తప్పనిసరి అయింది. ఇటువంటి అపరిచితులమధ్య పొరపొచ్చాలూ, కొట్లాటలూ తలెత్తకుండా సహజీవనం కొనసాగేందుకు అందరినీ ఏకం చెయ్యగలిగిన మతవిశ్వాసాలకు అవసరం ఏర్పడింది. పురాతనపద్ధతిలో ఏ తెగకాతెగలో జరిగినట్టుగా పక్షుల, జంతువుల చిహ్నాలను ఆరాధించడం సాధ్యంకాలేదు గనకనే దేవతల సంఖ్యకూడా తగ్గుతూవచ్చింది. అందరికీ వర్తించి, అందరూ పాటించగలిగే మతవిశ్వాసాలకు రూపలక్షణాలు ఏర్పడ్డాయి. సంబంధీకులు కానటువంటి వ్యక్తులు పరస్పరం కలహించుకోకుండా శాంతియుత సహజీవనం కొనసాగించేందుకు అందరినీ కలిపే మతాలు రూపొందాయి. దీని ఫలితంగా వ్యక్తులందరూ ఎవరికి వారేననే భావనకూడా పెరిగింది. ఒకనాడు గణజీవితంలో ప్రవర్తిల్లిన ఐకమత్యం బలహీనపడి, ప్రతివ్యక్తీ ఏకాకి అనీ, ప్రతి ఒక్కడూ దేవుణ్ణే నమ్ముకుని జీవించాలనే దృక్పథం ఏర్పడి, ఈనాటికీ కొనసాగుతోంది. అప్పట్లో ఇదొక విప్లవాత్మకమైన మార్పు. దీనికి అధ్యాత్మిక, అతీత కారణాలేమీ లేవు. ఇదంతా ఆర్థిక, సామాజిక పరిణామాల ఫలితమే.
అలాగే సమాజంలోని కట్టుబాట్లూ, పరిపాలకవ్యవస్థా, చట్టాలూ, నిబంధనలూ అన్నీ వ్యక్తిగత పద్ధతులకు అతీతంగా రూపొందే అవసరం ఏర్పడింది. కారణాలు ఏవైనప్పటికీ మునుపటికన్నా అతి దగ్గరగా జీవించసాగిన ప్రజలందరూ ఎవరికివారుగా ఏకాకులైపోయారు. అటువంటి పరిస్థితిలో దేవుళ్ళని నమ్ముకోవడంతప్ప వారికి గతి లేకుండాపోయింది. తెగలుగా, ముఠాలుగా జీవించినప్పుడు వారందరికీ ఉండిన పరస్పర సహకారం, ఐక్యతా క్రమంగా తగ్గిపోయాయి. వారంతా మతాధికారుల, పాలకవర్గాల చెప్పుచేతల్లో మెలగవలసిన అవసరం ఏర్పడింది.
సమాజాలు విస్తరించి, సామ్రాజ్యాలుగా రూపొందుతున్నకొద్దీ పాలకుల బలం పెరగసాగింది. రాజు స్వయానా దేవుడికి ప్రతినిధి అనీ, అందరూ అతనికి తలఒగ్గి జీవించడం దైవశాసనమేననీ మతాధికారులు ప్రజలను నమ్మించసాగారు. ఈనాటి పత్రికలూ, వార్తామాధ్యమాలూ డబ్బుకోసమూ, ప్రాపకం కోసమూ పనికిమాలిన రాజకీయనేతలనూ, చెత్తరకం సినిమాతారలనూ ఆకాశానికెత్తి అతిశయోక్తులు వల్లించే పద్ధతిలోనే అప్పటి పూజారివర్గాలూ, కవిపుంగవులూ పాలకులను కీర్తిస్తూ ఉండేవి. చంద్రవంశమనీ, సూర్యవంశమనీ పేర్లు పెట్టి, ఒక్కొక్క చక్రవర్తీ ఏ దేవత అంశాన జన్మించాడో చెపుతూ ప్రజలను నమ్మించడం అప్పటి వ్యవస్థల్లో మామూలే. ఇది మనదేశంలోనే కాక, ప్రపంచంలో తొలి నాగరికలన్నిటిలోనూ కనిపిస్తుంది.
ఈ పాలకవ్యవస్థలో చట్టాలను అమలుచెయ్యడం, పన్నులూ, శిస్తులూ వసూలు చెయ్యడం, సామాన్యులకు కొంత శాంతిభద్రతలను ఏర్పాటుచెయ్యడం మొదలైనవి ఉండేవి. దొంగలూ, దోపిడీదార్లూ, శత్రుదేశాలూ దాడులు చేసి కొల్లగొట్టకుండా ఉండేందుకు ఆత్మస్థైర్యాన్నిచ్చే విధంగా ఈ పాలకుల గురించిన ప్రశంసలు కొంతవరకూ ఉపయోగపడేవి. అతీతశక్తులూ, వరాల గురించి ఏం చెప్పినప్పటికీ అవన్నీ నిత్యజీవితంలోని అవసరాలకనే నిర్దేశించబడిన అతిశయోక్తులు. వీటి గురించిన సరైన అవగాహన మనకు లేకపోతే ప్రతిదానికీ విపరీతమైన వ్యాఖ్యానాలు చెప్పి సమర్థించే అర్థంలేని ప్రయాసే మనకు మిగులుతుంది.
సమాజం ఆర్థికంగా, ఆహారోత్పత్తి తదితర మౌలికవ్యవస్థల్లో పరిణామాలకు లోనవుతున్నప్పు డల్లా గతితార్కిక భౌతికవాదం చెప్పినట్టుగా పాతవ్యవస్థల స్థానంలో కొత్తవి పుట్టుకురావడం, అవి కొత్తరకం స్పర్ధలకు దారితియ్యడం వగైరాలన్నీ జరుగుతాయి. ప్రజలు తెగలుగా జీవించిన పరిస్థితి మారి గణజీవితం, జనపదాలూ, రాజ్యాలూ, సామ్రాజ్యాలూ, వైయక్తిక ధోరణులు పెరగడం మొదలైనవన్నీ అనివార్యంగా తలెత్తినటువంటి సంఘటనలే. గుహావాసులుగా దుర్భరజీవితాలు గడిపిన తొలిమానవులను మతభావనలు ఏకం చేసి ఉండవచ్చుగాని, చరిత్ర మొదలైనప్పటినుంచీ మతాలు ప్రజలను వేరుచెయ్యడానికే ఎక్కువగా ఉపయోగపడ్డాయనిపిస్తుంది.

తేనీరు


ఉత్పత్తి

దాదాపు ప్రతి దేశంలోనూ టీ వినియోగంలో ఉన్నా భారతదేశం ఉత్పాదించే టీ వైవిధ్యానికీ, విశిష్టతకూ ప్రసిద్ధి పొందింది. పశ్చిమ బెంగాల్ లోని డార్జిలింగ్ టీ మిక్కిలి నాణ్యమైనది. ఇది సువాసనభరితమైనది. ముఖ్యంగా ఇక్కడి మంచుతో కూడిన హిమాలయ పర్వత వాతావరణ పరిస్థితుల వల్ల మరియు ఈ ప్రదేశంలో భూసార రచనా విధానం వల్ల ఇక్కడ ఉత్పత్తి కాబడే టీకి ప్రత్యేక రుచి, సువాసన సిద్ధిస్తుంది. భారతదేశంలో టీ వ్యవసాయం ప్రాతిపదికగా అనేక మందికి జీవనోపాధిని కల్గిస్తోంది. ఈ రంగంలో సుమారు 2 మిలియన్ల మంది ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ శ్రామికులు ఉన్నారు. వీరిలో 50 శాతం స్త్రీలు.

చరిత్ర

4వ శతాబ్దంలో ఒక చైనా వైద్యుడు ఆకులను త్రుంచి, ఎండబెట్టి, ఒక ప్రత్యేక ఉష్ణోగ్రతకు వేడి చేసి, వేడి నీటిలో నానబెట్టగా వచ్చిన చేదు డికాక్షను వైద్య పరీక్షకు త్రాగాడు. ఈ టీ డికాక్షను త్రాగినందువల్ల ఇతడు ఉత్తేజాన్ని పొందాడు. టీ సేవన ద్వారా మొట్టమొదటగా ఉత్సాహాన్నీ, ఆనందాన్నీ పొందిన వ్యక్తి ఇతనే. [1]15వ శతాబ్దంలో నాగరిక ప్రపంచంలో టీ త్రాగడం ప్రారంభమయ్యింది. 17వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపనీ వినిమయ పద్ధతిలో బట్టలు, వెండికి మరియు అనధికార యుక్తంగా నల్లమందుకు బదులుగా టీని చైనా నుండి దిగుమతి చేసుకునేది. చాలాకాలం తర్వాత 1823లో బ్రిటన్‌కు చెందిన బ్రూస్ సోదరులు అస్సాంలో దేశీయ కనిపెట్టినప్పుడు భారతదేశంలో టీ ఉత్పాదన ప్రారంభమయ్యింది. విస్తారంగా టీ ప్రవృద్ధి చెందే ప్రాంతాలను వీరు కనుగొన్నారు. ఇవి సింగ్‌ఫో జాతులు తోటల పెంపకంలో మిగిలినవై ఉండవచ్చు. ఈ కొండ ప్రదేశాలలో జనులు టీ ఆకులతో చేసిన నాటు సారాను త్రాగుతూ ఉండేవారు. మొట్టమొదట 1838లో దిబ్రుఘర్ నుంచి 8 పెట్టెలు ఎగుమతి చేయబడ్డాయి. ఈ బ్లాక్ టీ సౌచోంగ్ మరియు పీకో అని రెండు గ్రేడులుగా చాలా ప్రసిద్ధి పొందింది. చైనాతో 1833లో ఏస్ట్ ఇండియా కంపెనీ గుత్తాధిపత్య వ్యాపార సంబంధాలు చెడిపోయినప్పుడు ఇంగ్లాండు భారతదేశంలో టీ ఉత్పాదనకు తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించింది. 1860 నాటికి భారతదేశంలో టీ ప్లాంటేషన్ తోటలు బాగా అభివృద్ధి చెందినప్పుడు ఇక్కడే టీ ఉత్పాదన సుమారు ఒక మిల్లియన్ కేజీలు ఉండేది.
చైనా నుండి బ్లాక్ మరియు గ్రీన్ టీ రకాల్ విత్తనాలను లార్డ్ మెకార్డెనీ తెప్పించి భారతదేశంలో 1793లో కలకత్తా బొటానికల్ గార్డెన్స్‌లో ప్రవేశపెట్టాడు. ఇవి పశ్చిమ బెంగాల్ కచార్ మరియు నీలగిరి ప్రదేశాలలో నాటబడ్డాయి. నేడు భారతదేశంలో సగానికి సగం టీ మొక్కలు ఆ తోటల పెంపకానికి చెందినవే. ఆ తరువాత అనతికాలంలో 1860కి చైనా టీ ఇక్కడి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రవృద్ధిపొందింది. నేడు అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ భారతదేశంలో టీని అధికంగా ఉత్పాదించే రాష్ట్రాలుగా ప్రసిద్ధిపొందాయి. ఇవి మొత్తం సుమారు 98 శాతం టీని ఉత్పాదిస్తున్నాయి. భారతదేశపు టీ ఉత్పాదక ప్రదేశాలలో త్రిపుర, కర్ణాటక, మణిపూర్, సిక్కిం, మరియు అరుణాచలప్రదేశ్ ముఖ్య పాత్రను వహిస్తున్నాయి. నీలగిరి కొండలలో భారతదేశపు ఉత్తమ రకం టీ ఉత్పాదించబడుతుంది. సతతహరితపు మొక్కైన టీకి వర్షపాతం అధికంగా ఉండాలి. అప్పుడే అది పుష్కలంగా, సమృద్ధిగా పెరుగుతుంది. దిగుబడి అధికంగా ఉంటుంది. సముద్ర మట్టానికి ఎత్తుగా ఉండే ప్రదేశాలలో పెరిగే టీ ఉత్తమమైనది. కానీ మైదానాలలో పెరిగే టీ వల్ల అధిక ఫలసాయం వస్తుంది.
చైనా మరియు జపాన్‌లలో టీ త్రాగడం విస్తారమైన తంతుతో కూడిన ఒక గొప్ప ఉత్సవం (Tea Ceremony)గా పరిణమించింది. అక్కడ టీ డికాక్షను కాచి పంచదార, పాలు కలపకుండా త్రాగుతారు. ఒక్కొక్కప్పుడు నిమ్మరసం, పంచదార కలిపి త్రాగుతారు. అమెరికాలో సామాన్యంగా టీలో ఐస్ వేసి, పంచదారతో త్రాగుతారు. భారతదేశం మరియు బ్రిటన్‌లలో పాలు, పంచదార కలిపి త్రాగుతారు. టిబెటియన్‌లు గ్రీన్ టీని ఉప్పు మరియు యాక్ వెన్నతో కొయ్య కప్పులలో త్రాగుతారు. ఆఫ్రికాలో డికాక్షనును చిలికి నురగగా తయారు చేసి త్రాగుతారు. పశ్చిమ ఆసియాలో టీని యాలకులతో కలిపిన డికాక్షన్‌తో త్రాగితే భారతదేశంలో గుజరాతీలు మసాలా టీ త్రాగుతారు. బ్లాక్ లేక గ్రీన్ టీని ఏలకులు, కొట్టిన బాదంపప్పు కలిపి కహ్వా అని కాశ్మీరులు త్రాగుతారు. ఇది చాల పుష్టికరమైన రుచికరమైన పానీయం.


నల్ల తేనరసాయనిక విశ్లేషణ
టీ సహజమైన పానీయం. దీనిలో రసాయనిక పదార్ధాలుగానీ, కృత్రిమ వాసల ద్రవ్యాలుగానీ, ఇతర రంగులుగానీ చేరి ఉండవు. ఇది ఆరోగ్యదాయకమైన మరియు శక్తిదాయకమైన పానీయం. దీనిలో విటమిన్లు ముఖ్యంగా బీ గ్రూప్ విటమిన్లు, రిబోఫ్లేవిన్ మరియు నియాసిన్ ఉంటాయి. దీన్లో అతి తక్కువగా లభించే కెఫీన్ మానవ శరీరానికి ఆరోగ్యకరమైనది. అపాయకారి కాదు.
వయసుతో నిమిత్తం లేకుండా టీని సేవించడం ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. ఒకప్పుడు అతిధులకు మర్యాదపూర్వకంగా ఇచ్చే టీ ఈనాడు త్రాగే నీరులాగా అతి సాధారణ పానీయం అయ్యింది. ఇక్కడబడితే టీ దుకాణాలు వెలవడం పజలు ఈ పానీయానికి ఎంతగా అలవాటుపడ్డారో తెలుపుతుంది.

జ్యోతిబసు

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సుధీర్ఘకాలం పాటు పనిచేసి దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు స్చంతంచేసుకున్న జ్యోతిబసు ( Jyoti Basu) జూలై 8, 1914న కోల్కతాలో జన్మించాడు. కమ్యూనిస్టు (మార్క్సిస్టు) పార్టీ కి చెందిన జ్యోతిబసు 1977 నుండి 2000 వరకు వరుసగా 5 సార్లు ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టినాడు. అంతకు ముందు 1967-69 కాలంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు. సి.పి.ఐ.పోలిట్ బ్యూరో నిర్ణయం వల్ల 1996లో దేశ ప్రధానమంత్రి అయ్యే అవకాశాన్ని కోల్పోయినాడు. 2000లో మఖ్యమంత్రి పదవి నుండి వైదొలిగిన జ్యోతిబసు జనవరి 17, 2010న 96 సంవత్సరాల వయస్సులో మరణించాడు. 

బాల్యం


జ్యోతిబసు జూలై 8, 1914న కోల్‌కతలో బెంగాలీ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి నిశికాంత్ బసు వైద్యుడిగా పనిచేసేవాడు. తల్లి హేమలతా బసు. స్థానికంగా కలకత్తా (ఇప్పటి కోల్‌కత) లోనే జ్యోతిబసు విద్యాభ్యాసం కొనసాగింది. ఇతని అసలుపేరు జ్యోతికిరణ్ బసు కాగా పాఠశాల దశలో ఉన్నప్పుడు తండ్రి జ్యోతిబసుగా పేరును తగ్గించాడు. ప్రెసిడెన్సీ కళాశాల జ్యోతిబసు తన డిగ్రీ పూర్తిచేశాడు. ఉన్నత చదువుల కోసం 1935లో ఇంగ్లాండు బయలుదేరాడు. ఇంగ్లాండులో న్యాయశాస్త్రంలో విద్యనభ్యసించుదశలోనే గ్రేట్బ్రిటన్ కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షితుడై రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నాడు. 1940లో యాయశాస్త్రవిద్య పూర్తిచేసుకొని మిడిల్ టెంపుల్ వద్ద బారిస్టర్‌గా అర్హత పొందినాడు. అదే సంవత్సరంలో భారతదేశానికి తిరిగివచ్చాడు. 1944లో ట్రేడ్ యూనియన్ ఉద్యమాలలో పాలుపంచుకొని ఆ తరివాత యూనియన్ ప్రధానకార్యదర్శి అయ్యాడు.

వడ్డెర చండీదాసు

ఎందుకోగాని అనుక్షణికం చదివినతరవాత చండీదాస్ గురుంచి నా బ్లాగ్లో కొద్దిగా రాయాలి అనిపించింది
వడ్డెర చండీదాసు (Vaddera Chandidas) ప్రముఖ తెలుగు నవలా రచయిత. ఇతని అసలు పేరు డాక్టర్ చెరుకూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు (సి.ఎస్.రావు) [1]. తన కలంపేరులో "వడ్డెర"ను పేద వృత్తికులమైన వడ్డెర ప్రజల నుండి, చండీదాస్ అన్న పేరును 15వ శతాబ్దపు విప్లవాత్మక బెంగాలీ కవి నుండి స్వీకరించాడని కథనం.[2] చండీదాస్ తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయములో తత్త్వశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేసి విరమించారు. ఇతని నవలలో హిమజ్వాల, అనుక్షణికం, చీకట్లోంచి చీకటిలోకి ప్రముఖమైనవి. చైతన్య స్రవంతి కథన రీతిని ఎంచుకుని రాసిన చండీదాస్‌ రచనలు విశేష ప్రజాదరణ పొందడమే కాకుండా సాహిత్యవేత్తల మన్ననలు కూడా పొందాయి. హిమజ్వాల ఇది వడ్డెర చండీదాస్ తొలి నవల. మంచులా చల్లబడిపోయిన తెలుగు పాఠకుల మనసులో మంటలు రగిలించిన నవల హిమజ్వాల. ఆంధ్రజ్యోతి వార పత్రికలో ధారావాహికగా వెలువడి విపరీతమైన సంచలనాన్ని సృష్టించింది. నాటకీయత, కధనా నైపుణ్యం, చేతనా స్రవంతి అద్భుతంగా మేళవించిన రచన ఇది. కృష్ణ చైతన్య, గీత అనే రెండు ముఖ్యపాత్రల అంతరంగ చిత్రణ ఈ నవలలో అద్భుతంగా జరిగింది. [మార్చు] అనుక్షణికం దీని రచనాకాలం 1979-81, కధాకాలం 1971-80. రెండు వందలు పైగా పాత్రలు, కోకొల్లుగా సంఘటనలతో ఒక దశాబ్దపు దేశ రాష్ట్ర చరిత్రలను కూర్చి సృష్టించిన నవల ఇది. ఇందులో ఘటనలన్నీ నిజాలు, చారిత్రికాలు. ఈ నవలలో మరొక విశేషం - తెలుగు నవలా సాహిత్యంలో ఎన్నడూ లేని వాస్తవికత. కులాల పేర్లు, ఇంటి పేర్లు, ఊళ్ళపేర్లు చిరినామాలతో సహా పేర్కొనడం. ఆంధ్రజ్యోతి వార పత్రికలో ధారావాహికగా వెలువడి రెండు సంవత్సరాల సుదీర్ఘ సమయంలో ఎందరినో మెప్పించిన నవల ఇది. చండీదాస్ 2005, జనవరి 30న విజయవాడలోని నాగార్జున ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు

ఎళ్దమొస్తవా.స్టేజి మీద పాట

ఎళ్దమొస్తవా.స్టేజి మీద పాట అయింది. కాసేపటికి తరువాత అక్కడే కింద ది ఆ పాట మాదంటె మాదని గొడవ మొదలయిం .సరే.మీరెక్కడికెళ్దామని అర్థం లో రాశారు"అన్నాడుఊరిపెద్ద..... .వలస,వలస పొయ్యే వాళ్ళ గురించి "అన్నాడు సింగమయ్య.. .సరే మీరెక్కడికని పాడుకున్నారు పిల్లలూ"అడిగాడు పెద్ద.......... నేను మా నాన్ననడగాలి అన్నాడు కుర్రాడు.................... అమ్మాయ్ నువ్వు ఎక్కడికని పాడావ్................................. ఇంకెందుకులెండి చెయ్యాల్సిన అల్లరంతా చేశాడు గా ఆ శింగమయ్య. ఆ పాట ఆయన రాసిందట. భంగ పడ్డాం చాలు,చాలు గాని ఇప్పుడేం చెయ్యమంటాడో అడగండి... సరె చెప్పు నాయనా,శింగమయ్యా, వాళ్ళు ఒప్పుకుంటున్నట్టు అనిపిస్తొంది. నీకేం కావాలో చెప్తే ఇప్పించే ప్రయత్నం చేస్తాను"అన్నాడు పెద్ద.......... .టిక్కెట్టు కి పావు టిక్కెట్టు వాల్యూ ,క్షమాపణ నాకు కావాలి"అన్నాడు శింగమయ్య....... అన్యాయం ,అన్యాయం అంటూ అబ్బాయి ,అమ్మాయి లేచారు............ మీరుండండి నాయనా,అమ్మా నేను మాట్లాడు తున్నాగ"అన్నాడు పెద్ద.... ఇంతలో మరొకాయన లేచి పావేంటి ఈ షో అంతా ఆ పాట మీద కాదు నడిచింది.ఇది పెద్ద హిట్టు.టిక్కెట్టు కి సగం ఇయ్యాల్సిందే"అన్నాడు.... మాకేం మిగులుద్ది అనుకున్నారు ఆ అమ్మాయి అబ్బాయి.అయినా మరీ అంత ఆశ ఉండొద్దయ్యా తప్పు"అన్నాడుపెద్ద.. ........ఏంటి ఆశా, లేచాడు శింగమయ్య.కందిపప్పెంత వంద,బియ్యం ఎంత నలభై,కూరగాయలెంత, పెట్రోలెంతా పిల్లల ఫీజులెంత,ఇంటి కిరాయిలెంతనుకున్నారు.నేనెంత కష్ట పడుతున్నా"అన్నాడు శింగమయ్య.............. ......అవును శింగమయ్య అన్నది కూడా కరక్టే .ఆయనా మనిషే కదా, బతకాలి కదా .కాస్త అటు ఇటు గ ఇచ్చెయ్యండి అన్నారు పెద్దలు ముగిస్తు

అంగవైకల్యం పెద్ద సమస్యకాదు. అంగవైకల్యంపై మనలాంటి సాధారణమైన మనుషులు చూపే వివక్ష అన్నిటికన్నా పెద్ద అంగవైకల్యం

http://www.youtube.com/watch?v=iq78SMYYVE0

RADIO

ఓ నిముషము....

ఓ నిముషము నిర్లక్ష్యము ఖరీదు........? ఓ నిముషము నిర్లక్ష్యము ఖరీదు........? జూలియస్ సీజర్ అనే పరాక్రమశాలి 800 పట్టణములను జయించి, ఒక మిలియన్ మంది శత్రువులను చంపి వారి రక్తములో తన వస్త్రాలను ఉతుక్కొన్నాడు.అయితే తన విజయోత్సవ ఉచ్చ స్తితిలో నిందినవాడై, తనకు అందించబడిన ముఖ్యమైన సమాచారమును చదువుటకు సమయమివ్వలేక పోయడు. రోమా పార్లమెంటుకు భవనానికి వెల్లుతున్న అతనికి పార్లమెంటు మెట్ల దగ్గర ఓ శత్రువు అతనిని చంపుటకు పొంచియున్నాడు అన్న సమాచారమును ఓ సైనికుడు అందించాడు. అయితే సభకు ఆలస్యం అవుతుందనుకున్న సీజర్ ఆవుత్తరమును చదువుటకు సమ్యమివ్వలేక పోయెను.ఆ వుత్తరమును బెల్టుకింద పెట్టుకొని వెల్లాడు. ఆ వుత్తరం తన ప్రాణమును కాపాడుతుందనుకొలేదు. యధావిధిగా వచ్చిన సీజర్ను శత్రువు మెట్లదగ్గర కత్తితో పొడిచి చంపాడు. చుశారా! ఒక్క నిమిశము సమయము వెచ్చించి ఆ వుత్తరమును చదివి వుండి వుంతె అతను తన ప్రాణమును కాపాడుకొనె వాడు. ఈనాడు అనేకులు సమయం లేదంటు నిర్లక్ష్యముగా వుంటున్నారు.

ముందుగా నా కవిత్వం గురుంచి

నా కవిత్వానికి గుక్కెడు కన్నిళ్ళ విలువ తెలుసు. నా కవిత్వానికి పిడెకెదు అనంద క్షణాలు తెలుసు. నా కవిత్వానికి ప్రస్నించటం తెలుసు. నా కవిత్వానికి తలెత్తి నిలబడతం తెలుసు. ఏ ఆస్తిత్వనికి లొనుకనిది నా కవిత్వం. ఏ బొందనికి ఆ అనుబందానికి మరె. భవబందానికి లొంగిపొనిది నా కవిత్వం. బాధొ ,అనందమూ, కస్టలొ,నస్టలూరజకియలొ,అరచకియలొ . అన్ని కగితంపికవితక్షరలి ముద్రింప బదతై. నా కవిత్వం గుడులెనివడికి నెద నిస్తుంది.న కవిత్వం కుడు లెనివడికి ముధ పెడుతుంది. నా కవిత్వం నెలాకసపు తాను చించి. వివస్త్రలకు వస్త్రం అవుతుంది. నా కవిత్వం వెన్నెలై వెలుగు నిస్థుంది. నా కవిత్వం చినుకై గొంతు తడుపుతుంది. నా కవిత్వం రాబందుమానవుల గుండెలలూ వురుమై భయం నింపుతుంది. అసలు అన్నిటికన్నా నా కవిత్వానికి మానవత్వం వుంది మా తెలుగు తల్లికి మల్లెపూదండ మా కన్న తల్లికి మంగళారతులు కడుపులో బంగారు, కనుచూపులో కరుణ చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి మా తెలుగు తల్లికి మల్లెపూదండ మా కన్న తల్లికి మంగళారతులు గల గలా గోదారి కదలి పోతుంటేను బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగారు పంటలే పండుతాయి మురిపాల ముత్యాలు దొరలుతాయి మా తెలుగు తల్లికి మల్లెపూదండ మా కన్న తల్లికి మంగళారతులు అమరావతీనగరి అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు తిక్కయ్య కలములో తియ్యందనాలు నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి మా చెవుల రింగుమని మారు మ్రోగేదాక నీ పాటలే పాడుతాం, నీ ఆటలే ఆడుతాం జై తెలుగుతల్లీ, జై తెలుగు తల్లీ! - శంకరంబాడి సుందరాచార్య web counter html code myspace web counter