-
కె.వి.రెడ్డి
కె.వి.రెడ్డి గా సుప్రసిద్ధుడైన కదిరి వెంకట రెడ్డి (K.V.Reddy, Kadiri Venkata Reddy) తెలుగు సినిమాలకు స్వర్ణ యుగమైన, 1940-1970 మధ్య కాలంలో ఎన్నో ఉత్తమ చిత్రాలను తెలుగు తెరకు అందించిన ప్రతిభావంతుడైన దర్శకుడు, నిర్మాత మరియు రచయిత. పురాణాలు, జానపద చలన చిత్రాలు తియ్యడంలో సాటి లేని మేటి అనిపించుకొన్న కె.వి.రెడ్డి అనంతపురం జిల్లా తాడిపత్రిలో 1912 వ సంవత్సరం జూలై 1 న జన్మించాడు. కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన సినిమాలలో కథానాయకులకే కాకుండా ఇతర చిన్న పాత్రలకు సైతం ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఉదాహరణకు సత్య హరిశ్చంద్ర చిత్రంలో రేలంగి, జగదేకవీరుని కథ చిత్రంలో రాజనాల, మాయాబజార్ చిత్రంలో ఎస్వీ.రంగారావు పాత్రలు. అంతేకాక కె.వి.రెడ్డి సినిమాలలో గిల్పం, తసమదీయులు, పరవేశ దవారం, డింభక లాంటి కొత్త పదాలు వినిపించడం కద్దు. ఈయన సినిమాలలో కథ, చిత్రానువాదం, పాత్రల విశిష్టతే కాకుండా సంగీతం కూడా ఎంతో బాగుంటుంది.
విషయ సూచిక
* 1 సినీ ప్రస్థానం
o 1.1 భక్త పోతన
o 1.2 పాతాళ భైరవి
o 1.3 పెద్ద మనుషులు
o 1.4 దొంగ రాముడు
o 1.5 మాయా బజార్
o 1.6 జగదేకవీరుని కథ
o 1.7 శ్రీకృష్ణార్జున యుద్దం
o 1.8 సత్య హరిశ్చంద్ర
o 1.9 శ్రీకృష్ణ సత్య
* 2 దర్శకత్వ శైలి
* 3 విశేషాలు
* 4 పని చేసిన సినిమాలు
* 5 వనరులు
సినీ ప్రస్థానం
సినిమాల గురించీ, సినిమా నిర్మాణం గురించీ తెలుసుకుని, పుస్తకాలు చదివి సినిమాలమీద అభిమానం పెంచుకున్న కె.వి.రెడ్డి, స్నేహితుడైన మూలా నారాయణస్వామి సలహా మీద గృహలక్ష్మి (1938 సినిమా)కి కేషియరుగా పని చేశాడు. తరువాత వాహినీ సంస్థ బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి దర్శకత్వంలో నిర్మించిన వందేమాతరం (1939) సినిమాకు ప్రొడక్షన్ మేనేజరుగా పని చేశాడు. ఇదే సినిమాకు పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు సహాయ దర్శకుడిగా ఉన్నాడు. తరువాత బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి సినిమాలైన సుమంగళి (1940), దేవత (1941), స్వర్గసీమ అన్నింటికీ ప్రొడక్షన్ మేనేజర్ గా పని చేశాడు. వాహినీ సినిమాలలో ఈయన ప్రొడక్షన్ మేనేజరు, కాషియరూ ఐనా, ఆలోచనంతా సినిమా దర్శకత్వం, నిర్మాణం మీదనే ఉండేది.
భక్త పోతన
కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన మొదటి సినిమా భక్త పోతన (1942). భక్తపోతన పెద్ద హిట్ కావడంతో యోగివేమన (1947) తీశాడు, కె.వి.రెడ్డి. ఆర్థికంగా లాభించకపోయినా ప్రపంచ సినిమాల స్థాయిలో 'యోగివేమన' కూడా ఒక క్లాసిక్ అన్న ఖ్యాతి లభించింది. ఈ రెండు సినిమాలలో కూడా చిత్తూరు నాగయ్య కథానాయకుడు. తరువాతి సినిమా గుణసుందరి కథ (1949). ఇందులో విషాద పాత్రలకు పేరు పొందిన శ్రీరంజని గుణసుందరీ దేవిగా నటించింది. ఈ సినిమాకు కె.వి.రెడ్డి మరియు కమలాకర కామేశ్వరరావు కలసి చిత్రానువాదం అందించగా, పింగళి నాగేంద్రరావు సంభాషణలు రాసాడు.
పాతాళ భైరవి
కె.వి.రెడ్డి మరియు విజయా సంస్థల పేర్లను ఆంధ్రదేశంలో ప్రతి ఒక ఇంట్లో మారుమోగేలా చేసిన పాతాళ భైరవి సినిమా 1951 సంవత్సరంలో విడుదలైంది. జానపదాల్లో పాతాళభైరవి అనేక విషయాల్లో మార్గదర్శకమైంది. ఈ సినిమా కథకు చందమామ పత్రికలో వచ్చిన ఒక కథ మూలం. నేపాలీ మాంత్రికుణ్ణి సంహరించి తన సాహసంతో ఉజ్జయినీ రాకుమార్తెను పొందే వీరుడిగా ఎన్.టి.రామారావు సరిగ్గా సరిపోయాడు. నేపాళీ మాంత్రికుడుగా అద్భుతంగా నటించిన ఎస్వీ రంగారావుకీ ఈ సినిమా ద్వారా మంచిపేరు వచ్చింది. ముఖ్యంగా సాహసం శాయరా డింభకా, రాకుమారి లభించునురా అన్న వాక్యం ప్రాచుర్యం పొందింది. నేపాళీ మాత్రికునితో పాటు ఉండే డింగిరి పాత్రలో పద్మనాభం నటించాడు. ఉజ్జయినీ మహారాజుగా సి.ఎస్.ఆర్.ఆంజనేయులు నటించగా, అమాయక రాకుమారుని పాత్రలో రేలంగి నవ్విస్తాడు. ఈ సినిమాలోని ఒక పాటలో ప్రముఖ నటి సావిత్రి కనిపించడం విశేషం. ఈ చిత్రంలాగే ఇందులోని పాటలు కూడా అద్భుత విజయం సాధించాయి. ముఖ్యంగా కలవరమాయే మదిలో, ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసివాడూ పాటలు ఆంధ్ర్రదేశమంతా మారుమోగాయి.
పెద్ద మనుషులు
పాతాళభైరవి లాంటి జానపదం తీసిన తరువాత 1954లో సాంఘిక చిత్రమైన పెద్ద మనుషులు చిత్రం విడుదలైంది. సాంఘికాల్లో పెద్ద మనుషులు చిత్రాన్ని కీర్తిస్తూ న భూతో న భవిష్యతి అన్నారు అప్పటి విమర్శకులు. పదవుల ఘరానా ముసుగులో అవతవకలకు పాల్పడే పెద్దలను విమర్శిస్తూ తీశారు ఈ సినిమా. పెద్దలు చేసే పనులలో లొసుగులను బయటపెట్టే తిక్క శంకరయ్య పాత్ర రేలంగి సినీ జీవితంలో మరపురాని పాత్రలలో ఒక్కటి. ప్రముఖ సినీ రచయిత డి.వి.నరసరాజుకు ఇదే తొలి సినిమా. కొసరాజు రాసిన శివ శివ మూర్తివి గణనాథా, నీవు శివుని కుమారుడవు గణనాథా పాట ఇప్పటికీ వినబడుతూంటుంది.
[మార్చు] దొంగ రాముడు
దుక్కిపాటి మధుసూదనరావు, అక్కినేని నాగేశ్వరరావులు సినీ నిర్మాణ కంపెనీ ఆరంభించినా, కె.వి.రెడ్డి చేతనే తొలి చిత్రం తీయించాలని అనుకోవడంతో, ఆయన కోసం రెండేళ్లు పైచిలుకు కాలం నిరీక్షంచవలసి వచ్చింది. ఆ చిత్రం అన్నపూర్ణావారి దొంగరాముడు (1955). ఈవాళ ఆ చిత్రం పూనా ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లోని విద్యార్ధులకు బోధనాపాఠం. ఒక దొంగ తన తప్పులు తెలుసుకొని తనను తాను సంస్కరించుకొనే పాత్రలో ఏయన్నార్ చక్కగా నటించాడు. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు మరియు ఆర్.నాగేశ్వరరావుల మధ్య పోరాట సన్నివేశాలను అత్యంత సహజంగా, అద్భుతంగా చిత్రీకరించారు. ఇందులో సావిత్రి పూలమ్మే అమ్మాయిగా నటించగా జమున, అక్కినేని నాగేశ్వరరావుకు చెల్లెలుగా నటించింది. సానుభూతి పరుడైన వైద్యునిగా కొంగర జగ్గయ్య నటించాడు.
మాయా బజార్
ప్రధాన వ్యాసం: మాయా బజార్
ఒక్క మాయాబజార్ సినిమా చాలు చిత్రానువాదం (స్క్రీన్ ప్లే) నడపడంలో కె.వి.రెడ్డి వైదుష్యం ఎంతటిదో అర్థం కావడానికి. ఆ చిత్రం ఎన్ని సార్లు చూసినా.., ఫలానా నన్నివేశం అనవసరమనో లేక ఇంకేదో సన్నివేశం అవసరం ఉందనో అనిపించదు. సినిమా మూడు గంటలపాటు నడిచినా ముప్పావుగంటలో అయిపోయిందన్న భ్రమ కల్పించడానికీ, సర్వకాలాల్లోనూ సర్వప్రేక్షకుల్నీ అలరిస్తూ ఆహ్లాదపరచడానికీ, ఆ చిత్రానువాదమే కారణం. తెలుగు సినిమా చరిత్రలో విడుదలైన అద్భుత చిత్రాలలో ఈ సినిమా ప్రథమ స్థానం అలంకరించిందంటే అది ఆ దర్శకచక్రవర్తి ప్రజ్ఞ. ప్రజ్ఞతో చేసిన తపస్సు. పాతాళ భైరవి తరువాత కెవి.రెడ్డి విజయా సంస్థకు చేసిన రెండవ సినిమా ఇది.
దుర్యోధనుని కుమారుడైన లక్ష్మణ కుమారుడితో వివాహం నిశ్చయమైన శశిరేఖను, ఘటోత్కచుడు తన మాయజాలంతో అపహరించి, తన ఆశ్రమంలో అభిమన్యుడితో వివాహం జరిపించడం, తాను మాయా శశిరేఖ అవతారం దాల్చడం, కౌరవులను ముప్పుతిప్పలు పెట్టడం, కృష్ణుడు వీటన్నిటికి పరోక్షంగా సహకరించడం, ఇవి ఈ చిత్రంలోని కథాంశాలు.
జగదేకవీరుని కథ
1958లో ఎ.ఎన్.ఆర్, జమున నటించిన పెళ్ళినాటి ప్రమాణాలు లాంటి సాంఘికం చేసిన తరువాత 1961లో జగదేకవీరుని కథ లాంటి అద్భుత జానపదాన్ని తీశాడు కె.వి.రెడ్డి. ఇందులో నలుగురి కథానాయికలలో ఒకరిగా బి.సరోజాదేవి నటించింది. ప్రతాప్ అనే రాకుమారుడు దేవకన్యలను పెళ్ళి చేసుకొనే కోరికతో బయలుదేరి, దేవతలనే మెప్పించి నాగ కన్య, అగ్ని పుత్రిక, వరుణుడి కుమార్తె, ఇంద్ర పుత్రికలను పెళ్ళాడటం ఈ చిత్రంలోని కథాంశం. ఇందులోని శివశంకరి పాట ఎంతో పేరుపొంది ఘంటసాల కీర్తిని శాశ్వతం చేసింది.
శ్రీకృష్ణార్జున యుద్దం
1962 సంవత్సరంలో తెలుగు సినిమాకు రెండు కళ్ళయిన రామారావు - నాగేశ్వరరావు కలసి నటించిన శ్రీకృష్ణార్జున యుద్దం విడులైంది. మహాభారతంలోని పాత్రలను తీసికొని కల్పించిన కథతో ఈ చిత్రాన్ని తీసారు. గయుడు అనే గంధర్వుడు పుష్పక విమానంలో వెడుతుండగా తను నములుతున్న తాంబూలాన్ని భూమి మీదకు ఉమ్ముతాడు. అది సంధ్యావందనం చేస్తున్న శ్రీకృష్ణుని చేతులో పడుతుంది. దానితో ఆగ్రహించిన కృష్ణుడు గయుణ్ణి సంహరిస్తానని శపథం చేస్తాడు. దానితో భీతిల్లిన గయుడు నారదుని సలహామీద, అసలు విషయం చెప్పకుండా అర్జునుని శరణు పొందుతాడు. తరువాత విషయం తెలిసికూడా ఇచ్చిన అభయం నిలబెట్టుకోవడం కోసం అర్జునుడు శ్రీకృష్ణుడితో పోరాడటం ఇందులోని కథాంశం.
సత్య హరిశ్చంద్ర
1965 సంవత్సరంలో కె.వి.రెడ్డి, హరిశ్చంద్రుని పాత్రలో ఎన్.టీ.ఆర్ ను, చంద్రమతి పాత్రలో ఎస్.వరలక్ష్మిని తీసికొని సత్య హరిశ్చంద్ర చలన చిత్రాన్ని తీశాడు. విశ్వామిత్రునిగా ముక్కామల నటించగా, కాటికాపరి పాత్రలో రాజనాల నటించాడు.
] శ్రీకృష్ణ సత్య
1972 సంవత్సరంలో కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన చివరి చిత్రం శ్రీకృష్ణ సత్య విడుదలైంది. కృష్ణుని పాత్రలో మళ్ళీ ఎన్.టీ.ఆర్ నటించగా, సత్యభామ పాత్రలో జమున నటించింది.
దర్శకత్వ శైలి
నిర్మాణ శాఖనీ, దర్శకత్వ శాఖనీ రెంటినీ ఆకళింపు చేసుకున్న వ్యక్తి కె.వి.రెడ్డి. ఏ చిత్రం తాను నిర్దేశకత్వం చేసినా, పథకం అంతా తనే సిద్ధం చేసేవాడు. వేసుకున్న బడ్జెట్‌లోనే సినిమా తియ్యడం సాద్యం చేసుకున్నట్టుగానే రాసుకున్న సినిమా నిడివిని దాటకుండా, సుసాధ్యం చేసుకోగలిగిన దర్శకుడు కె.వి.రెడ్డి. నిడివి విషయంలో ఎంతో దూరాలోచన ఉండేది కె.వి.రెడ్డికి. అలాగే కె.వి.కి దూరదృష్టి కూడా చాలా ఎక్కువ. ఏది తీసినా, ఏది తలపెట్టినా కథాగమనానికీ, దృశ్యనిర్మాణానికీ అతను వెచ్చించవలసిన కాలం వెచ్చించవలసిందే. అందులో రాజీ ఉండదు. 'గుణసుందరి కథ' లో ‘శ్రీరంజని హీరోయినా?’ అన్నారు కొందరు - మిత్రులూ, పరులూ. పాతాళభైరవిలో "రామారావు పక్కన మాలతి ఏం బావుంటుంది?" అన్నారు వాళ్లే. మాయాబజార్ లో అంత లావు సావిత్రి శశిరేఖా? ‘రేవతి ఛాయాదేవా?’ అన్నవాళ్లకి "అందుకే ఛాయాదేవి!" అని ఆయన సమాధానం ఇచ్చారు. అంతలావు తల్లి ఉన్నప్పుడు పక్కన కూతురిలో ఆ లావు కనిపించదని కె.వి. నమ్మకం. శ్రీరంజని అయినా, మాలతి అయినా కథాపరమైన పాత్రలకి ఏ సమస్యా రాదన్నది ఆయన విశ్వాసం. బక్కచిక్కిన 'పోతన' పాత్రకి భారీమనిషి నాగయ్యేమిటి? - అని అప్పుడే వచ్చింది విమర్శ. నాగయ్య తన నటనతో, తన పర్సనాలిటీని మరపింపజేస్తాడని - కె.వి. ధీమా. ఒక్క కథాగమనం, షూటింగ్ పథకాలూ అనే కాకుండా - అన్నీ నిశితంగా ఆలోచించే నిర్ణయించేవాడు కె.వి. చిన్న వేషాలు, పక్కవేషాలు, చెలికత్తెల వేషాల నిర్ణయంలో కూడా ఆ ఆలోచన ఉంటుంది. కె.వి. రెడ్డిని చూసినప్పుడు ‘ఈయనా? సినిమా డైరెక్టర్‌లా లేరే!’ అనుకునేవారు కొత్తవాళ్లు. ముతక ఖాదీపంచె, పొట్టిచేతుల చొక్కా, పర్సు, కాయితాలూ, పెన్నులతో ఎత్తయిన జేబు, భుజం మీద వేల్లాడుతూ కండువా -ఇదీ కె.వి. వేషధారణ. అందర్నీ ‘బ్రదర్!’ అని సంబోధిస్తూ ఎక్కువగా ఇంగ్లీషే మాట్లాడేవాడు.
షూటింగులో కె.వి.విధానమే వేరు. తానుగా చేసి చూపించడమో, నటించడమో చేసి చూపించేవాడు కాదు. చెప్పేవాడు కూడా కాదు. పాత్రధారుల్నే చెయ్యమనేవాడు. అది తనకి కావలసిన రీతిలో లేకపోతే, ఇంకోలాగా, ఇంకోవిధంగా చెయ్యమనీ, చెప్పమనీ - తను ఎన్నికచేసి ఖాయం చేసేవాడు. ఎక్కువ తక్కువలుంటే చెప్పేవాడు. కళాకారులకి స్వతంత్రం వుండేది - దర్శకుని నియంత్రణా ఉండేది. షాటులో ఆరుగురు నటులుంటే - మాట్లాడే వారొక్కరే అయినా, ఫైనల్ రిహార్సల్సు ఆరు చేయించేవారు. ఒకొక్క రిహార్సలులోనూ ప్రతి ఒక్కరి రియాక్షనూ చూసేవారు. ఎక్కువ తక్కువలుంటే - సరిదిద్దేవాడు. టేకు ముందు మేకప్‌లు, లైటింగ్, కెమెరా పొజిషనూ అన్నీ ఓసారి సరిచూసుకుని ‘టేక్!’ చేసేవాడు. ఐతే, ఆయన ఏనాడూ ‘ఒకే!’ అని గట్టిగా అనలేదు. ‘పాస్!’ అనడమే ఆయన అలవాటు. అతని చిత్రాల్లో మంచిపాత్రలు ధరించి పేరు తెచ్చుకున్న రేలంగి, కె.వి.రెడ్డి "పాస్ మార్కులు ఇచ్చేవారే గానీ, నూటికి నూరు ఇవ్వడం మేము ఎరగం" అని చెప్పాడు. కె.వి.రెడ్డి షూటింగుకి సందర్శకులకు అనుమతి ఉండేది కాదు. మరీ కావలసినాళ్లో, తప్పనిసరో అయితే ముగ్గురికో, నలుగురికో అనుమతి ఇచ్చేవాళ్లు - అదీ పది, పదిహేను నిమిషాల్లో వెళ్లిపోవాలి. పూర్తి నిశ్శబ్దం, క్రమశిక్షణ, ఏకాగ్రత కనిపించేవి అతని షూటింగుల్లో.
చిత్రాలు దర్శకత్వం చెయ్యమని బయటి సంస్థల నుంచి ఎంత గిరాకీ వున్నా కె.వి.రెడ్డి అంగీకరించేవాడు కాదు. ఒక సినిమా అయిన తర్వాతే, ఇంకో సినిమా తియ్యాలనే తత్వం ఆయనది. "మిగతా డైరెక్టర్లు ఒకేసారి రెండుమూడు చిత్రాలు చేస్తున్నారుకదా!" అంటే - "ఐయామ్ సారీ! ఐ డోంట్ హావ్ టు బ్రెయిన్స్!" అన్నది కె.వి.సమాధానం. జయాపజయాలు అనేవి అందరికీ వుంటాయి. అన్నిచోట్లా వుంటాయి. కె.వి.కీ వున్నాయి "చిత్రాలు విజయం పొందినప్పుడు ఎలా స్పందిస్తామో, పరాజయం పొందినప్పుడూ స్పందిస్తాం. రెండిటినీ సమానంగానే యాక్సెప్ట్ చెయ్యాలి!" అనేవాడు కె.వి.రెడ్డి.
విశేషాలు
* చిత్ర నిడివి విషయంలో కె.వి.రెడ్డికి ఎంత దూరాలోచన అంటే - ఒక ఉదాహరణ : దృశ్యాల విభజన జరిగిన తర్వాత సంభాషణలు నిర్ధారించుకున్న తర్వాత ‘ఇంత నిడివి ఉండాలి’ అని నిర్ణయించుకున్న తర్వాత - సహాయకులచేత సీన్లు చదివించుకుని స్టాప్ వాచ్ పెట్టుకుని, టైముచూసుకుని, ‘పుటేజ్’ నోట్‌చేసుకోవడం - అతని అలవాటు. అలా ‘గుణసుందరి కథ’ (1949) లోని ఒకదృశ్యం విని - ‘ఎంతొచ్చింది?’ అని అడిగాడు. ‘రెండు నిమిషాలొచ్చింది’ అన్నాడు సహాయదర్శకుడు. 'కాదు, ఇంకో అరనిమిషం పెరుగుతుంది. ఎంచేతంటారా రాజుగారి వేషం వేస్తున్నది గోవిందరాజు సుబ్బారావు. మీరు చదివినట్టుగా ఆయన డైలాగులు చెప్పరు. ఇంకా తాపీగా చెబుతారు. అంచేత, ఆయన ఉన్న ప్రతి దృశ్యాన్నీ మనం వేసుకున్న టైముకి మరికొంత కలుపుకుంటూ రావాలి!' అని కె.వి. వివరించినట్టు - పింగళి నాగేంద్రరావు ఓసారి చెప్పాడు.
* ‘జగదేకవీరుని కథ’ (1961) షూటింగ్ ఆరంభానికి నాలుగునెలల ముందే, కార్యక్రమాలు, షెడ్యూలు సిద్ధమైనాయి. ‘జలకాలాటలలో....’ పాట జనవరిలో పడింది. కాల్ షీట్ టైము ఉదయం ఏడుగంటలకి. జనవరి అంటే చలిరోజులు. నలుగురు అమ్మాయిలు ఆరున్నరకే రెడీ అయి, ఈతకొలనులోకి దిగాలి. నీళ్లు వెచ్చగా ఉంటే వాళ్లు హాయిగా దిగుతారు. లేకపోతే నసుగుతారు. పైగా చాలాసేపు నీళ్లలో ఉండాలి గనక - ‘ఆ పాట తీసే మూడుపూటలూ వేడి నీరు సరఫరా చెయ్యాలి’ అని నోట్ రాసి, ప్రొడక్షన్‌వారికి అందజేశాడు. షూటింగ్ వేళకి వెచ్చని నీళ్లు ‘పంపు’ కావడం, అనుకున్న షూటింగ్ రెండుపూటల్లోనే పూర్తికావడం జరిగాయి.
పని చేసిన సినిమాలు
దర్శకత్వం వహించినవి
1. భక్త పోతన (1942)
2. యోగి వేమన (1947)
3. గుణసుందరి కథ (1949)
4. పాతాళభైరవి (1951)
5. పెద్దమనుషులు (1954)
6. దొంగరాముడు (1955)
7. మాయాబజార్ (1957)
8. పెళ్ళినాటి ప్రమాణాలు (1958)
9. జగదేకవీరుని కథ (1961)
10. శ్రీకృష్ణార్జున యుద్ధం (1963)
11. సత్య హరిశ్చంద్ర (1965)
12. భాగ్యచక్రం (1968)
13. ఉమా చండీ గౌరీ శంకరుల కధ (1968)
14. శ్రీకృష్ణసత్య (1971)
చిత్రానువాదం అందించినవి
1. గుణసుందరి కథ (1949)
2. దొంగరాముడు (1955)
కథ అందించినవి
1. దొంగరాముడు (1955)
2. మాయాబజార్ (1957)
నిర్మాతగా వ్యవహరించినవి
1. పెళ్ళినాటి ప్రమాణాలు (1958)
2. జగదేకవీరుని కథ (1961)
3. శ్రీకృష్ణార్జున యుద్ధం (1963)
4. సత్య హరిశ్చంద్ర (1965)
5. భాగ్యచక్రం (1968)
6. ఉమా చండీ గౌరీ శంకరుల కధ (1968)
కె.ఎస్.ఆర్.దాస్
కె.ఎస్.ఆర్.దాస్ (జ. జనవరి 5, 1931[1]) తెలుగు మరియు కన్నడ సినిమా దర్శకుడు.
ఈయన యాక్షన్ మరియు క్రైమ్ చితాలు తీయడంలో సిద్ధహస్తుడు. మోసగాళ్ళకు మోసగాడు , యుగంధర్ లాంటి యాక్షన్ చిత్రాలకు ఈయనే దర్శకుడు.
కె. రాఘవేంద్ర రావు
తెలుగు సినీ రంగములో దర్శకేంద్రుడు అని పిలువబడే శతాధిక చిత్రాల తెలుగు సినిమా దర్శకుడు కె. రాఘవేంద్ర రావు. ఆయన మే 23, 1942 తేదీన కృష్ణా జిల్లా, కంకిపాడు మండలానికి చెందిన కోలవెన్ను గ్రామంలో జన్మించాడు. శ్రీదేవి, విజయశాంతి, రాధ, రమ్యకృష్ణ, రవళి లాంటి కథానాయికలకు ఎందరికో మంచి సినీ జీవితాన్ని ప్రసాదించిన ఈ దర్శకేంద్రుడు తన సినీ జీవితాన్ని శోభన్ బాబు నటించిన బాబు అనే విజయవంతమైన చిత్రంతో ప్రారంభించాడు. ఆ తర్వాత ఎంతో మంది కథానాయకులతో ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీశాడు. "హిమ్మత్-వాలా", "తోఫా" లాంటి విజయవంతమైన హిందీ సినిమాలకు దర్శకత్వం వహించి బాలీవుడ్ లో తన సత్తా చాటాడు. స్త్రీ పాత్రలే ప్రధానంగా జ్యోతి, ఆమె కథ, కల్పన లాంటి చిత్రాలు తీశాడు.
కె. రాఘవేంద్ర రావు సినిమాల జాబితా
స.రం చిత్రం పేరు నటీ నటులు
1975 బాబు శోభన్ బాబు, వాణిశ్రీ, లక్ష్మి
1976 రాజా శోభన్ బాబు, జయసుధ
1976 జ్యోతి జయసుధ
1977 అమరదీపం కృష్ణంరాజు, జయసుధ
1977 కల్పన మురళీమోహన్, జయచిత్ర
1977 ఆమెకథ మురళీమోహన్, ప్రభ
1977 అడవి రాముడు నందమూరి తారక రామారావు, జయప్రద, జయసుధ
1978 సింహబలుడు నందమూరి తారక రామారావు, వాణిశ్రీ
1978 పదహారేళ్ళ వయసు శ్రీదేవి, చంద్ర మోహన్
1979 డ్రైవర్ రాముడు నందమూరి తారక రామారావు, జయసుధ
1979 వేటగాడు నందమూరి తారక రామారావు, శ్రీదేవి
1980 గజదొంగ నందమూరి తారక రామారావు, శ్రీదేవి, జయసుధ
1980 మోసగాడు శోభన్ బాబు, శ్రీదేవి
1980 భలే కృష్ణుడు కృష్ణ, జయప్రద
1980 ఘరానా దొంగ కృష్ణ, శ్రీదేవి
1981 కొండవీటి సింహం నందమూరి తారక రామారావు, శ్రీదేవి, జయంతి
1981 తిరుగులేని మనిషి నందమూరి తారక రామారావు
1981 ఊరికి మొనగాడు కృష్ణ, జయప్రద
1981 రగిలే జ్వాల కృష్ణంరాజు, సుజాత, జయప్రద
1982 మధుర స్వప్నం కృష్ణంరాజు, జయసుధ, జయప్రద
1982 త్రిశూలం కృష్ణంరాజు, శ్రీదేవి, రాధిక, జయసుధ
1982 దేవత శోభన్ బాబు, జయప్రద, శ్రీదేవి
1982 జస్టిస్ చౌదరి నందమూరి తారక రామారావు, శ్రీదేవి
1983 అడవి సింహాలు కృష్ణ, కృష్ణంరాజు, శ్రీదేవి, జయప్రద
1983 శక్తి కృష్ణ, జయసుధ
1983 హిమ్మత్ వాలా జితేంద్ర, శ్రీదేవి
1984 థోఫా జితేంద్ర, శ్రీదేవి
1984 ఇద్దరు దొంగలు శోభన్ బాబు, రాధ
1984 బొబ్బిలి బ్రహ్మన్న కృష్ణంరాజు, లక్ష్మి, రాధ
1985 అడవి దొంగ చిరంజీవి, రాధ
1985 అగ్నిపర్వతం కృష్ణ, రాధ, విజయ శాంతి
1985 వజ్రాయుధం కృష్ణ, శ్రీదేవి
1985 పట్టాభిషేకం బాలకృష్ణ, విజయ శాంతి, శారద
1986 రావణబ్రహ్మ కృష్ణంరాజు, శారద, జయసుధ
1986 కలియుగ పాండవులు వెంకటేష్, కుష్బు
1986 చాణక్య శపధం చిరంజీవి, విజయ శాంతి
1986 కొండవీటి దొంగ చిరంజీవి, రాధ, విజయ శాంతి
1987 భారతంలో అర్జునుడు వెంకటేష్, కుష్బు, అరుణ
1988 జానకిరాముడు అక్కినేని నాగార్జున, విజయ శాంతి
1988 ఆఖరి పోరాటం అక్కినేని నాగార్జున, శ్రీదేవి , సుహాసిని
1989 ఒంటరి పోరాటం వెంకటేష్
1989 రుద్రనేత్ర చిరంజీవి
1990 మంచి దొంగ చిరంజీవి, విజయ శాంతి
1990 జగదేకవీరుడు- అతిలోక సుందరి చిరంజీవి, శ్రీదేవి
1990 అల్లుడుగారు మోహన్ బాబు, రమ్యకృష్ణ
1991 కూలీ నెం.1 వెంకటేష్, టబు
1992 సుందరకాండ వెంకటేష్, మీనా, అపర్ణ
1992 ఘరానా మొగుడు చిరంజీవి, నగ్మా, వాణీ విశ్వనాధ్
1992 రౌడీ అల్లుడు చిరంజీవి, శోభన, దివ్య భారతి
1992 అల్లరి మొగుడు మోహన్ బాబు, మీనా
1992 అశ్వమేధం శోభన్ బాబు, బాలకృష్ణ , మీనా
1993 మేజర్ చంద్రకాంత్ నందమూరి తారక రామారావు, మోహన్ బాబు, శారద, రమ్యకృష్ణ, నగ్మా
1994 అల్లరి ప్రియుడు రాజ శేఖర్, రమ్యకృష్ణ, మధు బాల
1994 ముద్దుల ప్రియుడు వెంకటేష్, రమ్యకృష్ణ, రంభ
1994 ముగ్గురు మొనగాళ్ళు చిరంజీవి, నగ్మా, రోజా, రమ్యకృష్ణ
1994 అల్లరి ప్రేమికుడు జగపతి బాబు, రమ్యకృష్ణ, సౌందర్య, రంభ
1995 ఘరానా బుల్లోడు అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ
1995 రాజసింహం రాజ శేఖర్, రమ్యకృష్ణ, సౌందర్య
1996 బొంబాయి ప్రియుడు జె.డి.చక్రవర్తి, రంభ
1996 పెళ్ళి సందడి శ్రీకాంత్, దీప్తీ భట్నాగర్, రవళి
1996 సాహసవీరుడు - సాగరకన్య వెంకటేష్, శిల్పా షెట్టి, మాలశ్రీ
1997 అన్నమయ్య అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ, కస్తూరి
1998 పరదేశి మాధవ్ , మోనా , ధనుజ, విశ్వ
1998 లవ్ స్టోరీ 1999 ప్రభుదేవా, నవీన్ వడ్డే , రమ్య, రంభ
1999 రాజకుమారుడు మహేష్ బాబు, ప్రీతి జింటా
1999 ఇద్దరు మిత్రులు చిరంజీవి, సాక్షీ శివానంద్, రమ్యకృష్ణ
2001 మంజునాధ చిరంజీవి, అర్జున్, సౌందర్య, మీనా
2003 గంగోత్రి అల్లు అర్జున్ , అదితి అగర్వాల్
2005 సుభాష్ చంద్రబోస్ వెంకటేష్, శ్రియా, జెనీలియా
2005 అల్లరి బుల్లోడు నితిన్, త్రిష
2006 శ్రీరామదాసు అక్కినేని నాగార్జున , స్నేహ
2008 పాండురంగడు బాలకృష్ణ, స్నేహ
కృష్ణవంశీ
కృష్ణవంశీ ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు. రామ్ గోపాల్ వర్మ దగ్గర కొన్ని చిత్రాలకు సహాయకుడిగా పనిచేసాడు. తన తొలి చిత్రం గులాబీతో మంచి పేరు తెచ్చుకున్నాడు. 2000వ సంవత్సరంలో ఆంధ్రా టాకీస్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. నటి రమ్యకృష్ణను పెళ్ళి చేసుకున్నాడు.
చిత్రాలు
1. గులాబి
2. నిన్నే పెళ్ళాడుతా
3. సిందూరం
4. అంతఃపురం
5. సముద్రం
6. మురారి
7. ఖడ్గం
8. శ్రీఆంజనేయం
9. చక్రం
10. డేంజర్
11. రాఖీ
12.చందమామ
13.ససిరేకపరినయం
14.మహాత్మా
తెలుగు సినిమా లో స్రుజనాత్మకతకు భాష్యం చెప్పిన దర్శకుడు క్రిష్ణవంశీ.
కమలాకర కామేశ్వరరావు
సాంఘిక చిత్రాల మాటెలా ఉన్నా తెలుగు పౌరాణిక చిత్రాలకు సాటి రాగల పౌరాణికాలు యావద్భారత దేశంలోనే మరే భాషలోనూ లేవు. తెలుగు పౌరాణికాలకు ఆ ఘనతను సాధించి పెట్టిన చిత్రాలు చాలానే ఉన్నాయి. నర్తనశాల, పాండవ వనవాసం మొదలైనవి వాటిలో ముఖ్యమైనవి. అలాంటి చిత్రాలను తీసి పౌరాణిక చిత్రాల బ్రహ్మ గా గుర్తింపు పొందిన దర్శకుడు కమలాకర కామేశ్వరరావు.
విషయ సూచిక
* 1 తొలి జీవితం
* 2 సినీ విమర్శకునిగా
* 3 రంగ ప్రవేశం
* 4 దర్శకత్వం వహించిన సినిమాలు:
o 4.1 దర్శకుని నిర్వచనం
కామేశ్వరరావు 1911 లో బందరు లో జన్మించాడు. ఆయన విద్యాభ్యాసం పూర్తిగా అక్కడే జరిగింది. ఆయన 1933 లో బి.ఏ. పాసయాడు. అప్పటికే ఆయనకు సినిమా టెక్నిక్ మీద మంచి ఉత్సాహం ఏర్పడింది. వచ్చిన ప్రతి చిత్రమూ భాషతో నిమిత్తం లేకుండా తప్పక చూసేవాడు. చూసి ఊరుకోక ఫిల్మ్ టెక్నిక్ కు సంబంధించిన పుస్తకాలు తెప్పించి చదవడం ప్రారంభించాడు. స్వతహాగా ఉన్న ఆసక్తికి ఇలా పుస్తకాల ద్వారా పొందిన విజ్ఞానం తోడవడంతో ఆయన విడుదలైన సినిమాల మీద విమర్శలు వ్రాయడం ఆరంభించాడు.
సినీ విమర్శకునిగా
కృష్ణా పత్రిక లో 'సినీఫాన్' అన్న పేరుతో సినిమా రివ్యూలు వ్రాసే వాడు. విడుదలైన తెలుగు సినిమాలను; న్యూ థియేటర్స్, ప్రభాత్ వారి హిందీ సినిమాలనూ కూలంకషంగా పరిశీలిస్తూ నిశితంగా విమర్శించేవాడు. బందరులో మొదటిసారి విడుదల కాని సినిమాలను బెజవాడ వెళ్ళి చూసి వచ్చేవాడు. సినిమాల్లో కథ, కథాసంవిధానం ఎలా వున్నాయి? ఆ సినిమాలు టెక్నికల్ గా ఎలా వున్నాయి? అన్న విషయాల మీద ఆయన విమర్శలు సాగేవి. తెలుగు, హిందీ సినిమాలే గాక ఆంగ్ల చిత్రాల గురించి కూడా వ్రాసేవాడు. 'గుడ్ ఎర్త్ ' అనే సినిమా లోని గొప్ప దనాన్ని గురించి వరసగా నాలుగు సంచికల్లో వ్రాశాడు.
ఆయన సినిమా విమర్శలకు ఎంతో విలువ ఉండేది. ఆ విమర్శలు విజ్ఞులందరికీ ప్రామాణికంగా ఉండేవి. ఆ విమర్శల్ని చదివి, వాటిలో 'బాగుంది' అని వ్రాస్తేనే ఆ సినిమాలను చూసేవాళ్ళు, బాగలేదని వ్రాస్తే చూడని వాళ్ళు కూడా ఉండేవారు. కృష్ణా పత్రిక స్థాపకుడు మరియు సంపాదకుడు అయిన ముట్నూరు కృష్ణారావు కామేశ్వరరావు ను గురించి "మా సినీఫాన్" అని గర్వంగా చెప్పేవాడు.
ఆ రోజుల్లో పోటీ పడి ఒకేసారి విడుదలైన "ద్రౌపదీ వస్త్రాపహరణం", "ద్రౌపదీ మానసంరక్షణం" చిత్రాలను రెండింటినీ సరిపోలుస్తూ, తేడాలను విశదపరుస్తూ కామేశ్వరరావు కృష్ణా పత్రికలో వరసగా నాలుగు సంచికలలో వ్రాసిన విమర్శలు సినిమా పరిశ్రమలో సంచలనం కలిగించాయి. ఎందుకంటే 'వస్త్రాపహరణం' ఆర్థికంగా విజయవంతమైంది; 'మానసంరక్షణం' దెబ్బతిన్నది. కానీ కామేశ్వరరావు మాత్రం 'మానసంరక్షణం' 'వస్త్రాపహరణం' కంటే మంచి చిత్రమని ప్రశంసించాడు. వస్త్రాపహరణం లోని లోటు పాట్లను విమర్శించాడు. వస్త్రాపహరణంలో నాటి ప్రముఖ స్టేజి నటులంతా నటించారు. బహుళ ప్రచారంలో ఉన్న పద్యాలనే ఆ సినిమాలో వాడారు. హెచ్. ఎం. రెడ్డి ఆధ్వర్యంలో హెచ్.వి.బాబు దర్శకత్వంలో ఆ చిత్ర నిర్మాణం జరిగింది.
ఇక మానసంరక్షణం చిత్రానికి ఎన్.జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. ఇందులో దుర్యోధన పాత్ర ధరించింది బళ్ళారి రాఘవ కాగా అందులో యడవల్లి సూర్యనారాయణ. కథ నడిపిన విధానం, నటన మానసంరక్షణం లో బాగున్నాయని కామేశ్వరరావు వ్రాశాడు.
ఈ విమర్శలను నార్ల వెంకటేశ్వరరావు, గూడవల్లి రామబ్రహ్మం లాంటి ప్రముఖులందరూ ప్రశంసించారు. రామబ్రహ్మం 'వస్త్రాపహరణం' సినిమాలో పని చేశాడు. అయినా కామేశ్వర రావు విమర్శలను మెచ్చుకున్నాడు! ఈ 'వస్త్రాపహరణం', 'మానసంరక్షణం' చిత్రాల మీద వ్రాసిన విమర్శలే కామేశ్వర రావును చిత్ర పరిశ్రమలో ప్రవేశ పెట్టాయి.
రంగ ప్రవేశం
హెచ్.ఎం.రెడ్డి 'కనకతార' తీస్తున్న రోజుల్లో కామేశ్వరరావు మద్రాసు వచ్చాడు. తాను 'సినీఫాన్' అనే పేరుతో కృష్ణా పత్రికలో సినిమాల గురించి విమర్శలు వ్రాస్తూ ఉంటానని చెప్పి 'మానసంరక్షణం', 'వస్త్రాపహరణం' చిత్రాల మీద తాను వ్రాసిన విమర్శలు చూపించాడు - వాటిల్లో ఆర్థికంగా హిట్టైనా సరే, బాగాలేదని తాను వ్రాసిన వస్త్రాపహరణం సినిమా తీసిన హెచ్.ఎం.రెడ్డి కి! కానీ విమర్శలు పూర్తిగా చదివి హెచ్.ఎం.రెడ్డి ఆయన్ను అభినందించాడు!! "చాలా బాగుంది" అని మెచ్చుకున్నాడు!! పైగా తన సినిమాను విమర్శించి, దానికి పోటీగా ఇంకొకరు తీసిన సినిమాను ప్రశంసించిన కామేశ్వరరావుకు ఉద్యోగమివ్వడానికి సిద్ధపడ్డాడు ఆయన.
గృహలక్ష్మి సినిమా ప్రారంభానికి ముందు కబురందుకుని కామేశ్వరరావు మద్రాసు చేరుకుని రోహిణీ సంస్థలో చేరాడు. అయితే ఆ సినిమాలో పనిచేసేనాటికి ఆయనకు సినిమాలలో పని చేసిన అనుభవం లేదు కాబట్టి జీతం లేదు కానీ భోజనం, వసతి సౌకర్యాలు ఉచితంగా ఏర్పాటు చేశారు. కామేశ్వరరావు రోహిణీ వారి లాడ్జిలోనే వుండేవారు. (ఆ రోజుల్లో ఒక సినిమాలో పని చేసే వాళ్లందరికీ ఒకే లాడ్జిలో వసతి, భోజనాలు ఏర్పాటు చేసేవారు). రోహిణీలో చేరడంతో ఆయనకు పెద్దవారితో పరిచయాలు ఏర్పడ్డాయి. రామ్‌నాథ్, ఎ.కె.శేఖర్, బి.ఎన్.రెడ్డి, కె.వి.రెడ్డి, సముద్రాల రాఘవాచార్య మొదలైన వారు పరిచయమయ్యారు. కె.వి.రెడ్డి అప్పుడు రోహిణి లో క్యాషియర్ గా ఉండేవాడు. పెద్ద, చిన్న భేదం లేకుండా అందరూ ఒకే చోట భోజనాలు చేసేవారు. ఒక్కసారే ఒకే కార్లో షూటింగుకు బయల్దేరే వారు. అంతా ఒక కుటుంబంలా ఉండేవారు.
కామేశ్వరరావుకు ఆ సినిమాలో జీతమేకాదు, పని కూడా ఏమీ ఉండేది కాదు. ప్రతిరోజూ తప్పనిసరిగా ఏదో ఒక సినిమా చూసేవాడు. రాత్రయాక లాడ్జిలో పడుకుని కె.వి.రెడ్డి, ఆయనా ఆ సినిమా గురించి చర్చించుకునేవారు. అలా వారిద్దరూ బాగా సన్నిహితులైనారు. గృహలక్ష్మి చిత్రం పూర్తయాక బి.ఎన్.రెడ్డి, రామ్‌నాథ్, ఎ.కె.శేఖర్ తదితరులంతా కలిసి వాహినీ సంస్థ స్థాపించారు. దాంట్లో కామేశ్వరరావు సహాయ దర్శకుడుగా చేరాడు. కె.వి.రెడ్డి ప్రొడక్షన్ మానేజరు, బి.ఎన్.రెడ్డి దర్శకుడు. వాహినీ వారి దేవత చిత్రం నుంచి కామేశ్వరరావు అసోసియేట్ గా పని చేశాడు. ఆసియాలోకెల్లా అతిపెద్ద స్టూడియోగా పేరుపొందిన వాహినీ స్టూడియోకు శంకుస్థాపన జరిగినప్పుడు అక్కడుండి మట్టి వేసిన వారిలో కామేశ్వరరావు ఒకడు.
బందరులో కామేశ్వరరావుకు పింగళి నాగేంద్రరావుతో పరిచయముంది. ఆయన వింధ్యరాణి చిత్ర నిర్మాణ సమయంలో మద్రాసు వచ్చాడు. అప్పుడు కామేశ్వరరావు ఆయనను కె.వి.రెడ్డికి, బి.ఎన్.రెడ్డికి పరిచయం చేశాడు. అలా తెలుగు సినిమా చరిత్రలో అత్యంత ప్రతిభావంతమైన రచయితను పరిశ్రమకు పరిచయం చేసింది కూడా కామేశ్వరరావేనని చెప్పవచ్చు.అంతలో కారణాంతరాల వల్ల వాహినీ స్టూడియో చేతులు మారి విజయా సంస్థ స్టూడియోను నిర్వహించసాగింది. విజయా వారు కామేశ్వరరావును కూడా తమ సంస్థ లోకి తీసుకున్నారు. తొలుత విజయా వారి పాతాళభైరవి సినిమాకు ఆయన పనిచేశాడు. తర్వాత విజయా వారే నిర్మించిన చంద్రహారం సినిమాతో కామేశ్వరరావు తొలిసారిగా దర్శకుడయ్యాడు. తెలుగు, తమిళ భాషల్లో నిర్మించబడిన ఈ చిత్రం విజయావారి మునుపటి చిత్రాల వలె అర్థికంగా విజయవంతం కాలేకపోయింది. కానీ విమర్శకుల మెప్పును మాత్రం పొందింది. ఆ చిత్రంలోని టెక్నిక్ కు ఎందరో విమర్శకులు జోహార్లర్పించారు. ఆ సినిమాలోని కొన్ని దృశ్యాలు విదేశాల్లో టెలివిజన్ లో ప్రసారమయ్యాయి.
దర్శకత్వం వహించిన సినిమాలు:
చంద్రహారం (1954)
గుణసుందరి కథ (తమిళం)
పెంకి పెళ్ళాం (1956)
పాండురంగ మహత్యం (1957)
శోభ (1958)
రేచుక్క-పగటిచుక్క (1959)
మహాకవి కాళిదాసు (1960)
గుండమ్మకథ (1962)
మహామంత్రి తిమ్మరుసు (1962)
నర్తనశాల (1963)
పాండవ వనవాసం (1965)
శకుంతల (1966)
శ్రీకృష్ణ తులాభారం (1966)
శ్రీకృష్ణావతారం (1967)
కాంభోజరాజు కథ (1967)
వీరాంజనేయ (1968)
కలసిన మనసులు (1968)
మాయని మమత (1970)
శ్రీకృష్ణ విజయం (1971)
బాల భారతం (1972), మొ||
దర్శకుని నిర్వచనం
* "చిత్రంలో అన్నిశాఖలూ, అందరూ కనిపించాలి గానీ, దర్శకుడు కనిపించగూడదని నా ఉద్దేశ్యం. అన్నిశాఖలనూ కనిపింపజెయ్యడమే దర్శకుని ఘనత. మణిహారంలో సూత్రముంటుంది. అది పైకి కనిపించదు. కానీ అన్ని మణులనూ కలిపి హారంగా రూపొందిస్తుంది. చిత్ర దర్శకుడు అలాంటి సూత్రం." -కమలాకర కామేశ్వరరావు.
* ఇంతటి మహోన్నత ఆదర్శమూర్తి జూన్ 29, 1998 న తన 88వ ఏట కాలంచేశారు.
కడారు నాగభూషణం
కడారు నాగభూషణం సుప్రసిద్ధ తెలుగు సినిమా నిర్మాత మరియు దర్శకుడు. పసుపులేటి కన్నాంబ భర్త.
చిత్రసమాహారం
* Thali Bhagyam (1966) (దర్శకుడు)
* ఉషా కల్యాణం (1966) (దర్శకుడు)
* చదువుకున్న భార్య (1965) (దర్శకుడు)
* ఆప్త మిత్రులు (1963) (నిర్మాత మరియు దర్శకుడు)
* దక్షయజ్ఞం (1962) (నిర్మాత మరియు దర్శకుడు)
* ఉషా పరిణయం (1961) (నిర్మాత మరియు దర్శకుడు)
* ధర్మమే జయం (1960) (దర్శకుడు)
* వీర భాస్కరుడు (1959) (దర్శకుడు)
* శ్రీకృష్ణ మాయ (1958) (నిర్మాత)
* అన్న తమ్ముడు (1958) (నిర్మాత)
* సతీ అనసూయ (1957) (దర్శకుడు)
* సతీ సావిత్రి (1957) (దర్శకుడు)
* నాగ పంచమి (1956) (దర్శకుడు)
* శ్రీకృష్ణ తులాభారం (1955) (నిర్మాత మరియు దర్శకుడు)
* సతీ సక్కుబాయి (1954) (దర్శకుడు)
* లక్ష్మి (1953) (దర్శకుడు)
* Enzhai Vazhavan (1952) (దర్శకుడు)
* పేదరైతు (1952) (దర్శకుడు)
* సౌదామిని (1951) (నిర్మాత మరియు దర్శకుడు)
* నవజీవనం (1949) (దర్శకుడు)
* తులసీ జలంధర్ (1947) (దర్శకుడు)
* పాదుకా పట్టాభిషేకం (1945) (నిర్మాత మరియు దర్శకుడు)
* సుమతి (1942) (నిర్మాత మరియు దర్శకుడు)
* తల్లిప్రేమ (1941) (నిర్మాత)
ఎస్వీ రంగారావు ( సామర్ల వెంకట రంగారావు)
సుప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు ఎస్వీ రంగారావు పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. నట యశస్వి గా పేరు పొందిన ఈ నటుడు మూడు దశాబ్దాలపాటు మూడొందల చిత్రాలకు పైగా అద్భుతంగా నటించి ఘటోత్కచుడిగా, కీచకుడిగా, రావణాసురుడిగా తనకు తానే సాటిగా ఖ్యాతి గడించాడు. ఆయా పాత్రలలో ఆయన ఎంత మమేకమై పొయ్యరంటే, వేరెవరు కూడా ఆ పాత్రలలో ఇప్పటివరకు ఇమడ లేకపొయ్యారు.
విషయ సూచిక
* 1 తొలి జీవితం
* 2 నటనా చాతుర్యం
* 3 వ్యక్తిగతం
* 4 అవార్డులు, ప్రశంసలు
* 5 కొన్ని పాత్రలు
* 6 నటించిన చిత్రాలు
* 7 మూలాలు
తొలి జీవితం
కృష్ణా జిల్లా లోని నూజివీడు లో 1918 జూలై 3 వ తేదీన లక్ష్మీ నరసాయమ్మ, కోటేశ్వరరావులకు ఎస్వీ రంగారావు జన్మించాడు. తండ్రి ఎక్సైజు శాఖలో పనిచేసేవాడు. యస్.వి.రంగారావు హిందూ కాలేజిలో చదివాడు. డిగ్రీ వరకూ చదివి, అగ్నిమాపక దళంలో ఉన్నతోద్యోగిగా పనిచేస్తూ, షేక్స్‌పియర్ ఆంగ్ల నాటకాలలో ఒథెల్లో, షైలాక్ తదితర పాత్రలు పోషించి ప్రముఖ రంగస్థల కళాకారుడిగా విశేష ఖ్యాతి గడించాడు. ఆ తర్వాత బి.వి.రామానందం దర్శకత్వంలో నిర్మించిన వరూధిని చిత్రంలో ప్రవరాఖ్యుడిగా తెలుగు చలనచిత్ర రంగానికి పరిచయమయ్యాడు.
నటనా చాతుర్యం
వరూధిని చిత్రంలో ప్రవరాఖ్యునిగా ఎస్వీ రంగారావు
ఆ తర్వాత మనదేశం, పల్లెటూరి పిల్ల , షావుకారు, పాతాళభైరవి, పెళ్ళి చేసి చూడు, బంగారుపాప, బాలనాగమ్మ, గృహలక్ష్మి, బాల భారతం, తాతా మనవడు ఇలా అనేక చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించి తన అద్భుత నటనాచాతుర్యంతో సినీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశాడు.
నటసామ్రాట్, విశ్వనట చక్రవర్తి మొదలగు బిరుదులతో తెలుగు ప్రేక్షకులు ఆయన్ను గౌరవించారు. ఎస్వీయార్ నటించిన నర్తనశాల ఇండొనేషియాలోని జకార్తా లో ఆఫ్రో-ఆసియా చిత్రోత్సవములో ప్రదర్శించబడడమే కాకుండా కీచకపాత్రకుగాను ఎస్వీయార్ ఉత్తమ నటుడు బహుమతి పొందాడు. కొన్ని చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించాడు. ముఖ్యంగా ఆయన దర్శకత్వం వహించిన చదరంగం చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వ బహుమతి, నగదు పారితోషికం లభించాయి.
అద్భుత నటనకు ప్రతీకగా నిల్చిన ఎస్వీ రంగారావు 1974 జూలై 18వ తేదీన మద్రాసు లో శాశ్వతంగా కన్నుమూశాడు.
[మార్చు] వ్యక్తిగతం
వ్యక్తిగా రంగారావు సహృదయుడు, చమత్కారి. ఆయన ఇష్టదైవం శివుడు. ప్రతిరోజూ శివపూజ చేసిన తర్వాత దినచర్య ప్రారంభించేవాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమార్తెల పేర్లు విజయ, ప్రమీల. కొడుకు పేరు కోటేశ్వర రావు.
యస్వీఆర్ ఒక రకమయిన వేదాంతి. ఆయన ఇంటి లైబ్రరీలో వివేకానందునికి సంబంధించిన పుస్తకాలు ఎన్నో ఉండేవి. ఆయన గొప్ప దాత. ప్రజాహిత సంస్థలకు లెక్కలేనన్ని విరాళాలు ఇచ్చాడు. చైనాతో యుద్ధం వచ్చినపుడు ఏర్పాటు చేసిన సభలో పదివేల రూపాయలు విరాళం ఇచ్చాడు. తర్వాత పాకిస్తాన్‌తో యుద్ధం వచ్చినపుడు కూడా ఎన్నో సభలు నిర్వహించి, మిగతా నటులతో కలసి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి, విరాళాలు సేకరించి, ఆ డబ్బును రక్షణ నిధికి ఇచ్చాడు.
అవార్డులు, ప్రశంసలు
నర్తనశాలలో కీచకుని పాత్రకు ఆఫ్రో-ఆసియా చిత్రోత్సవములో ఉత్తమ నటుని బహుమతి అందుకొన్న ఎస్వీ రంగారావు
బిరుదులు:
* విశ్వనటచక్రవర్తి
* నటసార్వభౌమ
* నటసింహ
బహుమతులు
* రంగారావు దర్శకత్వం వహించిన మొదటిచిత్రం 'చదరంగం' ద్వితీయ ఉత్తమ చిత్రంగా నంది అవార్డును, రెండవ చిత్రం 'బాంధవ్యాలు' తొలి ఉత్తమ చిత్రంగా నంది అవార్డును గెలుచుకున్నాయి.
* నర్తనశాల చిత్రంలో నటనకు ఇండోనేషియా ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ నటుడి అవార్డు, అదే పాత్రకు రాష్ట్రపతి అవార్డు అందుకున్నాడు.
* ఎస్.వి.రంగారావు ప్రతిభను గురించి, వైవిధ్యమైన పాత్రల పోషించగల నైపుణ్యం గురించి ప్రసిద్ధ దర్శకుడు చిత్రకారుడు, బాపువేసిన ఛిత్రానికిముళ్ళపూడి వాఖ్యానం ఇలా చమత్కారంగా వ్రాశారు.
క్లిష్టపాత్రల్లో చతురంగారావు
దుష్టపాత్రల్లో క్రూరంగారావు
హడలగొట్టే భయంకరంగారావు
హాయిగొలిపే టింగురంగారావు
రొమాన్సులో పూలరంగారావు
నిర్మాతల కొంగుబంగారావు
స్వభావానికి 'ఉంగారంగారావు
కథ నిర్బలం అయితే హావభావాలు పాత్రపరంగారావు
కళ్ళక్కట్టినట్టు కనబడేది ఉత్తి యశ్వీరంగారావు
ఆయన శైలీ ఠీవీ అన్యులకు సులభంగారావు
ఒకోసారి డైలాగుల్లో మాత్రం యమకంగారంగారావు
[మార్చు] కొన్ని పాత్రలు
రంగారావు బహుముఖ ప్రజ్ఞాశాలి. పాత్ర ఏదయినా, ఆయన కనిపించేవాడు కాదు, పాత్రే కనిపించేది. ఆయన తన సుదీర్ఘ నట జీవితంలో, అనేకానేక పాత్రలలో జీవించాడు. వాటిలో కొన్ని:
* షావుకారు - సున్నం రంగడు
* పెళ్ళిచేసి చూడు - ధూపాటి వియ్యన్న
* సంతానం - గుడ్డివాడు
* మాయాబజార్ - ఘటోత్కచుడు
* సతీ సావిత్రి - యముడు
* భక్తప్రహ్లాద - హిరణ్యకశిపుడు
* శ్రీక్రిష్ణ లీలలు - కంసుడు
* యశోద కృష్ణ - కంసుడు
* పాండవ వనవాసం - దుర్యోధనుడు
* నర్తనశాల - కీచకుడు
* హరిశ్చంద్ర - హరిశ్చంద్రుడు
* శ్రీకృష్ణాంజనేయ యుద్ధం - వాసుదేవుడు
* సంపూర్ణ రామాయణం - రావణుడు
* దీపావళి - బాణాసురుడు
* అనార్కలి - అక్బర్
* మహాకవి కాళిదాసు - భోజరాజు
* పాతాళభైరవి - మాంత్రికుడు
* భట్టి విక్రమార్క - మాంత్రికుడు
* బాలనాగమ్మ - మాంత్రికుడు
* విక్రమార్క - మాంత్రికుడు
* బంగారుపాప - కోటయ్య
* బొబ్బిలియుద్ధం - తాండ్ర పాపారాయుడు
నటనకే భాష్యం చెప్పిన యశస్వి - ఎస్వీ రంగారావు
[మార్చు] నటించిన చిత్రాలు
ఆయన నటంచిన చిత్రాలు అనేకం. అందులో కొన్ని .
40వ దశకం
1. వరూధిని(1946)
2. మన దేశం(1948)
50వ దశకం
1950
1. పల్లెటూరి పిల్ల
2. షావుకారు
3. తిరుగుబాటు
1951
1. ఆకాశరాజు
2. పాతాళభైరవి
1952
1. దాసి
2. పెళ్ళిచేసి చూడు
3. పల్లెటూరు
1953
1. బ్రతుకు తెరువు
2. చండీరాణి
3. దేవదాసు
4. పరదేశి
5. పెంపుడు కొడుకు
6. రోహిణి
1954
1. అంతా మనవాళ్ళే
2. జాతకఫలం
3. అన్నదాత
4. రాజు-పేద
5. రాజీ నా ప్రాణం
6. సంఘం
7. చంద్రహారం
1955
1. బంగారుపాప
2. అనార్కలి
3. మిస్సమ్మ
4. జయసింహ
5. సంతానం
1956
1. కనకతార
2. చింతామణి
3. హరిశ్చంద్ర
4. చరణదాసి
1957
1. తోడికోడళ్ళు
2. సతీ సావిత్రి
3. మాయాబజార్
4. అల్లావుద్దీన్ అద్భుతదీపం
5. సారంగధర
6. రేపు నీదే
1958
1. బొమ్మల పెళ్ళి
2. భూకైలాస్
3. చెంచులక్ష్మి
4. పెళ్ళినాటి ప్రమాణాలు
1959
1. కృష్ణలీలలు
2. మాంగల్య బలం
3. అప్పుచేసి పప్పుకూడు
4. జయభేరి
5. రేచుక్క పగటిచుక్క
6. బాలనాగమ్మ
7. భక్త అంబరీష
8. సౌభాగ్యవతి
60వ దశకం
1960
1. నమ్మిన బంటు
2. మహాకవి కాళిదాసు
3. దీపావళి
4. భట్టి విక్రమార్క
5. మామకు తగ్గ అల్లుడు
6. దేవాంతకుడు
1961
1. వెలుగు నీడలు
2. కృష్ణ ప్రేమ
3. సతీసులోచన
4. ఉషాపరిణయం
5. కలసి ఉంటే కలదు సుఖం
1962
1. గాలిమేడలు
2. టైగర్ రాముడు
3. పెళ్ళి తాంబూలం
4. మంచి మనసులు
5. దక్షయజ్ఞం
6. గుండమ్మకథ
7. ఆత్మబంధువు
8. పదండి ముందుకు
9. విషబిందువు
1963
1. నర్తనశాల
2. తోబుట్టువులు
1964
1. మురళీకృష్ణ
2. రాముడు భీముడు
3. బొబ్బిలి యుద్ధం
1965
1. నాదీ ఆడజన్మే
2. పాండవ వనవాసం
3. తోడు నీడ
4. సతీ సక్కుబాయి
5. ఆడబ్రతుకు
1966
1. మొనగాళ్ళకు మొనగాడు
2. ఆటబొమ్మలు
3. శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ
4. చిలకా గోరింక
5. సంగీత లక్ష్మి
6. భక్త పోతన
7. అడుగు జాడలు
8. మోహినీ భస్మాసుర
1967
1. భక్త ప్రహ్లాద
2. చదరంగం
3. గృహలక్ష్మి
4. లక్ష్మీనివాసం
5. పుణ్యవతి
6. రహస్యం
7. సుఖదుఃఖాలు
8. వసంతసేన
1968
1. బాంధవ్యాలు
2. బందిపోటు దొంగలు
3. భలే కోడళ్ళు
4. చిన్నారి పాపలు
5. కుంకుమ భరిణ
6. రాము
7. వీరాంజనేయ
1969
1. జగత్ కిలాడీలు
2. మామకుతగ్గ కోడలు
3. మూగనోము
4. బందిపోటు భీమన్న
70వ దశకం
1970
1. సంబరాల రాంబాబు
2. జగత్ జెట్టీలు
3. ఇద్దరు అమ్మాయిలు
4. దేశమంటే మనుషులోయ్
5. బస్తీ కిలాడీలు
6. కిలాడి సింగన్న
1971
1. విక్రమార్క విజయం
2. అనురాధ
3. దెబ్బకు ఠా దొంగల ముఠా
4. రౌడీ రంగడు
5. భలేపాప
6. జాతకరత్న మిడతంభొట్లు
7. ప్రేమనగర్
8. శ్రీకృష్ణ సత్య
9. దసరా బుల్లోడు
10. శ్రీకృష్ణ విజయం
1972
1. శ్రీకృష్ణాంజనేయ యుద్ధం
2. పాపం పసివాడు
3. పండంటికాపురం
4. సంపూర్ణ రామాయణం
5. శాంతి నిలయం
6. విచిత్రబంధం
7. వంశోద్ధారకుడు
8. కత్తుల రత్తయ్య
9. కొడుకు కోడలు
10. బాలభారతం
1973
1. బంగారు బాబు
2. మరపురాని మనిషి
3. తాతా మనవడు
4. డబ్బుకు లోకం దాసోహం
5. రామరాజ్యం
6. రాముడే దేముడు
7. వారసురాలు
8. మైనరు బాబు
9. దేవుడు చేసిన మనుషులు
10. డాక్టర్ బాబు
1974
1. ప్రేమలూ పెళ్ళిళ్ళు
2. బంగారు కలలు
3. చక్రవాకం
4. గాలిపటాలు
5. అందరూ దొంగలే
6. య
ఎల్.వి.ప్రసాద్
ఎల్.వి.ప్రసాద్ గా ప్రసిద్ధి చెందిన అక్కినేని లక్ష్మీవరప్రసాదరావు తెలుగు సినీనిర్మాత, దర్శకుడు, నటుడు మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత . ఈయన జనవరి 17,1908 లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఏలూరు తాలూకాలోని సోమవరప్పాడు గ్రామమునందు అక్కినేని శ్రీరాములు, బసవమ్మ దంపతుల రెండవ సంతానముగా జన్మించాడు. హిందీ, తమిళ, తెలుగు, కన్నడ వంటి పలు భారతీయ భాషలలో 50 చిత్రాల వరకు ఆయన దర్శకత్వం వహించటంగానీ, నిర్మించటంగానీ, నటించటంగానీ చేసాడు. అంతేకాదు ఎల్.వి.ప్రసాద్ హిందీ, తమిళ, తెలుగు భాషలలో తొలి టాకీ చిత్రాలయిన ఆలం ఆరా, కాళిదాస్ మరియూ భక్తప్రహ్లాద మూడింటిలోనూ ఆయన నటించాడు. తెలుగువారిలో బహుశా ఆయన ఒక్కరే ఈ ఘనత సాధించి ఉంటాడు.
విషయ సూచిక
* 1 బాల్యం
* 2 సినిమాలు
o 2.1 నటునిగా
o 2.2 దర్శకునిగా
* 3 పురస్కారాలు
* 4 బయటి లింకులు
బాల్యం
రైతు కుటుంబంలో పుట్టిన ప్రసాద్ గారాబంగా పెరిగాడు. చురుకైన కుర్రవాడే కానీ చదువులో ఎప్పుడూ శ్రద్ధ చూపలేదు. ఉరూరా తిరిగే నాటకాల కంపెనీలు, డాన్సు ట్రూపుల డప్పుల చప్పుల్లు ప్రసాద్ ను ఆకర్షించేవి. పాత అరిగిపోయిన సినిమా రీళ్ళను ప్రదర్శించే గుడారపు ప్రదర్శనశాలల్లో ప్రసాద్ తరచూ వాటిని ఆసక్తిగా చూసేవాడు. స్థానిక నాటకాల్లో తరచుగా చిన్న చిన్న వేషాలు వేసేవాడు. ఇదే ఆసక్తి పెద్దయ్యాక కదిలే బొమ్మలు, నటనపై ఆసక్తిని పెంచి సినిమా రంగంలో ప్రవేశించడానికి పునాదులు వేసింది.
17 యేళ్ళ వయసులో 1924లో మేనమామ కూతురు సౌందర్య మనోహరమ్మను సినిమా ఫక్కీలో పెళ్ళి చేసుకున్నాడు. వెనువెంటనే వీరికి ఒక ఆడపిల్ల పుట్టుంది. ప్రసాద్ తండ్రి కొండలా పెరిగిపోతున్న అప్పులను భరించలేక, ఇళ్ళు గడవక చేతులెత్తేసి కుటుంబాన్ని తలదించుకునేట్టు చేశాడు. ఇదే సమయంలో ప్రసాద్ తన నటనా ప్రతిభను జీవనోపాధికై ఉపయోగించాలని నిశ్చయించుకుని జేబులో వంద రూపాయలతో ఎవరికీ చెప్పకుండా ఉరు విడిచి వెళ్ళాడు.
సినిమాలు
నటునిగా
* స్టార్ ఆఫ్ ది ఈస్ట్ (Star of the east (Silent)) - అసంపూర్తి.
* 1931 : ఆలం ఆరా - మొదటి హిందీ టాకీ సినిమా
* 1931 : కాళిదాస్ - మొదటి తమిళ టాకీ సినిమా
* 1931 : భక్తప్రహ్లాద - మొదటి తెలుగు టాకీ సినిమా
* 1933 : సీతా స్వయంవర్ (హిందీ)
* 1940 : బోండాం పెళ్ళి (తెలుగు)
* 1940 : చదువుకున్న భార్య (1940) (తెలుగు)
* 1982 : రాజా పార్వాయి (తమిళం)
దర్శకునిగా
* మిస్సమ్మ (1955)
* గృహ ప్రవేశం (1947)
* పల్నాటి యుద్ధం (1947)
* ద్రోహి (1948)
* మన దేశం (1949)
* సంసారం (1950)
* షావుకారు (1950)
పురస్కారాలు
* దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
* ఎల్వీ ప్రసాదు స్మారకార్థం భారత తపాలా శాఖ 2006 సెప్టెంబరు 5న ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేసింది.
ఎం.వి.రఘు
మాడపాక వెంకట రఘు (ఎం.వి.రఘు)[1] తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పేరు గాంచిన అవార్డులు, రివార్డులు పొందిన ప్రముఖ ఛాయాగ్రాహకుడు (సినీమాటోగ్రాఫర్) మరియు దర్శకుడు. ఈయన వివిధ భాషలలో యాభైకి(50)[1] పైగా సినిమాలకి,10 డాక్యుమెంటరీలకి ఛాయగ్రాహణం నిర్వర్తించారు. రెండు సినిమాలకి దర్శకత్వం వహించారు. ఛాయగ్రాహకునిగా మరియు దర్శకునిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది అవార్డులతో పాటు వివిధ సాంస్కృతిక సంస్థల నుండి యాభైకి పైగా అవార్డులు పొందిన లబ్దప్రతిష్టుడు.[2]
విషయ సూచిక
* 1 బాల్యం
* 2 చదువు
* 3 సినీరంగ ప్రవేశం
* 4 సహాయ ఛాయగ్రాహకుడుగా
* 5 ఛాయగ్రాహకుడుగా
o 5.1 సితార సినిమాకి
o 5.2 అన్వేషణ సినిమాకి
o 5.3 స్వాతిముత్యం సినిమాకి
o 5.4 సిరివెన్నెల సినిమాకి
o 5.5 డాక్యుమెంటరీలకి
* 6 దర్శకుడుగా
* 7 పురస్కారాలు
* 8 చిత్ర సంకలనము
* 9 మూలాలు
* 10 ఇవి కూడా చూడండి
బాల్యం
1954లో భీమవరంలో జన్మించిన రఘు తండ్రి, ఎం.ఎస్.చిన్నయ్య రైల్వే ఉద్యోగి. తల్లి నాగేశ్వరమ్మ గృహిణి. చిన్నయ్యకు ఫోటోగ్రఫిలో చాలా ఆసక్తి ఉండేది. తన 620 కొడాక్ బాక్స్ కెమెరాతో తరచూ ఫోటోలు తీసి సొంతగా డెవలప్ చేసేవాడు. వాళ్ళ ఇంట్లోనే ఒక డార్క్ రూమ్ ఉండేది. రఘుకు బాల్యం నుండే ఫోటో రీళ్ళను కడగటం వంటి పనులు బాగా అలవడ్డాయి. చిన్నయ్యకు సినిమారంగములో అడుగుపెట్టాలని ఆశ ఉన్నా, అప్పటి పరిస్థితులు అనుకూలించక ఆ కల సాకారం కాలేదు. ఫోటోగ్రఫిలో తండ్రి అనేక అవార్డులను గెలుచుకోవటం, తనయుడైన రఘుకు పెద్దైన తర్వాత కెమెరామెన్ కావలనే స్ఫూర్తిని కలుగజేసింది. దానికి ఆయన కుటుంబము మంచి ప్రోత్సాహాన్నిచ్చింది.
తొమ్మిదేళ్ల వయసులో తండ్రికి గుంటూరు బదిలీ అవడంతో కుటుంబముతో సహా గుంటూరు వచ్చారు. అక్కడున్న ఆ తర్వాత పదేళ్ళు రఘు, తండ్రితో పాటు గుంటూరులోని లీలామహల్ థియేటర్లో విడుదలైన ఇంగ్లీషు సినిమాలన్నీ చూసేవాడు. ఒక్కో సినిమా 32 సార్లు చూసేవాన్నని, లాంగెస్ట్ డే సినిమాని 42సార్లు చూసానని చెప్పుకున్నాడు.[3] ఈయనను అత్యంత ప్రభావితం చేసిన సినిమా 1968లో విడుదలైన 2001- ఏ స్పేస్ ఒడిస్సీ. రఘుకు అప్పటినుండే సినిమా టెక్నిక్కులు, స్పెషల్ ఎఫెక్ట్లు, లైటింగ్ స్కీములు మరియు ఇతర చిన్న చిన్న విషయాల గురించి నోట్సు వ్రాసుకునే అలావాటు ఉండేది.
చదువు
రఘు గుంటూరులో బీఎస్సీ పూర్తిచేసి, 1972 నుండి 74వరకు హైదరాబాదులోని ప్రభుత్వ సైన్స్, ఆర్ట్స్ మరియు ఆర్కిటెక్చర్ కళాశాల (ప్రస్తుత జే.ఎన్.టి.యూ) లో కమర్షియల్ ఫోటోగ్రఫిలో డిప్లొమా కోర్సులో చేరి 98 శాతం మార్కులతో పాసై బంగారు పతకము సాధించాడు.
సినీరంగ ప్రవేశం
రఘు తండ్రి చిన్నయ్య, నేపథ్యగాయకుడు పిఠాపురం నాగేశ్వరరావు మంచి స్నేహితులు. చిన్నయ్య కొడుకు గురించి నాగేశ్వరరావుకు సిఫారుసు చేయగా, ఆయన తన ఇంట్లో అద్దెకుంటున్న కెమెరామెన్ వి.ఎస్.ఆర్.స్వామితో రఘ విషయమై ప్రస్తావించాడు. ఇలా 1976లో వి.ఎస్.ఆర్.స్వామి సహాయంతో రఘు విజయవాహినీ స్టూడియో సహాయకునిగా చేరాడు. కెమెరా విభాగంలో సహాయకునిగా రఘు తొలి చిత్రము, శివాజీ గణేషన్ కథానాయకునిగా దర్శకుడు యోగానంద్ నిర్మించిన గృహప్రవేశం. ఈ సినిమాను స్టూడియోలోని నాలుగవ అంతస్థులో చిత్రీకరించారు.
సహాయ ఛాయగ్రాహకుడుగా
ఈయన మద్రాస్(ఇప్పుడు చెన్నై) కి వచ్చిన కొత్తలో ప్రముఖ చలన చిత్ర చాయగ్రాకుడు వి.ఎస్.ఆర్.స్వామి దగ్గర సహాయకుడిగా చేరి అప్పటికే తనకు జే.ఎన్.టి యూనివర్సిటి వారి ఫోటోగ్రఫి శిక్షణ ద్వారా వున్న పరిజ్ఞానానికి మరింత మెరుగులు దిద్దుకుంటూ చలన చిత్ర చాయగ్రహణములో మంచి పరిణితి సాదించారు.దీనికంటే ముందు వి.ఎస్.ఆర్.స్వామి సూచన మేరకు ప్రముఖ ఫిల్మ్ స్టూడియో విజయ వాహిని లో కేమెరా విభాగములో చేరి ఒక సంవత్సరం పాటు పనిచేసి 2౦౦ మంది సినిమాటోగ్రాఫెర్ల పనితీరును,సినిమాల చిత్రీకరణ విధానాన్ని పరిశీలించి తిరిగీ వి.ఎస్.ఆర్.స్వామి దగ్గర సహాయకుడిగా ప్రముఖ దర్శకుడు,చిత్రకారుడు బాపు దర్శకత్వం వహించిన భక్త కన్నప్ప సినిమా ద్వారా తన సినిమాటోగ్రాఫి శిక్షణని ప్రారంభించి 25 సినిమాలకి పనిచేసారు[4]. అప్పటికే వి.ఎస్.ఆర్.స్వామి దగ్గర ఆపరేటివ్ కెమేరామన్ గా వున్న ఎస్.గోపాలరెడ్డి తను స్వంతగా జంధ్యాల దర్శకత్వంలో ముద్దమందారం తెలుగు చలన చిత్రానికి చాయాగ్రహకత్వం వహించే అవకాశం రావటముతో ఎం.వి.రఘు ని ఆపరేటివ్ కెమెరామన్ గా[5] తీసుకున్నారు.ఈయన దగ్గర 20 సినిమాలకి ఆపరేటివ్ కేమెరామన్ గాపనిచేసారు.
ఛాయగ్రాహకుడుగా
ప్రముఖ నటుడు చిరంజీవి-హరిప్రసాద్ మరియు సుధాకర్ లతో కలసి ఎం.వి.రఘు
తన మొట్ట మొదటి చాయగ్రాహక దర్శకత్వం విజయ బాపినీడు దర్శకత్వం వహించిన మగమహారాజు సినిమా. చిరంజీవి కూడా ఈ సినిమా ద్వారానే కథానాయకుడు గా పరిచయం చేయబడ్డాడు.ఈ సినిమా ఘన విజయం సాధించటముతో చిరంజీవి, ఎం.వి.రఘు లకి తమ తమ రంగాలలో ముందుకు వెళ్ళేదానికి దోహదపడింది అని చెప్పవచ్చు.
సితార సినిమాకి
1984 సంవత్సరములో విడుదల అయిన సితార సినిమా అప్పటివరకు వస్తూవున్న మూస చిత్రాలని తోసిరాజని ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందని చెప్పవచ్చు.ఎం.వి.రఘు అద్బుత చాయగ్రహణంతో ఈ సినిమా వంశీ దర్శకత్వం వహిస్తే పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ వారు నిర్మించారు.35ఎం.ఎం ఫిల్మ్ ఫార్మాట్ లో నిర్మించిన ఈ రంగుల సినిమాకి భారత ప్రభుత్వంవారి ఉత్తమ ప్రాంతీయ చిత్రం పురస్కారం లభించింది. దక్షిణ భారత దేశ సినిమా చరిత్రలో మొదటిసారిగా రౌండ్ ట్రాలి(గుండ్రటి పట్టాలఫై ట్రాలి మీద కెమేరా వుంచి చిత్రీకరణ జరిపే విదానం) వాడి చిత్రీకరణ జరిపిన చాయగ్రాహకుడిగా[6] రఘు ప్రసిద్ది చెందాడు.ఈ రౌండ్ ట్రాలీ మీద కెమెరా వుంచి చిత్రీకరించే విదానాన్ని సితార సినిమాలో కూడా ఒక సన్నివేశంలో గమనించవచ్చు.
తెలుగు చలన చిత్రాలలో సినేమాటోగ్రఫీకి గుర్తింపు,విలువ రావటం ఈ సినిమాతోనే మొదలయ్యిందనటం అతిశయోక్తికాదు.
సితార సినిమాకి రౌండ్ ట్రాలి వాడి చిత్రీకరిస్తున్నప్పటి ఫోటో కెమెరా పట్టుకున్న వ్యక్తి ఎం.వి.రఘు
కూర్చున్నవ్యక్తి డైరెక్టర్ వంశీ
సితార సినిమా లో రఘు చాయగ్రాహన పనితనాన్ని ముఖ్యంగా డే ఫర్ నైట్ చిత్రీకరణ విదానాన్ని చూసి ముగ్దుడయిన ప్రముఖ హిందీ నటుడు అమితాబ్ బచ్చన్ తన స్వంత సినిమాకి చాయగ్రాహకుడిగా నియమించుకున్నాడు[7].కాని అనివార్య కారణాలవలన ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు.
అన్వేషణ సినిమాకి
వంశీ దర్శకత్వంలోనే వచ్చిన అన్వేషణ సినిమాకి రఘు అందించిన చాయగ్రహణం అద్బుతంగా ఉంటుంది. చాల మంది ఔత్సాహిక ఫోటోగ్రాఫేర్లకి ఈ సినిమా ప్రేరణగా నిలిచిందని అంటుంటారు. తిరుపతి కి దగ్గరలోని తలకోన అడవులలో చిత్రీకరించిన ఈ సినిమా చాల భాగం రాత్రులు మరియు డే ఫర్ నైట్ పద్దతిలో పగలు చిత్రీకరించి రాత్రిలాగా చూపించటం, చేతితోనే కెమెరా పట్టుకుని పరిగెడుతూ(స్టేడికాం కెమేరాతో చిత్రీకరించినట్టుగా) చిత్రీకరించిన విధం, ముఖ్యంగా సినిమా సస్పెన్స్ కథనానికి, పాటల చిత్రీకరణానికి రఘు కి చాల పేరు, అవార్డులు పెట్టడమే కాకుండా చిత్ర విజయానికి ఎంతొ దోహదం చేసాయి.
ఈ సినిమాకి, చిత్ర విజయానికి వచ్చిన మంచి ప్రశంస" ఇది సాంకేతిక నిపుణుల సినిమా" అని పత్రికలూ,విమర్శకులు ప్రశంసించటం.
స్వాతిముత్యం సినిమాకి
సిరివెన్నెల సినిమాకి
మాస్క్ పనితనం(ఒకే నటుడు ఇద్దరు లేక ముగ్గురుగా ఒకే ఫ్రేములో కనిపించేట్టుగా నల్లటి అట్ట ముక్కని ఉపయోగించి ఒకే ఫిల్మ్ మీద చిత్రీకరించే విదానం), డే ఫర్ నైట్(రాత్రి చిత్రీకరణని పగలు చిత్రీకరించటం),అత్యంత వేగంగా చిత్రీకరణలో ఈయన నిష్ణాతుడు.
డాక్యుమెంటరీలకి
డిస్కవరీ టీవి ఛానల్ కార్యక్రమం హిడ్డెన్ ట్రెజర్స్ డాక్యుమెంటరీ దర్శకుడు మరియు రామోజీరావు తో కలసి ఎం.వి.రఘు'
ప్రపంచ ప్రఖ్యాత టీవి ఛానల్ డిస్కవరీ తమ కార్యక్రమం దాగివున్న సంపదలు (హిడ్డెన్ ట్రెజర్స్) శీర్షిక క్రింద రామోజీ ఫిల్మ్ సిటీ ని చిత్రీకరించేందుకు ఛాయగ్రాహకునిగా ఎం.వి.రఘుని ఎన్నుకున్నారు. ఎందరో ఛాయాగ్రాహకులను పరిశీలించి అంతర్జాతీయ ప్రమాణాలతో చిత్రీకరించేందుకు సరైన సినిమాటోగ్రాఫర్‌గా రఘును ఎన్నుకోవటం ఆయన ప్రతిభకి ఒక గుర్తింపు.
దర్శకుడుగా
రఘు మొట్టమొదటిసారిగా దర్శకత్వం వహించిన కళ్ళు సినిమా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక అత్యుత్తమమయిన కథతో తీసిన ప్రయోగాత్మక చిత్రంగా నిలిచిపోయింది. ఈ సినిమాకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి నంది పురస్కారముతో పాటు రెండు డజన్లకు పైగా ఇతర సాంస్కృతిక సంస్థల పురస్కారాలు లభించాయి. గొల్లపూడి మారుతీరావు రచించిన కళ్ళు నాటకం ఆధారంగా ఈ సినిమా తీశారు. [2] అంతేకాదు ఈ సినిమాను ఆస్కారు అవార్డుల నామినేషన్లలో భారతీయ సినిమాలకు ప్రాతినిధ్యం చేయడానికి కూడా ఎంపికచేయబడినది. [2] [8] ఈ సినిమాలో నటుడు చిరంజీవి తన కనిపించని పాత్రకు మాటలు అందించాడు. ఈ సినిమాలో తెల్లారింది లెగండోయ్... మంచాలింక దిగండోయ్... అనే పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రి తానే రాసి స్వయంగా పాడాడు. శివాజీ రాజా , రాజేశ్వరి , సుధారాణి, చిదంబరం ఈ సినిమా ద్వారానే మొట్టమొదటిసారిగా నటులుగా పరిచయం చేయబడ్డారు. కళ్ళు చిదంబరం పేరుకు ముందు ఉన్న కళ్ళు ఈ సినిమా నుండే వచ్చాయి.
రఘు దర్శకత్వం వహించిన రెండవ సినిమా ఆర్తనాదం. రాజశేఖర్, సీత, చంద్రమోహన్ మొదలగు వాళ్ళు నటించారు. చిత్రంలో ఉన్న వైవిధ్యం ఎంటి అంటే సినిమా మొత్తం ఒక చిత్రం షూటింగ్‌కి వెళ్ళిన యూనిట్ మధ్య జరుగుతుంది. కథానాయకిని హత్య చెయ్యడానికి ప్రయత్నం జరుగుతుంది. ఎవరు చేసారు? దేనికి? అన్నది అర్ధం కాదు. మధ్యలో వచ్చిన బైట వ్యక్తి మీద అనుమానం, కొన్ని ఆనవాళ్ళు కనపడతాయి. చివరకు ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ సినిమా ఆద్యంతమూ సాగుతుంది. చిత్రం మొత్తం ఊటిలోని బృందావన్ అతిధి గృహంలో తీసిన ఈ సినిమా షూటింగును మొత్తం 30 రోజుల్లో పూర్తి చేసారు. ఈ చిత్రానికి సంగీతం హంసలేఖ. అప్పట్లో సెన్సార్ అధికారిగా పనిచేస్తున్న సరళ ఈ చిత్రానికి అబ్బ నీ సొకు మాడా అనే ఒక పాట పాడటం మరో విశేషం.[9]
రఘు ఈ రెండు సినిమాలకి దర్శకత్వం వహించిన తరువాత ఛాయగ్రాహకునిగా అనేక సినిమాలకి చాయాగ్రహణం భాద్యతలు నిర్వర్తించినా తిరిగి దర్శకత్వం మాత్రం చేపట్టక పోవటం ఆశ్చర్యకర విషయం.
[మార్చు] పురస్కారాలు
పురస్కారం పేరు బహుకరించింది సంవత్సరం ఇతర వివరాలు
నంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
Mv Raghu nandi award frm NTR.jpg
1986 సిరివెన్నెల సినిమా చాయాగ్రహణ ప్రతిభకి న్యాయ నిర్ణేతల ప్రత్యేక పురస్కారం నంది పురస్కారం(ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపు అధికారిక అవార్డు) అప్పటి ముఖ్యమంత్రి,ప్రఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు నుండి అందుకుంటున్న ఎం.వి.రఘు[2]
నంది 1988వ సంవత్సరానికికళ్ళు (సినిమా) సినిమాకి ఉత్తమ నూతన దర్శకుడిగా నంది పురస్కారం
ఫిలింఫేర్ పురస్కారం
ఉత్తమ దర్శకుడు 1988 1988వ సంవత్సరానికికళ్ళు (సినిమా) సినిమాకి ఉత్తమ దర్శకుడిగా ఫిలింఫేర్ పురస్కారం.[2]
[మార్చు] చిత్ర సంకలనము
చిత్రము నటీ నటులు విడుదల సంవత్సరము భాష బాధ్యతలు
మగమహారాజు చిరంజీవి,సుహాసిని 1983 తెలుగు ఛాయాగ్రాహకత్వం
సితార భానుప్రియ, సుమన్ 1983 తెలుగు ఛాయాగ్రాహకత్వం [10]
స్వాతిముత్యం కమలహాసన్, రాధిక 1985 తెలుగు ఛాయాగ్రాహకత్వం [10]
అన్వేషణ కార్తీక్, భానుప్రియ 1985 తెలుగు ఛాయాగ్రాహకత్వం [10]
సంసార్[11] రేఖ,రాజ్ బబ్బర్,అనుపమ్ ఖేర్ 1985 హిందీ ఛాయాగ్రాహకత్వం [10]
మేరా పతీ సిర్ఫ్ మేరా హై[12] జితేంద్ర, రేఖ, రాధిక 1990 హిందీ ఛాయాగ్రాహకత్వం [10]
ఏప్రిల్ 1 విడుదల రాజేంద్రప్రసాద్,శోభన 1991 తెలుగు ఛాయాగ్రాహకత్వం [10]
డిటెక్టివ్ నారద మోహన్ బాబు,మోహిని,నిరోషా 1993 తెలుగు ఛాయాగ్రాహకత్వం [10]
వైఫ్ ఆఫ్ వి వరప్రసాద్ వినీత్,ఆవని,ఎస్.పీ.బాలసుబ్రమణ్యం,జె.డి.చక్రవర్తి 1998 తెలుగు ఛాయాగ్రాహకత్వం [10]
[మార్చు] మూలాలు
1. ↑ 1.0 1.1 "Return of the thespian", TheHindu.com, 2008-05-29. Retrieved on మే 29.
2. ↑ 2.0 2.1 2.2 2.3 2.4 ద హిందూ దిన పత్రికలో ఎం.వి.రఘుపై వ్యాసం. మే 26, 2007న సేకరించబడినది.
3. ↑ http://ilovehyderabad.com/interviews/interviews-i-write-with-the-light.html
4. ↑ "The saga of a lensman:M.V.Raghu", TheHindu.com, 2008-05-31. Retrieved on మే 31.
5. ↑ "as Operative cameraman: M.V. Raghu", telugucinema.com, 2008-05-30. Retrieved on మే 30.
6. ↑ "Sitara (1984)", cinegoer.com, 2008-06-03. Retrieved on జూన్ 03.
7. ↑ "The saga of a lensman", hinduonnet.com, 2008-06-03. Retrieved on జూన్ 03.
8. ↑ తెలుగు సినిమా.కాంలో ఎం.వి.రఘు పరిచయం. మే 26, 2007న సేకరించబడినది.
9. ↑ ఆర్తనాదం సినిమాపై telugucinema.comలోని వ్యాసం. మే 30, 2008న సేకరించబడినది.
10. ↑ 10.0 10.1 10.2 10.3 10.4 10.5 10.6 10.7 "Raghu M.V.", IMDb.com, 2008-05-28. Retrieved on మే 29.
11. ↑ "Sansar", IMDb.com, 2008-05-28. Retrieved on మే 29.
12. ↑ "Mera pati sirf mera hy", IMDb.com, 2008-05-28. Retrieved on మే 29.
ఎ.కోదండరామిరెడ్డి
కె.రాఘవేంద్రరావు శిష్యుడైన కోదండరామిరెడ్డికి దర్శకుడిగా తొ లిచిత్రం "సంధ్య". హిందీ చిత్రం 'తపస్య' ఆధారంగా తీసారు. కుటుంబ చిత్రంగా ఓ మాదిరిగా విజయవంతమైంది. చాలా కొద్దికాలంలోనే పెద్ద హీరోలతో అవకాశాలు వచ్చాయి. చిరంజీవిని తారాపథానికి తీసుకెళ్ళిన ఖైదీ చిత్రం కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చింది. "న్యాయం కావాలి" చిత్రంతో మొదలైన వీరి సినీ నిర్మాణ బంధం "ముఠా మేస్త్రి" సినిమా వరకు సాగింది. వీరిద్దరు కలిపి 23 సినిమాలకు పనిచేసారు. అందులో 80% విజయం సాధించాయి. ఒక్క ఎన్.టి.ఆర్ తో తప్ప అందరు ప్రముఖ నటులతోనూ చిత్రాలు తీసారు.
విషయ సూచిక
[దాచు]
* 1 చిత్రసమాహారం
o 1.1 దర్శకుడిగా
o 1.2 రచయితగా
o 1.3 నటుడిగా
* 2 బయటి లింకులు
[మార్చు] చిత్రసమాహారం
[మార్చు] దర్శకుడిగా
* గొడవ (2007)
* తప్పు చేసి పప్పు కూడు (2002)
* ముఠా మేస్త్రీ (1993)
* జమై రాజా (1990)
* కొండవీటి దొంగ (1990)
* అత్తకి యముడు అమ్మాయికి మొగుడు (1989)
* నారీ నారీ నడుమ మురారి (1989)
* త్రినేత్రుడు (1988)
* మరణ మృదంగం (1988)
* రక్తాభిషేకం (1988)
* జేబుదొంగ (1987)
* పసివాడి ప్రాణం (1987)
* దొంగ మొగుడు (1987)
* భార్గవ రాముడు (1987)
* రాక్షసుడు (1986)
* వేట (1986)
* కిరాతకుడు (1986)
* అనసూయమ్మగారి అల్లుడు (1986)
* దేశోద్ధారకులు (1986)
* విజేత (1985)
* ఒక రాధ ఇద్దరు కృష్ణులు (1985)
* రక్త సింధూరం (1985)
* దొంగ (1985)
* మహా సంగ్రామం (1985)
* పల్నాటి సింహం (1985)
* రుస్తుం (1984)
* ఛాలెంజ్ (1984)
* అనుబంధం (1984)
* గూండా (1984)
* ఖైదీ (1983)
* శివుడు శివుడు శివుడు (1983)
* అభిలాష (1983)
* ప్రేమ పిచ్చోళ్ళు (1983)
* రామరాజ్యంలో భీమరాజు (1983)
* శ్రీరంగనీతులు (1983)
* కిరాయి రౌడీలు (1981)
* న్యాయం కావాలి (1981)
[మార్చు] రచయితగా
* అత్తకు యముడు అమ్మాయికి మొగుడు (1989) (screen adaptation)
* దొంగ మొగుడు (1987) (writer)
* ఒక రాధ ఇద్దరు కృష్ణులు (1985) (screen adaptation)
* గూండా (1984) (screen adaptation)
* అభిలాష (1983) (screen adaptation)
[మార్చు] నటుడిగా
ఇ.వి.వి.సత్యనారాయణ
ఇ.వి.వి గా ప్రసిద్ధి చెందిన ఈదర వీర వెంకట సత్యనారాయణ (జ. జూన్ 10, 1958)[1] తెలుగు సినిమా ప్రరిశ్రమలో ప్రసిద్ధ దర్శకుడు. తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించిన ఇతడు ప్రముఖ దర్శకుడు జంధ్యాల శిష్యుడు. ఈతడి మొదటి సినిమా రాజేంద్రప్రసాద్ కధానాయకుడిగా నిర్మింపబడిన చెవిలో పువ్వు. ఈ సినిమా అంతగా విజయవంతం కాలేదు. కొద్ది కాలంతర్వాత నిర్మాత రామానాయుడు 'ప్రేమఖైదీ' చిత్రంలో అవకాశమిచ్చారు. ఆ చిత్రం విజయవంతం కావటంతో పలు అవకాశాలు వచ్చాయి. జంధ్యాల వరవడిలో హస్యప్రధాన చిత్రాలు నిర్మించాడు. జంధ్యాల కంటే కొంతఘాటైన హస్యాన్ని చిత్రాల్లో ప్రవేశపెట్టారు. రాజేంద్ర ప్రసాద్ తో 'ఆ ఒక్కటి అడక్కు', 'అప్పుల అప్పారావు', 'ఆలీబాబా అరడజనుదొంగలు' వంటి చిత్రాలు మరియు నరేష్ తో 'జంబలకిడి పంబ' మొడలైన చిత్రాలు తీశారు. సీతారత్నంగారి అబ్బాయి, ఏవండీ ఆవిడ వచ్చింది (శోభన్ బాబు), లాంటి చిత్రాలతర్వాత , ఆమె, తాళి వంటి మహిళాపరమైన చిత్రాలు తీశారు. అగ్రనటులైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లతో చిత్రాలు తీశారు. .కొద్ది విరామం తర్వాత కుమారులిద్దర్ని హీరోలుగా పరిచయంచేశారు.
విషయ సూచిక
[దాచు]
* 1 తొలినాళ్ళు
* 2 పరిచయం చేసిన నటీనటులు
* 3 చిత్రాలు
* 4 మూలాలు
[మార్చు] తొలినాళ్ళు
సత్యనారాయణ పశ్చిమ గోదావరి జిల్లాలోని దొమ్మేరులో వ్యవసాయ కుటుంబంలో పుట్టాడు. నాన్న వెంకటరావు, అమ్మ వెంకటరత్నం. ఈయన కుటుంబానికి దొమ్మేరులో 70 ఎకరాల పొలం ఉండింది. బాల్యం నుండి సినిమాలంటే ఆసక్తితో కనీసం వారానికి రెండు సినిమాలైన చూసేవాడు. ఇంటర్మీడియట్ వరకు బుద్ధిగానే చదివినా, ఇంటర్‌కు నిడుదవోలు వెళ్ళిన సత్యనారాయణ కాలేజికి వెళ్ళకుండా రోజూ ఉదయం ఆట, మధ్యాహ్నం ఆట సినిమాలను చూడటంతో హాజరు తక్కువై ఇంటర్మీయడ్ తప్పాడు. అప్పుడు సత్యనారాయణ తండ్రి ఆయన్ను కాలేజీకి పంపించి లాభం లేదని నిశ్చయించి తండ్రితో పాటు పొలం పనులు చూసుకోవటానికి నియమించాడు. 19 యేళ్ళకే 1976లో సరస్వతి కుమారితో పెళ్ళైంది. ఆ వెంటనే సంవత్సరానికి ఒకరు చొప్పున ఇద్దరు కొడుకులు పుట్టారు. వీళ్ళకు రాజేష్, నరేష్ అని పేరు పెట్టారు. కొన్నాళ్ళకు వ్యవసాయంలో పెద్ద నష్టాలు రావడంతో పొలాలు అమ్మేయవలసిన పరిస్థితి కలిగింది. ఆ పరిస్థితుల్లో అక్కడ ఉండటానికి సత్యనారాయణ తెగ ఇబ్బంది పడి ఎక్కడికైనా మరో ఊరికి కొన్నాళ్ళు వెళ్ళిపోవాలనుకున్నాడు. ఇ.వి.వి స్నేహితుడు నిర్మాత నవతా కృష్ణంరాజు మేనల్లుడైన సుబ్బరాజును సంప్రదించి ఒక సిఫారుసు ఉత్తరం పట్టుకుని మొదటిసారి మద్రాసు వెళ్ళాడు. నవతా కృష్ణంరాజును కలిసి ఉత్తరం ఇవ్వగా ఆయన సినీరంగంలో జీవితం అనుకున్నంత సులభం కాదని, తిరిగి సొంత ఊరికి వెళ్ళిపొమ్మని హితవు చెప్పాడు. దాంతో పూర్తిగా నిరాశచెందిన సత్యనారాయణ, తిరిగి వెళ్ళినా చేసేదేమీ లేదనుకుని మద్రాసులోనే ఉండి వివిధ ప్రదేశాలు తిరుగుతుండేవాడు. పాండీబజారుకు వెళ్ళి అక్కడ సహాయదర్శకులు చెప్పుకునే మాటలు వినేవాడు. ప్రతి ఉదయం నవత కృష్ణంరాజు కార్యాలయం గేటు వద్ద నుంచుని ఉండేవాడు. ఒక నెలరోజుల తర్వాత కుర్రవాని పట్టుదలను చూసి ఏం చెయ్యగలవు అని అడిగాడు. సహాయ దర్శకున్ని అవుతానని చెప్పిన ఇ.వి.వి ని కనకాల దేవదాసు క్రింద ఓ ఇంటి భాగోతం సినిమాకు సహాయదర్శకునిగా అవకాశం ఇప్పించాడు.[2] పరిచయం చేసిన నటీనటులు
* రంభ
* రచన
* ఊహ
* రవళి
చిత్రాలు
1. చెవిలో పువ్వు
2. సీతారత్నం గారి అబ్బాయి
3. అబ్బాయిగారు
4. ఏవండీ ఆవిడ వచ్చింది
5. తాళి
6. ఆమె
7. కన్యాదానం
8. అల్లుడా మజాకా
9. గొప్పింటి అల్లుడు
10. ఆవిడా మా ఆవిడే
11. ఇంట్లోఇల్లాలు వంటింట్లో ప్రియురాలు
1. ↑ http://www.cinegoer.com/evv1.htm
2. ↑ http://www.totaltollywood.com/interviews/E.V.V.Satyanarayana_2110.html
ఆదుర్తి సుబ్బారావు
ప్రముఖ తెలుగు సినిమా దర్శకులు, రచయిత మరియు నిర్మాత అయిన ఆదుర్తి సుబ్బారావు 1922 సంవత్సరం డిసెంబరు 16న రాజమండ్రిలో తాసీల్దారు సత్తెన్న ఇంట జన్మించాడు. ముంబాయి లోని సెయింట్ జూనియర్ కాలేజ్ ఆఫ్ ఫొటోగ్రఫీలో చేరి ఫిల్మ్ లాబ్, ప్రోసెసింగ్, ప్రింటింగ్, ఎడిటింగ్ మొదలైన విభాగాలలో అనుభవం సంపాదించాడు. ఆనాడు సంచలనం రేపిన ఉదయ శంకర్ 'కల్పన' చిత్రానికి అసోసియేట్ ఎడిటరుగా నియమితులయ్యాడు. అతని సోదరుడు ఆదుర్తి నరసింహమూర్తి ప్రచురించిన 'హారతి' పత్రికకు సంపాదకత్వం వహించాడు.
తరువాత ఇతడు చిత్ర రంగంలో ప్రవేశించి పూలరంగడు, గాజుల క్రిష్ణయ్య మొదలైన 26 చిత్రాలు, 9 తమిళ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఇతని చిత్రాలు నిర్మాతలకు విశేష లాభాలు ఆర్జించి పెట్టినాయి.
చలనచిత్ర రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆదుర్తి సుబ్బారావు 1975 సంవత్సరంలో అక్టోబరు 29న పరమపదించాడు.
విషయ సూచిక
* 1 చిత్ర సమాహారం
o 1.1 దర్శకులుగా
o 1.2 రచయిత
o 1.3 నిర్మాతగా
దర్శకులుగా
* మహాకవి క్షేత్రయ్య (1976)
* గాజుల కిష్టయ్య (1975)
* గుణవంతుడు (1975)
* సునెహరా సంసార్ (1975)
* బంగారు కలలు (1974)
* జ్వర్ భట (1973)
* ఇన్సాఫ్ (1973)
* మాయదారి మల్లిగాడు (1973)
* జీత్ (1972)
* విచిత్రబంధం (1972)
* రఖ్ వాలా (1971)
* మస్తానా (1970)
* దర్పన్ (1970)
* మరో ప్రపంచం (1970)
* పూల రంగడు (1970)
* డోలి (1969)
* మన్ కా మీత్ (1968)
* మిలన్ (1967)
* సుడిగుండాలు (1967)
* కన్నెమనసులు (1966)
* సుమంగళి (1965)
* తేనె మనసులు (1965)
* తోడు నీడ (1965)
* దాగుడు మూతలు (1964)
* డాక్టర్ చక్రవర్తి (1964)
* వెలుగు నీడలు (1964)
* చదువుకున్న అమ్మాయిలు (1963)
* మూగ మనసులు (1963)
* మంచి మనసులు (1962)
* ఇద్దరు మిత్రులు (1961)
* ఎంగళ్ కుల దైవి (1959)
* నమ్మిన బంటు (1959)
* ఆడపెత్తనం (1958)
* మాంగళ్యబలం (1958)
* తోడికోడళ్ళు (1957)
* అమరసందేశం (1954)
రచయిత
* డోలి (1969) (screenplay)
* మిలన్ (1967) (screenplay)
* సుడిగుండాలు (1967) (screen adaptation)
* తేనె మనసులు (1965) (writer)
* చదువుకున్న అమ్మాయిలు (1963) (screen adaptation)
* మాంగల్యబలం (1958) (writer)
* తోడికోడళ్ళు (1957) (screen adaptation)
నిర్మాతగా
* గాజుల కిష్టయ్య (1975)
* మాయదారి మల్లిగాడు (1973)
* జీత్ (1972) (హిందీ)
* దర్పన్ (1970) (హిందీ)
* ఐ.ఎమ్.బి.డి.లో సుబ్బారావు పేజీ.
తెలుగు సినిమా దర్శకులు
ఆ
* ఆదుర్తి సుబ్బారావు
ఇ
* ఇ.వి.వి.సత్యనారాయణ
ఎ
* ఎ.కోదండరామిరెడ్డి
* ఎం.వి.రఘు
* ఎల్.వి.ప్రసాద్
* ఎస్.వి. రంగారావు
క
* కడారు నాగభూషణం
* కమలాకర కామేశ్వరరావు
* కృష్ణవంశీ
* కె. రాఘవేంద్ర రావు
* కె.ఎస్.ఆర్.దాస్
* కె.వి.రెడ్డి
* కె.విశ్వనాథ్
* కైలాసం బాలచందర్
* కొమ్మినేని శేషగిరిరావు
* కోటయ్య ప్రత్యగాత్మ
* కోడి రామకృష్ణ
* కోవెలమూడి సూర్యప్రకాశరావు
గ
* గరికపాటి రాజారావు
* గిరిబాబు
* గుత్తా రామినీడు
* గూడవల్లి రామబ్రహ్మం
* గౌతమ్ ఘోష్
ఘ
* ఘంటసాల బలరామయ్య
చ
* చక్రపాణి
* చిత్తజల్లు శ్రీనివాసరావు
* చిత్తూరు నాగయ్య
జ
* జంధ్యాల
* జంపన చంద్రశేఖరరావు
డ
* డూండీ
త
* తమ్మారెడ్డి భరద్వాజ
* తాతినేని ప్రకాశరావు
* తాతినేని రామారావు
* త్రిపురనేని గోపీచంద్
ద
* దాసరి నారాయణరావు
ప
* పరిటాల ఓంకార్
* పాలడుగు దుర్గా ప్రసాద్
* పి.ఎస్. రామకృష్ణారావు
* పి.పుల్లయ్య
* పినిశెట్టి శ్రీరామమూర్తి
* పూరీ జగన్నాధ్
బ
* బాదామి సర్వోత్తం
* బాపు
* బాలు మహేంద్ర
* బి.ఎ.సుబ్బారావు
* బి.పద్మనాభం
బ (
* బి.విఠలాచార్య
* బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి
భ
* భానుమతీ రామకృష్ణ
మ
* మణిరత్నం
* ముక్కామల కృష్ణమూర్తి
ర
* రాజమౌళి
* రామ్ గోపాల్ వర్మ
వ
* వంశీ
* విజయ భాస్కర్
* విజయనిర్మల
* వీరమాచనేని మధుసూదనరావు
* వేదాంతం రాఘవయ్య
* వై.వి. రావు
శ
* శేఖర్ కమ్ముల
* శ్రీను వైట్ల
స
* సముద్రాల రాఘవాచార్య
* సావిత్రి (నటి)
* సి.పుల్లయ్య
* సింగీతం శ్రీనివాసరావు
* సుందరం బాలచందర్
* సుకుమార్
హ
* హెచ్.ఎమ్.రెడ్డి
* హెచ్.వి.బాబు
నాగురుంచి రెండు ముక్కలు
సోషియల్, ప్రొఫెషనల్, పర్సనల్...
అన్నీ కలిపి సింపుల్ గా నా గుణగణాల లిస్టిదిగో..
తెలివితేటలు నా తలకాయి పెద్దదని చిన్నప్పుడే డాక్టర్ చెప్పారని మా అమ్మ చెప్పింది. తల పెద్దదంటే ఆటోమేటిగ్గా మెదడు కూడా పెద్దదిగానే ఉంటుంది. మెదడు పెద్దదంటే తెలివితేటల గురించి చెప్పేదేముంది.
స్పెషల్ క్వాలిటీ మతిమరుపు... మరీ ఎక్కువేం కాదు. షాపుల్లో డబ్బులిచ్చేసి వస్తువులు తీసుకురావడం మరిచిపోతుంటానంతే గానీ... ఇంతవరకూ ఎప్పుడూ బట్టలేసుకోవడం మరిచిపోయి బయటకెళ్లింది లేదు!
రొమాంటిక్.నెస్ మాంచి రొమాంటిక్ ఫెలోనంట. వర్షాకాలం ఓ అర్ధరాత్రి ఆకలేస్తే బయటికెళ్లి ఐస్ క్రీం తినొచ్చా. (హైదరాబాద్ లో ఏ సీజనైనా సరే అర్ధరాత్రి పూట ఐస్ క్రీం బండ్లకు ఢోకా ఉండదు కదా). యు ఆర్ సో రొమాంటిక్ అన్నాడు మా రూంమేట్. ఏదీ దొరక్క అది తిన్నానని చెప్పలేదు నేను.
షార్ప్.నెస్ బాగా ఎక్కువ. ఓసారి పరుగుపందెంలో అందరికంటే ఫస్టొచ్చా. కానీ ప్రైజ్ ఇవ్వలా. అంపైర్ (కరక్టేనా?) వన్, టూ చెప్పాడు... త్రీ చెప్పకముందే ‘‘‘షార్ప్’’’గా ముందుకెళ్లిపోయా.
బలాలు ఖరీదైన కలలు కనడం. అబద్ధాలు చెప్పడం. మేధావినని ఫీలవడం
బలహీనతలు ఎప్పటికప్పడు కలల ఖరీదు పెంచలేకపోవడం. అబద్ధాల్ని నిజాలు చెయ్యలేకపోవడం. మేధావినని ఎదుటివాళ్లను నమ్మించలేకపోవడం.
చదువు B.Tech , M.Sc chemistry (svu,sku,ou,IIT), M.Sc maths (svu), B.Ed (* షరతులు వర్తించును)
(* పైన చెప్పిన కోర్సులకు ఎంట్రన్స్ టెస్టులు రాశాను. మార్కులు తగ్గినా ర్యాంకులు మాత్రం త్రిబుల్ డిజిట్ కి ఎక్కడా తగ్గలా. ర్యాంకులెలాగూ వచ్చాయి కాబట్టి ఏదో ఒక రోజుకు అన్ని కోర్సులూ పూర్తి చేసేద్దామనుకుంటున్నా)
ఉద్యోగం ఇంత టైం తీసుకోని ప్రొఫైల్ రాశాడు. ఖాళీగా పడుంటాడు అని ఫిక్సయిపోవద్దు. ఉద్యోగం వెలగబెడుతున్నా.
జీతం పది రూపాయల నోట్లయితే ఓ బ్యాగ్... వంద నోట్లయితే ప్యాంట్ జేబు... 500 నోట్లయితే చొక్కా జేబు సరిపోయేంత.
పొడవు శిల్పాశెట్టిని తలెత్తి... త్రిషను కళ్లలో కళ్లు పెట్టి... షీలాని కళ్లు దించి చూసేంత.
రంగు- మహేష్ బాబునీ... చిరంజీవినీ... రజనీకాంత్ నీ కలిపి... ఓ అరగంట మిక్సీలో వేసి బయటికి తీస్తే ఏ రంగొస్తుందో అలా ఉంటా.
ఫిజిక్ ఇంటర్ చదివేటపుడు 20 అడుగుల కొబ్బరి చెట్టు మీది నుంచి పడ్డా కూడా ఏం కాలా. మా చుట్టుపక్కల 15 పల్లెల్లో అంతెత్తు నుంచి పడి ఏదీ ఇరగ్గొట్టుకోనిది నేనొక్కణ్నే. మనది ఐరన్ బాడీ అని చెప్పడానికకి ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి? ఇక సిక్స్ ప్యాక్... ఎయిట్ ప్యాక్ అని అందరూ అంటున్నారు గానీ.... నా బాడీలో మాత్రం మెడ కింది నుంచి ప్యాక్ లే ప్యాక్ లు. కొందరు అజ్నానులు మాత్రం అవి ప్యాక్ లు కాదు... ఎముకలన్నారు అది వేరే విషయం.
బరువు జోరుగా వాన పడినా కదలకుండా నిలుచుకోగలిగినంత. వానకు గాలి కూడా కలిసిందంటే మాత్రం ఇంట్లో నుంచి బయటికి రాలేనంత.
కళ్లు పులి వేటాడుతున్నపుడు జింక కళ్లున్నట్లుంటాయి... (మరోసారి చదవండి) ఈ విషయం 2006 ముందు వరకు తెలియదు. ‘అతడు’ సినిమా చూశాకే తెలిసింది. అందులో హీరో కళ్లు జింకను వేటాడేటపుడు పులి కళ్లలాగా ఉంటాయని చెప్పార్లే.
జుట్టు ఒక రంగంటూ లేదు... త్రివర్ణం. నలుపు (జన్మత: వచ్చింది), తెలుపు (తెలివెక్కువై వచ్చింది) బ్రౌన్ (హెన్నా వల్ల వచ్చింది).
మంచి అలవాట్లేమైనా... ‘‘బీరులో 4 శాతమే ఆల్కహాలుంటుంది. మిగతాదంతా పళ్లరసమే. తాగితే లావవుతారు’’ అని మా కెమిస్ట్రీ లెక్చరర్ ఓసారి చెప్పాడు. మన బరువు గురించి ముందే చెప్పాగా... అందుకే బీరు ట్రై చేసి చూశా. రిజల్ట్ రాలా. ఫీలై ఇంకా సన్నబడిపోయా. పొగ తాగని తాగని తాగని వాడు దున్నపోతై పుట్టు... అని పెద్దోళ్లు చెప్పారు కదా (కన్యాశుల్కంలో గిరీశం చెప్పాడు... సీతారామరాజులో నాగార్జన పాడాడులెండి) ఎందుకైనా మంచిదని ఇంటర్లో ఓసారి ట్రై చేశా. నచ్చలా. వదిలేశా.
అంతేనా...అయిపోయిందా... అనుకోకండి. నేను నిత్య విద్యార్థిని. నా గురించి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకుంటుంటా. అప్పటికప్పుడు మీతో పంచుకుంటుంటా.
నా ఆర్కుట్ ప్రొఫైల్ లో కూడా ఇదే ఉంది .....
నాకు ఆర్కుట్లో ప్రేమ దొరికిందోచ్.................
- ప్రేమ మనసులో వుంటుందా..? మనిషి లో వుంటుందా...? మాటల్లో వుంటుందా...?
- 'నా మనసుకు తను నచ్చింది. తనంటే ప్రేమ' అంటాం మనం. అంటే మనసులో వుంటుందా ప్రేమ...???
- మనలో ప్రేమున్న లేకపోయినా తనలో ప్రేముండాలని, మనల్ని ప్రేమించాలని అనుకుంటాము మనం. అంటే ప్రేమ మనిషిలో వుంటుందా...?
- మనం ప్రేమించిన వాళ్ళతో ప్రేమగా మాట్లాడతాము.అంటే మాటల్లో వుంటుందా ప్రేమ...?
- నేస్తం..! ప్రేమ లేని చోటు అంటూ వుండదు..
- తన కోసం వేచి చూసే కన్నులో ప్రేమ వుంటుంది.
- పరుగులు తీసే పిల్లగాలికి చల్లనైన మల్లెల శుఘంధమంటే ప్రేమ. పగలంతా పడిన అలసటకికమ్ముకోచే చికటంటే ప్రేమ. నేర్రాలే నగలైన నెలకి ఒళ్ళంతా తడిమే జల్లంటే ప్రేమ.
- ప్రతి చిగురికి పచరంగుని పూసే ప్రకృతికి పచ్చధనమంటే ప్రేమ. మన చుట్టూ ప్రేమ కనిపిస్తుంటే ప్రేమని అక్కడో , ఇక్కడో మాత్రం చెప్పలేము..
- ప్రకృతిలోనే కాదు... మనలో, మన మనసులో, మన మాటల్లో ప్రేమ వుండాలి.
- నిలోను , ని మనసులోనూ, ని మాటల్లోనూ... అన్నింట్లోనూ కలగలిసి వుంటేనే అది నిజమైన , పరిపూర్ణ మైన ప్రేమ..
ఆంధ్రజ్యోతి లోని ఒక వ్యాసం
నాన్న : అబ్బయి ! నీకో పిల్లను చూశానురా
కొడుకు : అక్కర్లేదు నాన్న కావల్సిన అమ్మాయిని నేనే చూసుకుంటాను .
నాన్న : అరె .... నేను చూసిన అమ్మయి బిల్ గేట్స్ కూతురురా .
కొడుకు : అవునా ... అలా అయితే సరే ...
తర్వాత నాన్న బిల్ గేట్స్ దగ్గరికి వెళతాడు
నాన్న : మీ అమ్మయికో మంచి వరుడ్ని చూసాను .
బిల్ గేట్స్ : కాని మా అమ్మయి చాల చిన్న పిల్ల
నాన్న : ఆ అబ్బయి వరల్డ్ బ్యాంక్ ఉపాధ్య్ క్షుడు
బిల్ గేట్స్ : ఓ ... అలా అయితే సరే
ఆ తర్వాత నాన్న వరల్డ్ బ్యాంక్ అధ్య్క్షుడి దగ్గరికి వెళతాడు
నాన్న :meeకు ఉపాధ్య్ క్షుడిగా పనికివచ్చే ఒక Yuవకుడు ఉన్నాడు నా దగ్గర . అధ్యక్షు డు : నా దగ్గర ఇప్పటికే అవసరానికి మించి ఉపాధ్యక్షులు ఉన్నారు
నాన్న : కాని ఆ అబ్బయి బిల్ల్ గేట్స్ అల్లుడు
అధ్యక్షుడు : నిజమా.... అలా అయితే సరే ......
ఇవ్వాల రేపు వ్యాపారలన్ని ఇలాగే జరుగుతున్నయట
ఒక్క వ్యాపారాలనేమిటి రాజకీయాలు ,పరిపాలన , అంతర్జాతీయ వ్యవహారాలు
అన్ని ఇంతే. వాక్యాల మధ్యే కాదు పదాల మధ్య , అక్షరాల మధ్య కూడా
అంతరార్ధాలను శొధించాల్సి వస్తోంది . -------
ఇంగ్లిష్ టూ తెలుగు డిక్షనరీ
Posted by
సుమన్.గద్దె
on 16, ఆగస్టు 2009, ఆదివారం
/
Comments: (0)
John Mathieson workshop
Tastes in photography have changed. These
days things are much sharper, lower in
contrast, sometimes flat in pastel colours,
retouched, with no depth or perspective and
with a lot of front light. This is very different to
the past. With commercials not having the
budgets and influence they used to and the
MTV age gone, the only area that has
remained and expanded in our everyday
visual world of internet and cable TV,
surprisingly, is fashion photography. Glossy
magazines are more popular than ever and
they are stuffed full of digital retouched and
air brushed digital photography. Don’t
underestimate what an influence that has on
us, and, how we experiment. We support and
imitate it, not consciously, with our own
domestic digital cameras
the asc
వడ్డెర చండీదాసు
Posted by
సుమన్.గద్దె
on 12, ఆగస్టు 2009, బుధవారం
Labels:
పనికిరానివి పనికొచ్చేవి ..
/
Comments: (0)
ఎందుకోగాని అనుక్షణికం చదివినతరవాత చండీదాస్ గురుంచి నా బ్లాగ్లో కొద్దిగా రాయాలి అనిపించిందివడ్డెర చండీదాసు (Vaddera Chandidas) ప్రముఖ తెలుగు నవలా రచయిత. ఇతని అసలు పేరు డాక్టర్ చెరుకూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు (సి.ఎస్.రావు) [1]. తన కలంపేరులో "వడ్డెర"ను పేద వృత్తికులమైన వడ్డెర ప్రజల నుండి, చండీదాస్ అన్న పేరును 15వ శతాబ్దపు విప్లవాత్మక బెంగాలీ కవి నుండి స్వీకరించాడని కథనం.[2] చండీదాస్ తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయములో తత్త్వశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేసి విరమించారు. ఇతని నవలలో హిమజ్వాల, అనుక్షణికం, చీకట్లోంచి చీకటిలోకి ప్రముఖమైనవి. చైతన్య స్రవంతి కథన రీతిని ఎంచుకుని రాసిన చండీదాస్ రచనలు విశేష ప్రజాదరణ పొందడమే కాకుండా సాహిత్యవేత్తల మన్ననలు కూడా పొందాయి. హిమజ్వాల ఇది వడ్డెర చండీదాస్ తొలి నవల. మంచులా చల్లబడిపోయిన తెలుగు పాఠకుల మనసులో మంటలు రగిలించిన నవల హిమజ్వాల. ఆంధ్రజ్యోతి వార పత్రికలో ధారావాహికగా వెలువడి విపరీతమైన సంచలనాన్ని సృష్టించింది. నాటకీయత, కధనా నైపుణ్యం, చేతనా స్రవంతి అద్భుతంగా మేళవించిన రచన ఇది. కృష్ణ చైతన్య, గీత అనే రెండు ముఖ్యపాత్రల అంతరంగ చిత్రణ ఈ నవలలో అద్భుతంగా జరిగింది. [మార్చు] అనుక్షణికం దీని రచనాకాలం 1979-81, కధాకాలం 1971-80. రెండు వందలు పైగా పాత్రలు, కోకొల్లుగా సంఘటనలతో ఒక దశాబ్దపు దేశ రాష్ట్ర చరిత్రలను కూర్చి సృష్టించిన నవల ఇది. ఇందులో ఘటనలన్నీ నిజాలు, చారిత్రికాలు. ఈ నవలలో మరొక విశేషం - తెలుగు నవలా సాహిత్యంలో ఎన్నడూ లేని వాస్తవికత. కులాల పేర్లు, ఇంటి పేర్లు, ఊళ్ళపేర్లు చిరినామాలతో సహా పేర్కొనడం. ఆంధ్రజ్యోతి వార పత్రికలో ధారావాహికగా వెలువడి రెండు సంవత్సరాల సుదీర్ఘ సమయంలో ఎందరినో మెప్పించిన నవల ఇది. చండీదాస్ 2005, జనవరి 30న విజయవాడలోని నాగార్జున ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు
ఎళ్దమొస్తవా.స్టేజి మీద పాట
Posted by
సుమన్.గద్దె
on 9, ఆగస్టు 2009, ఆదివారం
Labels:
పనికిరానివి పనికొచ్చేవి ..
/
Comments: (0)
ఎళ్దమొస్తవా.స్టేజి మీద పాట
అయింది.
కాసేపటికి తరువాత అక్కడే కింద ది ఆ పాట మాదంటె
మాదని గొడవ మొదలయిం
.సరే.మీరెక్కడికెళ్దామని అర్థం లో రాశారు"అన్నాడుఊరిపెద్ద.....
.వలస,వలస పొయ్యే వాళ్ళ గురించి "అన్నాడు సింగమయ్య..
.సరే మీరెక్కడికని పాడుకున్నారు పిల్లలూ"అడిగాడు పెద్ద..........
నేను మా నాన్ననడగాలి అన్నాడు కుర్రాడు....................
అమ్మాయ్ నువ్వు ఎక్కడికని పాడావ్.................................
ఇంకెందుకులెండి చెయ్యాల్సిన అల్లరంతా చేశాడు గా ఆ శింగమయ్య.
ఆ పాట ఆయన రాసిందట.
భంగ పడ్డాం చాలు,చాలు గాని ఇప్పుడేం చెయ్యమంటాడో అడగండి...
సరె చెప్పు నాయనా,శింగమయ్యా, వాళ్ళు ఒప్పుకుంటున్నట్టు అనిపిస్తొంది.
నీకేం కావాలో చెప్తే ఇప్పించే ప్రయత్నం చేస్తాను"అన్నాడు పెద్ద..........
.టిక్కెట్టు కి
పావు టిక్కెట్టు వాల్యూ ,క్షమాపణ నాకు కావాలి"అన్నాడు శింగమయ్య.......
అన్యాయం ,అన్యాయం అంటూ అబ్బాయి ,అమ్మాయి లేచారు............
మీరుండండి నాయనా,అమ్మా నేను మాట్లాడు తున్నాగ"అన్నాడు పెద్ద....
ఇంతలో మరొకాయన లేచి పావేంటి ఈ షో అంతా ఆ పాట మీద కాదు
నడిచింది.ఇది పెద్ద హిట్టు.టిక్కెట్టు కి సగం ఇయ్యాల్సిందే"అన్నాడు....
మాకేం మిగులుద్ది అనుకున్నారు ఆ అమ్మాయి అబ్బాయి.అయినా
మరీ అంత ఆశ ఉండొద్దయ్యా తప్పు"అన్నాడుపెద్ద..
........ఏంటి ఆశా, లేచాడు శింగమయ్య.కందిపప్పెంత వంద,బియ్యం
ఎంత నలభై,కూరగాయలెంత,
పెట్రోలెంతా పిల్లల ఫీజులెంత,ఇంటి కిరాయిలెంతనుకున్నారు.నేనెంత
కష్ట పడుతున్నా"అన్నాడు శింగమయ్య..............
......అవును శింగమయ్య అన్నది కూడా కరక్టే .ఆయనా మనిషే కదా,
బతకాలి కదా .కాస్త అటు ఇటు గ ఇచ్చెయ్యండి అన్నారు పెద్దలు ముగిస్తు
మంచి స్క్రీన్ ప్లే
Posted by
సుమన్.గద్దె
/
Comments: (0)
ఎప్పటినుంచో మంచి స్క్రీన్ ప్లే 'స్ ని నా బ్లొగ్లొ ఉంచాలి అని అనుకుంటున్నాను
అందుకె ముంధుగా no smoking స్చ్రీంప్లయ్ మెకొసం చదవలి అని అనుకుంటె ఇక్కద క్లిక్ చెయ్యండి
అంగవైకల్యం పెద్ద సమస్యకాదు. అంగవైకల్యంపై మనలాంటి సాధారణమైన మనుషులు చూపే వివక్ష అన్నిటికన్నా పెద్ద అంగవైకల్యం
Posted by
సుమన్.గద్దె
Labels:
పనికిరానివి పనికొచ్చేవి ..
/
Comments: (0)
చలనచిత్రము యొక్క ప్రప్రధమ పరిశోధకుడు, సృష్టి కర్త ఫ్రీస్ గ్రీన్
Posted by
సుమన్.గద్దె
on 18, జనవరి 2009, ఆదివారం
/
Comments: (0)
ఫిలిం పరిశ్రమకు , ఫిలిం పరిశోధనలకు ఫిలిం సృష్టి కర్తలకు కూడా అమెరికా జన్మస్థానము అని చాలా మంది అభిప్రాయము. కాని, ఫిలిం పరిశ్రమ విషయంలో అన్ని విధములా అగ్రస్థానం ఇంగ్లండుది. అసలు చలన చిత్రం యొక్క సృష్టి ఇంగ్లండులో జరిగింది. ప్రపంచం అంతటిలోనూ ప్రపధమ చలనచిత్రము ఇంగ్లండులో తయారు చేయబడింది.
ప్రపంచం అంతటిలోనూ మొట్టమొదట సినిమా హాలు ఇంగ్లండులోనే నిర్మింపబడింది. చలన చిత్రమునకే కాక మాట్లాడే ఫిలిమునకు కూడా ఇంగ్లండే జన్మస్థానం. మాట్లాడే ఫిల్ము ప్రప్రధమములో ఇంగ్లండులో తయారు చేయబడినది.
ఈ చలనచిత్రము యొక్క ప్రప్రధమ పరిశోధకుడు, సృష్టి కర్త ఇంగ్లండులో జన్మించాడు.
అమెరికా దేశస్థులకి ఫిలిం అంటే యేమిటో తెలియని రోజులలో ఇంగ్లండు దేశీయుడైన ఫ్రీస్ గ్రీన్ (Friese Greene) అనే అతడు, ప్రస్తుత ఫిలిం పరిశ్రమలో ఉపయోగింపబడే సెల్యులాయిడ్ ఫిలిం మీద ఒక చలనచిత్రాన్నితయారుచేశాడు.ఇదే ప్రపంచంలో మొట్టమొదట తయారు చేయబడిన చలనచిత్రం.
ఈ ఫిలిం బ్రిటిష్ పేటెంటు కార్యాలయంలో, 1889 వ సంవత్సరంలో, జూన్ 21వ తేదీన పేటెంటు చేయబడింది. ఫ్రీస్ గ్రీన్ తన మొదటి చలనచిత్రాన్ని తయారు చేసిన నాలగైదు సంవత్సరాల తర్వాత, అనగ1894 ప్రాంతముల వరకు, అమెరికా శాస్త్రజ్ఞుడైన ఎడిసన్, ఫిలిం నిర్మాణానికి పరిశోధనతో తంటాలు పడుతూనే వున్నాడు.
గ్రీన్ తన మొదటి ఫిలిమును తయారుచేయుటకు ముందనేక సంవత్సరాలనుంచీ కూడా, ఫిల్ము నిర్మాణమును గూర్చి అనేక పరిశోధనలు చేస్తూండేవాడు, అనేక దినములు రాత్రింపగళ్ళు, నిద్రాహారాములు లేక, తదేక దీక్షతో ఆలోచనలు సాగిస్తుండేవాడు.
అతని ఆలోచనలకు అంతూపొంతూ లేకుండా నెలలు, సంవత్సరాలు, గడుపుతూ, ఒక్కక్కప్పుడు తనను తానే మరిచిపోతుండేవాడు. ఒక్కక్కప్పుడతని ఆలోచనలు అతనికే కలలుగాను, ఆకాశ పుష్పాలు గానూ భ్రమింపచేసి, నిరుత్సాహం కలిగించేవి. కాని, ఆలోచనలూ, పరిశోధనలు మాత్రము యధాప్రకారం సాగుతూనే వుండేవి.
’ఎప్పటికైనా జీవరహితమైన చిత్రములను చలనచిత్రాలుగా చేసి తీరాలి’ అని దీక్షవహించాడు.
చలనచిత్ర సృష్టియే తన జీవితాశముగా, అదియే తన జీవిత లక్ష్యముగా నిశ్చయించాడు. ఎల్లప్ప్పుడూ తన లక్ష్యమును గూర్చి అనేకములైన కలలు కంటూండేవాడు.
దీనికితోడు దారిద్ర్య దేవత కూడా అతన్ని ఆశ్రయించింది.ప్రతిరోజూ దినదిన గండంగా వుండేది. అతని సంసారిక జీవితమంతా అయోమయంగా, అనేక కష్టపరంపరంలతో కూడుకొని వుండేది.అతనియొక్క జీవితమంతా నిరాశ దు:ఖములతో కూడివుండేది.
కా్, గ్రీన్ జీవితలక్ష్యమునకు మాత్రము వీటి వలన భంగం కలగలేదు. అన్నిటినీ యదార్థమైన వీరుని వలె యెదుర్కొని, చలించక తన దృక్పథమును కొంచెము కూడా మార్పు చెందనీయలేదు.
అది 1889 వ సంవత్సరంలో ఒక నాటి నిశిరాత్రి-యధారీతిగా రాత్రి పండ్రెండు గంటలవరకూ తిరిగి తిరిగి ఇల్లు చేరుకున్నాడు.తక్షణమే గ్రీన్ మందహాసం చేస్తూ పరిశోధనాలయంలోకి పోయాడు.
అది ఒక చిన్న గది. గోడలన్నీ మాత్రం సున్నం చేయబడి తెల్లగా ఉన్నాయి. ఆ తెల్లగోడలనే గ్రీన్ తన పరిశోధనలకు తెరగా ఉపయోగించేవాడు. యధాప్రకారం పరిశోధనలు ప్రారంభించాడు.
సంవత్సరాలనుంచీ కొయ్యబొమ్మల్లా నిల్చివుండే చిత్రాలన్నీ, ఆనాడు ప్రాణములు ధరించినట్లు గోడల మీద ఆడడం ప్రారంభించాయి.
ఇన్ని సంవత్సరాలుగా ఈ ఆశయం కొరకు గ్రీన్ తన రక్తమాంసముల నాహుతిచేశాడో, ఆ ఆశయం సిద్ధించింది. అటువంటి సమయంలో గ్రీన్ సంతోషానికి హద్దుంటుందా!
గ్రీన్ ఆశాజ్యోతి అప్పుడే ప్రజ్వలించింది.అనేక సంవత్సరముల నుండి అతని హృదయవీధిలోసంచరిస్తూన్న కలలూ నాడతని హృదయఫలకం మీద నిల్చి నిజస్వరూపంలో తాండవించాయి. సంవత్సరములనుండి అతని దృష్టిలో తాండవిస్తూన్న ఆకాశపుష్పములన్నీ మాలయై అతని కంఠసీమ నలంకరించాయి.
అప్పుడతనిలో నుండి పొంగి పొంగ్ వచ్చిన ఉత్సాహాన్నీ సంతోషాన్నీ ఆపుకోలేకపోయాడు గ్రీన్.
అతనిలో ఆశ్చర్యం ఆనందం ఉదభవించి, అతన్ని పిచ్చివాడిని చేశాయి.
పిచ్చి యెత్తినవాడిలా పట్టారాని సంతోషంతో వీధిలోపడి పరుగులు ప్రారంభించాడు.
అక్కడవున్ పోలీసువాడొకడాతనిని వెంటాడి పట్టుకున్నాడు.
గ్రీన్ “కొయ్యబొమ్మలకి ప్రాణాలుపోసి నా గది గోడల మీద ఆడుస్తూన్నాను, చూడు చూడు” అని ఆ పోలీసును బరబర తన గదిలోకి ఈడ్చుకుపోయాడు.
ఆ పోలీసుకూడా చూసి ఆశ్చర్యంతో కొయ్య బారి చూడడం ప్రారంభించాడు.
ఈ హడావుడంతా చుసి చుట్టుప్రక్కలవాళ్ళంతా జేరి ఆశ్చర్యపడ్డారు. తక్షణం గ్రీన్ నాల్గు విస్కీ బాటిల్సు విప్పి జన్మదినోత్సవం చేసేశాడు.
మరునాటినుంచే పారిశ్రామికలనేకులు గ్రీన్ చుట్టూ మూగటం ప్రారంభించేరు.
అక్కడక్కడనేక స్టూడియోలు బయలుదేరి ఫిలింపరిశ్రమను ప్రారంభించాయి.
’కల్నర్ రాబర్ట్ హేమిల్టన్ వెచ్’ అనే ఒక ప్రభుత్వోద్యోగికి ఈ పరిశ్రమలో అభిరుచి కలిగింది.
ఒకనాడు తన ఆఫీసుకు రావలసిందని గ్రీన్ కు కబురుచేశాడు. గ్రీన్ తన మామూలు చింపిరిగుడ్డలతో దీర్ఘంగా ఆలోచిస్తూ పరధ్యానంగా బయల్దేరాడు.
ఆఫీసుదగ్గరకు రాగానే గుమ్మం దగ్గిర నౌకరు ’నీ పేరే’మని అడిగాడు.
కాని గ్రీన్ మనస్సు అక్కడలేదు, ఆ నౌకరుకేమీ సమాధానం చెప్పలేదు. ఆ నౌకరు మళ్ళి రెండు మూడు సార్లు గద్దించి అడిగాడు.
అప్పడులికిపాడి, నిద్దురలేచినట్లు కళ్ళు నులుముకుంటూ తనకు వచ్చిన ఆహ్వానం తీసి చూపించాడు.
అది చూసి ఆ నౌకరు గ్రీన్ ను, హామిల్టన్ దగ్గరు తీసుకుపోయాడు. కొంత సంభాషణ అయ్యాక గ్రీన్ చేత ఒక ఫిలిం తీయించడానికి నిర్ణయించుకున్నాడు హేమిల్టన్.
నిర్ణయప్రకారం బెలూన్ లో పైకిపోయి, క్రింద సైన్యములను, చలనచిత్రంగా తీశాడు గ్రీన్. ఇదే ఫిలిం ప్రపంచానికి మొదటి చలనచిత్రం. ఇప్పుడీ చలనచిత్ర నిర్మాతలు కోటీశ్వరులవుతూంటే అప్పుడా చలనచిత్ర జన్మధాత కూటికి లేకచనిపోయాడు, అతని జీవితమంతా దినదిన గండములుగా గడిపాడు.
తరచూ గ్రీన్ తినుటకు తిండిలేక మలమల మాడుతూనే వుండేవాడు. అవసరం నిమిత్తం అనేక అప్పులు చేశాడు.
అంత్యదశలో అప్పులవారాతని ఆస్తిని వేలంవేసి అతన్ని ఖైదులో పెట్టించారు. ఆ విజ్ఞాన శాస్త్ర కోవిదుడు, ఫిలిం జన్మధాత గ్రీన్, బెంగతో ఆకలిబాధతో కృశించి, సలసల కాగి స్రవించిన దు:ఖాశ్రుజాలంతోమరణించాడు.
"ఆవ_కాయ+ బిర్యాని"క్లైమాక్ష్ లో ఆడియన్స్ ఎందుకొచామా అని వెలుథుంటారు
Posted by
సుమన్.గద్దె
on 18, నవంబర్ 2008, మంగళవారం
/
Comments: (0)
ఓ ముస్లిం-హిందు(తెలంగాణ-ఆంధ్రా) ప్రేమ కథను చూస్తానని ఊహించలేకపోయాను. పోని అదన్నా స్టైయిట్ గా చెప్పాడా అంటే…మధ్యలో తెలంగాణ ఊరి సమస్యలు అంటూ ప్రభుత్వ ప్రకటనలా టార్చర్ స్టార్ట్ చేసాడు. ఇదీ ధియోటర్ ఫస్ట్ డే ఫస్ట్ టాక్.
మహ్మద్ అక్బర్ కలామ్(కమల్ కామరాజు) దేవరకొండ అనే తెలంగాణ పల్లెలో సెవన్ సీటర్ ఆటో నడుపుతూంటాడు. లక్ష్మి(బిందు మాధవి) ఆవకాయ అమ్ముకుని కుటుంబానికి సహకరించాలనుకుని పోలవరం (ఆంధ్రా)నుంచి వలస వచ్చిన అమ్మాయి. లక్ష్మి వికారబాద్ కి వెళ్ళటానికి అక్బర్ ఆటో ఎక్కుతుంది. ఇద్దరి మధ్య మీరూహించినట్లే కామన్ గా ప్రేమ చిగురిస్తుంది. ఈ మధ్యలో మాస్టర్జీ(రావు రమేష్),బబ్బర్ ఖాన్(వరుణ్ జొన్నాఢ) అనే ఇద్దరు పల్లె విలన్స్. వీరి నుండి ఈ ప్రేమ జంట తప్పించుకుని లక్ష్మి మతానికి విలువ ఇచ్చే తండ్రిని ఎలా ఒప్పించి పెళ్ళి చేసుకున్నారనేదే మిగతా కథ.
నిజానికి పైన రాసినట్లుగా ఎలా ఒప్పించి పెళ్ళి చేసుకున్నాడనేదే ఇలాంటి కథల్లో హైలట్ అవ్వాల్సింది…అదే మిస్సయింది. సమస్యకు ఏం పరిష్కారం చూపాలో అర్ధం కాక..రెండేళ్ళ తర్వాత అని వేసాడు. అనంతరం అక్బర్ మండల ప్రెసెడెంట్ అయ్యాడని చూపాడు.
అది చూసిన లక్ష్మి తండ్రి(అంటే ఆయన దృష్టిలో మనిషి సోషల్ స్టేటస్ పెరిగితే చాలు అన్న ఆలోచన ఉందేమో) పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు.
హీరోయిన్ చక్కగా బి.కామ్ చదువుకుంది కదా..ఏ ఉద్యోగమో చేసి కుటుంబానికి సాయపడుతుందేమో అనుకుంటాం..అలాంటిదేం జరగదు.దాంతో ఏ టెన్త్ ఫెయిల్ అమ్మాయో అని పెడితే బాగుండుననిపిస్తుంది. అలాగే హీరోతో ఆమె ఇకనుంచి ఇంగ్లీష్ లోనే మాట్లాడుదాం అంటుంది.కానీ అది తర్వాత సీన్ కే మర్చిపోతుంది. అంతేగాక హీరోయిన తండ్రి ఆమె పెళ్ళి చేసి చచ్చిపోతాను అన్నట్లు మాట్లాడుతూంటాడు గాని తనకు మరో కూతురు,కొడుకు ఉన్నారన్న ఫీలింగే ఎక్కడా కనిపించదు. ఇక బొంబాయి..సినిమాని మణిరత్నం అలానే ఎందుకు తీసాడో ఈ సినిమా చూస్తే…మరింత స్పష్టంగా అర్ధమవటం ఈ చిత్రానికున్న ఏకైక ప్లస్.
కథలో ఫెయిలయిన రచయిత,దర్శకుడు డైలాగుల్లో కూడా ఫీల్ మిస్సయ్యాడు. ఫస్టాఫ్ మొత్తం డైలాగులతో నింపి గోల గోలగా మార్చేసాడు. డైలాగులు తగ్గించి విజువల్స్ చూపెడితేనే నిండుతనం వచ్చేది.ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. కెమెరా,ఎడిటింగ్ దర్శకుడు సెన్స్ కి తగినట్లే ఉన్నాయి
ఏదైమైనా బ్రాండ్ నేమ్ చూసి సినిమాకెళితే మోసపోతారు అని నిక్కార్సయిన సత్యం చెప్పిన ఈచిత్రం ఇది. అలాగే ఈ సినిమాని ఆర్.కె.నారాయణ్ మాల్గుడి డేస్ తోను,శ్యామ్ బెనగల్ చిత్రాలతోనూ పోల్చటం అనవసరం.
"సిరివెన్నెల" గారి" అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా"?
అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా?
ఆత్మవినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా?
చిన్నప్పుడు పాటలు వినే కొత్తలో శ్రీశ్రీ రచించిన పాడవోయి భారతీయుడా అనే పాట చాలా గొప్పపాట అని అమ్మ వినిపించేది. పాట వచ్చి ముప్పయ్యేళ్ళు గడిచినా చూడు ఇప్పటికీ ఆ పాట ఎంత రెలవెంటుగా ఉందో అని చెప్పేది. అప్పటిలో శ్రీశ్రీ దార్శనికత మీద గొప్ప అభిమానం పెంచేసుకున్నా కూడాను. కొన్నాళ్ళ తర్వాత అర్థమయ్యింది – రాయడంలో శ్రీశ్రీ గొప్పతనం ఎంతలా ఉన్నా – ఆ పాటని నిజం చెయ్యడంలో సమాజం “గొప్పతనాన్ని” కూడా తక్కువ అంచనా వేయకూడదని. సిందూరం అనే సినిమాలో వ్రాయబడ్డ ఈ పాటగురించి కూడా పై అభిప్రాయం వర్తిస్తుందనుకుంటాను. ఈ పాట పదేళ్ళక్రితం యాభయ్యవ స్వాతంత్ర సంబరాల సమయంలో అనుకుంటా వ్రాయబడింది. నిన్నే ఎందుకో హమ్ముకుంటుంటే – ఆహా! అయితే మనం గత పదేళ్ళలో పెద్దగా ఒరగబెట్టేసినదేమీ లేదన్నమాట అనిపించింది. పాట వింటూ అనిపించిన కొన్ని అనుభూతుల్ని మీతో పంచుకుందామని…
శాంతికపోతపు కుత్తుక తెంచి తెచ్చినబహుమానం – ఈ రక్తపు సింధూరం
నీ పాపిటలో భక్తిగ దిద్దిన ప్రజలను చూడమ్మా – ఓ పవిత్ర భారతమా!
అవ్వడానికి సింధూరమే – పవిత్రమే – తెచ్చినదే ఎక్కడనుండి – కపోతాన్ని – అదే శాంతికపోతపు రక్తంతో భరతమాతకి సింధూరం దిద్దుతున్న సమాజం గత యాభయ్యేళ్ళలో అస్సలు మారలేదు. నాటి దేశవిభజన గొడవలనుండి – నేటి ఒరిస్సా మారణహోమాల దాకా – ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం – కృష్ణగీత ఆపిందా నిత్యకురుక్షేత్రం – మారదు లోకం – మారదు లోకం.
కులాలకోసం గుంపులు కడుతూ మతాలకోసం మంటలు పెడుతూ
ఎక్కడలేని తెగువను చూపి తగువుకు లేస్తారే – జనాలు తలలర్పిస్తారే
సమూహక్షేమం పట్టని స్వార్ధపు ఇరుకుతనంలో ముడుచుకుపోతూ
మొత్తం దేశం తగలడుతోందని నిజం తెలుసుకోరేం- తెలిసీ భుజంకలిపి రారేం
అలాంటి జనాల తరపున ఎవరో ఎందుకు పోరాడాలి – పోరి ఏవిటి సాధించాలి
ఎవ్వరికోసం ఎవరు ఎవరితో సాగించే సమరం – ఈ చిచ్చుల సింధూరం
జవాబు చెప్పే బాధ్యత మరిచిన జనాల భారతమా – ఓ అనాధ భారతమా!
ఒకవంక కులాల కురుక్షేత్రం. మరొకవంక మతాల మారణహోమం. పోనీ ఇవన్నీ అలా జరిగిపోతున్నాయా – కాదే - జరిపింపబడుతున్నాయి. ఎందుకు అని తెలిసినవాళ్ళంతా బానే ఉన్నారు. తెలియని మూర్ఖజనాలు బలవుతున్నారు. ఆపగలిగిన మేధావివర్గం దేశం అనే భావనే టెర్రరిజానికి మూలం – కాబట్టి దేశభక్తన్న భావనే పోవాలి అంటుంది. స్వేఛ్చ దేనికయ్యా అంటే కొట్టుకోవడానికి – ఎవరు ఎవరికోసం ఎవరితో కొట్టుకుంటున్నారు – ఎందుకోసం కొట్టుకుంటున్నారు – నూరుకోట్లమంది నీ నీడలో, నీ తిండి తింటూ, ఆనందంగా కొట్టుకుంటూ స్వేఛ్చని అనుభవిస్తున్నారు. నువ్వుమాత్రం అనాధవే… అమ్మ తుఝే సలాం.
అన్యాయాన్ని సహించని శౌర్యం దౌర్జన్యాన్ని దహించే ధైర్యం
క్రూరమృగంలా కారడువుల్లో దాక్కుని ఉండాలా – వెలుగుని తప్పుకు తిరగాలా
శత్రువుతో పోరాడే సైన్యం – శాంతిని కాపాడే కర్తవ్యం
స్వజాతివీరులనణిచే విధిలో కవాతు చెయ్యాలా – అన్నలచేతిలో చావాలా
తనలో ధైర్యం అడవికి ఇచ్చి – తన ధర్మం చట్టానికి ఇచ్చి
ఆ సమరం చూస్తూ సంఘం శిలలా నిలుచుంటే
నడిచే శవాల సిగలో తురిమిన నెత్తుటి మందారం ఈ సంధ్యా సింధూరం
చీకటివైపా వేకువలోకా ఎటు నడిపేనమ్మా – గతి తోచని భారతమా
ధైర్యమూ, ధర్మమూ రెండూ సమాజంలో ఉంటే ఆ సమాజంలో శాంతి వెల్లివిరుస్తుంది. ఆ రెంటినీ సమాజం పంచేసింది. ఒకభాగం అడవిలో నక్సలైట్లకిచ్చి, మరోభాగం పోలీసులకిచ్చి ఆ కలహాన్ని చూస్తూ సంఘం శిలలా చూస్తూ ఉంటే… సమాజంలో జీవం ఎక్కడుంది? అలాంటి జీవంలేని శవాల్లా సమాజంలో నడుస్తున్న మేధోజనాలం మనం. మన సిగలో నెత్తుటి మందారాన్ని తురుముతున్న ఈ సింధూరసంధ్య ఎటు తీసుకుపోతుందో? ఈ సంధ్య ఉదయసంధ్యో, సాయంసంధ్యో అర్థం కావడం లేదు. మనందరికీ ఒకటే తృప్తి. సాయం సంధ్య అయినా రాత్రంతా గడిచైనా రేపుదయం వస్తుందని. మనకేమన్నా తొందరా? మనం నడిచి వెళ్ళాలంటే సమస్య – మనం నడవనంతవరకూ ఎవరెక్కడికి పట్టుకెళ్ళినా మనకి పరవాలేదు. వీలైతే స్పందించడమే మానేద్దాం. లేదంటే నక్సలైట్లదే తప్పని కాస్త అరుద్దాం. కాదంటే పోలీసులదే తప్పని గోలచేద్దాం. లేదంటే హిందూమతానిదే పాపం అని ప్రశ్నిద్దాం. పోదంటే ముస్లిములే తీవ్రవాదులని నిర్ణయిద్దాం. మరింత ఆజ్యాన్ని రగిలిద్దాం. ఆ చితిమంటల వెలుగులో మనం చలికాచుకుందాం.
అంతేనా…
తనతలరాతను తనే మార్చగల అవకాశాన్నే వదలుకొని
తనలో భీతిని తన అవినీతిని తన ప్రతినిధులుగ ఎన్నుకుని
ప్రజాస్వామ్యమని పిలిచే జాతిని ప్రశ్నించడమే మానుకుని
కళ్ళు ఉన్న ఈ కబోది జాతిని నడిపిస్తుందట ఆవేశం
ఆ హక్కేదో తనకే ఉందని శాసిస్తుందట అధికారం
కృష్ణుడు లేని కురుక్షేత్రమున సాగే ఈ ఘోరం
చితిమంటల సింధూరం
చూస్తూ ఇంకా నిదురిస్తావా విశాలభారతమా ఓ విషాద భారతమా!
అస్సలు ఈ పాటకి మీకు మధ్య నేనుండాలా అనిపిస్తుంది. కళ్ళున్న జాతిని కళ్ళు తెరవమని చెప్పడానికి అటు ఆవేశానికీ, ఇటు అధికారానికీ తీరుబడిలేదు గానీ, నడిపించడానికి మాత్రం వాళ్ళల్లో వాళ్ళు కొట్టేసుకుంటున్నారు. ఈ కురుక్షేత్రానికి అతిముఖ్యలోపం గమ్యం లేకపోవడం – గమ్యం తెలియకపోవడం. ఈ చితిమంటల సింధూరం చూస్తూ కూడా నిదురిస్తావా అని భారతానికొక ప్రశ్న.
భారతమంటే నేను కాదు అని అనేసుకుని పక్కకు వెళ్ళిపోకండేం!
కాసేపు మణిరత్నం గారి గురించి ..
మణి రత్నం మొదటి నాలుగు సినిమాలు నేను చూళ్ళేదు (పల్లవి అనుపల్లవి , ఉన్నారు , పాగల్ నిలవు , ఇదయ కోవిల్ ) కాబట్టి వాటి మీద నో కామెంట్స్ .
మౌన రాగం --- చాలా డీసెంట్ సినిమా , ఇలాంటి సినిమాలు తెలుగు లో కూడా అప్పటికీ చాలా వచ్చినా , స్క్రీన్ ప్లే పరంగా .. ఇది కాస్త ఎడ్జ్ ఓవర్ విన్నర్ .. అప్పట్లో వచ్చిన మరో తమిళ సినిమా కు ఇది కొంత కాపీ అని విన్నాను , దీని తరువాత ఆయన చాలా సినిమాలు ఇతరుల సినిమాలనుంచి inspire అయినవే , కొంత వరకూ కాపీ కూడా అనొచ్చు !! నన్ను అడిగితే అదే అంటాను !! రేవతి గారి ఆక్టింగ్ ఇందులో నిజంగా సూపర్ !! shez one of my fav actors in indina cinema.
నాయకన్ --- ఎవరెన్ని చెప్పినా .. నేను మాత్రం ఇది కచ్చితంగా గాడ్ ఫాధర్ కాపీ అనే అంటాను, అందులో ఒక ఇటాలియన్ అమెరికా లో మాఫియా డాన్ గా ఎదిగితే .. ఇందులో ఒక మదరాసి .. బాంబే లో డాన్ గా ఎదుగుతాడు , ఇక ఇందులో సీన్లు చాలా వరకు మక్కీ కి మక్కీ దించక పోయినా ...స్క్రీన్ ప్లే ... టేకింగ్ ... ఇలా చాలా వరకు కాపీ యే ... కాపీ అయినా ఇండియన్ నేటివిటీ కి ఈ సబ్జెక్ట్ ఆపాదించి తీసి హిట్ చెయ్యడం గొప్ప కాదా అనవచ్చు .... కచ్చితంగా కాదు ... గాడ్ ఫాథర్ లాంటి సబ్జెక్ట్ , విభిన్న జాతూల తో ఒక మిని ప్రపంచం గా అలలారుతున్న మన భారతదేశానికి అతికినట్టు సరిపోతుంది .. కాబట్టి అందులో గొప్ప దనేమీ లేదు ... ఆ మాటకొస్తే మణి రత్నం కంటే రాం గోపాల్ వర్మా నే కొంత వరకూ బెటరూ ... ఆయన కనీసం సర్కార్ , నన్ను inspire చేసిన గాడ్ ఫాథర్ కి ఫ్రాంసిస్ ఫోర్డ్ కొప్పోలా కి నేను అర్పిస్తున్న గురు దక్షిణ అని ప్రకటించుకున్నారు ... మణి మాత్రం అది కాపీ కానే కాదు అని మంకు పట్టు పడుతున్నాడు .
పైగా నాయకన్ TIME ప్రకటించిన 100 గ్రేటెస్ట్ ఫిలంస్ ఎవర్ మేడ్ లిస్ట్ లో ... ఉంది
ఘర్షణ / అగ్ని నక్షత్రం ----- అసలు ఈ సినిమా ఎందుకు తీసాడో మణి రత్నానికే తెలియాలి , నన్ను అడిగితే ... ఇందులో హాస్పిటల్ సీన్ లో ప్రభు , కార్తీక్ వాళ్ళ నాన్న ని రూం మార్చి , మెట్ల దగ్గర కాపు కాసే సీన్ .. గాడ్ ఫాథర్ నుంచి మక్కి కి మక్కి దించేసారు మణి 'రతనం' గారు .....
అంజలి ---- ఈ సినిమా కు ఒక ఇంగ్లీష్ నవల ఆధారం , కొన్ని సీన్లు స్పీల్ బర్గ్ E.T నుంచి inspire అయ్యాయి , ఇందులో చిన్నారి షామిలీ అక్టింగ్ నిజంగా సూపర్ , రేవతి సినిమా కి మరో అసెట్.
దళ పతి ---- ఈ సినిమా లో ని రజనీ , మమ్ముటి , అరవింద్ స్వామీ పాత్రలు మహా భారతం లో కర్ణుడు , ధుర్యోధనుడు , అర్జునుడి పాత్రలను తలపిస్తాయి , కధ కూడా కొంత వరకూ అలానే ఉంటుంది , ఇందులో మమ్ముటి పాత్ర మధ్యలో వీక్ అయినట్టు అనిపిస్తుంది , కొంత సైకోటెరిక్ గా కూడా అనిపిస్తుంది . దీని పై 1960's లో వచ్చిన హాలీవుడ్ గాంగ్ స్టా సినిమాల ప్రభావం చాలా వరకూ ఉందనిపిస్తుంది .
గీతంజలి ---- ఒప్పుకుంటా ... ఈ సినిమా నిఝాంగా చాలా బావుంటుంది ... పైగా ఇందులో నాగార్జునా ఉన్నాడు అందుకే నో కామెంట్స్ . ;)
రోజా --- దళ పతి మహా భారతం నుంచి inspire అయినట్టే ఇది మైధలాజికల్ కారెక్టర్ సావిత్రి కధ నుంచి inspire అయ్యింది , కాక పోతే అక్కడ యముడు , ఇక్కడ టెర్రరిస్టు , అందులో సావిత్రి పట్టు దల చూసి యముడు కరిగి పోతే ... ఇక్కడ అరవింద్ స్వామి మాటలకి టెర్రరిస్టు
ice అయి పోయాడు ... కానీ ఇందులో జెండా తగుల బెట్టే సీన్ చూస్తే మాత్రం ... రక్తం ఉడికి పోతుంది .
దొంగా దొంగా --- రాం గోపాల్ వర్మా , మణి రత్నం కలిసి ఒక సినిమా నిర్మిస్తున్నరంటే ... అది ఏ రేంజి లో ఉందో అనుకుంటాం , నిజం చెప్పాలంటే అప్పట్లో ఈ సినిమా సూపర్ గ ఉంది అనిపించింది , కానీ ఇప్పుడు చూస్తే ...
బాంబే ---- హమ్ ..మ్.....మ్..మ్ ఈ సినిమా కి ఏం వంకలు పెట్టొచ్చబ్బా ?? ;) , రియల్ ఇంసిడెంట్ నుంచి inspire అయ్యింది ... పైగా చాలా మంచి వర్క్ ... కాబట్టి నో కామెంట్స్ .
ఇద్దరు --- తమిళ నాడు రాజకీయల ఆధారంగా తీసిన సినిమా ఇది !! పర్లేదు బానే ఉంటుంది !!
చాలా చోట్ల కధ మరీ పర్సనలైజ్ చేసినట్టు అనిపించింది , కధనం కూడా స్లో .... ముఖ్య పాత్రల మధ్య వైరం కూడా సినిమాలో వేగం తేలేక పోయింది !!
దిల్ సే --- చూళ్ళేదు , నో కామెంట్స్ !! :)
సఖి --- పర్లేదు మంచి సినిమా ... కాక పోతే .. ఇలాంటి వి బోల్డొచ్చాయి కాబట్టి లైట్ .. :)
అమ్రుతా --- తమిళ టైగర్ల పోరాట నేపధ్యం లో సాగుతుంది ... మొదటి అర్ధ గంట తరువాత సినిమాలో వేగం పెరిగింది కానీ , ప్లాట్ లో ని కాంప్లెక్సిటీ సరిగ్గా హండిల్ చెయ్య క పోవడం వల్ల నేమో మధ్యలో డైల్యూట్ అయినట్టు అనిపించింది !!
కానీ ఇందులో మాధవన్ , సిమ్రాన్ పాత్రలు చాలా బాగున్నాయి , సిమ్రాన్ ఒక తల్లి గా తన అమ్రుతకు సహాయ పడుతుంటే .... మాధవన్ మాత్రం తన రీసెర్చి కి కూడా పనికివస్తుంది అన్న రీతిలో ఉంటాడు , ఒక డెడికేటెడ్ రచయిత , తన లోని తండ్రి పాత్రను అధిగమించి అమ్రుత కు సహాయ పడుతుంది !!
యువ --- ఈ సినిమా లో హీరోల ఇంట్రడక్షన్ సీన్ చూసి అందరూ ... మాకి కిరి కిరి ఏం తీసాడు మావా అన్నారు .. తీరా చూస్తే మెక్సికన్ సినిమా అమెరోస్ పెరురోస్ నుంచి కాపీ పేస్ట్ చేసారు ... సరే ఆ సీన్ వదిలేసి సినిమా అన్నా గొప్పగా ఉందా అంటే అదీ లేదు .... పాలిట్రిక్స్ లో యువత అనే మంచి కాచీ సబ్జెక్ట్ తీసుకొని ఊదేసారు , సినిమా లో బేసిక్ ఎలిమెంట్స్ చాలా మిస్స్ అయినట్టు అనిపించాయి .
గురు --- Orson Welles తీసిన సిటిజన్ కేన్ చూసొచ్చి ఈ సినిమా చూడండి , కధా కధనాలు వేరైనా ... కారెక్టర్ పరంగా ... విజువల్స్ పరంగా .. స్క్రీన్ ప్లే పరంగా ఎన్ని సారూప్యతలు ఉన్నాయో మీరే గడ గడా చెబుతారు , ఇక అభిషేక్ అయితే Orson లాగా ఆక్ట్ చేడానికి తెగ కష్టపడ్డాడు పాపం , ఇందులో లైటింగ్ టెక్నిక్స్ అంతకు ముందే వచ్చిన స్పీల్ బర్గ్ సినిమా మ్యూనిక్ లైటింగ్ ఎఫెక్ట్స్ ని గుర్తుకు తెస్తాయి . దీన్ని ధీరూ భాయి అంబానీ జీవితం ఆధారంగా తీసారు. ఎందుకో నాకు పెద్దగా నచ్చలేదు !! ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా ఈ సం వ మన దేశం తరుఫున ఆస్కార్ కి పంపిస్తారట , చూద్దాం ఏ చేస్తాడో మన గురూ గారు !!
suman by morning shot is licensed under a Creative Commons Attribution 2.5 India License.
Based on a work at writtenbysuman.blogspot.com.
Permissions beyond the scope of this license may be available at http://writtenbysuman.blogspot.com/.
‘కొత్త బంగారులోకం’ మరీ అంత కొత్తగా ఎమీ లేదు
సినిమా కథ గురించి చెప్పేందుకు అంత ఏమీ లేదు కానీ కథనం మాత్రం కొన్ని చోట్ల బాగుంది.
కథ: ఒకమ్మాయీ ఒకబ్బాయీ ప్రేమించుకుంటారు. చివరికి వాళ్లు కలవటం. మరి మధ్యలో కలవరా అంటే సినిమాలో చాలా సేపు కలిసే ఉంటారు కానీ అసలు కలవటం అన్నమాట. కాలేజిలో కలవటం, ప్రేమించుకోటం , పెద్దలకి దొరికి పోటం. షరా మామూలే. దాన్ని కొంచం బ్రతికించింది నటీ నటుల ప్రతిభ.
కథనమేలా సాగిందంటే…: జయసుధ నేరేషన్లో కథ నడుస్తుంది. మంచి నటి కావటం, వాయిస్ బాగుండటం వల్ల నేరేషన్ లో ఏమీ భయం వెయ్యదు చూసేవాళ్ళకి. కానీ నాకు మాత్రం భయం వేసింది. (కృష్ణంరాజు, జయసుధలని పెట్టి మన్మధుడు తీసినా నేను ఇండియాలో A రేటింగూ, అమెరికాలో R రేటింగూ ఇస్తాను. గతానుభవం మరి). ఐతే అంత భయపడే విషయం ఏదీ లేదులే.
నటీ నటులు: వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్, ప్రకాశ్రాజ్, జయసుధ, ఆహుతి ప్రసాద్, బ్రహ్మానందం, రావు రమేష్.
ప్రతిభ: హీరో మనకి ‘హ్యాపీడేస్’ సినిమా ద్వారా పరిచయం అయ్యాడు. హీరోయిన్ కొత్తమ్మాయి లానే ఉంది. పాపం వాళ్ళకి దర్శకుడు నటించే అవకాశం ఇవ్వలేదు. దాంతో వాళ్ళిద్దరూ బ్రతికి పోయారు. అంతా వాళ్ల వయసుకు తగ్గట్టుగానే ఉండటంతో పెద్ద కష్ట పడకుండానే లాగించేశారు. మెచ్చుకోవచ్చు. హీరోయిన్ క్యూట్ గా ఉంది. ఈమధ్య అంత పెద్ద జడ ఉన్నా అమ్మాయిని చూడలేదు.
ప్రకాష్రాజ్ కి ఇది నిజంగానే కొత్త పాత్ర. బాగా అండర్ ప్లే చేశాడు. చాలా బాగుంది. జయసుదకి ఇది రొటీన్ పాత్రే. బాగానే చేసిందని చెప్పక్కర్లేదు. నాకైతే బోరు కొట్టింది. ఆహుతి ప్రసాద్ ఉన్నంతలో లాగించాడు. నాకైతే మొహం మొత్తింది. ఆ స్టైల్ ఆఫ్ డైలాగ్స్ తో.
బ్రహ్మానందం ప్రిన్సిపాల్ గా బాగున్నాడు. రెండు మూడు డైలాగ్స్ బాగున్నాయి. ‘రావు రమేష్’ ఫిజిక్స్ లెక్చరర్ గా చేశాడు. నేను మొదటి సారి విన్నాను. ఓ మాదిరిగా ఉన్నాడు. ఐతే అతనిది entertaining పాత్ర. మా ఫ్రెండు రావు గోపాల రావు తాలూకన్నాడు. నిజమా అనుకున్నాను.
పాటలు: నాకు ఇంట్రెస్ట్ కలిగింది ‘సీతారామశాస్త్రి’ అన్న టైటిల్ చూసి. ఎవరు ఏవి రాశారో తెలీదు. వెళ్ళేసరికే పేర్లు ఐపోయాయి. ‘నిజంగా నేనేనా…’ పాట చిత్రీకరణ బాగానే ఉంది. (మూడో పాట). ‘కన్ఫ్యూషన్’ అనే పాటా గుర్తు ఉంచుకోదగ్గదే కానీ కంఫ్యూషన్ గానే ఉంది. మ్యూజిక్ సినిమాకు తగ్గట్టుగానే ఉంది.
మాటలు: అసలు చెప్పుకోవాల్సింది వాటి గురించే. కొన్ని మాటలు బాగా పేలాయి. రెస్పాన్స్ బాగా వచ్చింది. అందులోనూ సెకండ్ హాఫ్ లో వచ్చే ‘అన్నయ్యా…’ డైలాగ్ అదిరింది. అలాగే హీరో ఫ్రెండు జల్సాని మూడు సార్లు చూశానంటే హీరో ‘అన్నిసార్లూ అర్ధం కాలేదా?”‘ అంటాడు. అదీ బాగానే ఉంది. క్లాసులో ‘టీనేజ్, యంగేజ్, మిడిలేజ్’ గురించి రావు రమేష్ చెప్పే సన్నివేశం లో డైలాగ్స్ బాగున్నాయి. అశ్లీలతలు లేక పోవటం బాగుంది.
కెమెరా: అవేరేజ్. మూడో పాటలో మాత్రం బాగుంది. అనవసరపు హడావిడి లేకుండా చక్కగా తీశారు. ఎవరో తెలీదు.
ఫైట్స్: ఒక్కటే ఉంది. క్రికెట్ ఫీల్డింగ్ లాగా. బాగుంది.
సినిమా చూడొచ్చా?: నిక్షేపంలాగా. ఐతే ఒక్కసారి మాత్రమే.
హెచ్చరిక: సినిమాలో హీరో తో కబుర్లాడుతూ హీరోయిన్ మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుదాం. అప్పుడు చాలా హ్యాపీ గా ఉండొచ్చు అంటుంది. ఇంకా డైలాగ్స్ ఉన్నాయి. మరీ చెప్పెయలేముగా! ఇది చాలు సినిమా చూడోచ్చోలేదో నిర్ణయించుకునేందుకు. పాపం ఆ అమ్మాయి అమాయకురాలనుకుంటా.
ఇదే సినిమా గురుంచి "నవతరంగం"లొ సూర్యప్రకాష్ గారు ఎమన్నారొ చూద్దాం
అసలు ఈ సినిమా కథ హ్యాపీడేస్ లాంటి ప్లేవర్ తో ఫస్టాఫ్ పూర్తి చేసి ప్రేమిస్తే లాంటి సంఘటనలతో సెకండాఫ్ నడుపుదామనకున్నప్పుడే సగం ప్లాబ్లం ప్రారంభమయ్యింది. ఎందుకంటే కాలేజి జీవితాన్ని ఉషారుగా చూపే పాప్ కార్న్ మోడ్ లో సాగ్ హ్యాపీడేస్ లో సంఘటనలకీ, ఉన్నదున్నట్లుగా వాస్తవంగా సన్నివేశాలతో నడిచే ప్రేమిస్తేని ముడి పెట్టడం చాలా కష్టం . అయినా ఈ స్కీమ్ ఫాలో కావటంతో సెకండాఫ్ లో హీరో,హీరోయిన్స్ కలిసే సన్నివేశాలే అసలు కథలో లేకుండా పోయాయి. దాంతో అప్పటి వరకూ వారి స్వీట్ రొమాన్స్ ని ఎంజాయి చేసిన ప్రేక్షకుడు హఠాత్తుగా కథ ఇలా డ్రైగా మారటం జీర్ణించుకోలేని విషయం. అలా కాకుండా తేజ రెగ్యులర్ నువ్వు-నేను,జయం స్కీమ్ వెళ్ళి పోయి టీనేజ్ ప్రేమ కథను అందర్ని ఎదిరించి పూర్తిగా గెలిపించే ప్రయత్నం చేసినే సమస్య లేకుండా పోయేది. అలా కాకుండా సందేశం చెప్పాలి…మరో ప్రక్క టీనేజ్ ప్రేమకథను చూపాలనే ప్రయత్నం చేయటం వల్లనే ఈ ప్రమాదం వచ్చింది.
దాంతో అసలు దర్శక,రచయిత ఈ సినిమా ద్వారా ఏం చెప్పాలనుకున్నాడు అన్న క్లారిటీని ప్రేక్షకుడుకి అందించటం మిస్సవటం జర్గింది. అదే ఇదే బ్యానర్ లో గతంలో వచ్చిన బొమ్మరిల్లు సినిమాలో ఫస్ట్ సీన్ లోనే మా సినిమా తండ్రి కొడుకుల సమస్య అని స్పష్టం చేస్తాడు. అలాగే ఈ సినిమాలో దర్శకుడు ఫాలో అయిన ప్రేమిస్తే లోనూ ఫస్ట్ సీన్ లోనే ప్రపంచం ఇంకా తెలియని ప్రేమజంట లేచిపోవటం తో ప్రారంభించి ఓ పిచ్చివాడిని చూపి చివరకు ఇలాగే కథ ముగుస్తుంది…రియలిస్టిక్ ఎప్రోచ్ ఉన్న సినిమా అని హింట్ దర్శకుడు ఇస్తాడు. అలాగే ఈ దర్శకుడు మనసు పడ్డ మరో సినిమా మరో చరిత్ర (హీరో హీరోయిన్ల పేర్లు స్వప్న,బాలు) సినిమాలో నూ కథ ఓ పాత కాలం బిల్డింగ్ పై ఓపెన్ చేసి ఇది ఓ విషదాంత ప్రేమకథ అని చెప్పి ఫాలో అవ్వమంటాడు. ఆ చిత్రంలో హైలెట్ గా నిలిచే మన మధ్య ఉన్నది ఆకర్షణా,ప్రేమ అన్న విషయం తేల్చుకోవాలి అన్న పాయింట్ ని తీసుకున్న దర్శకుడు ఈ క్లారిటీని తన సినిమాలో మిస్సయ్యాడు.
మీరిది చూసారా..?
1. మాయాబజార్ సినిమాలో జరిగేది అర్జునుడి కొడుకు పెళ్ళి. కాని పాండవులెక్కడా కనపడరు. మీరు గమనించారా?
2. రాయలసీమకు ఆ పేరు పెట్టి ఎన్నాళ్ళో కాలేదు అంతకు ముందు దాన్ని దత్తమండలం అనేవారు. ఆ పేరెవరు పెట్టారు?
3. "బావా బావా పన్నీరు" పాట వ్రాసిందెవరు?
వీటికి సమాధానాలు తెలుగు విజ్ఞాన సర్వస్వం -te.wikipedia.org. - లో ఉన్నాయి. మీరూ, నేనూ, మనవంటి వాళ్ళందరూ కలిసి సమష్టిగా రాస్తున్న సర్వస్వమిది. మనకేం తెలుసు, మనమేం రాయగలము అని అనుకోకండి. కాదేదీ కవితకనర్హం లాగా మనకు తెలిసిన ఏ విషయమూ చిన్నది కాదు. తెలుసు కాబట్టి అది మీకు చిన్నది.. కాని తెలియని నాకు...అది పెద్దదే, కొత్తదే.
ఒకసారి చూడండి. మీరూ ఓ వ్యాసం రాయండి. మీ ఊరి గురించో, మీకు తెలిసిన గొప్ప వ్యక్తి గురించో, ఓ సంఘటన గురించో, చరిత్రో, సైన్సో.. ఏదైనా రాయొచ్చు..పూర్తి తెలుగులో. మీకు దాని అవసరం ఉంది. మీ అవసరం అక్కడ చాలా ఉంది.
సుబ్రమణ్యపురం
తమిళోళ్ళు సామాన్యులు కాదు. ఒక పరుతి వీరన్, ఒక కల్లూరి, ఒక ఆటోగ్రాఫ్, ఒక తమిళ్ MA. తమ నేటివిటీ కి ఈ మాత్రం లోపం రాకుండా వాస్తవానికి దగ్గరగా సినిమాలు తీస్తూ కమర్షియల్ గా విజయం సాధించడం వీళ్ళ తర్వాతే అని చెప్పొచ్చు.
ప్రస్తుతం తమిళంలో సినిమాలు తీస్తున్న దర్శకుల్లో బాల, అమీర్ లు తమ సినిమాలతో ఇప్పటికే మంచి దర్శకులుగా పేరు తెచ్చుకున్నారు. వాళ్ళిద్దరి దగ్గరా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన శశికుమార్ దర్శకత్వంలో వచ్చిన సుబ్రమణ్యపురం సినిమా ఈ దశాబ్దపు ఉత్తమ సినిమాల్లో ఒకటిగా నిలుస్తుందనడంలో ఆశ్చర్యం లేదు.
ఈ సినిమా కథ చెప్పి ఈ సినిమా చూడాలనుకున్న ప్రేక్షకులను నిరాశ పరచడం ఇష్టం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే “1980 లలో మధురై లోని సుబ్రమణ్యపురం లో నివసించే ఒక ఐదుగురి యువకుల కథ ఇది”.
కథ, కథనం తో పాటు బ్రిలియంట్ సినిమాటోగ్రఫీ, సరైన సంగీతం ఈ సినిమాని ఒక మాస్టర్ పీస్ గా నిలబెడుతుంది.ఈ సినిమా నాకు బాగా నచ్చడానికి కొన్ని కారణాలు:
1. కథ మొదలైన తీరు నచ్చకపోయినా సినిమా ముగిసే సరికి కథ అలానే మొదలవ్వాలని దర్శకుడు కన్విన్స్ చేయగలగడం.
2. అంతా కొత్త వారైనా ప్రతి నటుడూ తమ పాత్రను అధ్భుతంగానే కాదు అవలీలగా పోషించారు.
3. ఈ సినిమాలో హీరో లంటూ ఎవరూ లేకపోవడం.
4. 1980 కాలాన్ని అత్యంత నేర్పుగా రిక్రియేట్ చేయడం.
5. కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో ఒక సినిమా తీసి దాన్ని బ్లాక్ బస్టర్ గా మలచిన తీరు.
6. మన టివిల్లో యాంకర్ గా ఒక వాగుడుకాయగా పరిచయమున్న స్వాతి కళ్ళతోనే గొప్ప నటన ప్రదర్శించింది.
7. పరుతి వీరన్, కల్లూరి, తమిళ్ MA సినిమాలలో క్లైమాక్స్ సెన్సేషనలైజ్ చేయకుండా ఈ సినిమా క్లైమాక్స్ కేవలం అంతకముందు జరిగిన సంఘటనల natural consequence గా మాత్రమే వుంటుంది.
8. వయొలెన్స్ అధికంగా వున్న సినిమా అయినా ఈ సినిమాలో అధిక శాతం వయొలెన్స్ మన మైండ్ లో ఊహించుకుంటాం కానీ తెరపై మనకి కనిపించదు.
9. ఈ సినిమాలో అణువణువనా వ్యక్తమయ్యే రియలిజం.
10. మొదటి పదిహేను నిమిషాలు తప్పితే ఊపిరి సలుపుకోలేని వేగంతో నడిచే కథనం.
ఒక వేళ మీకు పరుతి వీరన్, ఆటోగ్రాఫ్, కల్లూరి లాంటి సినిమాలు నచ్చుంటే ఈ సినిమా కూడా మీకు తప్పకుండా నచ్చుతుంది. ఒక వేళ మీకా సినిమాలు నచ్చకపోతే ఈ సినిమా మీకు గ్యారంటీగా నచ్చుతుంది.
ఇంకా కాదు అంటే మీకు పల్ప్ ఫిక్షన్, సిటీ ఆఫ్ గాడ్స్ నచ్చి వుంటే ఈ సినిమా మీకు తప్పకుండా నచ్చుతుంది. ఒక వేళ మీకా సినిమాలు నచ్చలేదంటే దయచేసి ఈ సినిమా కి దూరంగా వుండండి.ఈ సినిమా మీలాంటి టేస్ట్ లేని వాళ్ళకు కాదు.
rock on
నాలాగ మీకు ఇండియన్‌రాక్ లో ఏ కొంచెం ఆసక్తి వున్నా, ఈ సినిమా ‘GOD’ సినిమా అనిపించి తీరుతుంది. ఈ సినిమాలో లోట్లు వున్నాయి కానీ, నేను సినిమాలో ఎంత మైమరచి పోయానంటే, అవన్నీ ఏం తట్టలేదు.
ఇప్పుడు ఆలోచిస్తే, సినిమాలోని కొన్ని లోట్లు,
౧) జో నౌక ఎక్కడానికి వెళ్తూంటే, కారు సరిగ్గా వీళ్ళ కాంసెర్ట్ ముందు ఆగడం. ముంబాయి లాంటి మహానగరాల్లో ఇలాంటిది జరగడం, కొంత కష్టమే.
౨) రాబ్ కి బ్రెయిన్ ట్యూమర్ పెట్టడం కొద్దిగా పాత సినిమా తరహాలో వుంది. కానీ కథలో కాంప్లికేషన్ కోసం ఇలాంటిది చేయాల్సివుంది.
నాకీ రెండే తడుతున్నాయి. ఇంకా చిన్న చిన్నవి వున్నా, వాటిని పెద్దగా పట్టించుకోనక్కరలేదు.
ఇక ఫర్హాన్ , రాంపాల్ పాత్రల విషయమై,
ఫర్హాన్ పాత్ర ఆదిత్యలో కంటే, అర్జున్ పాత్ర జోలోనే ఎక్కువ డెప్త్ వుంది. ఆదర్శాలు ఎక్కువ వున్న పాత్ర జో. కాబట్టి ఎప్పటికైనా ఆ పాత్రకే మంచి గుర్తింపు వస్తుంది. ఈ సినిమా అర్జున రాంపాల్ కి మంచి గుర్తుంపునివ్వాలి. ఫర్హాన్ కూడా మరీ అతిగా చేయకండా, మిగిలిన నటులకు తగిన ప్రాముఖ్యతనిచ్చాడు.
ఇక మంచి విషయాలు చెప్పవస్తే,
౧) ఇండియన్-రాక్ ఇష్టముంటే, ఈ సినిమాలో సంగీతం చాలా చాలా బాగుంటుంది (నా అభిప్రాయం - నేనైతే సీడి కొన నిశ్చయించాను), మీరు రెహమాను సంగీతమో, ఇళయరాజ సంగీతమో ఆశించివెళితే, కాస్తంటే కాస్త నిరాశ కలుగవచ్చు.
౨) స్క్రిప్టు - ఆదిత్యకి అతని భార్యకి మధ్య సంఘర్షన చాలా బాగుంది. అలానే, బ్యాండులో చిన్నచిన్న చీలికలు వచ్చి అవి పెద్దగా మారడాన్ని చాలా నెమ్మదిగా సహజంగా చిత్రీకరించారు. (మన అత్తకోడళ్ళ మధ్య ఒక పూటలో గొడవలు జరగడం లాంటిది కాకుండ.)
౩) కెడి, రాబ్ ల సంబంధం వారి పాత్రల చిత్రీకరణ చాలా బాగున్నాయి.
౪) మన తెలుగు సినిమాల్లో, హీరో గారు ఏదో వాయిస్తూవుంటారు, అక్కడ సంగీతం ఏదో వస్తూంటుంది. అలా కాకుండా, చాలా సహజంగా వుంది, రాంపాల్ గిటారు వాయించడం, మఱియు కెడి డ్రమ్ములు వాయించడం.
౫) నాన్ లీనియర్ కథనం - ఈ తరహా కథనం చాలా కష్టం, గమ్యంలో క్రిష్ ఇలాంటిది ప్రయత్నించాడు కాని, అంత సఫలమవ్వలేదు. అదీ పదేళ్ళు వెనక్కి తీసుకెళ్ళడమంటే, ఇంకా కష్టమవుతుంది. (జుట్టూ మీసాలు పెంచేస్తే సరిపోదు). ఈ సినిమాలో ఈ టెక్నిక్ ని చాలా బాగా ఉపయోగించుకున్నారు.
౬) కాంసెర్ట్ సన్నివేశాలన్నీ చాల సహజంగా వచ్చాయి. ఇంగ్లీషు సినిమాల్లోలాగ (వాసు సినిమాలోలో కాకుండ).
స్థూలంగా చెప్పాలంటే,
ఈ సినిమాలోని సాంకేతికాంశాలను చాలా పటిష్ఠంగా ఉంచుతూనే, చాలా మంచి అనుభూతిని కలిగించింది. దీన్ని మాస్టర్ పీస్ అని అనలేమేమోగాని, ఒక కొత్త పుంత త్రొక్కి అందులో చాలా దూరం వెళ్ళవచ్చని నిరూపించిన సినిమా ఇది. ‘దిల్ చాహతా హైఁ’ కంటే ఒక పదడుగులు ముందుకు వేసింది.
వీలైతే ఈ సినిమా చూడండి, లేకుంటే డీవీడి కొనండి. సినిమాలో చెప్పినట్లు అక్రమంగా దిగుమతి చేసుకోవద్దు. (ఇది అష్టా-చెమ్మా కు కూడా వర్తిస్తుంది.)
