-
వ్యూ ప్రమ్ ఎ గ్రెయిన్ ఆఫ్ శాండ్
ముగ్గురు ఆప్ఘన్ మహిళల జీవితాల నేపధ్యంలో 30 సంవత్సరాల ఆప్ఘనిస్తాన్ చరిత్రను పరామర్శిస్తూ మీనా నాన్జి వ్యూ ప్రమ్ ఎ గ్రెయిన్ ఆఫ్ శాండ్ అనే అద్భుతమైన డాక్యుమెంటరీ చిత్రాన్ని తీశారు. దీన్ని తెలుగులో "ఇసుక తిన్నెలమీంచి చూసినప్పుడు" అని పిలిస్తే అర్థవంతంగా ఉంటుంది.
ఆప్ఘనిస్తాన్ గురించి ఎవరు ఆలోచించినా అక్కడి మహిళల దుస్థితే మొదటగా మనసులోకి వస్తూంటుంది. ఆప్ఘన్ మహిళల ప్రస్తుత పరిస్థితి ఏమిటి... వాళ్ల జీవితాలు ఇప్పుడెలా ఉన్నాయి... కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారి పరిస్థితి నిజంగా మెరుగుపడిందా... వాళ్లకు నిజమైన హక్కులు ప్రస్తుతం ఉన్నాయా.. లేదా ఇప్పటికీ వారు భయం, అణచివేత నేపధ్యంలోనే బతుకుతున్నారా.. ఇలా అనేక ప్రశ్నలు పొడుచుకుని వస్తుంటాయి.
ఇసుక తిన్నెల మీదనుంచి...
30 సంవత్సరాల క్రమంలో యుద్ధంతో ఛిన్నాభిన్నమైన ఆప్ఘనిస్తాన్ ఆకాశంలో సగభాగం దుర్భరస్థితిని, మనోధైర్యాన్ని సజీవంగా చిత్రించిన ఈ లఘుచిత్రం "వ్యూ ప్రమ్ ఎ గ్రెయిన్ ఆఫ్ శాండ్" పలు అంతర్జాతీయ చిత్రోత్సవాలలో లెక్కలేనన్ని అవార్డులు దక్కించుకుంది.
"ఇసుక తిన్నెల మీదనుంచి చూసినప్పుడు" అనే అర్థం గల ఈ సినిమా ముగ్గురు ఆప్ఘన్ మహిళల కళ్లలోంచి ఈ సమస్యలను పట్టి పరిశీలిస్తుంది. వారు ఓ డాక్టర్, ఓ టీచర్, ఓ హక్కుల కార్యకర్త. అంతర్జాతీయ శక్తులు పురికొల్పిన యుద్ధాల ద్వారా ఆప్ఘనిస్తాన్‌లో మూడు వేరువేరు ప్రభుత్వాల హయాంలో తమ జీవితాలు ఎంత హింసాత్మకంగా మారిందీ ఈ ముగ్గురు మహిళలూ కళ్లకు కట్టినట్లుగా చూపిస్తారు.
ఈ హింసా కొనసాగింపులో వారి జీవితాలు కదిలిపోయినప్పటికీ, తమ ఇళ్లు, తమ దేశం సైతం ధ్వంసం అయిపోయినప్పటికీ, ఈ ముగ్గురు మహిళలూ మొక్కవోని ధైర్యసాహసాలతో, చెరగని విశ్వాసంతో తమ చుట్టూ ఉన్న ప్రజల జీవితాలను మెరుగుపర్చడానికి తమ పనిలో కొనసాగుతున్న వైనాన్ని ఈ డాక్యుమెంటరీ చిత్రం అత్యద్భుతంగా చిత్రించింది.
వాయవ్య పాకిస్తాన్‌లోని శరణార్థి శిబిరాలలో, తర్వాత యుద్ధంతో ఛిన్నాభిన్నమైన కాబూల్ నగరంలో గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న పరిస్థితుల వివరణతో ప్రారంభమయ్యే ఈ చిత్రం గత 30 సంవత్సరాలుగా అంటే రాజు జహీర్ షా పాలన నుంచి మొదలై ప్రస్తుత హమీద్ కర్జాయ్ ప్రభుత్వం వరకు ఆప్ఘన్ మహిళల భయానకమైన, ఆలోచనలను రేకెత్తించే దుర్భర జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది.
కొనసాగుతున్న పోరాటంలో ఈ మహిళలు తమ శక్తినంతటినీ కూడదీసుకుని ఎలా నిలబడుతున్నారో ఈ చిత్రం అతి స్పష్టంగా చూపిస్తుంది. ఇప్పటికీ విభజించబడిన, పైశాచిక స్థితికి వెళ్లిన ఆప్ఘన్ జాతీయ చిత్రణను ఈ చిత్రం చూపరులను హత్తుకునేలా చూపించింది.
మొత్తం ప్రపంచం ఇప్పుడు మరో సంక్షోభం మీద దృష్టి పెడుతున్న నేపధ్యంలో, ఈ డాక్యుమెంటరీ ప్రాజెక్ట్ ఆప్ఘనిస్తాన్‌పై కెమెరాను సారించి ఆప్ఘన్‌లో జీవన సంఘర్షణలో మునిగి తేలుతున్న మహిళల విలువైన స్వరాలను ప్రపంచానికి గుర్తు చేస్తోంది.
30 సంవత్సరాల క్రమంలో యుద్ధంతో ఛిన్నాభిన్నమైన ఓ జాతిలో సగభాగం దుర్భరస్థితిని, మనోధైర్యాన్ని సజీవంగా చిత్రించిన ఈ లఘుచిత్రం "వ్యూ ప్రమ్ ఎ గ్రెయిన్ ఆఫ్ శాండ్" పలు అంతర్జాతీయ చిత్రోత్సవాలలో లెక్కలేనన్ని అవార్డులు దక్కించుకుంది.
చిత్ర దర్శకురాలు మీనా నాన్జి వివరాలు
ఈ చిత్ర దర్శకురాలు మీనా నాన్జి గత పదేళ్లుగా ఫిల్మ్ వీడియోలో పనిచేస్తున్నారు. తన ప్రయోగాత్మక చిత్ర నిర్మాణానికి గాను ఆమె అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. నేషనల్ ఎండోమెంట్ ఫర్ ది ఆర్ట్స్, రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్ మీడియా ఫెలోషిప్, ది లాస్ ఏంజెల్స్ కల్చరల్ ఎఫైర్స్ డిపార్ట్‌మెంట్, పాల్ రాబ్సన్ ఫండ్ గ్రాంట్, ఇండిపెండెంట్ ఫిల్మ్ వీడియో ప్రొడక్షన్ గ్రాంట్, వంటి పలు సంస్థలు ఈమె సృజనాత్మక ప్రతిభకు అవార్డులతో సత్కరించాయి.
ఆమె దర్శకత్వంలో వచ్చిన సినిమాలు అంతర్జాతీయ చిత్రోత్సవాలలో పలు అవార్డులను సాధించాయి. అలాగే అమెరికా, యూరోపియన్ టెలివిజన్లలో పిబిఎస్ స్టేషన్లద్వారా విస్తృత ప్రదర్శనకు నోచుకున్నాయి.
http://www.youtube.com/watch?v=2a9JUh6LtBg
మహాప్రస్థానం' మతలబులు
-
జూన్ పదిహేను మహాకవి శ్రీశ్రీ వర్ధంతి. శ్రీశ్రీ పేరు చెప్పగానే మనకు వెంటనే గుర్తువచ్చేది 'మహాప్రస్థానం'. అర్థ శతాబ్దం పైగా పూర్తి చేసుకున్న, తెలుగు కవిత్వ గతిని పూర్తిగా మార్చేసిన ఈ పుస్తకాన్ని గురించి నేను నోట్ చేసుకుని పెట్టుకొన్న కొన్ని పాఠకులకు ఆసక్తికరంగా ఉంటాయని ఈ క్రింద పొందుపరుస్తున్నాను:
* శ్రీశ్రీ 'మహాప్రస్థానం' గీతం మొట్టమొదట ముద్దుకౄష్ణ నడిపిన 'జ్వాలా పత్రికలో ప్రచురితమైంది ("మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది! పదండి ముందుకు, పదండి ముందుకు,పోదాం, పోదాం పైపైకి!" అని సాగుతుందీ గీతం)
* 'మహాప్రస్థానం' ప్రచురణకు శ్రీశ్రీకి ఆర్థిక సహాయం చేసింది, మచిలీపట్నం వాస్తవ్యుడైన ఆయన మిత్రుడు నళినీకుమార్ (అసలు పేరు ఉండవల్లి సూర్యనారాయణ). మదరాసులో ఉండగా శ్రీశ్రీకి అతడితో పరిచయమైంది.
* 'మహాప్రస్థానం' మొదటి ప్రచురణ 1950 జూన్ లో జరిగింది. ఇప్పటికిది మరో 23 ప్రచురణలు పొందింది (ఇది ఇటీవలే నేను కొన్న 'మహాప్రస్థానం' ప్రతిపైన ఉన్న వివరాల ఆధారంగా ఇచ్చిన సమాచారం. తప్పైతే సవరించండి)
* 'మహాప్రస్థానం' పుస్తకంలో మొత్తం 40 కవితలున్నాయి (కొంపెల్ల జనార్థనరావుకోసం రాసిన అంకిత గీతం కాకుండా)
* 'మహాప్రస్థానం'లోని గేయాలన్నీ 1933-1940 మధ్యకాలంలో రాసినవి ("నిజంగానే" "గర్జించు రష్యా" 1941లో, "నీడలు" 1947లో రాసినవి. అది (1930 దషకం) ఆకలి బాధలు, ఆర్థికమాంద్యం ప్రపంచాన్ని పీడిస్తున్న సమయం. ఈ దషాబ్దాన్ని (1930-40) చరిత్రకారులు "హుంగ్ర్య్ ఠిర్తిఎస్" అని అభివర్ణించారు.
* శ్రీశ్రీ తను ఆ కాలంలో రాసిన గేయాలన్నిటినీ ఈ సంపుటిలో చేర్చలేదు. ప్రపంచవ్యాప్తంగా మానవజాతి ఎదుర్కొంటున్న బాధలు ప్రధానేతివౄత్తంగా ఉండే గేయాల్నే చేర్చాడిందులో.
* శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని లండన్ లో స్థిరపడిన డాక్టర్ గూటాల కౄష్ణమూర్తి 'విదేశాంధ్ర ప్రచురణలా పేరుతో శ్రీశ్రీ సొంత దస్తూరిలో 1981లో విడుదల చేశారు. పుస్తకంతోపాటు శ్రీశ్రీతో స్వయంగా చదివించి రికార్డు చేసిన 'మహాప్రస్థానం' గీతాల క్యాసెట్టును కూడా విడుదల చేశారు. ఈ కౄషి వెనుక పురిపండా అప్పలస్వామి ప్రమేయం చాలా ఉంది.
* "మహాప్రస్థానం అన్న గీతం రాసేనాటికి నాకు మార్క్సిజం గురించి తెలియనే తెలియదు. నేను మార్క్సిజంను తెలుసుకున్నది సాహిత్యం ద్వారానేగాని, రాజకీయాలద్వారా కాదు." అని శ్రీశ్రీ 1970 ఫిబ్రవరిలో "సౄజన" పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పారు.
* 'మహాప్రస్థానానీకి చలంతో ముందుమాట (యోగ్యతాపత్రం) రాయించటానికి ప్రేరేపకుడు జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి (జరుక్ శాస్త్రి)
* 'మహాప్రస్థానం' సంపుటిలోని 'ప్రతిజ్ఞా గేయానికి మూలం లండన్ అభ్యుదయ రచయితల మానిఫెస్టో. దాని కాపీ ఒకటి అబ్బూరి రామకౄష్ణారావుగారు ఇస్తే అది చదవగానే ఆ స్ఫూర్తితో శ్రీశ్రీ ఈ గేయం రాశారు.
* 'దేశచరిత్రలూ గేయానికి 'జ్వాలా పత్రికలో ముద్దుకౄష్ణ రాసిన ఒక సంపాదకీయం ప్రేరణ (ఏ దేశచరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం...)
* 'మహాప్రస్థానం' ముందుమాటకి చలం పెట్టిన పేరు 'మహాప్రస్థానానికి జోహార్లూ అని. దాన్ని శ్రీశ్రీ 'యోగ్యతాపత్రం' అని మార్చుకున్నాడు. చలం అనుమతితోనే మరొక మార్పు కూడా చేశాడు. చలం రాసిన ముందుమాటలో 'శ్రీశ్రీ కవిత్వమూ, పాల్ రాబ్సన్ సంగీతమూ ఒకటేరకం అంటుంది సౌరిస్. ఆ రెంటికీ హద్దులూ, ఆజ్ఞలూ లేవు...' అని ఉంటుంది. నిజానికి చలం పాల్ రాబ్సన్ పేరు స్థానంలో 'సైగళ్ అని రాశాడు. సైగల్ పేరు తీసేసి, ఆ స్థానంలో పాల్ రాబ్సన్ పేరును చేర్చాడు శ్రీశ్రీ. పాల్ రాబ్సన్ అమెరికాలోని గొప్ప నీగ్రో గాయకుడు, వామపక్ష అభిమాని.
* శ్రీశ్రీ 'మహాప్రస్థానం' కవితా సంపుటిని హిందీలోకి డాక్టర్ సూర్యనారాయణ 'భానూ అనువదించారు. 1984లో ఇది ప్రచురింపబడింది.
* 'మహాప్రస్థానం'లోని 'చేదుపాటా కవితను జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి చదివి వింపించగా, చలం కన్నీళ్ళు పెట్టుకున్నాడట (ఔను నిజం, ఔను నిజం, ఔను నిజం, నీవన్నది, నీవన్నది, నీవన్నది నిజం, నిజం...)
* ఒక బహిరంగసభలో శ్రీశ్రీ చదివిన 'కవితా ఓ కవితా' అనే గేయాన్ని విష్వనాథ సత్యనారాయణ విని, పులకరించి, లేచి శ్రీశ్రీని కౌగిలించుకుని, ఆ గేయాన్ని నేనే ప్రచురిస్తానని వాగ్దానం చేశాడు. కాకపోతే ఆయన ఆ మాటను నిలబెట్టుకోలేకపోయాడు (కవితా! ఓ కవితా! నా యువకాశల నవపేశల సుమగీతావరణంలో...)
* శ్రీశ్రీ 'మహాప్రస్థానం' గేయాల్ని దేవులపల్లి, అడివి బాపిరాజు మొదలైన ప్రముఖులు బహిరంగసభల్లో ఆలాపించిన సందర్భాలు ఉన్నాయి.
* శ్రీశ్రీ తన సాహిత్య ప్రథమ గురువుగా చెప్పుకున్న అబ్బూరి రామకౄష్ణారావుగారు 1956లో తన మహాప్రస్థాన రచనావిధానాన్ని, అందులో ప్రతిపాదించిన సిద్ధాంతాలనూ వెక్కిరిస్తూ, ఖండిస్తూ ఓ కవిత రాశాడు (ఇది కేంద్ర సాహిత్య అకాడెమీ శ్రీశ్రీపై ప్రచురించిన మోనోగ్రాఫ్ లో బూదరాజు రాధాకౄష్ణగారు రాశారు, కాని, ఆ కవిత ఏమిటో చెప్పలేదు. ఎవరైనా సేకరిస్తే బాగుంటుంది)
* కొసమెరుపు - 'మహాప్రస్థానం' గేయాల్ని మొదట 'భారతీ పత్రికకు పంపిస్తే అవి తిరిగొచ్చాయి.
['మహాప్రస్థానం' లోని గీతాలను చాలా తెలుగు సినిమాల్లో ఉపయోగించుకున్నారు. వాటి వివరాలు ఎవరైనా సేకరించి ఉంటే తెలుపగలరు]
జూన్ పదిహేను మహాకవి శ్రీశ్రీ వర్ధంతి. శ్రీశ్రీ పేరు చెప్పగానే మనకు వెంటనే గుర్తువచ్చేది 'మహాప్రస్థానం'. అర్థ శతాబ్దం పైగా పూర్తి చేసుకున్న, తెలుగు కవిత్వ గతిని పూర్తిగా మార్చేసిన ఈ పుస్తకాన్ని గురించి నేను నోట్ చేసుకుని పెట్టుకొన్న కొన్ని పాఠకులకు ఆసక్తికరంగా ఉంటాయని ఈ క్రింద పొందుపరుస్తున్నాను:
* శ్రీశ్రీ 'మహాప్రస్థానం' గీతం మొట్టమొదట ముద్దుకౄష్ణ నడిపిన 'జ్వాలా పత్రికలో ప్రచురితమైంది ("మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది! పదండి ముందుకు, పదండి ముందుకు,పోదాం, పోదాం పైపైకి!" అని సాగుతుందీ గీతం)
* 'మహాప్రస్థానం' ప్రచురణకు శ్రీశ్రీకి ఆర్థిక సహాయం చేసింది, మచిలీపట్నం వాస్తవ్యుడైన ఆయన మిత్రుడు నళినీకుమార్ (అసలు పేరు ఉండవల్లి సూర్యనారాయణ). మదరాసులో ఉండగా శ్రీశ్రీకి అతడితో పరిచయమైంది.
* 'మహాప్రస్థానం' మొదటి ప్రచురణ 1950 జూన్ లో జరిగింది. ఇప్పటికిది మరో 23 ప్రచురణలు పొందింది (ఇది ఇటీవలే నేను కొన్న 'మహాప్రస్థానం' ప్రతిపైన ఉన్న వివరాల ఆధారంగా ఇచ్చిన సమాచారం. తప్పైతే సవరించండి)
* 'మహాప్రస్థానం' పుస్తకంలో మొత్తం 40 కవితలున్నాయి (కొంపెల్ల జనార్థనరావుకోసం రాసిన అంకిత గీతం కాకుండా)
* 'మహాప్రస్థానం'లోని గేయాలన్నీ 1933-1940 మధ్యకాలంలో రాసినవి ("నిజంగానే" "గర్జించు రష్యా" 1941లో, "నీడలు" 1947లో రాసినవి. అది (1930 దషకం) ఆకలి బాధలు, ఆర్థికమాంద్యం ప్రపంచాన్ని పీడిస్తున్న సమయం. ఈ దషాబ్దాన్ని (1930-40) చరిత్రకారులు "హుంగ్ర్య్ ఠిర్తిఎస్" అని అభివర్ణించారు.
* శ్రీశ్రీ తను ఆ కాలంలో రాసిన గేయాలన్నిటినీ ఈ సంపుటిలో చేర్చలేదు. ప్రపంచవ్యాప్తంగా మానవజాతి ఎదుర్కొంటున్న బాధలు ప్రధానేతివౄత్తంగా ఉండే గేయాల్నే చేర్చాడిందులో.
* శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని లండన్ లో స్థిరపడిన డాక్టర్ గూటాల కౄష్ణమూర్తి 'విదేశాంధ్ర ప్రచురణలా పేరుతో శ్రీశ్రీ సొంత దస్తూరిలో 1981లో విడుదల చేశారు. పుస్తకంతోపాటు శ్రీశ్రీతో స్వయంగా చదివించి రికార్డు చేసిన 'మహాప్రస్థానం' గీతాల క్యాసెట్టును కూడా విడుదల చేశారు. ఈ కౄషి వెనుక పురిపండా అప్పలస్వామి ప్రమేయం చాలా ఉంది.
* "మహాప్రస్థానం అన్న గీతం రాసేనాటికి నాకు మార్క్సిజం గురించి తెలియనే తెలియదు. నేను మార్క్సిజంను తెలుసుకున్నది సాహిత్యం ద్వారానేగాని, రాజకీయాలద్వారా కాదు." అని శ్రీశ్రీ 1970 ఫిబ్రవరిలో "సౄజన" పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పారు.
* 'మహాప్రస్థానానీకి చలంతో ముందుమాట (యోగ్యతాపత్రం) రాయించటానికి ప్రేరేపకుడు జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి (జరుక్ శాస్త్రి)
* 'మహాప్రస్థానం' సంపుటిలోని 'ప్రతిజ్ఞా గేయానికి మూలం లండన్ అభ్యుదయ రచయితల మానిఫెస్టో. దాని కాపీ ఒకటి అబ్బూరి రామకౄష్ణారావుగారు ఇస్తే అది చదవగానే ఆ స్ఫూర్తితో శ్రీశ్రీ ఈ గేయం రాశారు.
* 'దేశచరిత్రలూ గేయానికి 'జ్వాలా పత్రికలో ముద్దుకౄష్ణ రాసిన ఒక సంపాదకీయం ప్రేరణ (ఏ దేశచరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం...)
* 'మహాప్రస్థానం' ముందుమాటకి చలం పెట్టిన పేరు 'మహాప్రస్థానానికి జోహార్లూ అని. దాన్ని శ్రీశ్రీ 'యోగ్యతాపత్రం' అని మార్చుకున్నాడు. చలం అనుమతితోనే మరొక మార్పు కూడా చేశాడు. చలం రాసిన ముందుమాటలో 'శ్రీశ్రీ కవిత్వమూ, పాల్ రాబ్సన్ సంగీతమూ ఒకటేరకం అంటుంది సౌరిస్. ఆ రెంటికీ హద్దులూ, ఆజ్ఞలూ లేవు...' అని ఉంటుంది. నిజానికి చలం పాల్ రాబ్సన్ పేరు స్థానంలో 'సైగళ్ అని రాశాడు. సైగల్ పేరు తీసేసి, ఆ స్థానంలో పాల్ రాబ్సన్ పేరును చేర్చాడు శ్రీశ్రీ. పాల్ రాబ్సన్ అమెరికాలోని గొప్ప నీగ్రో గాయకుడు, వామపక్ష అభిమాని.
* శ్రీశ్రీ 'మహాప్రస్థానం' కవితా సంపుటిని హిందీలోకి డాక్టర్ సూర్యనారాయణ 'భానూ అనువదించారు. 1984లో ఇది ప్రచురింపబడింది.
* 'మహాప్రస్థానం'లోని 'చేదుపాటా కవితను జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి చదివి వింపించగా, చలం కన్నీళ్ళు పెట్టుకున్నాడట (ఔను నిజం, ఔను నిజం, ఔను నిజం, నీవన్నది, నీవన్నది, నీవన్నది నిజం, నిజం...)
* ఒక బహిరంగసభలో శ్రీశ్రీ చదివిన 'కవితా ఓ కవితా' అనే గేయాన్ని విష్వనాథ సత్యనారాయణ విని, పులకరించి, లేచి శ్రీశ్రీని కౌగిలించుకుని, ఆ గేయాన్ని నేనే ప్రచురిస్తానని వాగ్దానం చేశాడు. కాకపోతే ఆయన ఆ మాటను నిలబెట్టుకోలేకపోయాడు (కవితా! ఓ కవితా! నా యువకాశల నవపేశల సుమగీతావరణంలో...)
* శ్రీశ్రీ 'మహాప్రస్థానం' గేయాల్ని దేవులపల్లి, అడివి బాపిరాజు మొదలైన ప్రముఖులు బహిరంగసభల్లో ఆలాపించిన సందర్భాలు ఉన్నాయి.
* శ్రీశ్రీ తన సాహిత్య ప్రథమ గురువుగా చెప్పుకున్న అబ్బూరి రామకౄష్ణారావుగారు 1956లో తన మహాప్రస్థాన రచనావిధానాన్ని, అందులో ప్రతిపాదించిన సిద్ధాంతాలనూ వెక్కిరిస్తూ, ఖండిస్తూ ఓ కవిత రాశాడు (ఇది కేంద్ర సాహిత్య అకాడెమీ శ్రీశ్రీపై ప్రచురించిన మోనోగ్రాఫ్ లో బూదరాజు రాధాకౄష్ణగారు రాశారు, కాని, ఆ కవిత ఏమిటో చెప్పలేదు. ఎవరైనా సేకరిస్తే బాగుంటుంది)
* కొసమెరుపు - 'మహాప్రస్థానం' గేయాల్ని మొదట 'భారతీ పత్రికకు పంపిస్తే అవి తిరిగొచ్చాయి.
['మహాప్రస్థానం' లోని గీతాలను చాలా తెలుగు సినిమాల్లో ఉపయోగించుకున్నారు. వాటి వివరాలు ఎవరైనా సేకరించి ఉంటే తెలుపగలరు]
విశ్వనాథ్ బాబు
హనుమప్ప విశ్వనాథ్ బాబు (1903-1968) 1930వ దశకములో ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు. సరస్వతి టాకీస్ అనే చిత్రనిర్మాణ సంస్థను ప్రారంభించి అనేక తెలుగు సినిమాలు నిర్మించాడు. విశ్వనాథ్ బాబు మార్చి 27, 1903న బెంగుళూరులో జన్మించాడు. ఈయన బావ హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వం వహించిన తొలి తమిళ టాకీ సినిమా కాళిదాసులో నటించాడు.
చిత్ర సమాహారం
* దేవసుందరి
* ఆదర్శం (1952 సినిమా)
* ధర్మాంగద
* కృష్ణప్రేమ
* భోజ కాళిదాసు
* ద్రౌపదీ వస్త్రాపహరణం
* కనకతార (1937 సినిమా)
హెచ్.ఎమ్.రెడ్డి
తొలి తెలుగు సినిమా ‘భక్త ప్రహ్లాద’, తొలి తమిళ టాకీ చిత్రం కాళిదాసు తీసినవారు హెచ్.ఎమ్.రెడ్డి. ఆయన పూర్తిపేరు హనుమప్ప మునియప్ప రెడ్డి. హెచ్.ఎమ్.రెడ్డి బెంగుళూరులో పుట్టి పెరిగి, అక్కడే విద్యాభ్యాసం పూర్తిచేసుకున్నాడు. బెంగుళూరులో పోలీసుగా పనిచేశాడు.[1]
ఆయన హైదరాబాదు జాగీర్దార్ కాలేజీలో ఇంగ్లీషు టీచరుగా పనిచేసేవారు. 1927లో ప్లేగువ్యాధి ప్రబలినపుడు చాలా కుటుంబాల వలెనే వూరువిడచి బొంబాయి వెళ్ళారు. తన బావమరిది హెచ్.వి.బాబు అండలో సినిమా రంగంలో ప్రవేశించారు. అక్కడక్కడా వేషాలు వేస్తూ సినిమా టెక్నిక్‌ను కొంతవరకూ అర్థం చేసుకున్నారు.
1930లో ఇంపీరియల్ కంపెనీకి ‘విజయకుమార్’, 1931లో ‘ఎ వేజర్ ఇన్ లవ్’ అన్న రెండు మూకీలను హెచ్.ఎమ్.రెడ్డి డైరెక్ట్ చేశారు. రెండు చిత్రాల్లోనూ పృథ్వీరాజ్ కపూర్ ముఖ్యపాత్రధారి. అలా - శబ్దరహిత చిత్రాలు తీసి హెచ్.ఎమ్.రెడ్డి, 1931లో శబ్దసహిత చిత్రాలు తీశారు. హిందీలో తొలి టాకీ ‘ఆలం ఆరా’ అర్దేషిర్ ఇరానీ తీశాడు. ఆయనకి తెలుగులోనూ, తమిళంలోనూ కూడా చిత్రాలు తియ్యాలనిపించింది. హెచ్.ఎమ్.రెడ్డి తెలుగువాడు గనక ‘భక్తప్రహ్లాద’ని ఆయనకు అప్పజెప్పారు. అలాగే ‘కాళిదాసు’ కూడా తమిళంలో తీశారు రెడ్డి.
హిందీ, తెలుగు, తమిళం మూడు భాషల చిత్రాలూ 1931 లోనే విడుదలైనాయి. ‘ఆలం ఆరా’ మార్చి 14న విడుదలైంది. ‘భక్త ప్రహ్లాద’ సెప్టెంబరు 15న విడుదలయ్యింది. అలా హెచ్.ఎమ్.రెడ్డి టాకీయుగానికి నాంది పలికి, ‘పితామహుడు’అనిపించుకున్నారు.
రెడ్డిగారిని ‘టైగర్’ అనేవారు. మీసం మీద చెయ్యి వేసి ఈ పక్కా ఆ పక్కా దువ్వి ‘ఇది తమిళం ఇది తెలుగు’ అని దర్జాగా, గర్వంగా చెప్పుకోగల ఘనుడు హెచ్.ఎమ్.రెడ్డి. తర్వాత ‘సీతాస్వయంవరం’ (1933) చిత్రం హిందీలో తీశారు. రెడ్డి కొల్హాపూర్‌లో వున్నప్పుడు పారుపల్లి శేషయ్య, కూరుకూరు సుబ్బారావు ‘ద్రౌపదీ వస్త్రాపహరణం’ (1936) తియ్యాలని, ఆయన సహాయం కోరారు. హెచ్.వి. బాబు చేత ఆయన దర్శకత్వం చేయించి - తాను పర్యవేక్షణ చేసి పూర్తి చేయించారు. ఆ చిత్రం విజయవంతమైంది. గూడవల్లి రామబ్రహ్మం ఈ సినిమాకి ప్రొడక్షన్ మేనేజరుగా సినిమా రంగప్రవేశం చేశారు. అంతకుముందు రెడ్డిగారు తీసిన ‘ప్రహ్లాద’ నుంచి కొన్ని చిత్రాల వరకు ఎల్.వి.ప్రసాద్ సహాయకుడుగా పని చేశారు.
రోహిణి పిక్చర్స్ పేరిట బి.ఎన్.రెడ్డి లాంటి వారిని కలుపుకుని ‘గృహలక్ష్మి’ (1938) తీసి ‘సాంఘిక పతాకం’ ఎగరవేశారు రెడ్డి. రోహిణి స్థిరపడింది, భాగస్వాములు విడిపోయి ‘వాహిని పిక్చర్స్’ స్థాపిస్తే అదీ స్థిరపడింది. రెడ్డిగారు ‘నిర్దోషి’ (1951) తీసిన తర్వాత రోహిణి స్టూడియో కట్టారు మద్రాసులో. ప్రయోగాలు చెయ్యడంలో కూడా హెచ్.ఎమ్.దిట్ట. అంతవరకూ విలన్ వేషాలే వేస్తున్న ముక్కామలని ‘నిర్దోషి’లో హీరోని చేశారు. వాంప్ వేషాలు ఎక్కువగా వేసిన అంజలీదేవిని నిర్దోషి (1951) తో హీరోయిన్‌ని చేశారు. ‘నిర్దోషి’ లో ఓ చిన్నవేషంలో కనిపించిన కాంతారావుని ‘ప్రతిజ్ఞ’తో హీరోని చేశారు. అలాగే ‘ప్రతిజ్ఞ’ లో విలన్ రాజనాలకు అదే తొలిచిత్రం.
కమలాకర కామేశ్వరరావు, సదాశివబ్రహ్మం, కొండముది గోపాలరాయశర్మ, మల్లాది వెంకటకృష్ణశర్మ, కొవ్వలి, భమిడిపాటి కామేశ్వరరావు, శ్రీశ్రీ - ఇలా ఎందరో మహామహులను వెండితెరకు పరిచయంచేసిన ఘనులు హెచ్.ఎమ్.రెడ్డి.
సుకుమార్
సుకుమార్ తెలుగు చలనచిత్ర దర్శకుడు. దర్శకుడు కాక ముందు గణితం భోధించే అధ్యాపకులు. ఇతని మొదటి చిత్రం ఆర్య సంచలన విజయం సాధించి అల్లు అర్జున్ ను స్టార్ గా నిలబెట్టింది. రెండవ చిత్రం జగడం టేకింగ్ పరంగా వైవిధ్యం చూపి విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. మూడవ చిత్రం ఆర్య2
ఎస్.బాలచందర్
గా ప్రసిద్ధిచెందిన సుందరం బాలచందర్ (జ: 18 జనవరి 1927 – మ: 15 ఏప్రిల్ 1990) సుప్రసిద్ధ వీణా విద్వాంసులు మరియు దక్షిణ భారత సినిమా దర్శకుడు మరియు నటుడు.
ఇతడు తెలుగులో దర్శకత్వం వహించిన ఏది నిజం (1956) సినిమాకు రాష్ట్రపతి ప్రశంసా పత్రం లభించింది.
సింగీతం శ్రీనివాసరావు
సింగీతం శ్రీనివాసరావు (Singeetham Srinivasa Rao) ప్రతిభాశాలురైన సినిమా దర్శకులలో ఒకరు. తెలుగు, తమిళం, కన్నడ భాషలలో సందేశాత్మకమైవీ, ప్రయోగాత్మకమైనవీ, కధాభరితమైనవీ - ఇలా వైవిధ్యం గల పెక్కు సినిమాలకు దర్శకత్వం వహించి ఆయన ప్రేక్షకులనూ, విమర్శకులనూ మెప్పించాడు. మయూరి,పుష్పక విమానం,ఆదిత్య 369, మైఖేల్ మదన్ కామరాజు కధ వంటి వైవిధ్యము గల సినిమాలకు దర్శకత్వము వహించాడు. ఇంకా ఆయన మంచి సంగీత దర్శకుడు,కథకుడు కూడా.
జననం సెప్టెంబరు 21, 1931
ఉదయగిరి, నెల్లూరు జిల్లా
ప్రాముఖ్యత సినిమా దర్శకుడు
వృత్తి సినిమా దర్శకుడు, రచయిత
తండ్రి రామచంద్రరావు
తల్లి శకుంతలాబాయి
జీవిత విశేషాలు
సింగీతం శ్రీనివాసరావు 1931 సెప్టెంబరు 21న నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జన్మించాడు. తండ్రి ఒక హెడ్‌మాస్టరు. తల్లి వయొలిన్ వాయిద్య నిపుణురాలు. చెన్నై ప్రెసిడెన్సీ కాలేజీలో చదివేప్పుడు శ్రీనివాసరావుకు హరీంద్రనాద ఛటోపాధ్యాయ పర్వేక్షణలో నాటకరంగంలో ప్రవేశం ఏర్పడింది. డిగ్రీ వచ్చిన తరువాత సూళ్ళూరుపేటలో ఉపాధ్యాయవృత్తి సాగించాడు. స్వయంగా రచించిన నాటకాలు (బ్రహ్మ, అంత్యఘట్టం) తన విద్యార్ధులతో ప్రదర్శింపజేశాడు. రవీంద్రనాధ టాగూరు నాటకం "చిత్ర"ను "చిత్రార్జున" అనే సంగీతనాటకంగా రూపొందించి ప్రదర్శించి ప్రశంసలు అందుకొన్నాడు. ఈ నాటకాన్ని ఢిల్లీలో జవహర్ లాల్ నెహ్రూ చూశాడు. 'టామ్ బుచాన్' అనే స్కాటిష్ నాటకకారుడు ఈ నాటకాన్ని ఆంగ్లంలోకి అనువదించి ఒక అమెరికన్ టెలివిజన్ ఛానల్‌లో ప్రసారం చేశాడు. కొంతకాలం శ్రీనివాసరావు "తెలుగు స్వతంత్ర" పత్రికలో రచనలు (ప్రధానంగా ఇంటర్వ్యూలు) చేశాడు.
సినిమా రంగం
కానీ చలనచిత్ర రంగం శ్రీనివాసరావుకు ప్రధాన ధ్యేయం. పట్టు వదలకుండా సుప్రసిద్ధ దర్శకుడు కె.వి.రెడ్డి వెంటబడి ఆయనకు అనుచరునిగా పనిచేయడం మొదలుపెట్టాడు. మాయాబజార్ చిత్రంతో మొదలుపెట్టి చాలా చిత్రాలలో కె.వి.రెడ్డి చేతిక్రింద పనిచేశాడు. పట్టాభి రామిరెడ్డి కన్నడంలో యు.ఆర్.అనంతమూర్తి నవల ఆధారంగా సంస్కార సినిమా తీయ సంకల్పించినపుడు శ్రీనివాసరావును ఎక్సిక్యూటివ్ డైరెక్టరుగా తీసుకొన్నాడు. ఈ సినిమాకు రాష్ట్రపతి బంగారు పతకం లభించింది.
1972లో సింగీతం పూర్తి దర్శకత్వం వహించిన నీతి నిజాయితీ సినిమాను విమర్శకులు ప్రశంసించారుగాని ఆర్ధికంగా విఫలమయ్యింది. 1975లో తీసిన 'జమీందారుగారి అమ్మాయి' ఆయన మొదటి విజయవంతమైన చిత్రం. కాని 1976లో వచ్చిన అమెరికా అమ్మాయి అన్ని వర్గాల ప్రేక్షకులనూ మెప్పిచడమే గాక సంగీత పరంగా మంచి విజయం సాధించింది. ఆ కోవలోనే పంతులమ్మ విజయవంతమైంది. ఆ తరువాత సింగీతం విజయ పరంపర, ప్రయోగ పరంపర సమాంతరంగా సాగాయి.
ముఖ్యంగా కమల్ హాసన్‌తో సింగీతం సొమ్మొకడిది సోకొకడిది సినిమాతో ఆరంభించి పలు చిత్రాలను విజయవంతంగా తీశాడు. వాటిలో మైఖేల్ మదన కామరాజు కధ, అమావాస్య చంద్రుడు, అపూర్వ సహోదరులు ముఖ్యమైనవి.
సందేశాత్మకంగా తీసిన చిత్రాలలో తరం మారింది ముఖ్యమైంది. డైలాగులు లేకుండా తీసిన పుష్పక విమానం అన్ని "భాషలలో" ప్రదర్శించారు. మయూరి సినిమాలో "సుధా చంద్రన్" చరిత్రను సున్నితంగా తెరకెక్కించాడు. తెలుగులో వచ్చిన కొద్ది సైన్స్ ఫిక్షన్ సినిమాలలో ఆదిత్య 369 ఒకటి. భైరవద్వీపం సినిమాతో ప్రేక్షకులు మరచిపోతున్న జానపదచిత్రాలను గుర్తు చేశాడు. కన్నడంలో రాజకుమార్ ప్రధాన చిత్రాలలో 'శ్రావణబంతు' ఒకటి.
సంగీత దర్శకునిగా
సింగీతం శ్రీనివాసరావు ప్రసిద్ధ సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావుకు శిష్యుడు. 'భాగ్యద లక్ష్మి బారమ్మ', 'సంయుక్త' అనే రెండు విజయవంతమైన కన్నడ చిత్రాలకు శ్రీనివాసరావు సంగీత దర్శకుడు. ప్రవాస భారతీయుల పిల్ల సౌకర్యార్ధం 30 శ్లోకాలను ఆంగ్లంలో సంగీతపరంగా కూర్చాడు.
సినిమాల జాబితా
* ముంబై ఎక్స్‌ప్రెస్ (2005)
* Son of Alladin (2003)- 3D యానిమేషన్ చిత్రం.
* Little John (2002)
* ఆకాశ వీధిలో (2001)
* శ్రీకృష్ణార్జున యుద్ధం (1996)
* చిన్న వతియార్ (1995)
* భైరవద్వీపం(1994)
* ఆడవాళ్ళకు మాత్రమే (1994)
* మేడమ్(1993)
* ఫూల్ (1993)
* బృందావనం(1992)
* క్షీరసాగర (1992)
* ఆదిత్య 369 (1991)
* మైకేల్ మదన కామరాజు కధ(1991)
* అపూర్వ సహోదరులు (1989) ( తమిళం: అపూర్వ సహోదరగళ్, హిందీ: అప్పూరాజా)
* చిరంజీవి సుధాకర (1988)
* దేవతా మనుష్య (1988)
* పుష్పక విమానం (1988) - డైలాగులు లేని సినిమా, కనుక అన్ని భాషలలోనూ విడుదలయ్యింది
* అమెరికా అబ్బాయి (1987)
* ఆనంద(1986)
* మయూరి (1984)
* శ్రావణ బంతు(1984)
* చెలిసువ మొదగళు(1982)
* Nancy (1981)
* అమావాస్య చంద్రుడు (తమిళం: రాజా పారవై) (1981)
* త్రిలోక సుందరి
* మంగళ తోరణాలు(1979)
* గమ్మత్తు గూఢచారులు (1978)
* రామచిలుక (1978)
* సొమ్మొకడిది సోకొకడిది (1978)
* అందమె ఆనందం (1977)
* నిరపరయుమ్ నిలవిక్కుమ్ (1977)
* పంతులమ్మ (1977)
* తరం మారింది (1977)
* అమెరికా అమ్మాయి (1976)
* ఒక దీపం వెలిగింది(1976)
* జమీందారు గారి అమ్మాయి (1975)
* దిక్కట్ర పార్వతి (1973)
* నీతి నిజాయితి (1972)
సి.పుల్లయ్య
చిత్తజలు పుల్లయ్య మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు. ఇతను 1898లో కాకినాడలో జన్మించాడు. 1967 అక్టోబర్ 6న మద్రాసులో మరణించాడు. రఘుపతి వెంకయ్య, అతని కుమారుడు రఘుపతి ప్రకాష్ దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి సినిమా నిర్మాణ సంస్థ 'స్టార్ ఆఫ్ ది ఈస్ట్' ను స్థాపించారు. 1921లో భీష్మ ప్రతిజ్ఞ మూగచిత్రాన్ని నిర్మించారు (ఇది మూగచిత్రం గనుక "మొదటి తెలుగువాడి సినిమా" అనడం ఉచితం). ప్రకాష్ దర్శకత్వం వహించడమే కాకుండా ఈ చిత్రంలో భీష్ముని పాత్రను కూడా పోషించారు. 'డి కాస్టెల్లో' (De Castello) అనే ఆంగ్ల యువతి గంగ పాత్రను ధరించింది. తరువాత ప్రసిద్ధులైన సి.పుల్లయ్య, వై.వి.రావులూ ప్రకాష్ అనుచరులుగా తమ సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు.
] దర్శకత్వం వహించిన తెలుగు సినిమాలు
* భువన సుందరి కథ (1967)
* భామావిజయం (1967)
* పరమానందయ్య శిష్యుల కథ (1966)
* లవకుశ (1963) కొంత భాగం తీసిన తరువాత పుల్లయ్య ఆరోగ్యం క్షీణించింది. సుందర్ లాల్ నహతా, బి.ఎన్.రెడ్డి ల ప్రోత్సాహంతో సి.పుల్లయ్య కుమారుడైన సి.యస్.రావు దర్శకత్వబాధ్యత చేపట్టి మిగిలిన భాగం పూర్తి చేశాడు..
* దేవాంతకుడు (1960)
* పక్కింటి అమ్మాయి (1953)
* సంక్రాంతి (1952)
* అపూర్వ సహోదరులు (1950)
* వింధ్యరాణి (1948)
* గొల్లభామ (1947)
* నారద నారది (1946)
* బాలనాగమ్మ (1942)
* మాలతీ మాధవం (1940)
* వరవిక్రయం (1939)
* మోహినీ భస్మాసుర (1938)
* సత్యనారాయణ వ్రతం (1938)
* చల్ మోహనరంగ (1937)
* దశావతారములు (1937)
* కాసుల పేరు (1937)
* అనసూయ (1936)
* ధ్రువ (1936)
* శ్రీకృష్ణ తులాభారం (1935)
* లవకుశ (1934 సినిమా) (1963)
* రామదాసు (1933)
* సావిత్రి (1933)
కొమ్మారెడ్డి సావిత్రి
తెలుగు సినీ ప్రపంచం లో మహానటి కొమ్మారెడ్డి సావిత్రి (1936 జనవరి 4 - 1981 డిసెంబర్ 26) . తెలుగు తమిళ సినిమాల్లో కూడా నటించి, మహానటి అనిపించుకుని, తరాల తరువాత కూడా ఆరాధింపబడుతూంది. ఈమె కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించి నిర్మించింది.
తొలి జీవితం
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలంలోని చిర్రావూరు గ్రామంలో 1936 జనవరి 4 న నిశ్శంకర గురవయ్య, సుభద్రమ్మ దంపతులకు జన్మించింది. వారికి సావిత్రి రెండవ సంతానం, 1934లో ఆడపిల్ల పుట్టగా మారుతి అని నామకరణం చేశారు. సావిత్రికి ఆరు నెలలు నిండగానే టైఫాయిడ్ కారణంగా తండ్రి మరణించాడు. గురవయ్య మరణంతో సుభద్రమ్మ విజయవాడలోని తన అక్క అయిన దుర్గాంబ ఇంటికి మకాం మార్చింది. దుర్గాంబ భర్త పేరు కొమ్మారెడ్డి వెంకట్రామయ్య చౌదరి, సావిత్రికి వరుసకు పెద్దనాన్న. మారుతి, సావిత్రి విజయవాడలోని కస్తూరిబాయి మెమోరియల్ స్కూలులో చెరారు. పాఠశాలకు వెళ్ళే దారిలో నృత్యవిద్యాలయం ఉండేది. రోజూ ఇతరులు నాట్యం చేయటం చూసి శిష్ట్లా పూర్ణయ్య శాస్త్రి దగ్గర సంగీతం మరియూ శాస్త్రీయ నృత్యం నేర్చుకొని విజయవాడలో తన చిన్నతనంలోనే ప్రదర్శనలు ఇచ్చింది. కొంతకాలం ఎన్టీఆర్, జగ్గయ్య తదితరులు నడుపుతున్న నాటకాల కంపెనీలో పనిచేసి, అనంతరం స్వయంగా పెదనాన్న నడిపిన నాట్య మండలిలో కూడా నటించింది. బుచ్చిబాబు రాసిన ఆత్మవంచన అనే నాటకంలో కూడా నటించింది.
చలనచిత్ర జీవితం
పెదనాన్న ప్రోద్బలంతో సినిమా రంగం వైపు దృష్టి సారించి ఎన్నో కష్టాలనోర్చి తిరుగులేని అభినేత్రి గా విరాజిల్లింది. ఎల్వీ ప్రసాద్ దర్శకత్వం వహించిన సంసారం సినిమాలో చిన్న పాత్ర పొంది, ఆనక ఆ పాత్రకు తగ్గ వయసు లేదని అందులోనుండి తొలగింపబడింది. ఆ తరువాత కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన పాతాళ భైరవిలో ఒక చిన్న పాత్రలో నటించింది. పెళ్ళిచేసిచూడు ఆమె సినీ జీవితంలో ఒక మలుపు. కాని అందులో ఆమె రెండో కథానాయిక పాత్రకే పరిమితం కావలసి వచ్చింది. తన నటనా ప్రతిభను నిరూపించుకోవటానికి ఆమె, నృత్యరూపకుడు మరియూ దర్శకుడూ అయిన వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించిన దేవదాసు సినిమా వరకూ ఆగవలసి వచింది. ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో మిస్సమ్మ లో ప్రధానపాత్ర పోషించింది. ఆ చిత్రంతో ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా స్థిరపడింది. ఆ తరువాత వచ్చిన దొంగరాముడు, అర్థాంగి, చరణదాసి ఆమె స్థానాన్ని పదిలపరచాయి.1957 లో వచ్చిన తెలుగు చిత్ర చరిత్ర లోనే అజరామరం అనదగిన మాయాబజార్ చిత్రంలో ఆమె ప్రదర్శించిన అసమాన నటనా వైదుష్యం ఆమె కీర్తి పతాకంలో ఒక మణిమకుటం. అది మొదలు యెన్నో వైవిధ్యమైన పాత్రలను తనకే సాధ్యమైన రీతిలో పోషించి వాటికి ప్రాణ ప్రతిష్ట చేసింది.
ఆమె తమిళ చిత్రాలలోనూ నటించి పేరుతెచ్చుకుంది. తమిళంలోనూ మహానటి (నడిగెయర్ తిలగం) బిరుదు పొందింది. 1968 లో చిన్నారి పాపలు సినిమాకు దర్శకత్వం వహించింది. ఈ సినిమా కు ఒక ప్రత్యేకత వుంది. బహుశా దక్షిణ భారత దేశంలోనే తొలిసారిగా దాదాపు పూర్తిగా మహిళలచే నిర్మింపబడిన చిత్రంగా ప్రత్యేకత సంతరించుకున్నది . అయితే అది అంత విజయం సాధించలేదు. ఆ తరువాత చిరంజీవి,మాతృదేవత, వింత సంసారం మొదలగు సినిమాలకు దర్శకత్వం వహించింది. 1956లో అప్పటికే రెండు పెళ్ళిళ్ళయిన తమిళ నటుడు జెమినీ గణేశన్ ను పెళ్ళిచేసుకుంది. వారికి ఒక కుమార్తె, ఒక కుమారుడు - విజయ చాముండేశ్వరి, సతీష్ కుమార్. అయితే ఆ పెళ్ళి విఫలమైంది. ఆస్తిపాస్తులు కోల్పోయి, తాగుడుకు, మత్తుమందులకు, నిద్రమాత్రలకు బానిసై, 1981 డిసెంబర్ 26 న మరణించింది.
ఇతర విశేషాలు
అభిమానులు, ప్రచారసాధనాలు సావిత్రి జన్మదినాన్ని డిసెంబరు 6 గా జరుపుకుంటాయి. మల్లెపూలు, వర్షం సావిత్రికి ఇష్టమైనవి. ఆమెది ఎడమ చేతివాటం. క్రికెట్, చదరంగం ఆటలను బాగా ఇష్టపడేది. చెన్నైలో క్రికెట్ మ్యాచ్ ఉంటే ఆమె తప్పక చూసేది. వెస్టిండీస్ ప్రముఖ ఆటగాడు "గ్యారీ సోబర్స్" కు సావిత్రి అభిమాని. ఆ రోజుల్లోనే శివాజీగణేశన్ తోపాటు తారల క్రికెట్లో పాల్గొనేది. ఆమె వద్ద ఏనుగు దంతంతో చేసిన చదరంగం బల్లకూడా ఉండేది. సావిత్రి మంచి చమత్కారి, అంతే కాదు ఇతరులను అనుకరించటంలో కూడా దిట్ట. ఆమె తన భర్త జెమినీ గణేశన్ను, రేలంగిని, బి.సరోజాదేవిని, ఎస్వీ రంగారావుని, ఇంకా అనేకమందిని తరుచూ అనుకరించేది. దానధర్మాల విషయంలో అమెది ఎముకలేని చెయ్యి. ఒకసారి నిండుగా నగలతో అలంకరించుకుని ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి ని కలిసేందుకు వెళ్ళి, అక్కడ మొత్తం నగలన్నిటినీ వలిచి ప్రధానమంత్రి సహాయ నిధికి దానమిచ్చేసింది.
నటిగా
1. సంసారం (1950)
2. అగ్నిపరీక్ష (1951)
3. పాతాళభైరవి (1951)లో నృత్యకారిణి
4. పెళ్ళిచేసి చూడు (1952)లో సావిత్రి
5. పల్లెటూరు (1952)లో సుగుణ
6. ప్రతిజ్ఞ (1953)
7. దేవదాసు (1953)లో పార్వతి
8. బ్రతుకుతెరువు (1953)లో జమీందారుగారి కూతురు
9. మేనరికం (1954)
10. చంద్రహారం (1954)లో చంచల
11. బహుత్ దిన్ హుయే (1954) (హిందీ సినిమా)
12. పరివర్తన (1954)లో సుందరమ్మ
13. వదిన (1955)
14. మిస్సియమ్మ (1955) (తమిళ సినిమా)
15. మిస్సమ్మ (1955)లో మేరీ/మహాలక్ష్మి
16. అర్ధాంగి (1955)
17. సంతానం (1955)లో శారద
18. కన్యాశుల్కం (1955)లో మధురవాణి
19. దొంగరాముడు (1955)లో సీత
20. చరణదాసి (1956)లో లక్ష్మి
21. భలేరాముడు (1956)
22. అమరదీపం (1956)లో అరుణ
23. వినాయకచవితి (1957)లో సత్యభామ/భూదేవి
24. తోడికోడళ్ళు (1957)లో సుశీల
25. ఎమ్మెల్యే (M.L.A.) (1957)లో నిర్మల
26. మాయాబజార్ (1957)లో శశిరేఖ
27. మాయాబజార్ (1957) (తమిళ సినిమా)లో శశిరేఖ
28. కర్పూరకరసి (1957) (తమిళ సినిమా)లో మంజుల
29. మాంగల్యబలం (1958)
30. అప్పుచేసి పప్పుకూడు (1958)లో మంజరి
31. నమ్మిన బంటు (1959)
32. విమల (1960)
33. శ్రీవెంకటేశ్వరమహత్యం (1960)లో పద్మావతి
34. శాంతినివాసం (1960)
35. దీపావళి (1960)
36. చివరకు మిగిలేది (1960)లో పద్మ
37. పాపపరిహారం (1961)
38. పసమలార్ (1961) (తమిళ సినిమా)లో రాధ
39. పాండవవనవాసం (1961)లో ద్రౌపది
40. కలసివుంటే కలదుసుఖం (1961)
41. సిరిసంపదలు (1962)
42. పవిత్రప్రేమ (1962)
43. మనితన్ మరవిల్లై (1962) (తమిళ సినిమా)
44. మంచిమనసులు (1962)
45. ఆరాధన (1962)లో అనూరాధ
46. గుండమ్మ కథ (1962)లో లక్ష్మి
47. రక్తసంబంధం (1962)
48. ఆత్మబంధువు (1962)
49. రక్తతిలకం (1963)లో కమల
50. మూగ మనసులు (1963)లో రాధ
51. కర్ణలో (1963) భానుమతి
52. కర్ణన్ (1963) (తమిళ సినిమా)లో భానుమతి
53. ఘర్ బసాకే దేఖో (1963) (హిందీ సినిమా)
54. చదువుకున్న అమ్మాయిలు (1963)లో సుజాత
55. నర్తనశాల (1963)లో ద్రౌపది
56. వెలుగునీడలు (1964)లో సుగుణ
57. పూజాఫలం (1964)లో సీత
58. నవరాత్రి (1964)
59. కైకొడుత్తదైవం (1964) (తమిళ సినిమా)
60. గంగా కీ లెహరే (1964) (హిందీ సినిమా)
61. డాక్టర్ చక్రవర్తి (1964)లో మాధవీ దేవి
62. దేవత (1964)
63. సుమంగళి (1965)
64. తిరువిలయాదల్(1965) (తమిళ సినిమా)లో పార్వతి యొక్క వివిధ రూపాల్లో నటించింది.
65. నాదీ ఆడజన్మే (1965)
66. మనుషులు మమతలు (1965)
67. నవరాత్రి (1966)
68. భక్తపోతన (1966)లో సరస్వతీదేవి
69. ప్రాణమిత్రులు (1967)
70. వరకట్నం (1968)
71. తల్లితండ్రులు (1970)లో కౌసల్య
72. మరోప్రపంచం (1970)
73. అశ్వథ్థామ (1970)లో కుంజుని భార్య
74. జగన్మోహిని (1978)
75. అందరికంటే మొనగాడు (1985)
76. దేవదాసు మళ్లీ పుట్టాడు
77. గోరింటాకు (చివరి సినిమా)
నిర్మాతగా
1. ఏక్ చిట్టీ ప్యార్ భరీ(1985) (హిందీ సినిమా)
దర్శకురాలిగా
1. మాతృదేవత (1970)
1. నవరాత్రి (1966) సినిమాలో నేపథ్య గాయని
సముద్రాల
సముద్రాల రాఘవాచార్య(1902 - 1968) తెలుగు సినిమా పరిశ్రమలో సముద్రాల సీనియర్ గా ప్రసిద్ధి చెందిన రచయిత, నిర్మాత, దర్శకుడు మరియు నేపథ్యగాయకుడు. ఈయన కుమారుడు సముద్రాల రామానుజాచార్య సముద్రాల జూనియర్ గా తెలుగు చిత్ర పరిశ్రమ పరిచయము. రాఘవాచార్య 1902లో గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించాడు. పి.వి.దాసు నిర్మించిన శశిరేఖా పరిణయం సినిమాకు కొన్ని సన్నివేశాలు వ్రాయడంతో సినీ వ్యాసంగాన్ని ప్రారంభించిన సముద్రాల వందకు పైగా సినిమాలకు స్క్రిప్టులను వ్రాశాడు. అనేక పాటలు కూడా వ్రాశాడు. ఈయన వినాయకచవితి (1957), భక్త రఘునాథ్ (1960), బభృవాహన (1964) సినిమాలకు దర్శకత్వం కూడా వహించాడు.
రచయితగా
1. భక్త ప్రహ్లాద (1967 సినిమా)
2. శ్రీకృష్ణ పాండవీయం (1966)
3. బభ్రువాహన (1964) (మాటలు) (కథ)
4. నర్తనశాల (1963) (మాటలు)
5. లవకుశ (1963)
6. సీతారామ కళ్యాణం (1961) (మాటలు)
7. బాటసారి (1961) (మాటలు)
8. పాండవ వనవాసం (1965)
9. భూకైలాస్ (1958)
10. సారంగధర (1957)(మాటలు)
11. వినాయక చవితి (1957)
12. జయం మనదే (1956) (మాటలు) (కథ)
13. జయసింహ (1955) (మాటలు) (కథ)
14. బ్రతుకు తెరువు (1953) (మాటలు) (కథ)
15. దేవదాసు (1953)(మాటలు)
16. నవ్వితే నవరత్నాలు (1951)
17. స్వప్న సుందరి (1950)
18. షావుకారు (1950)
19. మన దేశం (1949) (మాటలు)
20. లైలా మజ్ను (1949) (మాటలు)
21. పల్నాటి యుద్ధం (1947) (మాటలు)
22. రత్నమాల (1947)
23. యోగి వేమన (1947)
24. గరుడ గర్వభంగం (1943) (మాటలు)
25. భక్త పోతన (1942 సినిమా) (కథ మరియు మాటలు)
26. దేవత (1941) (మాటలు)
27. సుమంగళి (1940) (మాటలు)
28. వందేమాతరం (1939) (మాటలు)
29. గృహలక్ష్మి (1938)
దర్శకత్వం
1. బభృవాహన (1964)
2. భక్త రఘునాథ్ (1960)
3. వినాయక చవితి (1957)
నిర్మాత
1. దేవదాసు (1953) (నిర్మాత) (uncredited)
2. శాంతి (1952) (నిర్మాత) (uncredited)
3. స్త్రీసాహసం (1951) (నిర్మాత) (uncredited)
నేపధ్య గాయకుడు
1. భక్త రఘునాథ్ (1960) (playback singe
శ్రీను వైట్ల
ను వైట్ల తెలుగు సినిమా దర్శకుడు. ఇతని మొదటి సినిమా నీ కోసం. కానీ 2001 సంవత్సరంలో విడుదలైన ఆనందం చిత్రం ద్వారా మంచి పేరు సంపాదించాడు. ఆయన స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా కందుల పాళెం అనే గ్రామం.
సినిమాలు
1. నీ కోసం (1999)
2. ఆనందం (2001)
3. సొంతం
4. వెంకీ
5. అందరివాడు (2005)
6. ఢీ (2007)
7. దుబాయ్ శీను (2007)
8. రెడీ (2008)
9. కింగ్ (2008)
శేఖర్ కమ్ముల
శేఖర్ కమ్ముల ప్రముఖ తెలుగు సినీదర్శకుడు, నిర్మాత మరియు సినీ రచయిత.
శేఖర్ నల్గొండ జిల్లా భువనగిరి ప్రాంతానికి చెందిన వాడు. సికిందరాబాద్ లోని సెయింట్ పాట్రిక్స్ హైస్కూల్ లో హైస్కూలు విద్య పూర్తి చేశాడు. సెయింట్ అల్ఫోన్సా కళాశాల నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. తరువాత చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. తరువాత అమెరికాలోని న్యూజెర్సీ లో కంప్యూటర్ సైన్సు లో పీజీ కోసం వెళ్ళాడు. కొద్ది కాలం సమాచార సాంకేతిక రంగంలో పని చేసిన తర్వాత వాషింగ్టన్ లోని హోవార్డ్ యూనివర్శిటీ లో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో చేరాడు.
కెరీర్
దర్శకుడిగా ఆయన మొదటి సినిమా డాలర్ డ్రీమ్స్. ఈ సినిమాకు ఆయనకు ఉత్తమ నూతన దర్శకుడిగా జాతీయ పురస్కారము లభించింది. [1]. తరువాత ఆయన దర్శకత్వం వహించిన ఆనంద్ సినిమా ఆయనకు మంచి కమర్షియల్ విజయాన్నిచ్చింది. సినిమాల్లో సాధారణంగా కనిపించే హింస, అశ్లీలత మొదలైనవి శేఖర్ సినిమాల్లో తక్కువ మోతాదులో ఉంటాయి కాబట్టి కుటుంబ సమేతంగా చూడదగ్గవిగా ఉంటాయి.
చిత్రాలు
1. డాలర్ డ్రీమ్స్ (2000)
2. ఆనంద్ (2004)
3. గోదావరి (2006)
4. హ్యాపీ డేస్ (2007)
5. లీడర్ (2009)
వై.వి.రావు
యెర్రగుడిపాటి వరదరావు (వై.వి.రావు) (జ: మే 30, 1903 - మ: ఫిబ్రవరి 14, 1973) తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత మరియు నటుడు.
వై.వి.రావు 1903 మే 30న నెల్లూరులో జన్మించాడు. మద్రాసు విశ్వవిద్యాలయములో వైద్యవిద్యను వదిలి సినిమాలలో నటించాలనే కోరికతో బొంబాయి వెళ్లాడు. బొంబాయిలో మణీలాల్ జోషీని కలిసి, మెప్పించి మూకీ చిత్రాలలో నటించే అవకాశము పొందాడు. ఈయన కొన్ని రోజులు అర్దేషిర్ ఇరానీ యొక్క రాయల్ ఆర్ట్ స్టూడియోలో కూడా పనిచేశాడు. ఆ తరువాత మద్రాసులోని జనరల్ పిక్చర్స్ లో కళాదర్శకునిగా, నటునిగా చేరాడు. ఈయన ఆర్.ఎస్.ప్రకాష్ యొక్క కొన్ని మూకీ చిత్రాలలో కూడా నటించాడు. వై.వి.రావు 1939 లో తన సొంత చిత్ర నిర్మాణ సంస్థ అయిన చింతామణి పిక్చర్స్ ను స్థాపించాడు. 1950లో శ్రీవరుణ ఫిలంస్ అనే సంస్థను కూడా ప్రారంభించాడు. అప్పట్లో భారతీయ చిత్ర పరిశ్రమలో అన్ని (ఏడు) భాషల చిత్రాలలో పనిచేసిన ఘనత ఈయనకే దక్కినది. వై.వి.రావు పశ్చిమ మరియు దక్షిణ భారత దేశములలోని ప్రముఖ చిత్రనిర్మాణ కేంద్రాలైన బొంబాయి, కొల్హాపూర్, మద్రాసు మరియు మైసూరులలో పనిచేశాడు. తొలి కన్నడ టాకీ చలనచిత్రము, ఎం.వి.సుబ్బయ్య నాయుడు మరియు ఆర్.నాగేంద్రరావు నటించిన సతీ సులోచన ఈయనే నిర్మించాడు.
1946లో వై.వి.రావు, నర్తకి నుంగంబాక్కం జానకి కుమార్తె మరియు తమిళ సినిమా నటీమణి అయిన కుమారి రుక్మిణిని వివాహమాడినాడు. తెలుగు సినీనటి లక్ష్మి (జీన్స్ చిత్రములో బామ్మ) ఈయన కూతురే.
* Hennina Balu Kanneru (1963)
* Nagarjuna (1961/I)
* శ్రీకృష్ణ గారడి (1958/I and II)
* మంజరి (1953)
* మానవతి (1952)
* లవంగి (1946) (1950)
* Ramadas (1948)
* తాసీల్దార్ (1944) (నటుడు, కథా రచయిత, నిర్మాత మరియు దర్శకుడు)
* సత్యభామ (1942) (నటుడు, నిర్మాత మరియు దర్శకుడు)
* సావిత్రి (1941)
* విశ్వమోహిని (1940) (నటుడు, కథా రచయిత మరియు దర్శకుడు)
* మళ్ళీ పెళ్ళి (1939) (నటుడు, కథా రచయిత మరియు దర్శకుడు)
* భక్త మీరా (1938)
* స్వర్ణలత (1938)
* Naganand (1935/I and II)
* సతీ సులోచన (1934/II) (నటుడు మరియు దర్శకుడు)
* Hari Maya (1932)
* Pandava Agyathavas (1930)
* సారంగధర (1930)
* Shri Subramanyam (1930)
వేదాంతం రాఘవయ్య
వేదాంతం రాఘవయ్య (Vedantam Raghavaiah) మంచి కూచిపూడి కళాకారుడే కాకుండా, పలు తెలుగు సినిమాలకు దర్శకత్వం, మరి కొన్ని సినిమాలకు నృత్య దర్శకత్వం వహించారు. అంతే కాక కొన్ని సినిమాలలో నటించారు కూడా.
[మార్చు] తొలి జీవితం
వేదాంతం రాఘవయ్య కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామంలో 1919 సంవత్సరంలో జన్మించారు. రాఘవగా పిలవబడే రాఘవయ్య వేదాంతం రత్తయ్య శర్మ మరియు రాజ్యలక్ష్మి గార్ల ప్రథమ సంతానం. వీరి తాతగారు వేదాంతం రామయ్య గారు ప్రఖ్యాత కూచిపూడి యక్ష గాన ప్రయోక్తలు.
వీరికి తమ ఇంటివిద్యపై మక్కువ వలన చిన్నతనంలోనే తన తండ్రిగారి వద్ద ఈ నాట్యవిద్యకు శ్రీకారం చుట్టారు. తరువాత పద్మభూషణ్ వెంపటి చినసత్యం గారివద్ద తన విద్యకు మెరుగులు దిద్దుకున్నారు. పాఠశాల విద్యానంతరము ఉన్నత విద్యలకై హైదరాబాదు వెళ్లి అక్కడ మేనమామగారైన నాట్యకళాధర పసుమర్తి రామలింగశాస్త్రి గారివద్ద ఉంటూ ఈ నాట్యకళల మెళకువలను, తాళప్రకరణము , నట్టువాంగమును అభ్యసించడమే కాకుండా తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా కూచిపూడి నాట్యంలో బి.ఎ. మరియు ఎం.ఎ. డిగ్రీలను పొందారు.
[మార్చు] పని చేసిన సినిమాలు
దర్శకత్వం వహించినవి
* శాంతి (1952)
* అన్నదాత (1952)
* దేవదాసు (1953)
* అనార్కలి (1955)
* భలే అమ్మాయిలు (1957)
* సువర్ణసుందరి (1957)
* రహస్యం (1967)
నటించినవి
* రైతుబిడ్డ (1939)
* గరుడ గర్వభంగం (1943)
నృత్య దర్శకత్వం చేసినవి
* పల్నాటి యుద్ధం (1947)
చిత్రానువాదం అందించినవి
* అనార్కలి (1955)
* సువర్ణసుందరి (1957)
వేదాంతం రాఘవయ్య (Vedantam Raghavaiah) మంచి కూచిపూడి కళాకారుడే కాకుండా, పలు తెలుగు సినిమాలకు దర్శకత్వం, మరి కొన్ని సినిమాలకు నృత్య దర్శకత్వం వహించారు. అంతే కాక కొన్ని సినిమాలలో నటించారు కూడా.
[మార్చు] తొలి జీవితం
వేదాంతం రాఘవయ్య కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామంలో 1919 సంవత్సరంలో జన్మించారు. రాఘవగా పిలవబడే రాఘవయ్య వేదాంతం రత్తయ్య శర్మ మరియు రాజ్యలక్ష్మి గార్ల ప్రథమ సంతానం. వీరి తాతగారు వేదాంతం రామయ్య గారు ప్రఖ్యాత కూచిపూడి యక్ష గాన ప్రయోక్తలు.
వీరికి తమ ఇంటివిద్యపై మక్కువ వలన చిన్నతనంలోనే తన తండ్రిగారి వద్ద ఈ నాట్యవిద్యకు శ్రీకారం చుట్టారు. తరువాత పద్మభూషణ్ వెంపటి చినసత్యం గారివద్ద తన విద్యకు మెరుగులు దిద్దుకున్నారు. పాఠశాల విద్యానంతరము ఉన్నత విద్యలకై హైదరాబాదు వెళ్లి అక్కడ మేనమామగారైన నాట్యకళాధర పసుమర్తి రామలింగశాస్త్రి గారివద్ద ఉంటూ ఈ నాట్యకళల మెళకువలను, తాళప్రకరణము , నట్టువాంగమును అభ్యసించడమే కాకుండా తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా కూచిపూడి నాట్యంలో బి.ఎ. మరియు ఎం.ఎ. డిగ్రీలను పొందారు.
[మార్చు] పని చేసిన సినిమాలు
దర్శకత్వం వహించినవి
* శాంతి (1952)
* అన్నదాత (1952)
* దేవదాసు (1953)
* అనార్కలి (1955)
* భలే అమ్మాయిలు (1957)
* సువర్ణసుందరి (1957)
* రహస్యం (1967)
నటించినవి
* రైతుబిడ్డ (1939)
* గరుడ గర్వభంగం (1943)
నృత్య దర్శకత్వం చేసినవి
* పల్నాటి యుద్ధం (1947)
చిత్రానువాదం అందించినవి
* అనార్కలి (1955)
* సువర్ణసుందరి (1957)
వి.మధుసుదనరావు
వి.మధుసుదనరావు లేదా వీరమాచనేని మధుసూదనరావు తెలుగు సినిమా దర్శకులు. ఇతడు కె.ఎస్.ప్రకాశరావు వద్ద చలనచిత్రీకరణ పాఠాలు నేర్చుకొని మొదటిసారిగా సతీ తులసి పౌరాణిక చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇతడు రాజధాని నగరంలో ఫిలిం ఇన్ స్టిట్యూట్ స్థాపించి ఎందరో నటుల్ని తీర్చిదిద్దారు.
సినిమాలు
* సతీ తులసి (1959)
* వీరాభిమన్యు (1965)
* ఆరాధన (1962)
* అంతస్థులు (1965)
* అదృష్టవంతులు (1968)
* పదండి ముందుకు (1962)
* రక్తసంబంధం (1962)
* భక్త తుకారాం (1973)
విజయనిర్మల
విజయనిర్మల (1946) తెలుగు సినిమా నటి, దర్శకురాలు మరియు ప్రముఖ నటుడు ఘట్టమనేని కృష్ణ భార్య. ఈమె అసలు పేరు నిర్మల అయితే తనకు సినీరంగములో తొలి అవకాశమిచ్చిన విజయా స్టూడియో కు కృతజ్ఞతగా విజయనిర్మల అని పేరు మార్చుకొన్నది. అప్పటికే ఇదే పేరుతో వేరే నటి (ఇప్పటి నిర్మలమ్మ) ఉండడం కూడా పేరు మార్పునకు మరో కారణము. ఈమె మొదటి పెళ్లి ద్వారా సినీ నటుడు నరేష్ కి తల్లి. మరో ప్రముఖ సినిమా నటి జయసుధకు ఈమె పిన్నమ్మ. 2002 లో ప్రపంచములోనే అతిఎక్కువ సినిమాలు తీసిన మహిళా దర్శకురాలిగా గిన్నీస్ ప్రపంచ రికార్డులు[1] లోకెక్కినది. నటి అయిన ఈమె 1971లో దర్శకత్వము వహించడము ప్రారంభించినది. ఈమె నటించిన అధిక చిత్రాలలో కధానాయకుడు కృష్ణ కావటం విశేషం. వీరిద్దరూ జంటగా సుమారు యాభై వరకూ చిత్రాలలో నటించారు.
విజయనిర్మల, కృష్ణ జంటగా నటించిన తెలుగు చిత్రాలు
* సాక్షి
* మంచి కుటుంబం
* సర్కార్ ఎక్స్ ప్రెస్
* అత్తగారు కొత్తకోడలు
* లవ్ ఇన్ ఆంధ్రా
* టక్కరి దొంగ చక్కని చుక్క
* విచిత్ర కుటుంబం
* బందిపోటు భీమన్న
* అక్కా చెల్లెలు
* మా నాన్న నిర్దోషి
* మళ్లీపెళ్లి
* విధివిలాసం
* అమ్మకోసం
* తాళిబొట్టు
* పెళ్లి సంబంధం
* పెళ్లికూతురు
* పగ సాధిస్తా
* అగ్నిపరీక్ష
* రెండు కుటుంబాల కధ
* అల్లుడే మేనల్లుడు
* మాస్టర్ కిలాడి
* అనురాధ
* మోసగాళ్లకు మోసగాడు
* భలే మోసగాడు
* పండంటి కాపురం
* ప్రజా నాయకుడు
* మంచివాళ్లకు మంచివాడు
* దేవుడు చేసిన మనుషులు
* మీనా
* గాలిపటాలు
* అల్లూరి సీతారామరాజు
* ధనవంతుడు గుణవంతుడు
* దేవదాసు
* సంతానం-సౌభాగ్యం
* పాడిపంటలు
* రామరాజ్యంలో రక్త పాతం
* దేవుడే గెలిచాడు
* పంచాయితీ
* పట్నవాసం
* మూడు పువ్వులు ఆరు కాయలు
* హేమాహేమీలు
* అంతం కాదిది ఆరంభం
* రక్తసంబంధం
* సాహసమే నా ఊపిరి
* ప్రజల మనిషి
* బొబ్బిలి దొర
* శ్రావణమాసం
వంశీ
వంశీ తెలుగు సినిమా దర్శకుడు, రచయిత. అసలు పేరు జె.వి.కె నారయణ రాజు ఈయన సినిమాలకధలు సహజంగా ఉంటూ పల్లెఅందాలను ఆవిష్కరిస్తుంటాయి.
బాల్యం
వంశీ తూర్పు గోదావరి జిల్లా, అనపర్తికి దగ్గరలో ఉన్న పసలపూడి అనే గ్రామంలో పుట్టి పెరిగాడు.
కెరీర్
తెలుగు సినీ చరిత్రలో ఆణిముత్యమైన శంకరాభరణం సినిమాకు వంశీ సహాయ దర్శకుడిగా వ్యవహరించాడు. దర్శకుడిగా ఆయన మొదటి సినిమా 1982 లో చిరంజీవి, సుహాసిని,రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రధారులుగా నటించిన మంచు పల్లకి అనే సినిమా. ఈ సినిమాకు యండమూరి వీరేంద్రనాథ్ రచయిత. యండమూరి, చిరంజీవి కలయికలో వచ్చిన తొలి చిత్రం ఇదే కావడం విశేషం.
1984 లో ఆయన రూపొందించిన సితార సినిమా విమర్శకుల మన్ననలనందుకుంది. ఇదే సినిమాతో భానుప్రియ తెలుగు సినిమాకు కథానాయిక గా పరిచయమైంది. ఆయన రూపొందించిన చాలా వరకు సినిమాలకు ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించాడు.
వంశీ దర్శకత్వం వహించిన అనేక తెలుగు సినిమాలలో ప్రస్పుటంగా కనిపించే అంశములు కామెడీ మరియు తెలుగువారి వ్యావహారిక పద్దతులు. గోదావరి పట్ల వంశికి వున్నప్రేమ అంత ఇంతా కానిది. ప్రతి సినిమాలో ఏదో ఒక పాత్ర శ్రుష్టించి అది గోదావరి జిల్లాలో పరిబ్రమించెలాగా చెయ్యటం వంశికి వెన్న తో పెట్టిన విద్య.
] అవార్డుల సినిమాలు
* సితార
* మంచుపల్లకి
వంశీ సినిమాల జాబితా
1. మంచు పల్లకి
2. ఆలాపన
3. అన్వేషణ
4. సితార
5. లాయర్ భారతి
6. చెట్టు క్రింద ప్లీడర్
7. స్వర కల్పన
8. లేడీస్ టైలర్
9. లింగబాబు లవ్ స్ఝ్తోరి
10. జోకర్
11. ప్రేమ & కో
12. డిటెక్టివ్ నారద
13. ఏప్రిల్ 1 విడుదల
14. దొంగ రాముడు అండ్ పార్టి
15. అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు
16. కొంచెం టచ్ లో ఉంటే చెబుతాను
17. అనుమానాస్పదం
18. గోపి గోపిక గోదావరి
19. [[ఫ్యాషన్ డిసైనర్ S/O లేడీస్ టైలర్(నిర్మాణంలో ఉంది?)
రామ్ గోపాల్ వర్మ
రామ్ గోపాల్ వర్మ (జ. ఏప్రిల్ 7, 1962) ఒక ప్రముఖ తెలుగు, భారతీయ సినిమా దర్శకుడు మరియు నిర్మాత. అతను సాంకేతికంగా పరిణితి చెందిన, మాఫియా మరియు హార్రర్ నేపథ్యం కలిగిన చిత్రాలను తీయడంలో సిద్దహస్తుడు. చలనచిత్ర ప్రవేశం తెలుగులో జరిగినా తర్వాత హిందీ చిత్ర పరిశ్రమలో స్థిరపడ్డాడు. అతనికి పేరు తెచ్చిన చిత్రాలలో ముఖ్యమైనవి శివ (తెలుగు), క్షణ క్షణం (తెలుగు), రంగీలా (హిందీ), సత్య (హిందీ), కంపెనీ (హిందీ) మరియు భూత్ (హిందీ). ఫాక్టరీగా సుపరిచితం అయిన అతని నిర్మాణ సంస్థ "వర్మ కార్పొరేషన్" పలు చిత్రాలు నిర్మించింది.
విషయ సూచిక
రామ్ గోపాల్ వర్మ 1962లో విజయవాడ నగరంలో కృష్ణంరాజు మరియు సూర్యమ్మ దంపతులకు జన్మించాడు. నగరంలోని సిధ్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ విద్యను అభ్యసించాడు. అయితే అతనికి చదువుకన్నా చిత్రరంగం మీదే ఎక్కువ శ్రద్ధ ఉండేది. విద్యార్థిగా ఉన్నప్పుడు విడుదలైన ప్రతి చిత్రము, ఏ భాషలోనైనా, వదలకుండా చూసేవాడినని ఆయన చెబుతూ ఉంటారు. తన స్నేహితులతో ప్రతి చిత్రాన్ని విశ్లేషిస్తూ, అందులోని తప్పొప్పుల గురించి వాదనలు జరిపేవాడు. ఇంజినీరింగ్ పట్టా పొందిన తర్వాత చిత్ర పరిశ్రమలో అవకాశం కోసం ఎదురుచూస్తూ బ్రతుకుతెరువు కోసం కొంతకాలం ఒక వీడియో దుకాణం నడిపాడు. తరువాత రావుగారి ఇల్లు అనే తెలుగు చిత్రానికి సహాయక నిర్దేశకునిగా అవకాశం వచ్చింది. ఆ చిత్రం ద్వారా వర్ధమాన తెలుగు నటుడు అక్కినేని నాగార్జునను కలిసే అవకాశం వచ్చింది.
ఆయనకి, ఆయన మేనమామకి సినిమాలు అంటే తగని మక్కువ. క్లాసులను ఎగ్గొట్టి మరీ సినిమాలు చూసి వాళ్ళ అమ్మతో దెబ్బలు తినేవారట. సినిమా పేర్లలో దర్శకుడి పేరు,"ఫిల్మ్ బై" అని వేసే పేర్లను చూసి చాలా ఉత్తేజం చెందేవాడట. షోలే సినిమాలో "ఫిల్మ్ బై రమేష్ సిప్పీ" పేరు చూసి ఉత్తేజం చెందిన ఆయన, తన పేరుని కూడా అలా సినిమా టైటిల్స్ లో మొదటిసారి ఉదయం సినిమాలో చూసుకుని మురిసిపోయారట. ఆయనకు తన కుటుంబం నుండి ఎలాంటి సహకారం లేదు. తన మేనమామ కూడా పిచ్చితనం అనే అనుకునేవాడు. దక్షిణ భారతంలో చెన్నై లాంటి నగరాల్లో నిర్మించే చిత్రాల్లోకంటే ముంబైలో నిర్మితమయ్యే చిత్రాల్లో ప్రతిభ కొరవడింది అని ఆయన భావించేవాడు. ఆయన తనకి ఎటువంటి దురలవాట్లు లేవు అని చెప్తాడు. మద్యం సేవించడం ఒక వ్యసనంగా ఆయన ఒప్పుకోడు. వర్మకి నచ్చిన దర్శకులు స్టీవెన్ స్పీల్‌బర్గ్, శేఖర్ కపూర్, గోవింద్ నిహ్‌లానీ మొదలగు వారు. కానీ ఆయన పైన ఎవరి ప్రభావం లేదు. ఆయనది సొంత శైలి. సినీ విశ్లేషణల గురించి ఆయన పెద్దగా పట్టించుకోరు. ఎవరో అపరిచితులు నా సినిమా గురించి రాసే విశ్లేషణల గురించి నేనెందుకు బాధపడాలి? ఎవరికో నచ్చకపోతే నేనేం చేయగలను? అని ప్రశ్నిస్తారు.
వృత్తి
రామ్ గోపాల్ వర్మ తన సినీ జీవితాన్ని ఎస్.ఎస్. క్రియేషన్స్ నిర్మించిన రావుగారిల్లు, కలెక్టర్ గారి అబ్బాయి చిత్రాలకి సహాయ నిర్దేశకునిగా మొదలు పెట్టారు. తెలుగు మరియు భారతీయ సినీ ప్రపంచంలో శివ సినిమా ద్వారా తన ఉనికిని ప్రపంచానికి చాటారు. ఈ చిత్రం కాలేజీ నేపథ్యంలో హింసాత్మక కథను చొప్పించి నిర్మించారు. ఎటువంటి ఆధారం, శిక్షణ, సహాయ సహకారాలు లేకుండా, 28 ఏళ్ల వయసులో తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నటుడైన అక్కినేని నాగార్జునను చిత్ర నిర్మాణానికి ఒప్పించగలిగారు. ఆయన కథ చెప్పిన విధానం నచ్చి నాగార్జున స్వయంగా చిత్ర నిర్మాణాన్ని చేపట్టారు. శివ చిత్రం తెలుగు చిత్ర ప్రపంచంలో ఒక చెరగని ముద్రని వేసుకుంది. హిందీ భాషలో కూడా ఈ చిత్రాన్ని అదే పేరుతో పునర్నిర్మించారు కానీ తెలుగులో సాధించినంత విజయాన్ని హిందీలో సాధించలేదు.
తను దర్శకత్వం వహించిన తరువాతి సినిమాలు క్షణక్షణం (వెంకటేష్, శ్రీదేవి నాయికానాయికలు) హాలీవుడ్ లో నిర్మించిన ఆధారము మరియు ఇది తన కాలేజి మనసు దోచిన సత్య(తరువాత రోజులలో ఇదే పేరుతో ఒక సినిమా కూడా నిర్మించాడు) తో సంబంధానికి ఒక జ్ఞాపకం, రాత్రి(రేవతి ప్రధాన పాత్రధారిగా నిర్మించిన ద్విభాషా హారర్ చిత్రం), అంతం(నాగార్జున, ఊర్మిలా మటోండ్కర్ నాయికానాయికలుగా అపరాధి - పోలీస్ కథతో నిర్మించిన మరో ద్విభాషాచిత్రం) కానీ ఇది వాణిజ్యపరంగా శివలా విజయం సాధించలేదు. తరువాత గోవిందా గోవిందా (నాగార్జున,శ్రీదేవి నాయికానాయికలు) దీనిలో విలన్లు వేంకటేశ్వరస్వామి వజ్రపు కిరీటాన్ని దొంగిలించటానికి స్వామి అరచేతులమీద కాళ్ళు పెట్టటంతో వివాదాస్పదం అయ్యింది. భారతీయ సెన్సార్ బోర్డ్ వాళ్ళు ఈ దృశ్యాన్ని తొలగించాలని కోరారు. అనవసరమైన ప్రచారం కలిగినా కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశ కలిగించింది.
తను దర్శకత్వం వహించిన తరువాతి సినిమా జగపతిబాబు, ఊర్మిలా మటోండ్కర్ నాయికానాయికలుగా నిర్మించిన గాయం కూడా నేరప్రపంచపు చీకటిసామ్రాజ్యం నేపథ్యంలో వచ్చిన మరొక హింసాత్మక కథ. దీనికి తమిళ సినిమా దర్శకుడు 'మణి రత్నం' స్క్రీన్ ప్లే అందించాడు. ఇది నగరాలలో బాగానే ఆడింది. తరచుగా తన సినిమాలలో ఊర్మిలా మటోండ్కర్ నే హీరోయిన్ గా తీసుకోవడం వారిద్దరి మధ్య ఉన్న సంబంధంపై వచ్చిన పుకార్లకు ఆజ్యం పోసింది.
వర్మ తన సొంత సినిమా నిర్మాణసంస్థ వర్మ కార్పోరేషన్ లిమిటెడ్ని స్థాపించి మనీ, మనీ మనీ, గులాబి, వైఫ్ ఆఫ్ వరప్రసాద్, అనగనగా ఒక రోజు, దెయ్యం(చివరి రెండు సినిమాలకు తనే దర్శకత్వం వహించాడు) అనే తెలుగు సినిమాలను నిర్మించాడు. వర్మ దగ్గర సహాయ దర్శకులుగా పనిచేసిన కృష్ణ్ఝ వంశీ, శివనాగేశ్వరరావు మరియు సినిమాటోగ్రాఫర్గా పని చేసిన తేజ తరువాత టాలీవుడ్ లో మంచి దర్శకులుగా పేరు సంపాదించారు.
హిందీ సినిమా పరిశ్రమను ప్రేమకథా చిత్రాలు మరియు యాక్షన్ చిత్రాలు రాజ్యమేలుతున్న రోజుల్లో వర్మ సినిమాలు నిజ జీవితానికి దగ్గరగా ఉండేవి మరియు విషయాన్ని లోతుగా అన్వేషించేవి. భారతీయ సినిమా ఇలాంటి నిజానికి దగ్గరగా ఉండే సినిమాలు తీసినప్పటికీ, వర్మ తనదైన శైలిలో ముందుకు సాగి పోయాడు.
వర్మ హిందీ సినిమాల దండయాత్ర (బాలీవుడ్ లో సాధారణంగా అనుకొనే మాట) రంగీలా చిత్ర ఘనవిజయంతో ఆరంభమైంది. ఈ సినిమాతో ఊర్మిళ మాటోండ్కర్ మంచి పేరు సంపాదించుకుంది. ప్రఖ్యాత సంగీతదర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ ఈ సినిమాతోనే బాలీవుడ్ లోకి రంగ ప్రవేశం చేశాడు. రంగీలా తర్వాత వచ్చిన సినిమా "దౌడ్".
సత్యా సినిమా వర్మకు ఒక ప్రతిష్ఠాత్మక చిత్రం. అతి తక్కువ బడ్జెటుతో తారలెవరూ లేకుండా తీసిన ఈ సినిమా అనేకమంది నటులు, సాంకేతికులకు ప్రాణం పోసింది. అందులో ముఖ్యమైన వారు మనోజ్ బాజ్‌పాయి, చక్రవర్తి, మకరంద్ దేశ్‌పాండే, అనురాగ్ కశ్యప్ (చిత్రానికి కథ, సంభాషణలు సమకూర్చాడు) మరియు సందీప్ చౌతా (నేపథ్య సంగీతం సమకూర్చాడు). విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం ఆ తరువాత బాలీవుడ్లో అనేక అనుకరణలకు మాతృక అయ్యింది. కొందరు విమర్శకులు ఈ హింసాత్మక చిత్రంలో వర్మ మాఫియాను glorify చేశాడని విమర్శించారు.
కౌన్, భూత్ మరియు కంపెనీ వంటి చిత్రాలలో కథాగమనానికి అడ్డుతగలకుండా ఉండేందుకు భారతీయ చిత్రాలలో సర్వసాధారణమైన పాటలను కత్తరించివేశాడు. నేపథ్య సంగీత విషయములో వర్మ చాలా శ్రద్ధ చూపుతాడు. చాలాకాలం తన సినిమాలలో సంగీత దర్శకుడు సందీప్ చౌతాతో కలిసి పనిచేశాడు.
రామ్ గోపాల్ వర్మ తన అన్ని సినిమాలలోనూ ప్రధాన స్రవంతిలోని బాలీవుడ్ చిత్రాలను నిర్మించే వ్యక్తులను వారి శైలిని తన వ్యంగ్య చతురతతో విమర్శిస్తూనే ఉన్నాడు. ఈయన సినిమాలు దాదాపు అన్నీ సమకాలీన సమాజానికి అద్దంపడతాయి . నేపథ్యం సాధారణంగా ఎపుడూ ముంబాయి నగరములోనే ప్రారంభమౌతుంది కానీ కథానుసారముగా విస్తరణకు అవకాశముంటుంది. విమర్శకులు, వర్మ సినిమాలు కేవలం స్థూలదృష్టికోణాన్ని చిత్రీకరించకుండా, కథానాయికనాయకుల అంతరంగములోకి లోతుగా చొచ్చుకుపోయి వాళ్ళ ప్రేరేపణలను వెలికితీసే ప్రయత్నం చేస్తాయి అని అంటారు.
ఇటీవల విడుదలైన వర్మ చిత్రం నాఛ్ ఇప్పటివరకు తన అత్యుత్తమ సినిమా అని చాటుకున్నాడు (తన అన్ని సినిమాల నిర్మాణం తర్వాత ఈయన ఇలానే చాటుకొంటూ ఉంటాడు). నాఛ్ సినిమా ప్రపంచముపై తనదైన ముద్ర వేయాలనుకునే ఒక నృత్యదర్శకురాలికి, సినిమాలలో గొప్పస్థాయికి ఎదగాలగుకుంటున్న ఒక వర్ధమాన నటునికి మధ్య సంబంధాన్ని చిత్రీకరిస్తుంది. నాఛ్ వ్యాపారపరంగా అంత విజయవంతము కాలేదు. ఇటీవల ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్మ "నేను నాఛ్ లో మున్సిపల్ స్కూలుకు ఐన్ రాండ్ ఇవ్వటానికి చాలా శ్రమపడ్డాను." అని ప్రేక్షకుల అవగాహానా స్థాయికి అందని సినిమా తీసానని చెప్పుకున్నాడు.
వర్మ తరువాతి సినిమా సర్కార్ జూన్,2005లో విడుదలయింది. నిజ జీవితంలో తండ్రి-కొడుకులయిన అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ సినిమాలో కూడా తండ్రి-కొడుకుల పాత్రలు పోషించారు. ఇది ద గాడ్ ఫాదర్ అనే హాలీవుడ్ సినిమా ఆధారంగా నిర్మించింది అని చెప్పాడు. ఈ సినిమా మౌళికంగా పితృస్వామ్యము మరియు స్వాభిమానము గురించి అని వర్మ అభిప్రాయం. భారతీయ రాజకీయాల నేపథ్యములో తీసిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ తనదే ధర్మం అనుకునే రాజకీయనాయకుడు సర్కార్ పాత్రను పోషించాడు. ఈ చిత్రం భారీ విజయం సాధించింది.
వర్మ భారతీయ చిత్ర పరిశ్రమలో మునుపెన్నడూ లేనంతగా చాలా వేగంగా సినిమాలను నిర్మిస్తున్నారు. తన ఆఫీస్ పేరు The Factory(ద ఫ్యాక్టరీ). తను ఎంపిక చేసిన దర్శకులతో తన నిర్మాణ సంస్థ ద్వారా చాలా సినిమాలను నిర్మిస్తున్నారు. తన సినిమాలకు ప్రతిభ వున్న క్రొత్త వారిని ఎంపిక చేయటం వర్మ అలవాటు. తను పరిచయం చేసిన వారందరి కెరీర్ బాగా వుండటంతో కావలసిన వాళ్ళు కింగ్ మేకర్ అని అంటారు. మనోజ్ బాజ్ పాయ్, ఆఫ్తాబ్ శివదాసాని, వివేక్ ఒబెరాయ్, రాజ్ పాల్ యాదవ్ వీళ్ళంతా సినిమా తెరకు వర్మ ద్వారా పరిచయం అయిన వాళ్ళే. తను వుదార స్వభావుడు కానని, తన స్వార్థం కోసమే క్రొత్త వాళ్ళని పరిచయం చేస్తున్నానని వర్మ ఇంటర్వ్యూలలో చెబుతుంటాడు. సినిమా పత్రికలు వారు 'స్పాన్సర్' చేసే అవార్డులంటే వర్మకు ఇష్టముండదు, తను ఎప్పుడూ బహుమతి ప్రధానోత్సవాలకు హాజరు కాలేదు.
అవార్డులు మరియు నామినేషన్లు
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతీ యేటా ఇచ్చే నంది అవార్డు ను రామ్ గోపాల్ వర్మ రెండుసార్లు ఆయన దర్శకత్వం వహించిన శివ మరియు క్షణ క్షణం చిత్రాలకు గెలుచుకున్నారు. సత్య' చిత్రానికి ఫిల్మ్ ఫేర్ వాళ్ళు ఇచ్చే ఉత్తమ దర్శకుడి అవార్డును గెల్చుకున్నారు.
వ్యక్తిగత జీవితం
వర్మకు తన సినిమాలలో పనిచేసిన అనేక నటీమణులతో ముఖ్యంగా ఊర్మిళ మాటోండ్కర్, అంతర మాలి, సమీరా రెడ్డి, రుఖ్‌సార్, ఇటివల నిషా కొఠారిలతో సంబంధం ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. వర్మ తన సినిమాల్లో పనిచేసిన హీరోయిన్లందరు తనకు చెల్లెళ్ళ వంటివారని ఆ పుకార్లను కొట్టిపారేశాడు. వర్మ ఒక ఇంటర్వూలో తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, పిల్లలను పెంచడం, చదివించడం, ఆడించడం అనేవి తన జీవితంలో మచ్చుకైన ఉహించని విషయాలని అన్నారు.
[మార్చు] చిత్ర సంకలనము
చిత్రము విడుదల తేది, సంవత్సరము భాష బాధ్యతలు
మిస్టర్. య మిస్. డిసెంబర్ 2, 2005 హిందీ నిర్మాత
జెమ్స్ సెప్టెంబర్ 16, 2005 హిందీ నిర్మాత
మై వైఫ్'స్ మర్దర్ ఆగస్ట్ 19, 2005 హిందీ నిర్మాత
సర్కార్ జులై 1, 2005 హిందీ దర్శకత్వం & నిర్మాత
డి జూన్ 3, 2005 హిందీ నిర్మాత
నాచ్ నవంబర్ 12, 2004 హిందీ నిర్మాత
వాస్తు శాస్త్ర 2004 హిందీ నిర్మాత
మధ్యాహ్నం హత్య 2004 తెలుగు నిర్మాత
గాయబ్ జులై 16, 2004 హిందీ నిర్మాత
అబ్ తక్ చప్పన్ ఫిబ్రవరి 27, 2004 హిందీ నిర్మాత
ఏక్ హసీనా థి జనవరి 16, 2004 హిందీ నిర్మాత
మై మాధురి ధిక్షిత్ బననా చహ తా హు అక్టోబర్ 10, 2003 హిందీ నిర్మాత
డర్న మనా హై జులై 25, 2003 హిందీ నిర్మాత
భూత్ మే 30, 2003 హిందీ దర్శకత్వం & నిర్మాత
రోడ్ సెప్టెంబర్ 27, 2002 హిందీ నిర్మాత
కంపెనీ ఏప్రిల్ 12, 2002 హిందీ దర్శకత్వం & నిర్మాత
లవ్ కెలియె కుచ్ భి కరేగ జూన్ 29, 2001 హిందీ నిర్మాత
ప్యార్ తూనె క్యా కియ ఏప్రిల్ 27, 2001 హిందీ నిర్మాత
జంగిల్ జులై14, 2000 హిందీ దర్శకత్వం & నిర్మాత
మస్త్ అక్టోబర్ 15, 1999 హిందీ దర్శకత్వం & నిర్మాత
శూల్ 1999 హిందీ కధ,నిర్మాత
ప్రేమ కథ 1999 తెలుగు దర్శకత్వం
కౌన్ February 26, 1999 హిందీ దర్శకత్వం & నిర్మాత
దిల్ సె 1998 హిందీ నిర్మాత
సత్య జులై 3, 1998 హిందీ దర్శకత్వం & నిర్మాత
దౌడ్ జులై 13, 1997 హిందీ కధ, స్క్రీన్ ప్లే,కూర్పు, దర్శకత్వం & నిర్మాత
W/O వర ప్రసాద్ 1997 తెలుగు నిర్మాత
దెయ్యం 1996 తెలుగు దర్శకత్వం & నిర్మాత
గులాబి 1996 తెలుగు నిర్మాత
అనగనగా ఒక రోజు 1995 తెలుగు దర్శకత్వం & నిర్మాత
రంగీలా సెప్టెంబర్ 8, 1995 హిందీ కధ, దర్శకత్వం & నిర్మాత
మని మనీ 1994 తెలుగు నిర్మాత
మని 1993 తెలుగు నిర్మాత
తిరుడ తిరుడ 1994 తమిళం స్క్రీన్ ప్లే
గాయం , దేశం 1993 తెలుగు, తమిళం దర్శకత్వం
గోవిందా గోవిందా 1993 తెలుగు దర్శకత్వం
అంతం, ద్రోహి అక్టోబర్ 25, 1992 తెలుగు,హిందీ దర్శకత్వం
క్షణ క్షణం 1991 తెలుగు దర్శకత్వం
రాత్రి, రాత్ 1991 తెలుగు, హిందీ దర్శకత్వం
శివ, ఉదయం,షివ డిసెంబర్ 7, 1990 తెలుగు, తమిళం, హిందీ కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం
