-
నాగురుంచి రెండు ముక్కలు
Posted by
సుమన్.గద్దె
on 16, అక్టోబర్ 2009, శుక్రవారం
Labels:
సినిమాలు
సోషియల్, ప్రొఫెషనల్, పర్సనల్...
అన్నీ కలిపి సింపుల్ గా నా గుణగణాల లిస్టిదిగో..
తెలివితేటలు నా తలకాయి పెద్దదని చిన్నప్పుడే డాక్టర్ చెప్పారని మా అమ్మ చెప్పింది. తల పెద్దదంటే ఆటోమేటిగ్గా మెదడు కూడా పెద్దదిగానే ఉంటుంది. మెదడు పెద్దదంటే తెలివితేటల గురించి చెప్పేదేముంది.
స్పెషల్ క్వాలిటీ మతిమరుపు... మరీ ఎక్కువేం కాదు. షాపుల్లో డబ్బులిచ్చేసి వస్తువులు తీసుకురావడం మరిచిపోతుంటానంతే గానీ... ఇంతవరకూ ఎప్పుడూ బట్టలేసుకోవడం మరిచిపోయి బయటకెళ్లింది లేదు!
రొమాంటిక్.నెస్ మాంచి రొమాంటిక్ ఫెలోనంట. వర్షాకాలం ఓ అర్ధరాత్రి ఆకలేస్తే బయటికెళ్లి ఐస్ క్రీం తినొచ్చా. (హైదరాబాద్ లో ఏ సీజనైనా సరే అర్ధరాత్రి పూట ఐస్ క్రీం బండ్లకు ఢోకా ఉండదు కదా). యు ఆర్ సో రొమాంటిక్ అన్నాడు మా రూంమేట్. ఏదీ దొరక్క అది తిన్నానని చెప్పలేదు నేను.
షార్ప్.నెస్ బాగా ఎక్కువ. ఓసారి పరుగుపందెంలో అందరికంటే ఫస్టొచ్చా. కానీ ప్రైజ్ ఇవ్వలా. అంపైర్ (కరక్టేనా?) వన్, టూ చెప్పాడు... త్రీ చెప్పకముందే ‘‘‘షార్ప్’’’గా ముందుకెళ్లిపోయా.
బలాలు ఖరీదైన కలలు కనడం. అబద్ధాలు చెప్పడం. మేధావినని ఫీలవడం
బలహీనతలు ఎప్పటికప్పడు కలల ఖరీదు పెంచలేకపోవడం. అబద్ధాల్ని నిజాలు చెయ్యలేకపోవడం. మేధావినని ఎదుటివాళ్లను నమ్మించలేకపోవడం.
చదువు B.Tech , M.Sc chemistry (svu,sku,ou,IIT), M.Sc maths (svu), B.Ed (* షరతులు వర్తించును)
(* పైన చెప్పిన కోర్సులకు ఎంట్రన్స్ టెస్టులు రాశాను. మార్కులు తగ్గినా ర్యాంకులు మాత్రం త్రిబుల్ డిజిట్ కి ఎక్కడా తగ్గలా. ర్యాంకులెలాగూ వచ్చాయి కాబట్టి ఏదో ఒక రోజుకు అన్ని కోర్సులూ పూర్తి చేసేద్దామనుకుంటున్నా)
ఉద్యోగం ఇంత టైం తీసుకోని ప్రొఫైల్ రాశాడు. ఖాళీగా పడుంటాడు అని ఫిక్సయిపోవద్దు. ఉద్యోగం వెలగబెడుతున్నా.
జీతం పది రూపాయల నోట్లయితే ఓ బ్యాగ్... వంద నోట్లయితే ప్యాంట్ జేబు... 500 నోట్లయితే చొక్కా జేబు సరిపోయేంత.
పొడవు శిల్పాశెట్టిని తలెత్తి... త్రిషను కళ్లలో కళ్లు పెట్టి... షీలాని కళ్లు దించి చూసేంత.
రంగు- మహేష్ బాబునీ... చిరంజీవినీ... రజనీకాంత్ నీ కలిపి... ఓ అరగంట మిక్సీలో వేసి బయటికి తీస్తే ఏ రంగొస్తుందో అలా ఉంటా.
ఫిజిక్ ఇంటర్ చదివేటపుడు 20 అడుగుల కొబ్బరి చెట్టు మీది నుంచి పడ్డా కూడా ఏం కాలా. మా చుట్టుపక్కల 15 పల్లెల్లో అంతెత్తు నుంచి పడి ఏదీ ఇరగ్గొట్టుకోనిది నేనొక్కణ్నే. మనది ఐరన్ బాడీ అని చెప్పడానికకి ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి? ఇక సిక్స్ ప్యాక్... ఎయిట్ ప్యాక్ అని అందరూ అంటున్నారు గానీ.... నా బాడీలో మాత్రం మెడ కింది నుంచి ప్యాక్ లే ప్యాక్ లు. కొందరు అజ్నానులు మాత్రం అవి ప్యాక్ లు కాదు... ఎముకలన్నారు అది వేరే విషయం.
బరువు జోరుగా వాన పడినా కదలకుండా నిలుచుకోగలిగినంత. వానకు గాలి కూడా కలిసిందంటే మాత్రం ఇంట్లో నుంచి బయటికి రాలేనంత.
కళ్లు పులి వేటాడుతున్నపుడు జింక కళ్లున్నట్లుంటాయి... (మరోసారి చదవండి) ఈ విషయం 2006 ముందు వరకు తెలియదు. ‘అతడు’ సినిమా చూశాకే తెలిసింది. అందులో హీరో కళ్లు జింకను వేటాడేటపుడు పులి కళ్లలాగా ఉంటాయని చెప్పార్లే.
జుట్టు ఒక రంగంటూ లేదు... త్రివర్ణం. నలుపు (జన్మత: వచ్చింది), తెలుపు (తెలివెక్కువై వచ్చింది) బ్రౌన్ (హెన్నా వల్ల వచ్చింది).
మంచి అలవాట్లేమైనా... ‘‘బీరులో 4 శాతమే ఆల్కహాలుంటుంది. మిగతాదంతా పళ్లరసమే. తాగితే లావవుతారు’’ అని మా కెమిస్ట్రీ లెక్చరర్ ఓసారి చెప్పాడు. మన బరువు గురించి ముందే చెప్పాగా... అందుకే బీరు ట్రై చేసి చూశా. రిజల్ట్ రాలా. ఫీలై ఇంకా సన్నబడిపోయా. పొగ తాగని తాగని తాగని వాడు దున్నపోతై పుట్టు... అని పెద్దోళ్లు చెప్పారు కదా (కన్యాశుల్కంలో గిరీశం చెప్పాడు... సీతారామరాజులో నాగార్జన పాడాడులెండి) ఎందుకైనా మంచిదని ఇంటర్లో ఓసారి ట్రై చేశా. నచ్చలా. వదిలేశా.
అంతేనా...అయిపోయిందా... అనుకోకండి. నేను నిత్య విద్యార్థిని. నా గురించి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకుంటుంటా. అప్పటికప్పుడు మీతో పంచుకుంటుంటా.
నా ఆర్కుట్ ప్రొఫైల్ లో కూడా ఇదే ఉంది .....
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి