-
‘కొత్త బంగారులోకం’ మరీ అంత కొత్తగా ఎమీ లేదు
Posted by
సుమన్.గద్దె
on 14, అక్టోబర్ 2008, మంగళవారం
Labels:
సినిమాలు
సినిమా కథ గురించి చెప్పేందుకు అంత ఏమీ లేదు కానీ కథనం మాత్రం కొన్ని చోట్ల బాగుంది.
కథ: ఒకమ్మాయీ ఒకబ్బాయీ ప్రేమించుకుంటారు. చివరికి వాళ్లు కలవటం. మరి మధ్యలో కలవరా అంటే సినిమాలో చాలా సేపు కలిసే ఉంటారు కానీ అసలు కలవటం అన్నమాట. కాలేజిలో కలవటం, ప్రేమించుకోటం , పెద్దలకి దొరికి పోటం. షరా మామూలే. దాన్ని కొంచం బ్రతికించింది నటీ నటుల ప్రతిభ.
కథనమేలా సాగిందంటే…: జయసుధ నేరేషన్లో కథ నడుస్తుంది. మంచి నటి కావటం, వాయిస్ బాగుండటం వల్ల నేరేషన్ లో ఏమీ భయం వెయ్యదు చూసేవాళ్ళకి. కానీ నాకు మాత్రం భయం వేసింది. (కృష్ణంరాజు, జయసుధలని పెట్టి మన్మధుడు తీసినా నేను ఇండియాలో A రేటింగూ, అమెరికాలో R రేటింగూ ఇస్తాను. గతానుభవం మరి). ఐతే అంత భయపడే విషయం ఏదీ లేదులే.
నటీ నటులు: వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్, ప్రకాశ్రాజ్, జయసుధ, ఆహుతి ప్రసాద్, బ్రహ్మానందం, రావు రమేష్.
ప్రతిభ: హీరో మనకి ‘హ్యాపీడేస్’ సినిమా ద్వారా పరిచయం అయ్యాడు. హీరోయిన్ కొత్తమ్మాయి లానే ఉంది. పాపం వాళ్ళకి దర్శకుడు నటించే అవకాశం ఇవ్వలేదు. దాంతో వాళ్ళిద్దరూ బ్రతికి పోయారు. అంతా వాళ్ల వయసుకు తగ్గట్టుగానే ఉండటంతో పెద్ద కష్ట పడకుండానే లాగించేశారు. మెచ్చుకోవచ్చు. హీరోయిన్ క్యూట్ గా ఉంది. ఈమధ్య అంత పెద్ద జడ ఉన్నా అమ్మాయిని చూడలేదు.
ప్రకాష్రాజ్ కి ఇది నిజంగానే కొత్త పాత్ర. బాగా అండర్ ప్లే చేశాడు. చాలా బాగుంది. జయసుదకి ఇది రొటీన్ పాత్రే. బాగానే చేసిందని చెప్పక్కర్లేదు. నాకైతే బోరు కొట్టింది. ఆహుతి ప్రసాద్ ఉన్నంతలో లాగించాడు. నాకైతే మొహం మొత్తింది. ఆ స్టైల్ ఆఫ్ డైలాగ్స్ తో.
బ్రహ్మానందం ప్రిన్సిపాల్ గా బాగున్నాడు. రెండు మూడు డైలాగ్స్ బాగున్నాయి. ‘రావు రమేష్’ ఫిజిక్స్ లెక్చరర్ గా చేశాడు. నేను మొదటి సారి విన్నాను. ఓ మాదిరిగా ఉన్నాడు. ఐతే అతనిది entertaining పాత్ర. మా ఫ్రెండు రావు గోపాల రావు తాలూకన్నాడు. నిజమా అనుకున్నాను.
పాటలు: నాకు ఇంట్రెస్ట్ కలిగింది ‘సీతారామశాస్త్రి’ అన్న టైటిల్ చూసి. ఎవరు ఏవి రాశారో తెలీదు. వెళ్ళేసరికే పేర్లు ఐపోయాయి. ‘నిజంగా నేనేనా…’ పాట చిత్రీకరణ బాగానే ఉంది. (మూడో పాట). ‘కన్ఫ్యూషన్’ అనే పాటా గుర్తు ఉంచుకోదగ్గదే కానీ కంఫ్యూషన్ గానే ఉంది. మ్యూజిక్ సినిమాకు తగ్గట్టుగానే ఉంది.
మాటలు: అసలు చెప్పుకోవాల్సింది వాటి గురించే. కొన్ని మాటలు బాగా పేలాయి. రెస్పాన్స్ బాగా వచ్చింది. అందులోనూ సెకండ్ హాఫ్ లో వచ్చే ‘అన్నయ్యా…’ డైలాగ్ అదిరింది. అలాగే హీరో ఫ్రెండు జల్సాని మూడు సార్లు చూశానంటే హీరో ‘అన్నిసార్లూ అర్ధం కాలేదా?”‘ అంటాడు. అదీ బాగానే ఉంది. క్లాసులో ‘టీనేజ్, యంగేజ్, మిడిలేజ్’ గురించి రావు రమేష్ చెప్పే సన్నివేశం లో డైలాగ్స్ బాగున్నాయి. అశ్లీలతలు లేక పోవటం బాగుంది.
కెమెరా: అవేరేజ్. మూడో పాటలో మాత్రం బాగుంది. అనవసరపు హడావిడి లేకుండా చక్కగా తీశారు. ఎవరో తెలీదు.
ఫైట్స్: ఒక్కటే ఉంది. క్రికెట్ ఫీల్డింగ్ లాగా. బాగుంది.
సినిమా చూడొచ్చా?: నిక్షేపంలాగా. ఐతే ఒక్కసారి మాత్రమే.
హెచ్చరిక: సినిమాలో హీరో తో కబుర్లాడుతూ హీరోయిన్ మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుదాం. అప్పుడు చాలా హ్యాపీ గా ఉండొచ్చు అంటుంది. ఇంకా డైలాగ్స్ ఉన్నాయి. మరీ చెప్పెయలేముగా! ఇది చాలు సినిమా చూడోచ్చోలేదో నిర్ణయించుకునేందుకు. పాపం ఆ అమ్మాయి అమాయకురాలనుకుంటా.
ఇదే సినిమా గురుంచి "నవతరంగం"లొ సూర్యప్రకాష్ గారు ఎమన్నారొ చూద్దాం
అసలు ఈ సినిమా కథ హ్యాపీడేస్ లాంటి ప్లేవర్ తో ఫస్టాఫ్ పూర్తి చేసి ప్రేమిస్తే లాంటి సంఘటనలతో సెకండాఫ్ నడుపుదామనకున్నప్పుడే సగం ప్లాబ్లం ప్రారంభమయ్యింది. ఎందుకంటే కాలేజి జీవితాన్ని ఉషారుగా చూపే పాప్ కార్న్ మోడ్ లో సాగ్ హ్యాపీడేస్ లో సంఘటనలకీ, ఉన్నదున్నట్లుగా వాస్తవంగా సన్నివేశాలతో నడిచే ప్రేమిస్తేని ముడి పెట్టడం చాలా కష్టం . అయినా ఈ స్కీమ్ ఫాలో కావటంతో సెకండాఫ్ లో హీరో,హీరోయిన్స్ కలిసే సన్నివేశాలే అసలు కథలో లేకుండా పోయాయి. దాంతో అప్పటి వరకూ వారి స్వీట్ రొమాన్స్ ని ఎంజాయి చేసిన ప్రేక్షకుడు హఠాత్తుగా కథ ఇలా డ్రైగా మారటం జీర్ణించుకోలేని విషయం. అలా కాకుండా తేజ రెగ్యులర్ నువ్వు-నేను,జయం స్కీమ్ వెళ్ళి పోయి టీనేజ్ ప్రేమ కథను అందర్ని ఎదిరించి పూర్తిగా గెలిపించే ప్రయత్నం చేసినే సమస్య లేకుండా పోయేది. అలా కాకుండా సందేశం చెప్పాలి…మరో ప్రక్క టీనేజ్ ప్రేమకథను చూపాలనే ప్రయత్నం చేయటం వల్లనే ఈ ప్రమాదం వచ్చింది.
దాంతో అసలు దర్శక,రచయిత ఈ సినిమా ద్వారా ఏం చెప్పాలనుకున్నాడు అన్న క్లారిటీని ప్రేక్షకుడుకి అందించటం మిస్సవటం జర్గింది. అదే ఇదే బ్యానర్ లో గతంలో వచ్చిన బొమ్మరిల్లు సినిమాలో ఫస్ట్ సీన్ లోనే మా సినిమా తండ్రి కొడుకుల సమస్య అని స్పష్టం చేస్తాడు. అలాగే ఈ సినిమాలో దర్శకుడు ఫాలో అయిన ప్రేమిస్తే లోనూ ఫస్ట్ సీన్ లోనే ప్రపంచం ఇంకా తెలియని ప్రేమజంట లేచిపోవటం తో ప్రారంభించి ఓ పిచ్చివాడిని చూపి చివరకు ఇలాగే కథ ముగుస్తుంది…రియలిస్టిక్ ఎప్రోచ్ ఉన్న సినిమా అని హింట్ దర్శకుడు ఇస్తాడు. అలాగే ఈ దర్శకుడు మనసు పడ్డ మరో సినిమా మరో చరిత్ర (హీరో హీరోయిన్ల పేర్లు స్వప్న,బాలు) సినిమాలో నూ కథ ఓ పాత కాలం బిల్డింగ్ పై ఓపెన్ చేసి ఇది ఓ విషదాంత ప్రేమకథ అని చెప్పి ఫాలో అవ్వమంటాడు. ఆ చిత్రంలో హైలెట్ గా నిలిచే మన మధ్య ఉన్నది ఆకర్షణా,ప్రేమ అన్న విషయం తేల్చుకోవాలి అన్న పాయింట్ ని తీసుకున్న దర్శకుడు ఈ క్లారిటీని తన సినిమాలో మిస్సయ్యాడు.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి