Rss Feed

కె.ప్రత్యగాత్మ

కె.ప్రత్యగాత్మగా ప్రసిద్ధిచెందిన కొల్లి ప్రత్యగాత్మ (ఆంగ్లం: Kotayya Pratyagatma) తెలుగు సినిమా దర్శకుడు. ఈయన 1925 అక్టోబర్ 31 న గుడివాడలో జన్మించాడు. చదువుకునే రోజుల్లోనే చేసిన జాతీయవాద ప్రదర్శనలకు గాను జె.జె.కళాశాల యొక్క బ్రిటీషు ప్రిన్సిపాలు ప్రత్యగాత్మను కళాశాల నుండి బహిష్కరించాడు. ఈయన సినిమా రంగములో ప్రవేశించక మునుపు 1952లో ప్రజాశక్తి లో పాత్రికేయునిగా, జ్వాలా పత్రికకు సంపాదకునిగా పనిచేశాడు. ప్రత్యగాత్మ దర్శకునిగా తొలి సినిమా 1961లో విడుదలైన భార్యాభర్తలు. ఈయన తెలుగులో 21 సినిమాలు మరియు హిందీలో 7 సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఈయన ఆత్మా బ్యానర్ క్రింద చిలకా గోరింక మరియు మా వదిన చిత్రాలను స్వయంగా దర్శకత్వం వహించి నిర్మించాడు. ప్రత్యగాత్మ, తెలుగు సినీ రంగములో రెబెల్‌స్టార్ గా పేరుతెచ్చుకున్న కృష్ణంరాజును 1966లో విడుదలైన చిలకా గోరింక సినిమాతో పరిచయము చేశాడు. 1966లో సొంత సినీ నిర్మాణ సంస్థ ఆత్మ ఆర్ట్స్ ప్రారంభించాడు. ఈయన 2001, జూన్ 8న హైదరాబాదులో కన్నుమూశాడు. ప్రత్యగాత్మ కుమారుడు కె.వాసు కూడా తెలుగు సినిమా దర్శకుడు. * 1 పురస్కారాలు * 2 చిత్ర సమాహారం o 2.1 తెలుగు సినిమాలు o 2.2 హిందీ సినిమాలు * 3 బయటి లింకులు పురస్కారాలు ఈయన 1962లో భార్యాభర్తలు చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రముగా రజత కమలాన్ని అందుకున్నాడు. చిత్ర సమాహారం తెలుగు సినిమాలు * భార్యాభర్తలు (1961) * కులగోత్రాలు (1962) * పునర్జన్మ (1963) * మంచి మనిషి (1964) * మనుషులు మమతలు (1965) * చిలకా గోరింక (1966) * మా వదిన (1967) * ఆదర్శ కుటుంబం (1969) * అమ్మకోసం (1970) * మనసు మాంగల్యం (1970) * శ్రీమంతుడు (1971) * స్త్రీ (1973) * పల్లెటూరి బావ (1973) * దీక్ష (1974) * ముగ్గురమ్మాయిలు (1974) * అల్లుడొచ్చాడు (1976) * అత్తవారిల్లు (1976) * గడుసు అమ్మాయి (1977) * కన్నవారి ఇల్లు (1978) * మంచి మనసు (1978) * కమలమ్మ కమతం (1979) * నాయకుడు – వినాయకుడు (1980) హిందీ సినిమాలు ఈయన హిందిలో కె.పి.ఆత్మ పేరుతో కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించాడు * దో లడ్కియా (1976) * మెహమాన్ (1973) * ఏక్ నారీ ఏక్ బ్రహ్మచారీ (1971) * బచ్‌పన్ (1970) * తమన్నా (1969) * రాజా ఔర్ రంక్ (1968) * ఛోటాభాయి (1966)