-
కె.విశ్వనాథ్.
Posted by
సుమన్.గద్దె
on 23, నవంబర్ 2009, సోమవారం
Labels:
సినిమాలు
ళాతపస్విగా చిరపరిచితమైన పద్మశ్రీ కాశీనాధుని విశ్వనాధ్ తెలుగు సినిమా దర్శకుడు. ప్రశస్తమైన సినిమాలను సృష్టించి, తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన వ్యక్తి, కె.విశ్వనాథ్.
విశ్వనాథ్ 1930 లో విజయవాడ లో జన్మించాడు. చెన్నై లోని ఒక స్టూడియోలో తెక్నీషియనుగా సినిమా జీవితాన్ని మొదలుపెట్టి, ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు వద్ద సహాయకుడిగా చేరాడు. అక్కినేని నాగేశ్వరరావు నాయకుడిగా నిర్మించిన ఆత్మ గౌరవం సినిమాతో విశ్వనాథ్ దర్శకుడిగా మారాడు. సిరిసిరిమువ్వ సినిమాతో ఆయన ప్రతిభ వెలుగులోకి వచ్చింది.
విశ్వనాథ్ చలనచిత్ర జీవితంలో కలికితురాయి వంటిది శంకరాభరణం. జాతీయ పురస్కారం గెలుచుకున్న ఈ సినిమా, తెలుగు సినిమా చరిత్రలో కూడా ఒక మైలురాయి వంటిది. పాశ్చాత్య సంగీతపు హోరులో కొట్టుకుపోతున్న భారతీయ సాంప్రదాయ సంగీతానికి పూర్వవైభవాన్ని పునస్థాపించాలనే ఉద్దేశ్యాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించాడు. భారతీయ సాంప్రదాయ కళలకు పట్టం కడుతూ ఆయన మరిన్ని సినిమాలు తీసాడు. వాటిలో కొన్ని సాగరసంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం మొదలైనవి.
కుల వ్యవస్థ, వరకట్నం వంటి సామాజిక అంశాలను కూడా తీసుకుని విశ్వనాథ్ చిత్రాలు నిర్మించాడు. సప్తపది, స్వాతిముత్యం, స్వయంకృషి, శుభోదయం, శుభలేఖ, ఆపద్బాంధవుడు, శుభసంకల్పం వంటి సినిమాలు ఈ కోవలోకి వస్తాయి.
శంకరాభరణం కు జాతీయ పురస్కారం తో పాటు సప్తపదికి జాతీయ సమగ్రతా పురస్కారం లభించింది. స్వాతిముత్యం సినిమా 1986 లో ఆస్కార్ అవార్డుకు అధికారిక ప్రవేశం పొందింది. భారతీయ సినిమాకు చేసిన సమగ్ర సేవకు గాను విశ్వనాథ్ కు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారమిచ్చి గౌరవించింది.
విశ్వనాథ్ సినిమాలలో సంగీతానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. తన సినిమాలకు ఎక్కువగా కె.వి.మహదేవన్ నుగానీ, ఇళయరాజా ను గానీ సంగీతదర్శకులుగా ఎంచుకునేవాడు. కొన్ని సినిమాలలో పండిత హరిప్రసాద్ చౌరాసియా, కేలూచరణ్ మహాపాత్ర, షరోన్ లోవెన్ వంటి ప్రముఖ కళాకారులతో కలిసి పని చేసాడు. ప్రస్తుతం దర్శకత్వ బాధ్యతలను తగ్గించుకుని నటుడిగా ప్రేక్షకులను అలరిస్తున్నాడు.
* 1 కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన చిత్రాలు
* 2 కె.విశ్వనాథ్ నటించిన చిత్రాలు
* 3 పురస్కారాలు
* 4 బయటి లింకులు
* 5 మూలాలు
కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన చిత్రాలు
* ఆత్మ గౌరవం
* అల్లుడు పట్టిన భరతం
* సిరి సిరి మువ్వ
* సీతామాలక్ష్మి
* శంకరాభరణం
* సప్తపది
* ఆపద్భాందవుడు
* శృతిలయలు
* స్వాతికిరణం
* స్వాతిముత్యం
* స్వర్ణకమలం
* శుభలేఖ
* శుభోదయం
* శుభ సంకల్పం
* సిరివెన్నెల
* సాగరసంగమం
* స్వయంకృషి
* జననీ జన్మభూమి
* చిన్నబ్బాయి
* సూత్రధారులు
* స్వరాభిషేకం
* జీవిత నౌక
* కాలాంతకులు
* జీవన జ్యోతి
* ప్రేమబంధం
* చెల్లెలి కాపురం
* నిండు హృదయాలు
* చిన్ననాటి స్నేహితులు
* ఉండమ్మా బొట్టు పెడతా
* కలిసొచ్చిన అదృష్టం
* ప్రైవేటు మాస్టారు
* శారద
* కాలం మారింది
* ఓ సీత కధ
తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయి
కె.విశ్వనాథ్ నటించిన చిత్రాలు
* వజ్రం
* శుభసంకల్పం
* సంతోషం
* స్వరాభిషేకం
* నరసింహనాయుడు
* ఠాగూర్
* నీ స్నేహం
* ద్రోహి
* అతడు
* సీమసింహం
* లక్ష్మీనరసింహ
* ఆంధ్రుడు
[మార్చు] పురస్కారాలు
* జాతీయ చలనచిత్ర పురస్కారాలు
o 1980-జాతీయ ఉత్తమ కుటుంబకథా చిత్రం -శంకరాభరణం
o 1982-నర్గీస్ దత్ జాతీయ సమైక్యతా ఉత్తమచిత్రం - సప్తపది
o 1984- జాతీయ ఉత్తమ చలనచిత్రం - తెలుగు సాగరసంగమం
o 1986 - జాతీయ ఉత్తమ చలనచిత్రం - తెలుగు - స్వాతిముత్యం
o 1988 - జాతీయ ఉత్తమ చలనచిత్రం - తెలుగు శృతిలయలు
o 2004 - జాతీయ ఉత్తమ చలనచిత్రం - తెలుగు స్వరాభిషేకం
* 1992 - రఘుపతి వెంకయ్య పురస్కారం
* పద్మశ్రీ పురస్కారం
జన్మ నామం కాశీనాధుని విశ్వనాధ్
జననం ఏప్రిల్ 19 1930 (1930-04-19) (వయసు 79)
Flag of భారత దేశంతెనాలి,గుంటూరుజిల్లా,ఆంధ్రప్రదేశ్
నివాసం చెన్నై,తమిళనాడు
ఇతర పేర్లు కళాతపస్వి,కె.విశ్వనాధ్
వృత్తి సినిమా, టి.వి దర్శకుడు
నటుడు
కథా రచయిత
స్క్రీన్ ప్లే రచయిత
శబ్ద గ్రాహకుడు
మతం బ్రాహ్మణ హిందూ
భార్య/భర్త జయలక్ష్మి
సంతానం పద్మావతి దేవి(కూతురు)
కాశీనాధుని నాగేంద్రనాథ్
కాశీనాధుని రవీంద్రనాథ్(కొడుకులు)
తండ్రి కాశీనాధుని సుబ్రహ్మణ్యం
తల్లి సరస్వతమ్మ
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి